saifabad
-
వివాదాస్పదమైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తీరు
-
సైఫాబాద్ సైన్స్ కాలేజీలో మూడు కొత్త కోర్సులు
బంజారాహిల్స్: యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్‌లో బుధవారం న్యూ అకడమిక్ కేలెండర్, యాంటీ ర్యాగింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సైఫాబాద్ కాలేజ్ 2023–24 అకడమిక్ ఇయర్లో కొత్త కోర్సులు రావడం, అదే విధంగా పీజీ లేడీస్ హాస్టల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జె. లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ చొరవతో ఈ కాలేజీలో కొత్తగా మూడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశ పెట్టారన్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నామని అన్నారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నవనీత, హాస్టల్ వైస్ ప్రిన్సిపాల్ జగదీశ్వర్, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ రామయ్య, డాక్టర్ వెంకటేష్ , రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఓ సారూ.. మమ్మల్ని పట్టించుకోండ్రి!
-
సైఫాబాద్ లో తండ్రి దాడిలో గాయపడిన చిన్నారి మృతి
-
Hyderabad: తండ్రి చేతిలో గాయపడిన చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: కన్న కూతురిని విక్షణారహితంగా కొట్టడమేగాక పైకెత్తి కింద పారవేడయంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. సైఫాబాద్ ఇన్స్‌స్పెక్టర్ సత్తయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గత శనివారం ఇంట్లో బాత్రూంలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి సకినా ఫాతిమాను ఆమె తండ్రి బాసిత్ ఖాన్ తీవ్రంగా కొట్టడమేగాక పాటు పైకెత్తి నేలకేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తల్లి సనా ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Telangana: ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారికి ఉద్యోగాలకు ఓకే! -
Hyderabad: పసిపాపను కిరాతకంగా కొట్టిన తండ్రి
సాక్షి, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీ ఘట్లో దారుణం జరిగింది. బాసిత్ అలీ ఖాన్ అనే ఆటో డ్రైవర్ తన మూడో కూతుర్ని కిరాతకంగా కొట్టాడు. ఆమె ఏడుస్తుందని ఆగ్రహంతో నేలకేసిబాది క్రూరంగా ప్రవర్తించాడు. నలుగురు సంతానం గల ఇతడు పదే పదే ఆడపిల్లలు పుడుతున్నారని శనివారం ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన చిన్నారిని తల్లి సన నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యుల సూచన మేరకు పాపను ఉస్మానియా ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. భార్య సన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి బాసిత్ అలీ ఖాన్‌ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఆడపిల్లలు పదే పదే పుట్టడంతో భార్య, పిల్లలపై దాడి చేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాసిత్ అలీ ఖాన్, సన 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. చదవండి: కూతురి ప్రేమకు తండ్రే విలన్... చంపమని రూ.లక్ష సుపారీ.. చివరకు.. -
నాణేలు చూతము రారండోయ్! ఇక్ష్వాకుల నుంచి ఈస్ట్ ఇండియా కాలం వరకు
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: చారిత్రక సైఫాబాద్ మింట్ కాంపౌండ్ మరో అరుదైన ప్రదర్శనకు వేదికైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సందర్శకులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్పీఎంసీఐఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ త్రిపాఠి పత్ర ఘోష్ ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీఎంసీఐఎల్ డైరెక్టర్లు ఎస్.కె.సిన్హా, అజయ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పటి తూకపు బాట్లు 119 ఏళ్ల చరిత్ర కలిగిన మింట్ కాంపౌండ్‌లో నిజాం కాలం నుంచి నాణేలను ముద్రించారు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు వివిధ రాజుల కాలాల్లో తయారు చేసిన, ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన విలువైన నాణేలను, స్మారక చిహ్నాలను ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. మహనీయుల స్మారకార్థం తయారైన నాణేలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సైఫాబాద్ మింట్‌లో యంత్రాల ద్వారా నాణేలను తయారు చేసే ఛాయాచిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. చారిత్రక, సాంస్కృతిక వారధులు.. ∙మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో క్రీ.శ 1613 నాటి 11 కిలోల బంగారు నాణెం మొహర్ చిత్రం సందర్శకులను కట్టి పడేస్తోంది. మొఘల్ సామ్రాజ్య ఔన్నత్యాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే ఈ అరుదైన నాణేన్ని నిజాంకు జహంగీర్ బహుమతిగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఈ నాణెం కువైట్‌లో ఉందని చారిత్రక పరిశోధకులు క్రాంతికుమార్ సేవక్ తెలిపారు. ఇలాంటి అరుదైన మొహర్లతో పాటు అనేక రకాల నాణేలను, చిహ్నాలను ఈ ప్రదర్శనలో వీక్షించవచ్చు. ఆయా కాలాల్లో రాజులు ఆరాధించిన దేవతామూర్తుల చిత్రాలు, వారి సాంస్కృతిక జీవితాన్ని, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే చిత్రాలతోనూ ఆ కాలంలో నాణేలు చలామణిలో ఉన్నాయి. ఇక్ష్వాకులు, చాళుక్యులు, శాతవాహనాలు, తదితర రాజుల కాలం నుంచి ఈస్టిండియా వారి ఏలుబడిలో చలామణిలో ఉన్న నాణేల వరకు ఈ ప్రదర్శనలో చూడవచ్చు. ఢిల్లీ సుల్తాన్లు, మహ్మద్‌బిన్ తుగ్లక్, మద్రాస్ ప్రెసిడెన్సీ, ట్రావెన్కోర్ మహారాజుల ఏలుబడి నాటి నాణేలతో పాటు నిజాం నవాబుల హయాంలో హాలీ చిక్కా నుంచి అణాల వరకు ఇక్కడ కనిపిస్తాయి. విదేశాల నాణేలు కూడా.. దేశంలోని పలు రాజవంశాల కాలం నాటి నాణేలతో పాటు వివిధ దేశాలకు చెందిన నాణేలను కూడా ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ తదితర దేశాలకు చెందిన నాణేలు ఇక్కడ కనిపిస్తాయి. బ్రిటీష్ రాజుల కాలంలోని వివిధ కాలాల్లో తయారు చేసిన నాణేలు సైతం ఉన్నాయి. 1835 నుంచి 1947 వరకు చలామణీలో ఉన్న ఈస్టి్టండియా నాణేలు ప్రదర్శనలో ఉంచారు. -
పెటి కేసులో సైఫాబాద్ పోలీసుల దురుసు ప్రవర్తన.. లాఠీలతో మహిళలపై దాడి?
సాక్షి, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున పోలీసుల దురుసు ప్రవర్తన ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్న పెటి కేసు వివాదంలో ముస్లిం మహిళలపై సైఫాబాద్ ఎస్సై సూరజ్, కానిస్టేబుల్ లాఠీలతో కొట్టారు. సైఫాబాద్ నుంచి ఇద్దరు హిళలు కారులో నాంపల్లి వైపు వెళుతుండగా అదే దారిలో ప్రయాణిస్తున్న బస్సుతో మైనర్ యాక్సిడెంట్ జరిగింది. దీంతో మహిళలు, బస్సు డ్రైవర్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్సై సూరజ్, ఓ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తమను ఎస్సై సూరజ్, కానిస్టేబుల్ లాఠీతో కొట్టినట్లు ఇద్దరు మహిళలు ఆరోపించారు. దీంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న యువకులు, బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలని రోడ్డు పై ఆందోళనకు దిగారు. చదవండి: రాకాసి రోడ్డు.. ప్రమాదాలకు నిలయంగా ఎన్‌హెచ్–44 తమకు న్యాయం చేయాలని ఎస్సై సూరజ్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమను లాఠీతో గాయపరిచిన ఎస్సై, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ సీఐ జలీల్ పాషా, సైఫాబాద్ డీఐ రాజు నాయక్‌లు బాదితులను శాంతింపజేసీ ప్రయత్నం చేశారు. విచారణ జరిపి ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని బాధిత మహిళకు నచ్చజెప్పారు. బాధిత మహిలు ఇచిన ఫిర్యాదును నాంపల్లి సీఐ కలిల్ పాషా స్వీకరించి , విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
పాపం పసివాడు.. తల్లి ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి!
సాక్షి, ఖైరతాబాద్: అప్పటివరకు గోరుముద్దలు తినిపించిన తల్లి ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి రెండున్నరేళ్ల బాలుడు ఇంటిముందు ఉన్న సంపులో పడి మృతిచెందిన సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖైరతాబాద్ డివిజన్, బీజేఆర్‌నగర్‌కు చెందిన ఉపేందర్, నాగేశ్వరి దంపతులకు అభినయ్(2.5 ) కుమారుడు ఉన్నాడు. ఉపేందర్ గత కొంత కాలంగా కర్నాటకలో ఉంటుండగా నాగేశ్వరి కుమారుడితో కలిసి రేకుల ఇంట్లో ఉంటోంది. మంగళవారం రాత్రి బాబుకు అన్నం తినిపించి ఇంట్లోకి వెళ్లింది. అరగంట తర్వాత బయటికి వచ్చి చూడగా బాబు కనిపించలేదు. దీంతో అతడి కోసం గాలించగా నీటి సంపులో క నిపించాగు. చిన్నారికి బయటికి తీసి వెంటనే వాస వి హాస్పిటల్‌కు, అక్కడి నుంచి నిలోఫర్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నీటి సంపుపై కప్పు లేనందునే ప్రమాదవశాత్తు బాలు డు అందులో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు సంపులపై మూతలు ఉండేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చదవండి: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ! -
నగరంలో రోడ్డుమీదే దగ్ధమైన కారు!
హైదరాబాద్: నగరంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు ఉన్నపళంగా మంటల్లో దగ్ధమవ్వడం కలకలం రేపింది. లక్డీకాఫూల్లోని సైఫాబాద్ పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. ఖైరతాబాద్ నుంచి లక్డీకాఫూల్ వైపు వస్తుండగా ఉన్న రోడ్డు మీద ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ టెండర్‌తో కారులోని మంటలను ఆర్పారు. ఒక్కసారిగా కారులో మంటలు ఎందుకు వచ్చాయన్నది తెలియాల్సి ఉంది. -
కూతురుకు మత్తుమందు ఇచ్చి..
హైదరాబాద్: కూతురి పట్ల ఓ సవతి తల్లి కర్కశంగా ప్రవర్తించింది. కూతురును బలవంతంగా వ్యభిచారవృత్తిలోకి దించి ఆమె జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఓ యువతి తన సవతి తల్లి నుంచి రక్షణ కల్పించమని సైఫాబాద్ పోలీసుల్ని ఆశ్రయించింది. సైఫాబాద్‌లో ఓ మహిళ తన కూతురుకు మత్తుమందు ఇచ్చి వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించింది. అయితే కూతురు భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ విషయం తెలిసిన సవతి తల్లి, రౌడీలతో వెళ్లి అక్కడ గొడవ చేసింది. అంతేకాకుండా తన కూతురు కనిపించడం లేదంటూ, బంగారం దొంగలించిందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైన యువతి... జరిగిన విషయం పోలీసులకు తెలిపింది. తన తల్లి వ్యభిచారం చేయమని బలవంతం చేస్తోందని, అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికులు కూడా అండగా నిలిచి పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సైన్స్ కాలేజీలో రూ.10 కోట్లతో హాస్టల్ భవనం
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా సైఫాబాద్‌లో ఉన్న సైన్స్ కాలేజీలో మరో హాస్టల్ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మయ్య తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అందించనున్న రూ.8 కోట్ల నిధులకు తోడు యూనివర్సిటీ నుంచి రూ.2 కోట్లు రానున్నాయని ఆయన వివరించారు. ఈ మొత్తం రూ.10 కోట్లతో విద్యార్థులకు కొత్త హాస్టల్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒకే హాస్టల్ భవనంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు వసతి కల్పించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. మంత్రి ప్రకటించిన మేరకు నిధులు అందిన వెంటనే వచ్చే మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన శనివారం 'సాక్షి'కి వెల్లడించారు. -
సైఫాబాద్ పీఎస్‌లో చంద్రబాబుపై ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ న్యాయవాదులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ కులాన్ని కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాదులు పేర్కొన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇదిలావుండగా చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలియజేస్తూ కరీంనగర్ జిల్లాలో యాదవులు వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు. కరీంనగర్ జిల్లా సమీపంలోని గుంటూరుపల్లి వద్ద యాదవ కులస్తులు చంద్రబాబు ఫ్లెక్సీని దగ్ధం చేశారు. యాదవులను కిందచపరిచేలా మాట్లాడిన చంద్రబాబు తీరును నిరసిస్తూ గొర్రెల మందతో రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు వెంటనే యాదవ కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
రూ.3 కోట్లకు ‘కొరియర్’ కుచ్చుటోపీ
శాఖల ఏర్పాటు పేరుతో మోసం హైదరాబాద్ : కొరియర్ సర్వీస్ పేరుతో సుమారు రూ.3కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిందో సంస్థ. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ఫోరన్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ సర్వీసెస్ పేరుతో నిర్వాహకులు పలు జిల్లాల్లో కొరియర్ సర్వీస్ శాఖలను ఏర్పాటు కోసం ప్రచారం చేశారు. లాభాలొస్తాయని ఆశించిన బాధితులు జిల్లా, సబ్‌జోనల్ వారీగా శాఖల ఏర్పాటు చేసుకునేందుకు రూ.1.30 లక్షల నుంచి రూ.5లక్షల వరకు నిర్వాహకులకు చెల్లించారు. తమ ప్రాంతాల్లో కార్యాలయాలు తెరచిన బాధితులు అందుకు తగిన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా ప్రధాన కార్యాల యం నుంచి కొరియర్ సర్వీస్ ప్రారంభించేందుకు అనుమతి రాకపోవడంతో వారంతా ఫోన్లో వాకబు చేయడం ప్రారంభించారు. అయితే అటునుంచి స్పందన రాలేదు. దీంతో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాలకు చెందిన బాధితులు బుధవారం హైదరాబాద్‌లోని సాధన్ కళాశాల దరి పావని ప్లాజా ఆరో అంతస్తులో ఉన్న సంస్థ కార్యాలయానికి వచ్చారు. సంస్థ రీజినల్ సేల్స్ మేనేజర్ రిపు దమన్‌సింగ్, ఆపరేషన్స్ హెడ్ పుల్‌దీప్‌సింగ్‌లను నిలదీశారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుంచి ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తారని వారు చెప్పడంతో బాధితులు గురువారం ఉదయం నుంచి కార్యాలయం వద్దనే గడిపారు. మధ్యాహ్నం గడిచినా సంస్థ ప్రతినిధులెవరూ రాకపోవడంతో మోసపోయామని తెలుసుకొన్న వారు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
కిరాయిదారులపై నిఘా
సైబరాబాద్ సీపీసాక్షి, సిటీబ్యూరో: 2007 ఆగస్టు, 2013 ఫిబ్రవరి... ఉత్తరాది నుంచి వచ్చిన ముగ్గురు ముష్కరులు హబ్సిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్‌ల్లో మకాం పెట్టారు... లుంబినీపార్క్, గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌ల్లో బాంబులు పేల్చి 59 మందిని బలి తీసుకున్నారు... ముంబై మోడల్ని ఈవెంట్ పేరుతో తీసుకువచ్చిన దండుగులు నిజాంపేట్‌లోని ఇంట్లో బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాల్ని పరిగణలోకి తీసుకున్న సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ టెనెంట్స్ వాచ్ (అద్దెకుండే వారిపై నిఘా) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవీ విధి విధానాలు... ‘టెనెంట్స్ వాచ్ ఫామ్’ దరఖాస్తుల్ని ముద్రించి అన్ని ఠాణాల్లో అందుబాటులో ఉంచుతారు. ఇంటి యజమానులంతా వీటిని తీసుకోవాలి. తమ ఇంట్లో అద్దెకుండే వారి పూర్తి వివరాలు నమోదు చేసి, వారి గుర్తింపు పత్రాలతో పాటు ఫొటోలనూ జత చేసి పోలీసు స్టేషన్లో అప్పగించాలి. ఈ అంశాన్ని మరింత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారం నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క స్థానిక ఇన్స్పెక్టర్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తన పరిధిలో టెనెంట్స్ వాచ్ అమలును తనిఖీ చేయాలి. కేవలం వివరాలు సేకరించి వదిలిపెట్టకుండా ఫొటోలతో సహా టెనెంట్స్ డేటాబేస్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అద్దెకున్న వారి వివరాలన్నీ సెంట్రల్ సర్వర్‌లో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, దీన్ని పోలీసు విభాగం వినియోగించే ఇంట్రానెట్‌కు కనెక్ట్ చేస్తారు. శివార్లలో కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు ఐటీ హబ్‌లోనూ టెనెంట్స్ వాచ్ తప్పనిసరి చేసి ఉల్లంఘించిన ఇంటి యజమానులపై చర్యలకు అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఈ టెనెంట్స్‌వాచ్ అమలుతో ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయడంతో పాటు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు దర్యాప్తు తేలికవుతుందని అధికారులు భావిస్తున్నారు. -
డయల్ 100కు 175 సార్లు ఫోన్: వ్యక్తిపై కేసు
హైదరాబాద్, న్యూస్‌లైన్: అత్యవసర సమయాల్లో సమాచారం అందించేందుకు పోలీసు శాఖ ఏర్పాటు చేసిన డయల్ 100 ఫోన్ నెంబర్‌కు వరుసగా 175 సార్లు ఫోన్ చేసిన ఆలూరి చిన్నా అనే వ్యక్తిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న చిన్నా తన సెల్‌ఫోన్ నుంచి వరుసగా 175 సార్లు డయల్ చేశాడు. ఫోన్ చేసిన ప్రతీసారి ఏం మాట్లాడకుండా పెట్టేశాడు. అత్యవసర సేవల కోసం కేటాయించిన ఫోన్‌నెంబర్‌కు అనవసరంగా ఫోన్‌చేసి విధులకు ఆటంకం కలిగించినందుకుగాను చిన్నాపై కేసు నమోదుచేసినట్లు డీఐ కె. శంకర్ తెలిపారు. అత్యవసర సేవల కోసం కేటాయించిన ఫోన్ నెంబర్లకు ఎవరైనా అనవసరంగా ఫోన్‌చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నగదు బదిలీ.. నవ్వులపాలు
