సైఫాబాద్‌ సైన్స్‌ కాలేజీలో మూడు కొత్త కోర్సులు | J Laxman Naik has started three new courses Saifabad Science College | Sakshi
Sakshi News home page

సైఫాబాద్‌ సైన్స్‌ కాలేజీలో మూడు కొత్త కోర్సులు

Published Thu, Jul 20 2023 1:53 AM | Last Updated on Thu, Jul 20 2023 11:29 AM

J Laxman Naik has started three new courses Saifabad Science College - Sakshi

బంజారాహిల్స్‌: యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ సైఫాబాద్‌లో బుధవారం న్యూ అకడమిక్‌ కేలెండర్, యాంటీ ర్యాగింగ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సైఫాబాద్‌ కాలేజ్‌ 2023–24 అకడమిక్‌ ఇయర్‌లో కొత్త కోర్సులు రావడం, అదే విధంగా పీజీ లేడీస్‌ హాస్టల్‌ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ జె. లక్ష్మణ్‌ నాయక్‌ అన్నారు. ఓయూ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ యాదవ్‌ చొరవతో ఈ కాలేజీలో కొత్తగా మూడు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు ప్రవేశ పెట్టారన్నారు.  బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ ఆనర్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఈ విద్యా సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నామని అన్నారు.కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నవనీత, హాస్టల్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ జగదీశ్వర్, అకడమిక్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ రామయ్య, డాక్టర్‌ వెంకటేష్ , రమణ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement