ఓయూ లేడీస్‌ హాస్టల్‌లోకి ఆగంతకుడు | UNIdentified Person Enters Into OU ladies Hostel | Sakshi
Sakshi News home page

ఓయూ లేడీస్‌ హాస్టల్‌లోకి ఆగంతకుడు

Published Thu, Aug 15 2019 7:33 PM | Last Updated on Thu, Aug 15 2019 7:35 PM

UNIdentified Person Enters Into OU ladies Hostel - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్‌ హాస్టల్‌లోకి ఓ ఆగంతకుడు చొరబడటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. గురువారం తెల్లవారుజామున హాస్టల్‌లోకి చొరబడ్డ ఆగంతకుడు ఓయూ లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన ఓ విద్యార్థినిని అతడు కత్తితో బెదిరించాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సదురు విద్యార్థిని భయంతో వణికి పోయింది.  ఆ తర్వాత విద్యార్థిని కేకలు వేయడంతో ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే దుండగుడు విద్యార్థిని సెల్‌ఫోన్‌ తీసుకెళ్లాడు. ఆగంతకుడు వెనక వైపు నుంచి హాస్టల్‌లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement