తనిఖీలు చేస్తున్న క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్
తార్నాక: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ లేడీస్ హాస్టల్‌లోకి ప్రవేశించి భీభత్సం సృష్టించిన అగంతుకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హాస్టల్‌లోకి ప్రవేశించి అతను ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అడ్డువచ్చిన ఇతర విద్యార్థినులను సైతం కత్తితో బెదిరించి సెల్‌ఫోన్‌తో పారిపోయిన సంఘటన ఇటీవల తీవ్ర కలకలం సృష్టించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఓయూ అధికారులు నిందితుడిని పట్టుకోవాలని పోలీసులపై ఒత్తిడి తేవడంతో సవాల్‌గా తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తాను సెల్‌ఫోన్‌కోసమే అర్దరాత్రి ఓయూ లేడీస్‌హాస్టల్‌లోకి ప్రవేశించినట్లు అతను పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కాగా తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఓయూ పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment