విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికా నావికులు సందడి చేశారు. విశాఖ తీరంలో ‘టైగర్ ట్రయంఫ్’ పేరుతో జరుగుతున్న భారత్-అమెరికా ద్వైపాక్షిక సైనిక విన్యాసాల్లో భాగంగా శుక్రవారం ఆంధ్రా వర్సిటీ క్యాంపస్‌ను యూఎస్ సెయిలర్లు సందర్శించారు.
ఈ సందర్భంగా అమెరికా నావికులకు స్థానిక ఎన్‌సీసీ విద్యార్థులు స్వాగతం పలికారు. వర్సిటీ క్యాంపస్‌లో యూఎస్ సర్వీస్ సభ్యులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కుడ్యచిత్రాలు చిత్రించారు. మహిళా క్యాడెట్‌లతో యూఎస్‌ఎస్ సోమర్‌సెట్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ మిచెల్ బ్రాండ్, మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ కమాండర్ ఆఫ్ ట్రూప్స్ లెఫ్టినెంట్ కల్నల్ లిండ్సే మాత్విక్ చర్చించారు.
టైగర్ ట్రయంఫ్ అనేది భారత్, యునైటెడ్ స్టేట్స్ మధ్య అతిపెద్ద ద్వైపాక్షిక సైనిక విన్యాసం. విశాఖపట్నంలో మార్చి 18 నుంచి 30 తేదీల్లో జరుగుతోంది. మొదటి టైగర్ ట్రయంఫ్ 2019లో విశాఖపట్నంలోనే జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment