
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం సందర్భంగా వాహన చోదకులకు స్వల్ప ఊరట. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ పై 63 పైసలు తగ్గించగా, డీజిల్ పై 1.06పైసలు తగ్గించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తగ్గిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. అంతకుముందు లీటర్ పెట్రోల్పై 50 పైసలు, డీజిల్పై 46పైసలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఓసారి సమావేశమై.. పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్లో పెట్రోల్ ధర లీటర్కు 58 పైసలు, డీజిల్ ధర లీటర్కు 25 పైసలు చొప్పున తగ్గాయి. కాగా అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే దేశీయంగా మాత్రం ఆ ప్రభావం తక్కువగా ఉంది.