లేడిస్ హాస్టల్లో పేలిన సిలిండర్
Published Fri, Dec 9 2016 3:13 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
హైదరాబాద్: నగరంలోని ఓ లేడిస్ హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహన నగర్ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీక్యూ లేడీస్ హాస్టల్లో ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ పేలినట్లు చెప్పారు.
దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, స్వల్ప ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement