Ladies Hostel
-
కుప్పం: ప్రియురాలు పిలిచిందని లేడీస్ హాస్టల్లో దూరి..
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల నర్సింగ్ హాస్టల్లోకి యువకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది. కేరళ నుంచి ప్రియుడిని యువతి, పిలిపించుకుంది. ఒకే గదిలో ఆరుగురు నర్సింగ్ విద్యార్థినులు ఉండగా, బురఖా వేసుకొని మారు వేషంలో లేడీస్ హాస్టల్‌కు ప్రియుడు వెళ్లాడు.ఆటో దిగి వ్యక్తి వెళ్తుండగా, గమనించిన ఆటో డ్రైవర్లు వార్డెన్‌కు సమాచారం అందించారు. దీంతో కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని పట్టుకున్నారు. గుడిపల్లి పోలీసులకు హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: మానవత్వమా.. కళ్లు మూసుకో! -
పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..
-
విచారణ చెయ్యకుండానే కెమెరాలు లేవని పోలీసులు
-
హాస్టల్ బాత్రూంలో స్పై కెమెరాలు..
-
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలం
-
సైఫాబాద్ సైన్స్ కాలేజీలో మూడు కొత్త కోర్సులు
బంజారాహిల్స్: యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్‌లో బుధవారం న్యూ అకడమిక్ కేలెండర్, యాంటీ ర్యాగింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సైఫాబాద్ కాలేజ్ 2023–24 అకడమిక్ ఇయర్లో కొత్త కోర్సులు రావడం, అదే విధంగా పీజీ లేడీస్ హాస్టల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జె. లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ చొరవతో ఈ కాలేజీలో కొత్తగా మూడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశ పెట్టారన్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నామని అన్నారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నవనీత, హాస్టల్ వైస్ ప్రిన్సిపాల్ జగదీశ్వర్, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ రామయ్య, డాక్టర్ వెంకటేష్ , రమణ తదితరులు పాల్గొన్నారు. -
లేడీస్ హాస్టల్ సమీపంలో ఆడ శిశువు మృతదేహం కలకలం..
సాక్షి, వరంగల్: వరంగల్‌లో ఆడ శిశువు మృతదేహం కలకలం సృష్టించింది. అప్పుడే పుట్టిన బిడ్డను రోడ్డుపై పడేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆడ శిశువుని పడేశారో, మరేదైనా కారణమో తెలియదు కానీ, రంగంపేటలోని డాక్టర్ గన్నుకృష్ణ మూర్తి హాస్పిటల్ పక్క వీధిలో పసి పాప మృతదేహం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. చుట్టు పక్కల హాస్పిటల్, లేడీస్ హాస్టల్ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ సంబంధంతో పుట్టిన బిడ్డని పడేశారో, పురిట్లోనే శిశువు మృతితో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి శిశు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. శిశువు పడేసిన విషయంపై ఆరా తీస్తున్నారు. చదవండి: పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్.. -
లేడీస్ హాస్టల్స్ టార్గెట్.. ఊహించని రీతిలో దొరికాడు
క్రైమ్: లేడీస్ హాస్టల్స్‌ను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి.. అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల చోరీ కలకలం రేగింది. ఏకంగా హాస్టల్లో ఓ బాత్రూం డోర్ బద్దలు కొట్టి మరీ చోరీలు చేశాడు ఆగంతకుడు. దీంతో.. బెంబేలెత్తిన విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన సైతం చేపట్టారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే.. అందరినీ హడలెత్తించిన దొంగ ఊహించని విధంగా దొరికాడు. సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను దొంగలించి రాత్రి పొలాల గుండా పారిపోతుండగా.. చీకట్లో ఓ వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఉదయం కేకలతో అతన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తాడు సాయంతో బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. -
నిద్రపట్టక రాత్రుళ్లు లేడీస్ హాస్టల్లోనే తిరుగుతూ..
భువనేశ్వర్: ఇప్పుడున్న ఒత్తిళ్లలో ఆందోళన, ఇతర మానసిక సమస్యలు తలెత్తడం సహజంగా మారింది. అయితే వాటికి పరిష్కారాలు వైపు వెళ్లకుండా.. తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది నేటి తరం. తాజాగా ఓ అమ్మాయి.. నిద్ర కారణంతో అఘాయిత్యానికి పాల్పడి తల్లిదండ్రులకు శోకం మిగిల్చింది. గత కొన్నిరోజులుగా నర్సింగ్ చదువుతున్న ఆ అమ్మాయి నిద్రపోవట్లేదు. రాత్రిళ్లు హాస్టల్లో తిరుగుతూ అందరిలో ఆందోళన రేకెత్తించింది. అందుకే ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని, అప్పుడైనా మామూలుగా అవుతుందేమో చూడాలని తల్లిదండ్రులకు సమాచారం అందించారు హాస్టల్ నిర్వాహకులు. కానీ, ఇంతలోనే.. ఒడిశా బాలోంగిర్‌కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి.. భువనేశ్వర్ జముకోలిలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. అయితే గత కొన్నిరోజులుగా ఆమెకు కంటి నిండా నిద్ర పట్టడం లేదట. ఈ కారణంతోనే రాత్రిళ్లు హాస్టల్లో తిరుగుతూ మిగతా వాళ్లను ఇబ్బంది పెడుతోంది. ఇది గమనించిన నిర్వాహకులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చేలోపే ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, నిద్ర పట్టకపోవడమే సమస్య అని, తల్లిదండ్రులు తనను క్షమించాలంటూ లేఖలో పేర్కొందామె. ఫోరెన్సిక్ నిపుణులు అది ఆమె చేతిరాతేనని నిర్ధారించారు. ఈ కారణంతో ఆమె చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
లేడీస్ హాస్టల్లో యువతిపై వికృత చేష్టలు..
ఢిల్లీ: మరో షాకింగ్ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో లేడీస్ హాస్టల్లోకి జొరబడి.. ఓ యువతిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు అదే హాస్టల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డుకాగా.. విషయం బయలకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ కరోల్ బాగ్ ఏరియాలో ఉన్న ఓ లేడీ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ కారిడార్లోంచి వెళ్తున్న యువతులు.. మద్యం మత్తులో లోపలికి వచ్చిన సెక్యూరిటీ గార్డును చూసి ఒక్కసారిగా వెనక్కి పరుగులు తీశారు. ఇంతలో ఓ యువతిని దొరకబుచ్చుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడికి సైతం పాల్పడ్డాడు సెక్యూరిటీ గార్డు. ఈ ఘటనపై హాస్టల్ ఓనర్ ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఢిల్లీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ దృష్టికి చేరడంతో ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో డీసీడబ్ల్యూ రంగంలోకి దిగి.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. करोल बाग में चल रहे एक PG hostel में सिक्योरिटी गार्ड ने नशे की हालत में लड़कियों के साथ छेड़खानी और मारपीट की. हमें ट्विटर के जरिए शिकायत मिली, मामले की गंभीरता को देखते हुए पुलिस को नोटिस जारी किया है. मामले में कड़ी कार्यवाही सुनिश्चित करेंगे। pic.twitter.com/6smwjfqEJB — Swati Maliwal (@SwatiJaiHind) August 16, 2022 వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేయాలని స్వాతి మలివాల్, ఢిల్లీ పోలీసులకు కోరారు. అంతేకాదు గురువారం సాయంత్రం కల్లా ఘటనపై పూర్తి నివేదికను అందించాలని గడువు విధించారు. అయితే బాధితురాలు ఫిర్యాదుకు ముందుకు రాకపోవడంతో.. న్యాయ సలహా మేరకు వీడియో ఆధారంతో ఈ ఘటనను సుమోటాగా స్వీకరించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ డీసీపీ శ్వేతా చౌహాన్ వెల్లడించారు. Since the complainant is against giving a statement, legal opinion was taken&as per legal opinion & in light of video footage, FIR being registered suo motto by police: DCP Central Dist, Shweta Chauhan on a security guard molesting & manhandling girls at a PG hostel in Karol Bagh pic.twitter.com/GdzvVjnwZQ — ANI (@ANI) August 17, 2022 ఇదీ చదవండి: ఇది రూ. 500 మర్డర్!! తల నరికి.. -
కూలిన లేడీస్ హాస్టల్ గోడ
-
ట్రిపుల్ ఐటీ ఘటనలో ట్విస్ట్!
సాక్షి, కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. లేడీస్ హాస్టల్లో పట్టుబడిన యువకుడు కూడా ట్రిపుల్ ఐటీ విద్యార్థేనని తెలిసింది. విద్యార్థినిల సహకారంతో అతడు వసతి గృహంలోకి చేరినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈనేపథ్యంలో ఆరుగురు విద్యార్థినిలను వర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఎవరినీ సస్పెండ్ చేయలేదని సమాచారం. విద్యార్థినిలకు కేవలం కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చి పంపించివేశారని, యువకుడికి కూడా కౌన్సెలింగ్‌తో సరిపెట్టారని తెలిసింది. దీంతో యాజమాన్యం తీరుపై విమర్శలు వస్తున్నాయి. లేడీస్ హాస్టల్లో రోజంతా గడిపిన ఓ యువకుడిపై చర్యలు లేకపోవడం గమనార్హం. ఇక సెక్యురిటీ సిబ్బంది, కేర్ టేకర్లపై చర్యలు శూన్యమనే చెప్పాలి! (చదవండి : లేడీస్ హాస్టల్లో యువకుడు.. ఆరుగురి సస్పెన్షన్!) మంత్రి ఆగ్రహం.. తీవ్ర విమర్శల నేపథ్యంలో మొత్తం వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి నివేదించేందుకు వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం క్రమశిక్షణా కమిటీ విద్యార్థులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీ కీలక అధికారులు సెలవులో ఉన్నట్టు తెలిసింది. కాగా, ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సీరియస్ అయ్యారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీలో సెక్యురిటీ లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలిచ్చారు. -
లేడీస్ హాస్టల్లో యువకుడు.. ఆరుగురి సస్పెన్షన్!
-
లేడీస్ హాస్టల్లో యువకుడు..
సాక్షి, కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. అక్కడి సెక్యురిటీ లోపాలు మరోసారి బయటపడ్డాయి. విద్యార్థినుల హ్టాస్టల్లోకి ఓ యువకుడు చొరబడిన ఘటన వెలుగుచూసింది. విద్యార్థినిల సహకారంతో అతడు వసతి గృహంలోకి చేరినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. వివరాలు.. నూజివీడు ట్రిపుల్ ఐటీలోని లేడీస్ హాస్టల్లోకి ఓ యవకుడు చొరబడ్డాడు. కొందరు విద్యార్థినుల సహకారంతో కిటీకీ ఊచలు విరగొట్టి హాస్టల్లోని ఓ గదికి చేరాడు. రోజంతా అక్కడే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం విద్యార్థినులంతా గదికి తాళం వేసి యథావిధిగా కాలేజీకి వెళ్లారు. అయితే, ఆ గదిలో మనుషుల అలికిడి గ్రహించిన తోటి విద్యార్థులు విషయాన్ని సెక్యురిటీ సిబ్బందికి తెలిపారు. దాంతో వారు తాళం పగులగొట్టి గదిలో నక్కిన యువకుడిని పట్టుకున్నారు. విషయం ట్రిపుల్ ఐటీ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది. కొందరు విద్యార్థినుల సహకారంతో అతను లోపలికి వెళ్లగలిగాడని తేలింది. యువకుడికి సహకరించిన ఆరుగురు విద్యార్థినులను యూనివర్సిటీ మేనేజ్మెంట్ సస్పెండ్ చేసినట్టు తెలిసింది. పట్టుబడిన యువకుడు కూడా ట్రిపుల్ ఐటీ విద్యార్థి కావడం గమనార్హం. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న సెక్యురిటీ సిబ్బందిపై విచారణ నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకోనున్నారు. -
నువ్.. మగాడివైతే అర్ధరాత్రి హాస్టల్‌కి రా
చిత్తూరు, పలమనేరు: సినిమాను తలపించేలా ఓ యువకుడు తన ప్రేయసి కోసం దుస్సాహసానికి తెగబడ్డాడు. ‘నువ్..మగాడివైతే అర్ధరాత్రి హాస్టల్‌కి రా..ఫోన్ చెయ్ వస్తా..’ అని బంపర్ ఆఫర్ ఇవ్వడంతో గాల్లో తేలిపోయాడు. తానో స్పైడర్ మాన్ లెవెల్లో గోడలు ఎగబాకి హాస్టల్లోకి ప్రవేశించాడు. ఆపై, ప్రేయసికి ఫోన్‌చేసే ప్రయత్నంలో పడ్డాడు. అయితే ఆగంతకుడి రాకను గమనించిన వాచ్ ఉమెన్ పోలీసులకు సమాచారమిచ్చింది. విద్యార్థినులు అతగాడిని చూసి భయంతో కేకలు వేశారు. అంతే కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే..స్థానిక మదనపల్లె రోడ్డులోని ఓ మహిళా ప్రైవేటు హాస్టల్లోకి గురువారం అర్ధరాత్రి ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. హాస్టల్ గోడకు ఉన్న పైపుల ద్వారా ఎగబాకి రెండో అంతస్తుకు చేరుకున్నాడు. అక్క డ చీకటి ప్రదేశం నుంచి సెల్ఫోన్లో మాట్లాడుతుండగా వాచ్మెన్ గమనించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. దీంతో అప్రమత్తమైన సీఐ శ్రీధర్ మహిళా ఎస్ఐ ప్రియాంక, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే హాస్టల్లోని విద్యార్థులు బిగ్గరగా కేకలు పెట్టడం.. కింద సైరన్ మోతతో పోలీసు వాహనం చేరుకోవడం చూసి ఆగంతకుడు చమటలు పట్టాయి. పైపుల నుంచి మళ్లీ జారుతూ కిందకు దూకాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో అతని పేరు భానుప్రసాద్(22) అని, పట్టణంలో పెయింటర్ పనిచేసే వాడని తేలింది. హాస్టల్లో ఉంటున్న ఇంటర్ చదివే బాలిక అర్ధరాత్రి లోనికి ఎలాగైనా రమ్మందని, అందుకే ఈ ప్రయత్నం చేసినట్లు అతడు వెల్లడించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ద్వారా సీఐ బైండోవర్ చేయించారు. అసలు మేటరేమిటంటే ఆ విద్యార్థిని ఇంట వారం పాటు ఇతగాడు పెయిటింగ్ పనులు చేశాడట! దీంతో ఆ బాలిక ప్రేమ పల్లవి అందుకుందట!! -
నైటీలు.. ముఖానికి చున్నీతో బాలికల హాస్టల్లోకి..
సాక్షి, బొబ్బిలి: మా వసతిగృహాలకు ప్రహారీ లేదు.. మేడపైకి సులువుగా ఎక్కే సన్‌షెడ్‌లు మీదుగా అర్ధరాత్రి పోకిరీలు లోనికి వచ్చేస్తున్నారు. అక్కడ మేం ఆరబెట్టుకున్న నైటీలు వేసుకుని బాలికల్లా లోనికి వచ్చేస్తున్నారు. మేం గట్టిగా కేకలు వేసేసరికి పారిపోతున్నారు. నిత్యం ఇదే యాతన... ఇప్పటికిలా ఆరుసార్లు వచ్చారు. మేం జిల్లా అధికారులు, పోలీసులకు కూడా పలుమార్లు చెప్పాం... అయినా చర్యల్లేవు. నిత్యం భయంగా వసతిగృహంలో గడుపుతున్నామని ప్రభుత్వ బీసీ కళాశాల, ప్రీమెట్రిక్ కళాశాల విద్యార్థినులు విలేకర్లు, విద్యార్థి సంఘాలతో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి కూడా ఇలానే వచ్చేసరికి వారు ఎన్నాళ్లీ భయభ్రాంతులని అల్పాహారం తినకుండా నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులకు విషయం తెలిసి వారితో కలసి బైఠాయించారు. పట్టణ పరిధిలో ఐటీఐ కాలనీలో సమీకృత కళాశాల వసతి గృహం ఉండేది. ఇక్కడి వసతిగృహం గత ప్రభుత్వ హయాంలో విలీనం చేసి విద్యార్థులను పలు చోట్లకు తరలించారు. ఇదే వసతి గృహభవనాన్ని ప్రీమెట్రిక్, కళాశాల విద్యార్థినుల కోసం కేటాయించారు. దీనికి ప్రహరీ లేదు. పలుమార్లు అల్లరి మూకలు వసతిగృహంలోకి రాత్రి వేళల్లో లోనికి చొరబడుతున్నారని విద్యార్థినులు వాపోయారు. పలుమార్లు అధికారులకు కూడా తెలిపారు. శుక్రవారం కూడా ఇదే రీతిన రావడంతో వారు 100 నెంబర్‌కు కాల్ చేశామని చెప్పారు. మహిళా ఎస్ఐకు కూడా కాల్ చేశామన్నారు. కానీ ఎవరూ రాకపోవడంతో వేకువ జామున నాలుగు గంటల వరకూ బిక్కు బిక్కుమంటూ గడిపామన్నారు. గడచిన ఆదివారం ఓ అగంతకుడు తాము ఆరబెట్టుకున్న నైటీని ధరించి లోనికి వచ్చేశాడన్నారు. ముఖానికి చున్నీ వేసుకుని ఉన్నాడనీ, అయితే ఆ చున్నీ ఊడిపోవడంతో మీసాలు చూసి పెద్దగా కేకలు వేశామని విద్యార్థినులు చెప్పారు. వసతిగృహంలో జరిగిన ఘటనకు వార్డెన్, విద్యార్థినులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 120 మంది కళాశాల విద్యార్థినులు, మరో 60 మంది స్కూలు పిల్లలు ఉన్న ఈ వసతి గృహంలో నిత్యం ఏడు గంటలకు అల్పాహారం తినే విద్యార్థినులు ఈ ఘటనతో శనివారం టిఫిన్ చేయడం మానేశారు. మహిళా ఎస్ఐ కేటీఆర్ లక్ష్మీ, మహిళా రక్షక్ కోఆర్డినేటర్ మంగమ్మ వచ్చి విద్యార్థినులకు కౌన్సెలింగ్ చేశారు. అనంతరం టిఫిన్లు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ విలేకర్లతో మాట్లాడుతూ తమకు ఫోన్లు రాలేదన్నారు. సీఐ మాట్లాడుతూ 100కు డయల్ చేసినపుడు ఏ నంబరయినా రికార్డు అవుతుందనీ, కాల్ లిస్ట్ పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం అక్కడకు వచ్చిన ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులను సీఐ కేశవరావు పిలిచి మాట్లాడారు. విద్యార్థినులు చేసిన నిరసనకు సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మద్దతుగా నిలిచారు. -
అతనికి సహకరించింది సోని.. అదుపులో ‘ఆగంతుకుడు’
తార్నాక: ఉస్మానియా యూనివర్శిటీలో లేడీస్ హాస్టల్లో ప్రవేశించింది పాత నేరస్తుడు పొట్టేళ్ళ రమేష్‌గా తేలింది. పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిని రాచకొండ పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్లో చోరీకి అతడికి సహకరించిన మరో నిందితుడు సోనీని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. ఈ ఉదంతం నేపథ్యంలో లేడీస్ హాస్టల్‌కు భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ప్రకటించారు. ఈ ద్వయం ఓయూ హాస్టల్లోకి ప్రవేశించడానికి కొద్దిసేపటి ముందు అదే పరిధిలో మరో సెల్‌ఫోన్ చోరీ చేసినట్లు పోలీసులు తేల్చారు. మహబూబ్‌నగర్ జిల్లా, వెల్దండకు చెందిన పొట్టేళ్ళ రమేష్ నగరానికి వలసవచ్చి బీఎన్ రెడ్డి నగర్లో ఉంటున్నాడు. వృత్తిరీత్యా కూలీ అయినా ఇతడి ప్రవృత్తి మాత్రం ఇళ్ళల్లో చోరీలు చేయడం. ఇప్పటికే ఇతడిపై మూడు కమిషనరేట్లలో పలు కేసులు నమోదయ్యాయి. మీర్‌పేట పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. రమేష్ తనకు జైల్లో పరిచయమైన కాచిగూడ వాసి సన్నీ అలియాస్ సోనీతో కలిసి కొన్ని నేరాలు చేశాడు. సన్నీపై ముషీరాబాద్, నారాయణగూడ, సుల్తాన్‌బజార్ పరిధుల్లో అక్రమ మద్యం కేసులు ఉన్నాయి. నారాయణగూడ ఎౖMð్సజ్ పోలీసులు ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. వీరద్దరూ కలిసి ఈ నెల 15 రాత్రి దొంగతనాలకు బయలుదేరారు. 16 తెల్లవారుజామున జామై ఉస్మానియా వద్ద ఉన్న గుడిసెల వద్దకు వెళ్ళారు. సోనీ బయటే ఉండిపోగా రమేష్ లోపలకు వెళ్ళి ఓ సెల్‌ఫోన్ పట్టుకుని వచ్చి అతడికి అప్పగించాడు. అక్కడి నుంచి వీరిద్దరూ నేరుగా ఉస్మానియా వర్శిటీ ప్రాంగణంలోకి చేరుకున్నారు. లేడీస్ హాస్టల్ భవనానికి ప్రాంతంలో కంచె సరిగ్గా లేకపోవడం రమేష్‌కు కలిసి వచ్చింది. అక్కడ ఉన్న ఓ చెట్టు సాయంతో గోడ దూకిన అతను లేడీస్ హాస్టల్ బాత్రూమ్లోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి లోపలకు వెళ్ళి ఓ సెల్‌ఫోన్ తస్కరించాడు. తిరిగి బాత్రూమ్ ద్వారానే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా... అటుగా వచ్చిన ఓ విద్యార్థిని కంట పడ్డాడు. అతడిని పట్టుకోవడానికి ఆమె ప్రయత్నించడంతో పెనుగులాట జరిగి దాడి చేశాడు. వచ్చిన దారిలోనే పరారైన రమేష్ రెండో సెల్‌ఫోన్‌ను సోనికి ఇచ్చాడు. ఈ ఉదంతంపై ఉస్మానియా యూనివర్శిటీ ఠాణాలో కేసు నమోదు కావడంతో ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అప్పటికే రాచకొండలో జరిగిన అనేక చోరీ కేసుల్లో రమేష్ ప్రమేయం ఉంది. వివిధ ఘటనాస్థలాల్లో దొరికిన వేలిముద్రలు అతడే నేరాలు చేసినట్లు నిరూపించాయి. దీంతో రమేష్ కోసం మూడు నెలలుగా ముమ్మరంగా గాలిస్తున్న సరూర్‌నగర్ సీసీఎస్ పోలీసులు గురువారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క ఓయూ కేసు దర్యాప్తు చేస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి సోనిని పట్టుకున్నారు. ఇతడి నుంచి మూడు చోరీ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు రమేష్ కోసం ఆరా తీయగా, అతడు రాచకొండ పోలీసుల అదుపులో ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం అతడు చేసిన నేరాలకు సంబంధించిన రికవరీలు చేయడంపై అధికారులు దృష్టిపెట్టారు. త్వరలో రమేష్‌ను అధికారికంగా రాచకొండ పోలీసులు అరెస్టు ప్రకటించనున్నారు. ఆపై ఉస్మానియా వర్శిటీ పోలీసులు అతడిని పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి ఓయూ లేడీస్ హాస్టల్ కేసులో అరెస్టు చూపించనున్నారు. -
ఓయూ లేడిస్ హాస్టల్ ఆగంతకుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో చొరబడిన ఆగంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో పొట్టేలా రమేశ్, సన్నీలను ఇద్దరు నిందితులుగా గుర్తించామన్నారు. అదేవిధంగా ఈ ఇద్దరు పాత నేతస్తులని పేర్కొన్నారు. వీరిలో సన్నీ అనే నిందితున్ని ఆరెస్టు చేశామన్నారు. రమేశ్ గతంలో పీడి యాక్ట్ కింద జైలుకు వెళ్లాడని తెలిపారు. వీరిద్దరు హాస్టల్లో ఫోన్లు దొంగలించడానికి వెళ్లారని.. ఏ2 నిందితుడు సన్నీ హాస్టల్ బయట ఉండగా.. ఏ1 రమేశ్ లోపలికి వెళ్లారని తెలిపారు. బాత్రూం ద్వారానే హాస్టల్ లోపలికి వెళ్లి మళ్లీ ఆక్కడి నుంచే దొంగలు బయటకు వచ్చారని చెప్పారు. బాత్రూం నుంచి బయటకు వస్తుండగా ఓ అమ్మాయి కంటబడగా.. దీంతో ఆమెపై దాడి చేశారని తెలిపారు. ఈ కేసులో ఏ1 పొట్టేలా రమేశ్ దొరికితే మరిన్ని విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. -
అతనెవరో తెలిసిపోయింది..!
తార్నాక: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి భీభత్సం సృష్టించిన అగంతుకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హాస్టల్లోకి ప్రవేశించి అతను ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అడ్డువచ్చిన ఇతర విద్యార్థినులను సైతం కత్తితో బెదిరించి సెల్‌ఫోన్‌తో పారిపోయిన సంఘటన ఇటీవల తీవ్ర కలకలం సృష్టించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఓయూ అధికారులు నిందితుడిని పట్టుకోవాలని పోలీసులపై ఒత్తిడి తేవడంతో సవాల్‌గా తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తాను సెల్ఫోన్కోసమే అర్దరాత్రి ఓయూ లేడీస్హాస్టల్లోకి ప్రవేశించినట్లు అతను పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కాగా తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఓయూ పోలీసులు పేర్కొన్నారు. -
అమ్మాయిలు.. అభద్రత!
ఓయూ లేడీస్ హాస్టల్.. 2014లో ఓతాగుబోతు లోపలికి ప్రవేశించి విద్యార్థినులను బెదిరించాడు. వారు అప్రమత్తమై అతన్నిపట్టుకునేలోపే వెనుకవైపు నుంచి గోడ దూకి పారిపోయాడు. ♦ ఈ ఏడాది ఓ యువకుడు అర్ధరాత్రి హాస్టల్ గదిలోకి ప్రవేశించి దొంగతనానికిప్రయత్నించగా అమ్మాయిలు పట్టుకొనిదేహశుద్ధి చేశారు. అయితే నిందితుడు వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ♦ తాజాగా రెండు రోజుల క్రితం తెల్లవారుజామున ఓ అగంతకుడు విద్యార్థినుల హాస్టల్లోకి ప్రవేశించి ఓ అమ్మాయి గదిలో నుంచి సెల్‌ఫోన్ దొంగిలించాడు. అడ్డుకునేందుకుప్రయత్నించిన విద్యార్థినులను కత్తి చూపి బెదిరించి గోడ దూకి పారిపోయాడు. ♦ ....ఇలా తరచూ సంఘటనలు జరుగుతున్నా ఓయూ అధికారులు పట్టించుకోవడం లేదు. భద్రత పెంపు విషయంలో చర్యలుతీసుకోవడం లేదు. తార్నాక: నగరంలో నేరాల నియంత్రణ.. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఆధునిక పద్ధతులు.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండగా, యువతుల భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చే ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం ఆ ఛాయలు కనిపించడం లేదు. కట్టుదిట్టమైన భద్రత ఉండాల్సిన చోట బయటి వ్యక్తులు సునాయాసంగా ప్రవేశించి దాడులు చేసి దర్జాగా పోతున్నారు. ముఖ్యంగా మహిళా హాస్టళ్లలో చోరీలు నిత్యకృత్యమయ్యాయి. హాస్టళ్లలోకి ఆగంతుకులు చొరబడి విద్యార్థినులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలనుంచి ఓయూ క్యాంపస్‌కు వచ్చిన వారు ఇక్కడి హాస్టళ్లలో ఉండాలంటే భయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా పాలకవర్గం తీరు మారడంలేదు. తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సంఘటన జరిగినపుడు హడావిడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం ఓ అగంతకుడు తెల్లవారు జామున విద్యార్థినుల హాస్టల్లోకి ప్రవేశించి ఓ అమ్మాయి గదిలో సెల్‌ఫోన్ దొంగిలించడమే కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమెతో పాటు ఇతర విద్యార్థినులను కత్తిచూపి బెదిరించి గోడ దూకి పారిపోయాడు. ఆగంతుకుడు ప్రవేశించిన ఉమెన్స్ హాస్టల్ ఇదే.. ♦ 2014లో కూడా ఇలాగే ఓ తాగుబోతు అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి విద్యార్థినులను బెదిరించాడు. వారు అప్రమత్తమై అతన్ని పట్టుకునే లోపే వెనుకవైపు నుంచి గోడ దూకి పారిపోయాడు. ♦ 2015లో ఓ విద్యార్థిని లైబ్రరీలో చదువుకుని రాత్రి వేళ తిరిగి హాస్టల్‌కు వస్తుండగా, లా కళాశాల వద్ద ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడిచేశారు. ఆమె ప్రతిఘటించి తప్పించుకోగలిగింది. విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థులు అక్కడకు వెళ్లేసరికి వారు పారిపోయారు. ♦ ఇదే ఏడాది ఓ యువకుడు అర్ధరాత్రి హాస్టల్ గదిలోకి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించగా అమ్మాయిలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే సదరు వ్యక్తి వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ♦ 2016లో ఓయూ క్యాంపస్‌లో నడుచుకుంటూ హాస్టల్‌కు వెళుతున్న ఇద్దరు అమ్మాయిలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడి వారి నుంచి సెల్ఫోన్లు, బ్యాగులు లాక్కునేందుకు ప్రయత్నించారు. యువతులు కేకలు వేయడంతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు వచ్చేసరికి ఆగంతుకులు పారిపోయారు. ♦ 2016లో బయట నుంచి క్యాంపస్‌లోకి వచ్చిన ఓ ప్రేమజంటను జువాలజీ డిపార్టుమెంట్ వద్ద అడ్డుకుని పోలీసులమంటూ బెదిరించి వారినుంచి బంగారు ఆభరణాలు లాక్కున్నారు. దీనిపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు నిఘా పెట్టారు. వారం రోజుల తర్వాత ఇదే గ్యాంగ్ రాత్రి వేళ ఐపీఈ వద్ద ఓ ప్రేమజంటను బెదిరించి వారినుంచి డబ్బులు లాక్కుని వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడిన వారిలో ఒకరు పీజీ పూర్తి చేసిన నాన్బోర్డర్ కాగా, మిగతా ఇద్దరు వర్సిటీతో ఎలాంటిసంబంధం లేని వ్యక్తులు కావడం గమనార్హం. ఒక్కరినీ పట్టుకోలేదు.. లేడీస్ హాస్టల్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగడం.. ఆగంతుకులు చొరబడ్డం జరుగుతోంది. విద్యార్థినులను భయబ్రాంతులకు గురిచేస్తున్నా ఈ సంఘటనలపై పాలనా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది లేదు. ఫిర్యాదులు చేసినా ఇంతరకు కనీసం ఒక్కరిని కూడా పట్టుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. వెనుకవైపు లేని సీసీకెమెరాలు విద్యార్థినుల రక్షణం కోసం హాస్టల్ చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అధికారులు కేవలం హాస్టళ్ల ముందు మాత్రమే బిగించారు. ముందు వైపు సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నందున దుండగులు హాస్టళ్ల వెనుక నుంచి గోడదూకి లోపలికి ప్రవేశిస్తున్నారు. జరిగిన సంఘటనలన్నీ అలాగే ఉన్నా అధికారులు మాత్రం హాస్టళ్ల వెనుక వైపు రక్షణ చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు చేస్తున్నాం.. ఓయూ ఇంజినీరింగ్ లేడీస్ హాస్టల్లోకి వ్యక్తి ప్రవేశించాడనే సమాచారం రాగానే తనిఖీలు చేపట్టాం. క్లూస్‌టీమ్‌తో నమూనాలు సేకరించాం. అయితే, సీసీకెమెరాల్లో ఫుటేజ్ చూసినా ఫలితం కనిపించలేదు. ఆగంతుకుడు వెనుకవైపు నుంచి పారిపోయి ఉంటాడు. కేసు నమోదు చేసి గాలింపు చేపట్టాం. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం. – రాజశేఖర్‌రెడ్డి, ఓయూ ఇన్స్పెక్టర్ -
ఓయూ లేడీస్ హాస్టల్లో ఆగంతకుడి హల్చల్
తార్నాక: ఓయూ, ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి తీవ్ర కళకలం సృష్టించాడు. వాష్ రూమ్కువెళ్లిన యువతి గదిలోకి ప్రవేశించిన అతను అరిస్తే చంపేస్తానంటూ కత్తితో బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థిని కేకలు విని విద్యార్థినులు బయటికి రావడంతో అతను గోడదూకి పారిపోయాడు. ఓయూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓయూ ఇంజినీరింగ్ లేడీస్ హాస్టలో ఉంటున్న ఓ విద్యార్థిని గురువారం తెల్లవారు జామున వాష్‌రూమ్‌కు వెళ్లింది. అదే సమయంలో హాస్టల్ వెనుకవైపు నుంచి గోడదూకి వచ్చిన ఓ ఆగంతకుడు ఆమె గదిలోకి ప్రవేశించి సెల్‌ఫోన్ తీసుకెళుతుండగా, గుర్తించిన ఆమె కేకలు వేసింది. దీంతో ఆ అగంతకుడు కత్తితో అరవొద్దంటూ ఆమెను బెదిరించడంతో ఆమె వాష్‌రూమ్‌లో దాక్కుని గడియవేసుకుంది. దీనిని గుర్తించిన అతను బాత్రూంతో పాటు సమీపంలోని మూడు గదులకు బయటనుంచి గడియపెట్టాడు. అనంతరం వాష్ రూంలోకి వెళ్లిన అతను బాధితురాలిని కత్తితో బెదిరిస్తూ బయటికి లాక్కొచ్చాడు. అతని భారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె కేకలు విద్యార్థినిలు బయటికి వచ్చి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను వారిని కత్తితో బెదిరిస్తూ గోడదూకి పారిపోయాడు. ఈ సమయంలో అతను చోరీ చేసిన సెల్‌ఫోన్ జారికింద పడిపోయింది. సెల్‌ఫోన్‌ను దొంగిలించేందుకే అతను హాస్టల్లోకి ప్రవేశించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గాయనపడిన విద్యార్థినికి దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. క్లూస్ టీమ్,డాగ్ స్క్వాడ్ తనిఖీలు.. ఓయూ పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో తనిఖీలు నిర్వహించారు. జాగిలాలు హాస్టల్ గోడ వెనుకవైపు వెళ్లి ఆగిపోయాయి. బాధితురాలి కథనం మేరకు అగంతకుడు నల్లగా, పొట్టిగా ఉన్నాడని, తెలుగు, హిందీభాషలు మాట్లాడుతున్నట్లు తెలిసింది. వివరాల ఆధారంగా అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హాస్టల్‌ను సందర్శించినఇన్చార్జ్ వీసీ దీనిపై సమాచారం అందడంతో ఓయూ ఇన్చార్జ్ వీసీ అరవింద్‌కుమార్ గురువారం ఓయూ లేడీస్హాస్టల్ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. హాస్టల్లో సెల్ఫోన్ల గల్లంతు.. కాగా ఓయూ క్యాంపస్‌లోని పలు హాస్టళ్లలో అమ్మాయిల సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. ముఖ్యంగా అగంతకుడు ప్రవేశించిన హాస్టల్లో ఇటీవల సెల్ఫోన్లు పోగొట్టుకున్న విద్యార్థినులు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసినా వాటి ఆచూకీ లభించలేదు. -
ఓయూ లేడీస్ హాస్టల్లోకి ఆగంతకుడు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లోకి ఓ ఆగంతకుడు చొరబడటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. గురువారం తెల్లవారుజామున హాస్టల్లోకి చొరబడ్డ ఆగంతకుడు ఓయూ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో బాత్రూమ్కు వెళ్లిన ఓ విద్యార్థినిని అతడు కత్తితో బెదిరించాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సదురు విద్యార్థిని భయంతో వణికి పోయింది. ఆ తర్వాత విద్యార్థిని కేకలు వేయడంతో ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే దుండగుడు విద్యార్థిని సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు. ఆగంతకుడు వెనక వైపు నుంచి హాస్టల్లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మాయిల హాస్టల్లో అమానుషం
బతిండా: పంజాబ్ బతిండా జిల్లా తల్వాండీ సాబొలోని అకాల్ యూనివర్సిటీలో అమానుష ఘటన వెలుగు చూసింది. క్యాంపస్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్న విద్యార్థినుల పట్ల అక్కడి సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. విద్యార్థినులు ఆందోళన చేయడంతో బాధ్యులైన నలుగురు మహిళా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. వాడేసిన శానిటరీ నాప్కిన్లను మరుగుదొడ్డిలో పడేయడంతో ఎవరు రుతుక్రమంలో పరీక్షించేందుకు దుస్తులు విప్పాలని హాస్టల్ వార్డెన్లు తమపై ఒత్తిడి తెచ్చారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ దారుణంపై వైస్ ఛాన్స్లర్ గుర్మైల్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన యూనివర్సిటీ అధికారులు.. హాస్టల్ వార్డెన్, అసిస్టెంట్ హాస్టల్ వార్డెన్, ఇద్దరు మహిళా సెక్యురిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై తమకు విద్యార్థినిలు, యూనివర్సిటీ యంత్రాంగం నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తల్వాండీ సాబొ పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ) సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. ఈ ఉదంతం తమ పరిశీలనకు రాలేదని పంజాబ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ మనీషా గులాటీ చెప్పారు. -
లేడీస్ హాస్టల్లో భయానక బల్లి!
ఢిల్లీ: కాలేజీకి రెడీ అవుదామని బాత్రూమ్లోకి వెళ్లిన ఆ విద్యార్థిని ఒక్కసారే గావుకేక పెట్టింది.. ఏం జరిగిందోనన్న కంగారుతో లేడీస్ హాస్టల్లోని విద్యార్థునులంతా పరుగున వచ్చారు.. అంతకుముందెన్నడూ చూడనంత పెద్ద బల్లిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆలస్యం చేయకుండా కాలేజీ యాజమాన్యానికి కబురుపెట్టారు. నిమిషాల వ్యవధిలోనే వణ్యప్రాణి సంరక్షకులు వచ్చారు.. అది ఆఫ్రికా జాతికి చెందిన విషపూరిత బల్లిగా గుర్తించారు.. జాగ్రత్తగా మత్తుమందు ఎక్కించి, వెంటతీసుకెళ్లారు!! ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని నేతాజీ సుభాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఎస్ఐటీ)లో మే 16 చోటుచేసుకుందీ ఘటన. దట్టమైన చెట్ల మధ్యలో ఉండే ఆ క్యాపస్‌లో ఇలాంటి జీవిని ఇదివరకెప్పుడూ చూడలేదని విద్యార్థులు పేర్కొన్నారు. అంతకుముందురోజే భారీ వర్షం కురిసిన విషయాన్ని గుర్తుచేశారు. పెద్ద బల్లి ఘటన తర్వాత విద్యార్థినులంతా తమ గదుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆఫ్రికా జాతికి చెందిన ఆ విషపూరిత బల్లి కుడితే.. ప్రాణాపాయం ఉండనప్పటికీ తీవ్రమైన అనారోగ్యం, విపరీతమైన నొప్పి కలుగుతాయని వణ్యప్రాణి సంరక్షకులు వివరించారు. -
అర్థరాత్రి హాస్టల్లో హాహాకారాలు
విశాఖ క్రైం: ఆశీలుమెట్టలోని మేఘాలయ హోటల్ ఎదురుగా గల సేవ్హాండ్స్ లేడీస్ హాస్టల్లో శుక్రవారం అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే విద్యార్థినుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫోన్లు, నగదు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. పోలీసులు, విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ, హైదరాబాద్‌తో పాటు వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 37 మంది విద్యార్థినులు అశీలుమెట్ట సమీపంలోని సేఫ్ హ్యాండ్స్ లేడీస్ హాస్టల్లో ఉంటున్నారు. వీరంతా శుక్రవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అర్థరాత్రి సమయంలో రూం నెంబర్ – 2లో షార్ట్ సర్క్యూట్ కావడంతో టేబుల్ ఫ్యాన్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అవి సమీపంలోని మంచానికి, టీవీకి అంటుకోవడంతో కాలిపోయాయి. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన విద్యార్థినులు భయాందోళనతో పరుగులు తీసి తోటి వారికి విషయం తెలియజేశారు. వెంటనే అందరూ బయటకు పరుగులు తీశారు. ఈ హడావిడిలో కొందరు తమ సర్టిఫికెట్లు, ఇతర విలువైన వస్తువులు గదుల్లోనే వదిలేశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని నిర్వాహకురాలు జయమ్మతోపాటు అగ్నిమాపక శాఖ సిబ్బందికి తెలియజేశారు. అయితే వారెవరూ వెంటనే స్పందించలేదని... సంఘటనా స్థలికి రాకుండానే జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్వాహకురాలు జయమ్మ ఫోన్ పెట్టేసిందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా సమయానికి రాకపోవడంతో విలువైన వస్తువులన్నీ కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు కాలిబూడిదవడంతో వారంతా కన్నీరు పెట్టుకున్నారు. గదుల్లోని టీవీ, ఫ్యాన్లన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. నీరు లేదని గంట సమయం ఆలస్యంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వారంతా క్షేమంగా ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. నిర్వహణ లోపం వల్లేనా..? సేఫ్ హాండ్స్ లేడీస్ హాస్టల్‌ను అగ్గిపెట్టెల్లాంటి 15 చిన్న గదుల్లో 37 మంది విద్యార్థినులతో నిర్వహిస్తున్నారు. ఒక్కో గదిలో ఒక బెడ్, చిన్న బీరువా ఉండడంతో చాలా ఇరుకుగా ఉంటుంది. మరోవైపు హాస్టల్లో సరైన సౌకర్యాలు లేవని, అయినప్పటికీ నిర్వాహకురాలు పట్టించుకోవడంలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. చాలా గదుల్లో ఎక్కువ మంది ఉన్నారని, తగ్గించమని చెప్పినా వినిపించుకోలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.5వేలు చొప్పున వసూలు చేస్తున్నా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిందని చెప్పినా నిర్వాహకురాలు కనీసం స్పందించలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని నిర్వాహకురాలు జయ మ్మ వద్ద విలేకరులు ప్రస్తావించగా హాస్టల్లో ఆగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకుని సంఘటన స్థలా నికి చేరుకున్నానని... భగవంతుని దయ వల్ల ఎవరికీ ఏమీ కాలేదని అన్నారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేపడతామని ఈస్టు డివిజన్ ఏసీపీ అన్నెపు నర్శింహమూర్తి తెలిపారు.