హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ న్యాయవాదులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ కులాన్ని కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాదులు పేర్కొన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఇదిలావుండగా చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలియజేస్తూ కరీంనగర్ జిల్లాలో యాదవులు వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు. కరీంనగర్ జిల్లా సమీపంలోని గుంటూరుపల్లి వద్ద యాదవ కులస్తులు చంద్రబాబు ఫ్లెక్సీని దగ్ధం చేశారు. యాదవులను కిందచపరిచేలా మాట్లాడిన చంద్రబాబు తీరును నిరసిస్తూ గొర్రెల మందతో రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు వెంటనే యాదవ కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సైఫాబాద్ పీఎస్లో చంద్రబాబుపై ఫిర్యాదు
Published Mon, May 4 2015 1:20 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement
Advertisement