
లేడీస్ హాస్టల్ కు నీటి సరఫరా బంద్
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో నీటి కొరత కారణంగా ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహంలోని బ్లాక్-5లో నాలుగు రోజులుగా తాగునీరు లేకపోవడంతో విద్యార్థినులు కష్టాలు పడుతున్నారు.
ఈ ఉదయం నుంచి వాడుక నీరు కూడా నిలిచిపోవడంతో వారి బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. తాము ఫోన్ చేసినా వార్డెన్, చీఫ్ వార్డెన్లు స్పందించడం లేదని విద్యార్థినులు వాపోతున్నారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్దరించాలని కోరుతున్నారు.