CM YS Jagan To Release YSR Matsyakara Bharosa Funds At Nizampatnam Updates - Sakshi
Sakshi News home page

YSR Matsyakara Bharosa: 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు, ప్రజల తరపున నిలబడ్డా, మంచి చేస్తున్నా: సీఎం జగన్‌

Published Tue, May 16 2023 9:52 AM | Last Updated on Tue, May 16 2023 4:09 PM

YSR Matsyakara Bharosa Funds Release Program Nizampatnam Updates - Sakshi

Updates:

► బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు.

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం జగన్‌ స్పీచ్‌

►ఎన్ని వ్యవస్థలను నాపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు. ప్రజల తరపున నిలబడ్డా.. మంచి చేస్తున్నా.
►మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి.
►ప్రధానిని కలిస్తే చాలు నాపై దుష్ప్రచారం చేస్తారు.
►బీజేపీ, కాంగ్రెస్‌తో అంటకాగిన వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు.
►పొత్తులు పెట్టుకొని.. తెగదెంపులు చేసుకునేది వీళ్లే.. 
►వివాహాలు చేసునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లే..

►ఎన్నికలప్పుడే చంద్రబాబాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు.
►బాబు, తన దత్తపుత్రుడు నమ్ముకున్నది పొత్తులు, కుయుక్తులనే
►చంద్రబాబు పేరు చెబితే ఒక్కపథకం గుర్తు రాదు
► ఆయన పేరు తలిస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటే

►చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి.. అధికారంపోతే జూబ్లీహిల్స్‌
►ఏపీలో దోచుకుని హైదరాబాద్‌లో ఉండటం వీరి పని
►ఏపీలోనే నా శాశ్వత నివాసం ఉంది. తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నా
►ప్రధానులు, రాష్ట్రపతులను చేశానన్న పెద్ద మనిషి.. ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా?
►175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదు. ఆయనకు సభలు పెట్టే ధైర్య కూడా లేదు
►చంద్రబాబు, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు.
►అలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా అని ప్రశ్నించారు.

►మన ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారు.
►పేదవాడికి మంచి చేస్తుంటే చూడలేకపోతున్నారు.
►ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు.
► నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా.
►ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం.

గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరకొర సాయం.
టీడీపీ ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేది.
చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు
 మన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నాం.

గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలి.
గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నాం.
గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నాం.

►అందరికీ నమస్కారం, ఒక చక్కటి కార్యక్రమం, మానవతా దృక్పదంతో పది మంది పేదలకు సహాయం చేయాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం 
►మత్స్యకార భరోసా అనేది కులవృత్తులను నమ్ముకుని ప్రాణాలు ఫణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకార కుటుంబాలకు వేట నిషేద సమయంలో ఆదుకునేందకు ప్రభుత్వం ఇచ్చే సాయం
►గతం కంటే పదిరెట్లు అదనపు సాయం ఇది, జాతీయ స్ధాయిలోనే ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయనివిధంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ప్రభుత్వం ఇది. 
►రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళుతున్నారు సీఎం జగన్‌

►గత పాలన వల్ల ప్రజలంతా పూర్తిగా నష్టపోయారు, అత్యంత సుధీర్ఘ తీరప్రాంతం గల రాష్ట్రం, సీఎంగారు ఫిషింగ్‌ హార్బర్‌లు, జెట్టీలు, ఓడరేవులు పూర్తిచేస్తున్నారు, ఫేజ్‌ 1లో సగం పనులు పూర్తవుతున్నాయి

►నిజాంపట్నం హార్బర్‌కూడా దాదాపు 70 శాతం పూర్తయితే, ఈనాడులో దుర్మార్గంగా ఆర్టికల్స్‌ రాస్తున్నారు. 

► దేశంలో ఎక్కడాలేని విధంగా ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌ను, ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఆక్వా హ్యచరీస్‌ను రూ. 185 కోట్లతో 278 ఎకరాలలో దిండి గ్రామం వద్ద నిర్మాణానికి సీఎంగారు శంకుస్ధాపన చేశారు.
► మెరైన్‌ సెక్టార్‌ను ఆక్వారంగాన్ని ఆదుకుంటూ ముందుచూపుతో ముందుకెళుతున్నారు. 
► మా నియోజకవర్గంలో కులవృత్తుల మీద ఆధారపడి జీవించేవారు అధికం, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడంతో పాటు సాగునీరు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. 
► మా బీసీ సామాజికవర్గంలో కార్యకర్త స్ధాయి నుంచి ఎదిగిన మాలాంటి వ్యక్తులకు అత్యున్నత రాజ్యసభలో కూర్చునే అవకాశం కల్పించిన గౌరవం, కీర్తి సీఎంగారికి దక్కుతాయి. ధన్యవాదాలు. 

►బాపట్లలోని  నిజాంపట్నంలో వైఎస్సార్‌ మత్స్యాకార భరోసా  కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

►వైఎస్సార్‌ మత్స్యాకార భరోసా నిధుల విడుదల కార్యక్రమం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం జగన్‌ పరిశీలించారు.  

► సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల జిల్లా నిజాంపట్నం చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. దారిపొడవున సీఎం జగన్‌ కాన్వాయ్‌పై పూలు చల్లుతూ ప్రజలు ఘనంగా స్వాగతించారు.

►వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
►1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేయనున్నారు.
►చెప్పిన మాట ప్రకారం వేట నిషేధ కాలంలోనే భృతి చెల్లింపు.
► ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు రూ.108 కోట్ల ఆర్థిక సాయం
► ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ. 10వేల చొప్పున సాయం .
►ఇప్పటి వరకు లబ్ధిదారులకు రూ.538 కోట్ల సాయం అందజేత.

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది కూడా రంగం సిద్ధంచేసింది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మంగళవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సాయాన్ని జమచేయనున్నారు. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేయనున్నారు.  

ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉ.9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి తిరిగి మ.1.00కు ఇంటికి చేరుకుంటారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement