న్యూఢిల్లీ : వాహనదారులకు స్వల ఊరట. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. లీటర్ పెట్రోల్పై 50 పైసలు, డీజిల్పై 46పైసలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. తగ్గిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఓసారి సమావేశమై.. పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్లో పెట్రోల్ ధర లీటర్కు 58 పైసలు, డీజిల్ ధర లీటర్కు 25 పైసలు చొప్పున తగ్గాయి. కాగా అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే దేశీయంగా మాత్రం ఆ ప్రభావం తక్కువగా ఉంది.
స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
Published Tue, Dec 15 2015 7:18 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement