సాక్షి,బాపట్ల: బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కంప్యూటర్‌లో బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా నిజాంపట్నంకు చెందిన బొమ్మిడి బాలరాజు అనే లబ్ధిదారుడు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
‘అన్నా నమస్తే, నేను మత్స్యకార కుటుంబం నుంచి వచ్చాను, గతంలో మత్స్యకారులకు భరోసా లేదు, గతంలో వేట నిషేద భృతి నామామాత్రం, ఏప్రిల్, మే నెలలో దరఖాస్తు చేస్తే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇచ్చేవారు, అవి కూడా కొందరికే వచ్చేవి, కానీ మన జగనన్న మా కష్టాలు పరిశీలించి మత్స్యకారులను ఆదుకునేలా భరోసా కల్పించారు, సకాలంలో మాకు సాయం అందిస్తున్నారు, ఏటా రూ. 10 వేల చొప్పున అకౌంట్‌లో వేస్తున్నారు, జగనన్నా మీ మేలు మరిచిపోము, మత్స్యకారుడు గతంలో చనిపోతే శవం కనపడితేనే డబ్బులు ఇస్తామనేవారు, అప్పుడు ఆఫీస్‌ల చుట్టూ తిరగగా తిరగగా ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు ఎప్పటికో ఇచ్చేవారు, కానీ మన జగనన్న వచ్చిన తర్వాత రూ. 10 లక్షలు అకౌంట్‌లో వేస్తున్నారు.
శవం కనబడినా కనబడకపోయినా సాయం అందుతుంది, గతంలో ఆయిల్ సబ్సిడీ చిన్న బోట్లకు ఉండేది కాదు, కేవలం పెద్ద బోట్లకు కూడా వెయ్యి లీటర్లకే ఇచ్చేవారు, ఆ డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళం, కొంతమందికి వచ్చేవే కాదు, కానీ ఇప్పుడు పెద్ద బోట్లకు, చిన్న బోట్లకు కూడా సబ్సిడీ ఇస్తున్నారు, పైగా వెంటనే మన ఖాతాలో, మన మత్స్యకారులంతా జగనన్నను మరిచిపోకూడదు. గతంలో నిజాంపట్నం హార్బర్ లేదు, చాలా కష్టాలు పడ్డాం, సముద్రంలోకి వెళ్ళాలంటే మెరక, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, మన జగనన్న ఆ హార్బర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేస్తున్నారు. జగనన్నా నువ్వే మా ధైర్యం, మా నమ్మకం. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి, ధన్యవాదాలు’ అని సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment