
డీజిల్, పెట్రోల్ ధరల తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర భారీగా పతనమైంది. దాంతో బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర 55 డాల్లర్లకు తగ్గిపోయింది. దీంతో దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలను రూ. 2 మేర తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. న్యూఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 5051, ముంబైలో రూ. 57.91గా ఉంది. గతేడాది డిసెంబర్ 15వ తేదీన లీటర్ డీజిల్, పెట్రోల్పై రూ. 2 మేర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. అలాగే సబ్సీడీయేతర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 43.50 మేర తగ్గిస్తున్నట్లు తెలిపింది. దాంతో 14.2 కేజీల సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ. 708 ఉండగా, ముంబైలో రూ. 725.50గా ఉంది.