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్‌కు చెందిన రాజేశ్వర్ గతనెల 22న గ్యాస్ బుక్ చేయగా.. ఈనెల 2న సిలిండర్ ఇంటికి చేరింది. రూ.1096 చెల్లించి సిలిండర్ తీసుకున్నారు. సబ్సిడీ నగదు మాత్రం ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. కూకట్‌పల్లికి చెందిన సుజాత పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంది. ఆధార్‌కార్డు జీరాక్స్ కాపీలను గ్యాస్ ఏజెన్సీలో, బ్యాంకులో రెండుచోట్లా ఇచ్చారు. ఇప్పటివరకు ఆధార్ కనెక్ట్ కాలేదు. అదేమంటే రేపు..మాపు అంటూ తిప్పుతున్నారు. ఇవీ ఒక్క రాజేశ్వర్, సుజాతల సమస్యలే కాదు..మహానగరంలో లక్షలాదిమంది గ్యాస్ వినియోగదారుల సమస్య. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నగదుబదిలీ పథకం ఆరంభంలోనే నవ్వులపాలవుతోంది. ఎంతో కసరత్తు చేసి దీన్ని ప్రారంభించామని ప్రకటించిన ప్రభుత్వం..గ్యాస్ వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపుతోంది. ఫలితంగా గ్యాస్ సిలిండర్ ముట్టుకోవాలంటేనే భయమవుతోందని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ నగదు ఖాతాలో జమ కాక పూర్తిస్థాయి రీఫిల్లింగ్ ధరలను భరించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. కొందరు వినియోగదారులకు సబ్సిడీ నగదు అసలు బదిలీ కాకపోగా, మరికొందరికి అడ్వాన్సగా బ్యాంకు ఖాతాలో జమఅయినా..రెండు,మూడోసారి మాత్రం తీవ్రజాప్యం జరుగుతోంది. చేసేదిలేక వినియోగదారులు సబ్సిడీ నగదు కోసం డీలర్ల, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. సబ్సిడీ కొందరికే..: వంటగ్యాస్‌కు నగదుబదిలీ అమలుతో ‘సబ్సిడీ’పై అయోమయం నెలకొం ది. ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానమైనా రీఫిల్లింగ్‌పై సబ్సిడీ వస్తుందో రాదో? అర్థంకాని దుస్థితి ఏర్పడింది. సిలిండర్‌కు మా త్రం మార్కెట్ ధర చెల్లించక తప్పడంలేదు. గ్రే టర్లో ప్రస్తుతం వినియోగంలో 26.05 లక్షల ఎల్పీజీ కనెక్షన్లుండగా, అందులో 68 శాతం కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. అం దులో బ్యాంకు ఖాతాలతో అనుసంధానమైన కనెక్షన్లు 46 శాతానికి మించలేదు. ఆధార్,బ్యాం కు రెండింటితో అనుసంధానమైన వారు మాత్ర మే సబ్సిడీకి అర్హులు కాగా, అందులో సైతం సగంమందికే సబ్సిడీ నగదు జమవుతోంది. బాధ్యులెవరు..? ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానమైనా.. సబ్సిడీ నగదు బదిలీపై జవాబుదారీతనం లేకుండాపోయింది. ఇటు డీలర్లు, అటు బ్యాంకర్లు తమకు సంబంధం లేదంటే తమకులేదని పట్టించుకోవడం లేదు. ఫలితంగా నగదు బదిలీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ) పరిధిలోని భారత జాతీయ చెల్లింపు సంస్థ(ఎన్పీసీఐ) అనుసంధానంలో సాంకేతిక తప్పిదాలే సమస్యకు కారణమని అధికారులు అంటున్నారు. వాస్తవంగా కేంద్రం సబ్సిడీ మొతాన్ని ఆయిల్ కంపెనీలకు విడుదల చేస్తే..కంపెనీలు ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తాయి. ఎన్పీసీఐ అనుసంధానం ఆధారంగా సబ్సిడీ నగదు వినియోగదారుల ఖాతాలో జమవుతుంది. సిలిండర్ ఆన్లైన్లో బుక్ కాగానే సంబంధిత డీలర్ల ద్వారా ఆయా కంపెనీలు ఓఎంసీలకు అనుసంధానమై అక్కడ్నుంచి ఎన్పీసీఐలకు మ్యాపెడ్ జరగాల్సి ఉంది. అయితే మ్యాపెడ్లో ఎలాంటి సాంకేతిక తప్పిదం జరిగినా.. నగదు బదిలీ పెండింగ్ పడిపోతోంది. ఇలా నగరంలో సుమారు 52శాతం మంది వినియోగదారులకు నగదు బదిలీలో ఆటంకం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇదీ లెక్క.. చెల్లిస్తున్న ధర సబ్సిడీ ధర సబ్సిడీ నగదు జమయ్యేది అదనపు భారం రూ.1096 412.50 రూ.626.39 రూ. 57.10 (అమ్మకం పన్ను)