
సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్ర యునివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తక్షణమే తన పదవి రాజీనామా చేయాలంటూ కాల్స్ వస్తున్నాయి. ఇలా హైదరాబాద్ కి చెందిన మాధవనాయుడు అనే వ్యక్తి ఏయూ రిజిస్టర్డ్ ఆఫీస్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగ్గుతున్నాడని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. పీవీజీడీ ప్రసాద్ రెడ్డిని వీసీ పదవికి తక్షణమే రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment