ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం తన యూజర్ల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం యాప్ నుంచి ఎల్పీజీ సిలిండర్స్ బుక్ చేసుకునే యూజర్ల కోసం అద్భుతమైన డీల్స్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం కొత్త యూజర్లకు మాత్రమే వర్తించనుంది.
ఎల్బీజీ వినియోగదారులకోసం పేటీఎం మూడు సరికొత్త ప్రొమోకోడ్స్‌ను తీసుకొచ్చింది. పేటీఎం యాప్‌ను ఉపయోగించి గ్యాస్ బుక్‌చేసే సమయంలో ఈ ప్రొమోకోడ్స్‌ను అప్లై చేయడంతో క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చును. మొదటి ప్రొమో కోడ్(BANKBANG)లో భాగంగా పేటీఎం యూజర్లు రూ. 25 డిస్కౌంట్‌ను పొందవచ్చును. ఈ ఆఫర్ కేవలం డెబిట్ కార్డుతో చెల్లింపు జరిపినప్పుడే డిస్కౌంట్ వస్తోంది. రెండో ప్రోమో కోడ్(FIRSTCYLINDER)తో రూ.30 పేటీఎం క్యాష్‌బ్యాక్ యూజర్లకు రానుంది. మూడో ప్రొమో కోడ్‌లో భాగంగా ఉచితంగానే సిలిండర్‌ను పొందవచ్చును.
ఉచితంగా సిలిండర్..!
ఎల్పీజీ కస్టమర్లకోసం పేటీఎం సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. పేటీఎం యూజర్లకు ఎల్పీజీ సిలిండర్లను బుకింగ్ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్, ఇంధనే వంటి గ్యాస్ సిలిండర్లను పేటీఎం యూజర్లు బుక్ చేసుకోవచ్చు. పేటీఎం యూజర్లు (FREECYLINDER) అనే ప్రోమోకోడ్‌ను సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో అప్లై చేయడంతో ఉచితంగా సిలిండర్‌ను పొందే అవకాశం ఉంది. ఈ ప్రోమోకొడ్‌తో చెల్లించిన మొత్తాన్ని పేటీఎం క్యాష్‌బ్యాక్ రూపంలో పూర్తిగా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రతి 100 వ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి వర్తించనుంది. గరిష్టంగా వెయ్యి రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు పొందవచ్చు. అంటే యూజర్లు కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుది. ఫిబ్రవరి 28, 2022 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు 100వ లక్కీ కస్టమర్ అయితే.. 24 గంటల్లో మీకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఇలా బుక్ చేయండి..!
- ముందుగా పేటీఎం యాప్‌ను ఒపెన్ చేయండి
- ‘బుక్ మై సిలిండర్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నెంబర్ లేదా ఎల్‌పీజీ ఐడీ లేదా కస్టమర్ నెంబర్‌ను నమోదుచేసిన తర్వాత... మీ ఏజెన్సీ గురించి మీకు సమాచారం లభిస్తుంది.
- ఆ తర్వాత మీరు పేమెంట్ చేయడంతో మీ బుకింగ్ పూర్తవుతుంది.
- బుకింగ్ సమయంలో ప్రొమో కోడ్ అప్లై చేయడంతో క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చును.
చదవండి: కేవలం నెలకు రూ. 125 చెల్లించి 12 ఓటీటీ సేవలను ఇలా పొందండి..!
చదవండి: తళుక్కున మెరిసిన కల్యాణ్ జ్యువెలర్స్..! కోవిడ్-19 ముందుస్థాయికి మించి..
Comments
Please login to add a commentAdd a comment