మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్. సిలిండర్ బుకింగ్‌పై మీకోసం పలు రకాల ఆఫర్లను తీసుకొచ్చింది ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm). ఈ యాప్‌ను ఉపయోగించి ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం ద్వారా రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.
ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌పై 4 రకాల ఆఫర్లను ప్రవేశపెట్టింది పేటీఎం. వీటిని ఉపయోగించి కస్టమర్లు రూ. 5 నుంచి రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అనగా రూ. 5 నుంచి రూ. 1000 వరకు మధ్యలో ఎంతైనా రావొచ్చు. ఈ ఆఫర్లను పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం!
మొదటి క్యాష్‌బ్యాక్ ఆఫర్ కోసం ప్రోమోకోడ్ GAS1000. ఈ ప్రోమోకోడ్‌ని ఉపయోగించి కస్టమర్ రూ.5 నుంచి రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. సిలిండర్ బుకింగ్ సమయంలో ఈ ప్రోమో కోడ్ వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా FREEGAS ప్రోమోకోడ్‌తో గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్న ప్రతి 500వ వినియోగదారునికి రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు.
ఏయూ క్రెడిట్ కార్డ్‌తో (AU Credit card) సిలిండర్‌ను చెల్లింపుపై పేటీఎం రూ.50 వరకు తగ్గింపును ఇస్తోంది. ఈ ఆఫర్ ప్రోమోకోడ్ AUCC50. వీటితో పాటు యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో (YES Bank Credit Card) గ్యాస్ సిలిండర్ చెల్లింపుపై రూ.30 తగ్గింపు లభిస్తుంది. దీని కోసం బుకింగ్ చేసేటప్పుడు GASYESCC ప్రోమోకోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా వీటి ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత మీకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కాగా ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకే ఉండే అవకాశం ఉంది.
చదవండి భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా!
Comments
Please login to add a commentAdd a comment