సబ్‌మెరైన్ ప్రమాదం.. 55 మంది చైనా నావికులు మృతి | 55 Chinese sailors dead as submarine gets stuck in trap: Report | Sakshi
Sakshi News home page

సబ్‌మెరైన్ ప్రమాదం.. 55 మంది చైనా నావికులు మృతి

Published Wed, Oct 4 2023 2:07 PM | Last Updated on Wed, Oct 4 2023 3:04 PM

55 Chinese Sailors Dead In Submarine Gets Stuck  - Sakshi

ఎల్లో సముద్రంలో చైనా న్యూక్లియర్ సబ్‌మెరైన్‌కు జరిగిన ప్రమాదంలో 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. విదేశీ నావల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో సబ్‌మెరైన్ చిక్కుకున్నట్లు యూకే ఇంటెలిజెన్స్ విభాగాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో ఆక్సిజన్ సిస్టమ్‌ దెబ్బతిన్న కారణంగా సబ్‌మెరైన్ విషపూరితంగా మారి నావికులు చనిపోయినట్లు వెల్లడించాయి. 

చైనా నావికాదళానికి చెందిన 093417 సబ్‌మెరైన్‌ ఆగష్టు 21న ఉదయం 8:12 సమయంలో ఎల్లో సముద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. విదేశీ నౌకల కోసం ఆర్మీ ఏర్పాటు చేసిన ఉచ్చులో సబ్‌మెరైన్ చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఆక్సిజన్ సిస్టమ్ దెబ్బతింది. ఉపరితలానికి రావడానికి కనీసం ఆరు గంటలు పాడుతుంది. కానీ అప్పటికే సబ్‌మెరైన్ విషపూరితంగా మారి 55 మంది నావికులు మరణించారు. ఇందులో 22 మంది అధికారులు ఉన్నారు. 

ఈ ఘటనపై చైనా స్పందించలేదు. ప్రమాద సమాచారాన్ని చైనా ఖండించింది. తప్పుడు సమాచారంగా ప్రకటించింది. తైవాన్‌ కూడా ఈ ఘటనను ఖండించింది. సబ్‌మెరైన్ జాడ కనిపెట్టడానికి కూడా అంతర్జాతీయ సహకారాన్ని చైనా ఖండించింది. గత 15 ఏళ్లుగా సబ్‌మెరైన్ సేవల్లో ఉన్నట్లు యూకే అంటెలిజెన్స్ విభాగాలు పేర్కొన్నాయి.    

ఇదీ చదవండి: అంతరిక్షంలో చెత్త వదిలినందుకు  రూ.1.24 కోట్ల జరిమానా


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement