
ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే
మన దేశంలో ‘నేషనల్ సైన్స్ డే’ (ఎన్‌ఎస్‌డీ) 1987 ఫిబ్రవరి 28 నుంచి ప్రతి ఏడాదీ నిర్వహించుకుంటున్నాం. అదే రోజు మన భారత శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ తన పరిశోధనల్ని ‘రామన్ ఎఫెక్ట్’ పేరుతో 28 ఫిబ్రవరి 1928న ప్రతిపాదించారు. దీనికే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఇది భారత్‌కే కాదు మొత్తం ఆసియా ఖండానికే దక్కిన మొదటి నోబెల్ బహుమతి.
సైన్స్ డే సందర్భంగా నిర్వహించు కోవాల్సిన కార్యక్రమాలు: 1. నిత్య జీవితంలో సైన్సు ప్రాముఖ్యతను గ్రహించే విధంగా కార్యక్రమాలు రూపొందించు కోవాలి. 2. మానవాభ్యు దయానికి ఉపయోగపడే వైజ్ఞా నిక పథకాలకు రూపకల్పన చేసుకోవాలి. 3. సమాజంలో వైజ్ఞానిక అవగాహన పెంచడా నికి కృషి చేసిన, చేస్తున్నవారి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. వాటికి ప్రాధాన్యత కల్పించాలి.
సైన్స్ డే పాఠశాలలకు, కళాశాలలకు, విశ్వవిద్యాల యాలకు మాత్రమే పరిమితం కాదు. అన్ని పౌర సంఘాల్లో దీన్ని ఘనంగా జరుపు కోవాలి. దేశ పౌరుల్లో ముఖ్యంగా బాల బాలికల్లో సైన్సుపట్ల ఆసక్తిని పెంచడానికి దీన్ని ఉపయోగించాలి. సైన్స్ డే సందర్భంగా ఉప న్యాసాలు, ఊరేగింపులు, వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ సంబంధిత పోటీలు నిర్వహించి జనంలో అవగాహనపెంచాలి.
మన విద్యా విధానంలో ఉన్న ప్రధాన లోపమేమంటే, క్లాస్ రూంలో సైన్స్ సూత్రాలు మాత్రమే చెబుతారు. అంతేగానీ, ఒక శాస్త్రవేత్త ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ పరిశోధ నలు చేయగలిగాడన్నది మాత్రం సంక్షిప్తంగా నైనా చెప్పరు. ఈ ధోరణి మారాలి.ప్రపంచమంతా వైజ్ఞానికంగా ముందుకు దూసుకుపోతున్న తరుణంలో కొందరు మన దేశ పౌరులు మన ప్రభుత్వ పెద్దలు మూఢ నమ్మకాలకు పెద్ద పీట వేస్తున్నారు. దేశాన్ని మూడు వేల ఏళ్ళ నాటి అనాగరిక సమాజంలోకి లాక్కుపోతున్నారు. ఆ ప్రమాదంలోంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశ పౌరులంతా వివేకం ప్రదర్శించాలి. సైన్సును ఒక వెన్నెముకగా చేసుకుని ప్రగతి పథంలోకి నడవాలి.మూఢత్వాన్ని వదిలి, చేతనత్వం లోకి రావాలంటే – మనం మన రాజ్యాంగంలో రాసుకున్న 51ఏ (హెచ్) స్ఫూర్తిని నిలుపు కోవాలంటే, ప్రతి పౌరుడూ చిత్తశుద్ధితో పని చేయక తప్పదు. ఇప్పటి దేశ కాల పరిస్థితులను చూస్తుంటే, ఇక ఆ దిశలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించి ఆచరించాల్సిన అవ సరం వచ్చిందని అనిపిస్తోంది.
ఇప్పుడు ప్రజల చేతిలో ఉన్న ఆయుధం – ప్రశ్న! ప్రశ్నలోంచి ఎదు గుతూ వచ్చిందే సైన్సు!! ఈ సైన్సు అంత ముఖ్యమైందిగా ఎందుకయ్యిందీ? అంటే చీకటిలోంచి వెలుగులోకి వెళ్ళాలంటే సైన్సే ఆసరా కాబట్టి. అనాగరికతనూ, మూర్ఖత్వాన్నీ వదిలి విశాల విశ్వంలో అత్యాధునిక మాన వులుగా నిల బడాలంటే సైన్సు తప్ప మరో మార్గం లేదు. అన్యాయాల్ని, అబద్ధాల్ని, దుర్మా ర్గాల్ని ఛేదించాలంటే తీసుకోక తప్పదు సైన్సు సహాయం. అలాగే ఇప్పుడు ప్రభుత్వాల మూఢత్వం బద్దలు కొట్టాలన్నా, మనకున్నది ఒక్కటే పదునైన ఆయుధం – అదే సైన్స్!
– డా.దేవరాజు మహారాజు, సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment