sailors
-
విశాఖలో సెయిలర్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సెయిలర్స్ కోసం సాగర్ పేరుతో ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్ విశాఖలో ప్రారంభమైంది. నావికుల శిక్షణ కోసం ఐఎన్ఎస్ విశ్వకర్మ బేస్‌లో ఉన్న సెయిలర్స్ ఎనెక్స్ ఇన్స్టిట్యూట్ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించారు. సాగర్ పేరుతో ఆధునికీకరించిన ఈ భవనాన్ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ బుధవారం ప్రారంభించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేసిన సాగర్‌లో పురుషులతో పాటు మహిళా సెయిలర్స్, అగ్నివీర్లకు, యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తించే వారి కోసం ఏర్పాట్లు చేసినట్లు ఈఎన్సీ చీఫ్ అడ్మిరల్ పెందార్కర్ తెలిపారు. భారత దేశ రక్షణ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న సెయిలర్స్‌కు ఆహ్లాదకరమైన వాతావరణంలో మోటివేషన్ అందించడంతో పాటు విశ్రాంతి తీసుకునేలా సాగర్ నిర్మాణం సాగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధికారులు పాల్గొన్నారు. నౌకాదళ సిబ్బందికి ‘ఏఐ’ క్యాప్సుల్ కోర్సు సాంకేతిక పరిజ్ఞానంలో నౌకాదళ సిబ్బంది ప్రతిభా పాటవాలు మెరుగు పరిచేందుకు తూర్పు నౌకాదళంలో విధులు నిర్వర్తిస్తున్న వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాప్సుల్ కోర్సును అందించారు. గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐఎన్ఎస్ కళింగలో ఈనెల 10 నుంచి 3 రోజుల పాటు ఏఐ అప్లికేషన్స్‌తో పాటు మెషిన్ లెర్నింగ్ గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు.ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా సందేహాలు నివృత్తి చేయడంతో వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్‌లో ప్రయోగాత్మక వివరణలు అందించారు. శిక్షణలో పాల్గొన్న తూర్పు నౌకాదళ సిబ్బందికి ధ్రువపత్రాలు అందజేశారు. -
ఆంధ్రా వర్సిటీలో అమెరికా నావికుల సందడి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికా నావికులు సందడి చేశారు. విశాఖ తీరంలో ‘టైగర్ ట్రయంఫ్’ పేరుతో జరుగుతున్న భారత్-అమెరికా ద్వైపాక్షిక సైనిక విన్యాసాల్లో భాగంగా శుక్రవారం ఆంధ్రా వర్సిటీ క్యాంపస్‌ను యూఎస్ సెయిలర్లు సందర్శించారు. ఈ సందర్భంగా అమెరికా నావికులకు స్థానిక ఎన్సీసీ విద్యార్థులు స్వాగతం పలికారు. వర్సిటీ క్యాంపస్‌లో యూఎస్ సర్వీస్ సభ్యులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కుడ్యచిత్రాలు చిత్రించారు. మహిళా క్యాడెట్లతో యూఎస్ఎస్ సోమర్సెట్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ మిచెల్ బ్రాండ్, మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ కమాండర్ ఆఫ్ ట్రూప్స్ లెఫ్టినెంట్ కల్నల్ లిండ్సే మాత్విక్ చర్చించారు. టైగర్ ట్రయంఫ్ అనేది భారత్, యునైటెడ్ స్టేట్స్ మధ్య అతిపెద్ద ద్వైపాక్షిక సైనిక విన్యాసం. విశాఖపట్నంలో మార్చి 18 నుంచి 30 తేదీల్లో జరుగుతోంది. మొదటి టైగర్ ట్రయంఫ్ 2019లో విశాఖపట్నంలోనే జరిగింది. -
తాను వేసిన ఉచ్చులో..
లండన్: చైనాకు సమీపంలోని ఎల్లో సముద్రంలో పశ్చిమ దేశాల జలాంతర్గాములను నిరోధించడానికి తాను వేసిన ఉచ్చులో డ్రాగన్ దేశానికి చెందిన అణు జలాంతర్గామి చిక్కుకుంది. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ రహస్య నివేదిక తమ దగ్గర ఉందని డెయిలీ మెయిల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆగస్టులో ఎల్లో సముద్రంలో చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతానికి సమీపంలో క్వింగ్డావ్ నౌకాదళ స్థావరం ఉంది. ఆక్కడికి అమెరికా, బ్రిటన్ల జలంతర్గాములు రాకుండా చైనా ఏర్పాటు చేసిన యాంకర్ ఉచ్చులో దాని సబ్‌మెరైన్ చిక్కుకుందని డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం ఎలా జరిగిందంటే.. ! ఈ సబ్‌మెరైన్ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ సవివరమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం ఎల్లో సముద్రంలో ఆగస్టు 21 ఉదయం 8.12 గంటల సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన అణు జలంతర్గామి 093 చిక్కుకుపోయింది. అమెరికా, దాని మిత్రపక్షాల జలాంతర్గాముల్ని అడ్డుకోవడానికి వేసిన యాంకర్ చైన్‌ను డ్రాగన్ జలంతర్గామి ఢీ కొట్టడంతో అందులో ఎయిర్ ఫ్యూరిఫయర్, ఎయిర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు ఆగిపోయి ఉండవచ్చు. సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తున్న సిబ్బంది ఆరుగంటల సేపు శ్రమించి ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చినా ఫలితం లేకుండా పోయింది. జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ విషతుల్యమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడి అందులో ప్రయాణిస్తున్న 55 మంది ఉసురు తీసింది. మృతి చెందిన వారిలో జలాంతర్గామి కెప్టెన్ కల్నల్ జీ యాంగ్పెంగ్ సహా 22 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్ కేడెట్స్, 9 మంది పెట్టీ ఆఫీసర్స్, 17 మంది సిబ్బంది ఉన్నారు. ఆగస్టులో ఈ ప్రమాదం గురించి కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాసినా అప్పట్లో చైనా, తైవాన్లు దీనిని తోసిపుచ్చాయి. జలంతర్గాముల్లో హైడ్రోజన్ నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థలు ఉంటాయి. బహుశా చైనా జలాంతర్గామిలో ఆ వ్యవస్థ లేకపోయి ఉండవచ్చునని బ్రిటన్ నిపుణులు చెబుతున్నట్టుగా డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో సబ్మెరైన్నుంచి ఎన్క్రిప్టెడ్ ఆటోమేటిక్ సిగ్నల్ పొరుగు దేశాలకు అందాయని బ్రిటన్ నిపుణులు వెల్లడించారు. అదే సమయంలో బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రసంగం మధ్యలో వెళ్లిపోయారు. అధ్యక్షుడు ప్రసంగ పాఠాన్ని ఆ దేశ వాణిజ్య మంత్రి కొనసాగించారని, ఈ ప్రమాదమే దానికి కారణమన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. -
సబ్‌మెరైన్ ప్రమాదం.. 55 మంది చైనా నావికులు మృతి
ఎల్లో సముద్రంలో చైనా న్యూక్లియర్ సబ్‌మెరైన్‌కు జరిగిన ప్రమాదంలో 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. విదేశీ నావల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో సబ్‌మెరైన్ చిక్కుకున్నట్లు యూకే ఇంటెలిజెన్స్ విభాగాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో ఆక్సిజన్ సిస్టమ్ దెబ్బతిన్న కారణంగా సబ్‌మెరైన్ విషపూరితంగా మారి నావికులు చనిపోయినట్లు వెల్లడించాయి. చైనా నావికాదళానికి చెందిన 093417 సబ్‌మెరైన్ ఆగష్టు 21న ఉదయం 8:12 సమయంలో ఎల్లో సముద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. విదేశీ నౌకల కోసం ఆర్మీ ఏర్పాటు చేసిన ఉచ్చులో సబ్‌మెరైన్ చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఆక్సిజన్ సిస్టమ్ దెబ్బతింది. ఉపరితలానికి రావడానికి కనీసం ఆరు గంటలు పాడుతుంది. కానీ అప్పటికే సబ్‌మెరైన్ విషపూరితంగా మారి 55 మంది నావికులు మరణించారు. ఇందులో 22 మంది అధికారులు ఉన్నారు. ఈ ఘటనపై చైనా స్పందించలేదు. ప్రమాద సమాచారాన్ని చైనా ఖండించింది. తప్పుడు సమాచారంగా ప్రకటించింది. తైవాన్ కూడా ఈ ఘటనను ఖండించింది. సబ్‌మెరైన్ జాడ కనిపెట్టడానికి కూడా అంతర్జాతీయ సహకారాన్ని చైనా ఖండించింది. గత 15 ఏళ్లుగా సబ్‌మెరైన్ సేవల్లో ఉన్నట్లు యూకే అంటెలిజెన్స్ విభాగాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: అంతరిక్షంలో చెత్త వదిలినందుకు రూ.1.24 కోట్ల జరిమానా -
సత్తా చాటిన హైదరాబాద్ సెయిలర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రతికూల వాతావరణంలో ఆరంభమైన జాతీయ మాన్సూన్ రెగట్టా చాంపియన్‌షిప్ మొదటి రోజు హైదరాబాద్ సెయిలర్స్ సత్తా చాటారు. సోమవారం జరిగిన మెయిన్ ఫ్లీట్ ఈవెంట్లో మాజీ జాతీయ చాంపియన్ విజయ్ కుమార్, ప్రీతి కొంగర, లక్ష్మీ నూకరత్నం మెరిశారు. బెంగుళూరు ఆర్మీ త్రిష్ణ సెయిలింగ్ క్లబ్ తరపున బరిలో దిగిన లోకల్ హీరో విజయ్ కుమార్ మొదటి రేస్‌లో తడబడ్డా... తరువాతి రేస్‌లలో 2వ, 3వ స్థానాల్లో నిలిచాడు. మొత్తం మీద 14 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ చౌను కుమారుకు మొదటి రోజు ఏమాత్రం కలసి రాలేదు. అతను 13వ స్థానంలో ఉన్నాడు. బాలికల విభాగంలో హైదరాబాద్ యాట్ క్లబ్ తరపున బరిలో దిగిన ప్రీతి కొంగర రెండో రేస్‌లో విజేతగా నిలిచింది. రేస్ ఆరంభం నుంచి ముగింపు వరకు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అదే క్లబ్‌కు చెందిన లక్ష్మీ నూకరత్నం బాలికల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్‌గా బరిలో దిగిన ఉమా చౌహాన్ (ఎన్ఎస్ఎస్ భోపాల్) నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. గ్రీన్ ఫ్లీట్‌లో హైదరాబాద్ యాట్ క్లబ్ హవా.. అనంతరం జరిగిన గ్రీన్ ఫ్లీట్ సెయిలింగ్ పోటీల్లో హైదరాబాద్ యాట్ క్లబ్ హవా కనబరిచింది. బాలుర విభాగంలో సునీల్ ముదావత్ (మడ్‌ఫోర్ట్ స్కూల్) మొదటి స్థానంలో నిలవగా.. మల్లేష్ గడ్డం (ఎమ్‌జేపీటీ స్కూల్) రెండో స్థానంలో, ప్రవీణ్ రమావత్ మూడో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో సుప్రియ పీరంపల్లి, శ్రీ హర్షిత, వైష్ణవి తాలపల్లి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. హైదరాబాద్ మారియోట్ హోటల్స్ సమర్పణలో ప్రారంభమైన రెగెట్టా సెయిలింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఈనెల 28 వరకు జరగనున్నాయి. -
సెయిలింగ్‌లో రజతం, రెండు కాంస్యాలు
ఏషియాడ్‌లో భారత సెయిలర్లు ఒక రజతం, రెండు కాంస్యాలు అందించారు. మహిళల 49ఈఆర్ ఎఫ్ఎక్స్ ఈవెంట్లో వర్షా గౌతమ్–శ్వేతా షిర్వేగర్ ద్వయం 15 రేసులు పూర్తయ్యేసరికి 40 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది. ఓపెన్ లేజర్ 4.7 విభాగంలో 16 ఏళ్ల హర్షిత తోమర్ 12వ రేసు అనంతరం 62 పాయింట్లతో నిలిచి కాంస్యం దక్కించుకుంది. పురుషుల 49 ఈఆర్‌లో వరుణ్ ఠక్కర్, చెంగప్ప గణపతి కేలపండ జోడీ 15వ రేసు తర్వాత 53 పాయింట్లు స్కోరు చేసి కాంస్యంతో సంతృప్తి పడింది. -
‘మా నౌక మునిగిపోతోంది.. కాపాడండి’
న్యూఢిల్లీ: ‘మేడం మేము వెళ్లుతున్న నౌక మునిగిపోయే ప్రమాదంలో ఉంది. ఇప్పటికే నౌకలోకి చాలా నీళ్లు వచ్చాయి. దయచేసి మమల్ని కాపాడండి. మేమంతా ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లాలనుకుంటున్నామని’ అంటూ ఓ నావికుడు పంపిన ఎస్ఓఎస్ మెసేజ్‌కు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తక్షణమే స్పందించారు. యూఏఈలోని అజ్మాన్ ప్రాంతంలో నడిసద్రంలో చిక్కుకుపోయిన నావికులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ‘నావికులు సముద్రంలో చిక్కుకున్న వార్త ఇప్పుడే చూశాను. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామ’ని సుష్మ తెలిపారు. అనూప్ పాఠక్ అనే నావికుడు మెసేజ్ పంపడంతో ఆమె వెంటనే స్పందించారు. నాలుగు నౌకల్లో 41 మంది భారతీయ నావికులు చిక్కుకున్నట్టు మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది. ఈ నౌకలకు సంబంధించిన యజమాని నావికుల పాస్ పోర్టులు లాక్కుని పత్తా లేకుండా పోయాడు. ఏడాదిగా వీరికి వేతనాలు కూడా చెల్లించడం లేదని స్థానిక మీడియా తెలిపింది. -
సింగపూర్ జలాల్లో చిక్కుకున్న భారత నావికులు
ఫిబ్రవరి నుంచి నౌకలోనే.. నానాకష్టాలు పడుతున్న 22 మంది సింగపూర్: భారత్‌కు చెందిన 22 మంది నావికులు సింగపూర్ జలాల్లో చిక్కుకుపోయి గత ఫిబ్రవరి నుంచి నానా కష్టాలు పడుతున్నారు. తైవాన్‌కు చెందిన చమురు రవాణా నౌక ‘ఫార్చ్యూన్ ఎలిఫెంట్’ కొద్దినెలల క్రితం సింగపూర్ తీరానికి వెళ్లింది. ఇందులో 22 మంది భారత నావికులతోపాటు ఒక రోమన్ దేశస్తుడు ఉన్నారు. నౌకలోని చమురు అన్లోడింగ్ చేయరాదంటూ సింగపూర్ సుప్రీంకోర్టు నుంచి తైవాన్‌కు చెందిన క్యాథే యునెటైడ్ బ్యాంక్ అనుమతి తెచ్చుకుంది. దీంతో 3 నెలల నుంచి చమురు అన్లోడింగ్ నిలిచిపోయింది. ఫలితంగా సిబ్బంది అంతా నౌకలోనే ఉండాల్సి వ స్తోంది. నీరు, తిండి, వేతనానికి ఇబ్బందేమీ లేకపోయినా నౌక నుంచి బయటకు రావడంపై ఆంక్షలు కొనసాగుతుండడంతో ఇబ్బందులపాలవుతున్నారు. కిందటివారం నావికులను మూడుగంటలపాటు సింగపూర్‌లోకి అనుమతించారు. నౌక మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్ల పరిమాణంలో ఉంది. ‘‘టీవీలు చూస్తూ, రేడియో వింటూ, తమ ఇళ్లకు ఫోన్లు చేస్తూ సిబ్బంది కాలక్షేపం చేస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ వారిలో నిరాశ పెరుగుతోంది. సొంతిళ్లకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు’’ అని నౌక కెప్టెన్ ఆశీష్ ఎన్ జా చెప్పారు. -
'సింధురక్షక్' ఘటనలో మూడు మృతదేహలు లభ్యం
-
'సింధురక్షక్' ఘటనలో మూడు మృతదేహలు లభ్యం
ముంబై డాక్‌యార్డ్‌లో మంగళవారం అర్ధరాత్రి పేలుడు సంభవించిన ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో మరణించిన నావికుల్లో మూడు మృతదేహాలను గజ ఈతగాళ్లు ఈ రోజు ఉదయం కనుగొన్నారని నావికాదళ ఉన్నతాధికారులు శుక్రవారం ముంబైలో వెల్లడించారు. అయితే లభ్యమైన ముగ్గురు మృతదేహాలను గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ ఘటనలో మృతి చెందిన మరో 15 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని వారు తెలిపారు. గత మూడు రోజులుగా మరణించిన ఆ నావిక సిబ్బంది ఆచూకీ కోసం నావికాదళం చేపట్టిన ముమ్మర చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని చెప్పారు. జలాంతర్గామి ఘటనలో మరణించిన వారి వివరాలను న్యూఢిల్లీలోని రక్షణ మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరణించిన ఆ 18 మంది నావికుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాకు చెందినవారు ఉన్నారు. ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇదే సింధురక్షక్ మూడేళ్లక్రితం విశాఖతీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని బ్యాటరీ వ్యవస్థ ఉండేచోట పేలుడు సంభవించి ఒక నావికుడు మరణించాడు. ఆ ప్రమాదం జరిగిన నాలుగు నెలలకు మరో రెండు జలాంత ర్గాములు ఢీకొట్టుకున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడగల నౌక గురించి మన నావికాదళం 15 ఏళ్లనుంచి పోరాడుతున్నా అరణ్యరోదనే అవుతోంది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉండగా 2006లో ఆయన సింధురక్షక్లో కొన్ని గంటలు సంచరించినప్పుడు దానికి రక్షణగా అత్యవసర పరిస్థితిలో వినియోగించడం కోసం అమెరికా నుంచి సహాయ నౌకను తెప్పించాల్సివచ్చింది. అది మన నావికాదళానికి అందుబాటులోఉంటే ఇప్పుడు సింధురక్షక్ ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడం సులభమయ్యేది.