telangana lawyers
-
మోదం.. ఖేదం
యాకుత్‌పురా: హైకోర్టును విభజించడంపై హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టులో గురువారం సంబురాలు జరుపుకున్నారు. కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ జీపీ ఎం.ఎస్.తిరుమల్‌రావు, బార్ అసోసియేషన్ కార్యదర్శి బి.జానకీరాములు, సీనియర్ న్యాయవాదులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జానకీరాములు మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టును విభజించడం శుభపరిణామమన్నారు. హైకోర్టు విభజనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణ, బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైకోర్టులో సంబురాలు.. ఉమ్మడి హైకోర్టును విభజించడంతో హైకోర్టు వద్ద గురువారం తెలంగాణ న్యాయవాదుల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. న్యాయవాదులు కోర్టు బయట టపాసులు పేలుస్తూ, స్వీట్లు పంచి పెడుతూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గండ్ర మోహన్ రావు, తెలంగాణ న్యాయవాదులు కొంతం గోవర్దన్‌రెడ్డి, వి.రవికుమార్, ఎ.అనిల్ కుమార్, చంద్రశేఖర్‌రావు, సి.కల్యాణ్ రావు తదితరులు పాల్గొన్నారు. విధులను బహిష్కరించిన ఏపీ న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ పనులు పూర్తికాక ముందే హైకోర్టును అమరావతికి తరలించడంపై ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో గురువారం విధులను బహిష్కరించి హైకోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేశ్ కుమార్, కోశాధికారి బి.వి.అపర్ణలక్ష్మీ మాట్లాడుతూ.. రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైకోర్టును పూర్తిస్థాయి భవన నిర్మాణ పనులు చేపటాకే కోర్టును తరలించాలన్నారు.అమరావతిలో నిర్మిస్తున్న సిటీ సివిల్ కోర్టు భవనంలోకి హైకోర్టును తరలిస్తున్నప్పటికీ అక్కడ ఇప్పటి వరకు 50శాతం కూడా నిర్మాణ పనులు పూర్తికాలేదన్నారు. తాత్కాలిక భవన నిర్మాణ పనులు సైతం పూర్తి కాకముందే తరలించడంతో న్యాయవాదులు ఇబ్బందులకు గురవుతారన్నారు. రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌కు అనుగుణంగా భవన నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం కోర్టును తరలిస్తే బాగుంటుందన్నారు. -
న్యాయవాదులపై హైకోర్టు కన్నెర్ర
సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఇటీవల నిర్వహించి న ఆందోళనల సందర్భంగా న్యాయవాదులపై హైకోర్టు కన్నెర్ర చేసింది. విధి నిర్వహణలో ఉన్న న్యాయాధికారులపై దాడులు చేయడం, కోర్టు ఆస్తుల విధ్వంసం, కోర్టు విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడిన అంశాన్ని సుమోటోగా తీసుకుంది. వారిపై కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు మంత్రి రవీందర్, భార్గవ్, వరంగల్ జిల్లాకు చెందిన ఎం.రంజిత్, అంబటి శ్రీనివాస్, అల్లం నాగరాజు, ఆండాలు, బి.జయకర్, ఎం.సహోదర్‌రెడ్డి, వి.శ్యాంకృష్ణాలతో పాటు మరికొందరికి నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కార చట్టం కింద వారిపై చర్యలెందుకు తీసుకోరాదో వివరించాలని కోరింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 23న చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా జడ్జీల నివేదికల మేరకు.. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల కు వ్యతిరేకంగా న్యాయాధికారులు, న్యాయవాదు లు ఈ ఏడాది జూన్‌లో ఆందోళన చేపట్టారు. అన్ని జిల్లాల్లో కోర్టు కార్యకలాపాలు జరగకుండా అడ్డుకున్నారు. కోర్టు హాళ్లలో కుర్చీలను, టేబుళ్లను ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై ఆయా జిల్లా జడ్జీలు హైకోర్టుకు నివేదికలు పంపారు. వీటిని పరిశీలించిన హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ... సదరు న్యాయవాదులపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించే అంశాన్ని పరిశీలించాలని తీర్మానించింది. దీంతో అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే గత నెల 26న ఆదేశాలిచ్చారు. రంగారెడ్డి జిల్లా న్యాయవాదులకు సంబంధించి ఒక పిటిషన్, వరంగల్ జిల్లాకు చెందిన న్యాయవాదులకు సంబందించిన పిటిషన్‌ను కలిపి మంగళవా రం విచారణ జరిపిన ధర్మాసనం.. నోటీసులు జారీ చేసింది. -
వెళ్లండి.. లేదా వెళ్లగొడతాం
హైకోర్టును విభజించాలని ఢిల్లీలో తెలంగాణ న్యాయవాదుల మహాధర్నా విభజన జరగకుండా వెంకయ్య, చంద్రబాబు కుట్రపన్నుతున్నారు ఉమ్మడి హైకోర్టును అడ్డం పెట్టుకుని తెలంగాణపై పెత్తనం చేస్తున్నారు చేతులకు సంకెళ్లతో నిరసన సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు వెంటనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ న్యాయవాదులు ఢిల్లీలో కదం తొక్కారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేశారు. వెళ్లండి.. లేదా వెళ్లగొడతామంటూ నినాదాలు చేశారు. హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని.. లేకుంటే మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పా టు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర న్యాయవాదులు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా చేపట్టారు. కేంద్రం తీరుకు నిరసనగా చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో రాష్ట్రంలోని అన్ని బార్ అసొసియేషన్ల సభ్యులు కలిపి సుమారు రెండు వేల మందికిపైగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మాదిరిగా మరో పోరాటం చేసి ప్రత్యేక హైకోర్టును సాధించుకుంటామని వారంతా నినదించారు. నిర్దిష్ట గడువుతో ప్రణాళిక ప్రకటించాలి హైకోర్టు విభజనకు నిర్దిష్ట గడువుతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకటించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయాధికారుల విభజనకు అనుసరించిన ఆప్షన్ల విధానాన్ని ఉపసంహరించుకోవాలని... కింది స్థాయి కోర్టుల జడ్జీలు, న్యాయస్థానాల సిబ్బందిపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరారు. ఈ ధర్నాతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని... తమ న్యాయమైన పోరాటాన్ని గుర్తించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య, ఏపీ సీఎం చంద్రబాబులే హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి హైకోర్టును అడ్డు పెట్టుకుని తెలంగాణపై పెత్తనం చెలాయించడానికి వారు కుట్రపన్నారని పేర్కొన్నారు. కాగా న్యాయవాదుల ధర్నాకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ మద్దతు పలికారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ధర్నాలో టీఆర్ఎస్ ఎంపీలు కవిత, వినోద్, జితేందర్, సీతారాం నాయక్ పాల్గొని మద్దతు పలికారు. కాస్త ఓపిక పడదాం..: ఎంపీ కవిత తెలంగాణ ఏర్పడి రెండేళ్లయినా హైకోర్టు విభజన జరగ కపోవడంతో న్యాయవాదులే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. వారి పోరాటానికి అండగా ఉంటామన్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, ఈ అంశంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై అన్నిరకాలుగా ఒత్తిడి తెస్తున్నారని.. గత వారం జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలోనూ, ప్రధాని మోదీతో భేటీలోనూ కేసీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తారని తెలిపారు. ప్రధాని మోదీ కూడా తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై సానుకూలంగా స్పందించారని.. హైకోర్టు విభజనకు ఆయన చొరవ తీసుకుంటారన్న నమ్మకముందని పేర్కొన్నారు. అందువల్ల హైకోర్టు విభజనపై కాస్త ఓపిక పడదామని, అయినా ఏర్పాటు చేయకపోతే పోరాడి సాధించుకుందామని చెప్పారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఏర్పడిన రెండు నెలల్లోనే వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేశారని.. కానీ తెలంగాణ ఏర్పడి రెండేళ్లయినా హైకోర్టు ఏర్పాటు చేయలేదని టీఆర్ఎస్ మరో ఎంపీ వినోద్ పేర్కొన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్రం చొరవ తీసుకుని ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ధర్నాకు టీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తోందని చెప్పారు. -
అసదుద్దీన్ ఓవైసీపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశద్రోహులకు అండగా ఉన్నాడంటూ తెలంగాణా న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. నగరంలో పట్టుబడ్డ ఐసిస్ ఏజెంట్లకు న్యాయసహాయం అందిస్తామన్న ఎంపీ వ్యాఖ్యల వల్ల ఉగ్రవాదులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆరోపించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని హెచ్చార్సీ చైర్మన్ ను లాయర్స్ కోరారు. -
సీజేతో తెలంగాణా న్యాయవాదుల భేటీ
-సమ్మె విరమిస్తే జోక్యం చేసుకుంటానని హామీ ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యూఢిల్లీ: తెలంగాణా న్యాయవాదులు చేపట్టిన సమ్మె విరమిస్తే తాను సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ హామీ ఇచ్చారని తెలంగాణా న్యాయవాద సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదివారం తెలంగాణా న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఆయన అధికార నివాసంలో కలుసుకున్నారు. తెలంగాణాలో న్యాయమూర్తుల సస్పెన్షన్ తర్వాత ఏర్పడిన పరిస్ధితులను వివరించామని తెలంగాణా న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఎం. రాజేందర్ రెడ్డి, జి. మోహన్ రావు, జి. జితేందర్ రెడ్డి విలేకరులకు తెలిపారు. న్యాయాధికారుల నియామకాలను వెంటనే నిలిపివేయాలని, న్యాయమూర్తుల సస్పెన్షన్ ఎత్తివేయాలని, హైకోర్టు విభజన సమస్యను పరిష్కరించడానికి జోక్యం చేసుకోవాలని కోరామన్నారు. దాదాపుగా గంట సేపు జరిగిన సమావేశంలో తాము చెప్పిన విషయాలను ప్రధాన న్యాయమూర్తి సావధానంగా విన్నారని తెలంగాణా న్యాయవాదులు చెప్పారు. కేంద్రం మార్గదర్శకాలు లేకుండా న్యాయవాదుల నియామకాలు జరిగాయని వారు వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి నియామకాలు జరపాలన్న అంశంపై ప్రధాన న్యాయమూర్తి కూడా అంగీకరించారన్నారు. ఈ విషయం పై కేంద్ర న్యాయ శాఖా మంత్రితో చర్చిస్తామని జస్టిస్ టిఎస్ ఠాకూర్ చెప్పారన్నారు. తెలంగాణా న్యాయవాదులు నిరసనను విరమించుకుంటేనే తాను జోక్యం చేసుకుంటానని, లేని పక్షంలో తప్పడు సంకేతాలు వేళ్లే అవకాశం ఉందని ప్రధాన న్యాయమూర్తి సూచించారని తెలంగాణా న్యాయవాదులు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి సూచనపై హైదరాబాద్‌లో విస్తృత స్ధాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణా న్యాయవాద సంఘాల ప్రతినిధులు చెప్పారు. -
'ఏపీలో హైకోర్టుకు మాకు అభ్యంతరం లేదు'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు పెట్టుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. గురువారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు విభజనపై తెలంగాణ న్యాయవాదులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర పరిధిలో హైకోర్టు విభజన ఉందనే ఉద్దేశంతో ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కేఈ అన్నారు. -
విధుల బహిష్కరణకు సహకరిస్తే చర్యలే
- తెలంగాణ న్యాయాధికారులకు హైకోర్టు హెచ్చరిక - కొద్ది రోజుల క్రితం అంతర్గత సర్క్యులర్ - విధుల బహిష్కరణ సరికాదు: ఏసీజే - విధులకొచ్చే న్యాయవాదులకు రక్షణ కల్పిస్తాం సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను వ్యతిరేకిస్తూ తెలంగాణ న్యాయవాదులు కొద్ది రోజులుగా ఆందోళనలు, ముఖ్యంగా కోర్టుల బహిష్కరణ కొనసాగిస్తున్న నేపథ్యంలో హైకోర్టు కొద్ది రోజుల క్రితం ఓ కీలక అంతర్గత సర్క్యులర్ జారీ చేసింది. న్యాయవాదుల కోర్టుల బహిష్కరణకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహాయ సహకారాలందిస్తున్నట్లు తెలిస్తే తీవ్రంగా పరిగణిస్తామని తెలంగాణ న్యాయాధికారులను హెచ్చరించింది. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విధుల బహిష్కరణ సందర్భంగా కొందరు న్యాయాధికారులు కాల్ వర్క్ పూర్తి చేసి, కేసుల విచారణ చేపట్టకుండా చాంబర్లకే పరిమితమవుతున్నట్లు తమ దృష్టికి వచ్చినందుకే సర్క్యులర్ జారీ చేస్తున్నట్లు పేర్కొంది. ‘‘న్యాయాధికారులు నెలవారీగా పరిష్కరించాల్సిన కేసుల కోటాను పూర్తి చేయకపోవడానికి లాయర్ల కోర్టుల బహిష్కరణను కారణంగా చూపితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. న్యాయాధికారిని విధులను నిర్వర్తించకుండా లాయర్లు గానీ, మరెవరైనా గానీ అడ్డుకుంటే తన యూనిట్ హెడ్ దృష్టికి తీసుకురావాలి. వారు ఆ న్యాయాధికారికి పోలీసు రక్షణ కల్పించి కోర్టు విధులు సక్రమంగా జరిగేలా చూడాలి’’ అని ఆదేశించింది. కారణమేదైనా లాయర్లెవరూ విధులు బహిష్కరించొద్దని సుప్రీంకోర్టు కూడా పేర్కొందంటూ, ఆ తీర్పు కాపీని న్యాయాధికారులకు హైకోర్టు పంపింది. రక్షణ కల్పిస్తాం... విధుల బహిష్కరణ వల్ల పేద కక్షిదారులే నష్టపోతారని లాయర్లు గ్రహించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే పేర్కొన్నారు. మంగళవారం ఓ కేసు విచారణను ఆయన నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేయగా, ఆ రోజు విధుల బహిష్కరణ ఉందంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సోమవారానికి వాయిదా కోరారు. ఆ కార్యక్రమాలతో తమకు సంబంధం లేదన్న ధర్మాసనం, తదుపరి వాయిదాలివ్వబోమని పేర్కొంది. వాయిదా కోరబోనని, రక్షణ కల్పిస్తే వాదనలు వినిపిస్తానని ఆయన చెప్పారు. రక్షణ కోరితే నిస్సందేహంగా వెంటనే కల్పిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఏసీజే ఉన్నత స్థాయి భేటీ తెలంగాణ న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చిన సందర్భంగా జస్టిస్ బొసాలే మంగళవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ‘ఏపీఏటీ చైర్మన్ రాజీనామా చేయాలి’ ఓ న్యాయవాదికి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ సముద్రాల గోవిందరాజులు వైఖరిని నిరసిస్తూ ఉభయ రాష్ట్రాల న్యాయవాదులు మంగళవారం ఏపీఏటీలో విధులను బహిష్కరించారు. చాంబర్ ముందు నినాదాలు చేశారు. గోవిందరాజులు రాజీనామా చేయాలన్నారు. ఇంద్రకరణ్‌ను కలిసిన జేఏసీ నేతలు హైకోర్టు విభజన, న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాలపై జోక్యం చేసుకోవాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు మంగళవారం న్యాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిశారు. జేఏసీ అధ్యక్షుడు ఎం.రాజేందర్‌రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు, న్యాయవాద సంఘాల సమాఖ్య అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లక్కరాజు హరిరావు వినతిపత్రం సమర్పించారు. లాయర్ల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. -
లాయర్ల చలో హైకోర్టు ఉద్రిక్తం
జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో చేరుకున్న న్యాయవాదులు బృందాలుగా హైకోర్టు వద్దకు వెళ్లేందుకు యత్నం భారీగా మోహరించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడంతో ఉద్రిక్తత న్యాయవాదుల నిరసన.. మదీనా వద్ద రోడ్డుపై బైఠాయింపు అటు హైకోర్టులోనూ బైఠాయించిన న్యాయవాదులు వందల మంది న్యాయవాదుల అరెస్టు.. పోలీస్స్టేషన్లకు తరలింపు ఆందోళన ఉధృతం చేస్తామని న్యాయవాద సంఘాల ప్రకటన నేటి నుంచి రోజుకో రూపంలో నిరసన ప్రదర్శనలు జూలై 1 నుంచి సమ్మె చేస్తామని న్యాయశాఖ ఉద్యోగుల నోటీసు సాక్షి, హైదరాబాద్: కింది స్థాయి న్యాయవ్యవస్థలో న్యాయాధికారులను విభజిస్తూ చేసిన ప్రాథమిక కేటాయింపులపై నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన చలో హైకోర్టు ఉద్రిక్తంగా మారింది. న్యాయవాదుల ముట్టడిని అడ్డుకునేందుకు హైకోర్టు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. హైకోర్టు వైపు వెళ్లే రహదారులపై ఆంక్షలు అమలు చేశారు. హైకోర్టు వద్దకు బృందాలుగా వస్తున్న వందలాది మంది న్యాయవాదులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. హైకోర్టు వద్దకు చేరుకున్నవారిని గేటు వద్దే నిలిపేసి అరెస్టులు చేశారు. దీంతో న్యాయవాదులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అప్పటికే హైకోర్టులోకి వెళ్లిన న్యాయవాదులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలు వద్ద బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల హై అలర్ట్! సోమవారం న్యాయవాదులు చేపట్టిన నిరసనలు, చలో హైకోర్టు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. హైకోర్టుకు వెళ్లే ప్రధానదారుల వద్ద ఆంక్షలు అమలు చేశారు. ఇటు మదీనా వద్ద, అటు సిటీ కాలేజీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఉద్యోగులను, కేసుల జాబి తాలో పేర్లున్న న్యాయవాదులను, స్వయంగా కేసులను వాదించుకునే కక్షిదారులను మాత్ర మే హైకోర్టులోకి వెళ్లేందుకు అనుమతించారు. హైకోర్టు వద్దకు బృందాలుగా వస్తున్న పలువురు లాయర్లను మదీనా వద్ద వద్దే నిలిపేశారు. దాంతో న్యాయవాదులంతా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు వారందరినీ అరెస్టు చేసి ఫలక్‌నుమా, కంచన్‌బాగ్ పోలీస్స్టేషన్లకు తరలించారు. హైకోర్టులోనూ నిరసనలు.. కోర్టు పనివేళలు ప్రారంభం కావడానికి ముం దే పలువురు న్యాయవాదులు కోర్టు ప్రవేశమార్గాల వద్దకు వచ్చి విధుల బహిష్కరణకు సహకరించాలని ఆంధ్రా న్యాయవాదులను కోరా రు. ఉదయం 10.30 గంటలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) సహా మిగతా న్యాయమూర్తులంతా యథావిధిగా కేసుల విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ న్యాయవాదులు కోర్టు హాలులోకి వచ్చి తాము విధుల బహిష్కరణకు పిలుపునిచ్చామని, కేసుల విచారణకు హాజరుకాని న్యాయవాదుల కేసులను కొట్టివేయవద్దని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇదే తరహాలో మిగతా న్యాయమూర్తుల కోర్టులకు వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని న్యాయవాదులను కోరారు. న్యాయవాద జేఏసీ నేతలతో చర్చలు వివిధ జిల్లాల నుంచి హైకోర్టుకు వస్తున్న న్యాయవాదులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఏసీజే కోర్టు హాలు ముందు బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయవాదులను విడిచిపెడతామని పోలీసులు హామీ ఇవ్వడంతో అక్కడ నిరసన విరమించారు. కానీ హైకోర్టు గేటు వద్దకు చేరుకుంటున్న న్యాయవాదుల సంఖ్య పెరుగుతుండడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీనిపై ఆగ్రహించిన న్యాయవాదులు ఈసారి ఏసీజే చాంబర్ ముందు బైఠాయించారు. దీంతో ఏసీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలే, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ రామసుబ్రమణ్యన్, జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లు న్యాయవాదుల జేఏసీ నాయకులు గండ్ర మోహనరావు, రాజేందర్‌రెడ్డి, సత్యంరెడ్డి, రఘునాథ్ తదితరులతో చర్చలు జరిపారు. ఈ చర్చల గురించి నిర్దిష్ట సమాచారం బయటకు రాలేదు. మరోవైపు చలో హైకోర్టు కార్యక్రమానికి మద్దతుగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల పరిధిలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. పోలీసులు అరెస్టు చేసిన న్యాయవాదులను సాయంత్రం విడిచిపెట్టారు. జూలై 1 నుంచి సమ్మె: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను ఉప సంహరించుకోవాలని, లేకపోతే జూలై 1 నుంచి తెలంగాణవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో సమ్మెకు దిగుతామని న్యాయశాఖ ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు న్యాయ శాఖ ఉద్యోగులు సోమవారం హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) డి.నాగార్జునకు సమ్మె నోటీసు అందచేశారు. ఆందోళనలు ఉధృతం చేస్తాం న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను వెనక్కి తీసుకునే వరకూ ఆందోళన కొనసాగించాలని న్యాయవాదుల సంఘాలు నిర్ణయించాయి. తెలంగాణవ్యాప్తంగా కోర్టు విధుల బహిష్కరణను శనివారం వరకూ కొనసాగించాలని తీర్మానించాయి. చలో హైకోర్టు కార్యక్రమం అనంతరం పది జిల్లాల న్యాయవాద సంఘాలు, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం సమావేశమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకో రూపంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 14న కోర్టు ఆవరణల్లో టెంట్లు వేసి సామూహిక నిరాహార దీక్షలు, 15న మౌన ప్రదర్శనలు, 16న వంటావార్పు, 17న తెలంగాణకు ఆప్షన్ ఇచ్చిన న్యాయాధికారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఆంధ్రాకు వెళ్లాలని కోరుతూ పోస్టుకార్డులు పంపనున్నారు. తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు ఈ వారాంతంలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇక వారంలో ఒక రోజు హైకోర్టు విధులను బహిష్కరిస్తామని, న్యాయవాదులకు సంఘీభావంగా రోజుకో జిల్లాకు వెళ్లి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు తెలిపారు. -
తెలంగాణ న్యాయవాదుల ఛలో హైకోర్టు
హైదరాబాద్ : హైకోర్టును విభజించడం, ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్లతో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ పిలుపు మేరకు లాయర్లు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సోమవారం ఛలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. దీంతో కోర్టు దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. కాగా హైకోర్టుకు తరలి వస్తున్న న్యాయవాదులను పోలీసులు మదీనా చౌరస్తా దగ్గరే అడ్డుకున్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ కోర్టులో కేసులు ఉన్నటువంటి న్యాయవాదులను మాత్రమే లోనికి అనుమతి ఇస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు లోపలికి చేరుకున్నారు. విధులను అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. -
10 నుంచి కోర్టుల్లో విధుల బహిష్కరణ
తెలంగాణ న్యాయవాదుల ఉద్యమ బాట సాక్షి, హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులు మరోసారి ఉద్యమ బాట పట్టనున్నారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన ప్రక్రియలో భాగంగా న్యాయాధికారుల కేటాయింపులకు సంబంధించి హైకోర్టు ఇటీవల విడుదల చేసిన ప్రాథమిక జాబితాను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి తెలంగాణలోని అన్ని కోర్టుల్లో విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. అన్ని కోర్టుల్లో ప్రాథమిక కేటాయింపుల జాబితా ప్రతులను తగులబెట్టి హైకోర్టుకు తమ నిరసనను తెలియజేయనున్నారు. న్యాయంగా దక్కాల్సిన 40 శాతం వాటా మేర మొదట తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారుల నుంచి హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం రెండు రోజుల క్రితం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేసింది. అలాగే తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం అన్ని జిల్లా న్యాయవాద సంఘాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఎం.రాజేందర్‌రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు, బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం.సహోదర్‌రెడ్డి, పలు జిల్లా న్యాయవాద సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో తీర్మానాలు చేశారు. కీలక తీర్మానాలు... - మార్గదర్శకాలకు విరుద్ధంగా హైకోర్టు రూపొందించిన న్యాయాధికారుల కేటాయింపుల ప్రాథమిక జాబితాను ఉపసంహరించుకోవాలి. - ఏపీ న్యాయాధికారులు తెలంగాణను ఎంపిక చేసుకుంటూ ఇచ్చిన ఆప్షన్‌ను వెనక్కి తీసుకునేలా కోరుతూ అన్ని కోర్టుల్లో బ్యానర్లు ఏర్పాటు చేయాలి. - రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ మంత్రి తదితరులను కలసి వినతిపత్రాలు సమర్పించాలి. - న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్ల నిధిని సక్రమంగా వినియోగించేందుకు వెంటనే మార్గదర్శకాలు జారీ చేయాలి. అలాగే న్యాయవాదులకు హౌసింగ్ స్కీం కోసం కూడా మార్గదర్శకాలు జారీ చేయాలి. - స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా అన్ని పోలీస్స్టేషన్లకు ఆదేశాలివ్వాలి. ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి. -
తెలంగాణ లాయర్ల ‘ఉద్యమ’ బాట!
చిచ్చు రేపిన న్యాయాధికారుల కేటాయింపులు సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల విభజనపై మరో ఉద్యమానికి తెలంగాణ న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ న్యాయాధికారులు ఇందుకు పరోక్షంగా మద్దతిస్తున్నారు. భావి కార్యాచరణ కోసం తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం గురువారం జరగనుంది. జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులతో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కూడా శనివారం భేటీ జరపనుంది. తెలంగాణ న్యాయాధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. న్యాయాధికారుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించిన హైకోర్టు, కేటాయింపులను మాత్రం వాటికి విరుద్ధంగా చేసిందంటూ లాయర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన వారిలో 141 మంది ఏపీ చెందిన న్యాయాధికారులున్నారని తెలిసి కూడా హైకోర్టు ప్రాథమిక జాబితాను విడుదల చేసిందని, ఇది సరికాదన్నారు. కేటాయింపుల్లో అన్యాయంపై అంతా కలిసి తమ వాదనలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ‘‘ఈ కేటాయింపులను ఆమోదిస్తే వచ్చే రెండేళ్లల్లో ఏపీలో భారీగా ఖాళీలు ఏర్పడతాయి గానీ తెలంగాణలో మాత్రం అందుకు ఆస్కారముండదు. తెలంగాణ న్యాయాధికారులకు పదోన్నతుల్లోనూ తీరని అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేదాకా దీనిపై పోరాటం చేస్తాం’’ అని వారంటున్నారు. -
ఏపీకి 492.. తెలంగాణకు 335
♦ కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనలో ముందడుగు ♦ న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపు ♦ జాబితాను విడుదల చేసిన ఉమ్మడి హైకోర్టు ♦ అభ్యంతరాలకు పది రోజుల గడువు ♦ కేటాయింపులపై టీ న్యాయవాదుల అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనలో ముందడుగు పడింది. ఇరురాష్ట్రాలకు న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులకు సంబంధించిన జాబితాను ఉమ్మడి హైకోర్టు మంగళవారం విడుదల చేసింది. న్యాయాధికారులిచ్చిన ఆప్షన్లు ఆధారంగా రూపొందించిన ఈ జాబితాను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ విడుదల చేశారు. ఉభయ రాష్ట్రాల్లో జిల్లా జడ్జీలు, సీనియర్ సివిల్ జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జీలు.. మొత్తం కలిపి 830 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురుతప్ప మిగతా 827 మంది ఆప్షన్లు ఇచ్చారు. దీని ఆధారంగా 827 మందిలో 492 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 335 మందిని తెలంగాణకు కేటాయించారు. పదవీ విరమణ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని.. పదవీ విరమణ చేసిన, మరణించిన న్యాయాధికారుల్ని కూడా ఆయా రాష్ట్రాలకు కేటాయించారు. హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు అయిన జిల్లా జడ్జీలు జె.ఉమాదేవి, శ్యాంప్రసాద్, ఎన్.బాలయోగి, రజనీలను ప్రాథమికంగా తెలంగాణకు కేటాయించగా.. వారు తమను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలసి విజ్ఞప్తి చేశారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన జరగకపోవడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో న్యాయాధికారుల విభజనకోసం హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికనుగుణంగా ఆప్షన్లు ఇవ్వాలని రెండు రాష్ట్రాల్లోని న్యాయాధికారులను ఆదేశించింది. ఆ మేరకు న్యాయాధికారులు ఆప్షన్లు ఇవ్వగా.. వాటి ఆధారంగా ప్రాథమిక జాబితాను హైకోర్టు రూపొందించింది. దీనిపై అభ్యంతరాలుంటే న్యాయాధికారులు పదిరోజుల్లోగా సీల్డ్ కవర్లో ఆయా జిల్లాల జడ్జీలకు పంపాలని రిజిస్ట్రార్ జనరల్ స్పష్టం చేశారు. జిల్లా జడ్జీలు వాటిని ఈనెల 18కల్లా హైకోర్టుకు పంపాలన్నారు. తెలంగాణకు కేటాయింపులు... తెలంగాణకు 335 మందిని కేటాయించగా.. అందులో 77 మంది జిల్లా జడ్జిల కేడర్, 65 మంది సీనియర్ సివిల్ జడ్జీల కేడర్, 193 మంది జూనియర్ సివిల్ జడ్జీల కేడర్ న్యాయాధికారులున్నారు. ఈ మూడు కేడర్లలోని 28 మంది విశ్రాంత న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు... ఆంధ్రప్రదేశ్‌కు 492 మందిని కేటాయించగా.. అందులో 79 మంది జిల్లా జడ్జీల కేడర్, 123 మంది సీనియర్ సివిల్ జడ్జీల కేడర్, 290 మంది జూనియర్ సివిల్ జడ్జీల కేడర్ న్యాయాధికారులున్నారు. 34 మంది విశ్రాంత న్యాయాధికారులను ఏపీకి కేటాయించారు. ముగ్గురు న్యాయాధికారులు ఆప్షన్లు ఇవ్వకపోవడంతో సర్వీసు రికార్డుల్లోని వివరాల ఆధారంగా వారిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. తెలంగాణ న్యాయవాదుల అభ్యంతరం.. తాజా కేటాయింపులపై తెలంగాణ న్యాయవాదులు మండిపడుతున్నారు. హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ జాబితా ఉందని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ ఎం.రాజేందర్‌రెడ్డి చెప్పారు. దీనిపై బుధవారం ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 141 మంది ఏపీకి చెందిన న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణకు ఆప్షన్ ఇచ్చారని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ న్యాయాధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు నిమ్మ సత్యనారాయణ పేర్కొన్నారు. -
సైఫాబాద్ పీఎస్‌లో చంద్రబాబుపై ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ న్యాయవాదులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ కులాన్ని కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాదులు పేర్కొన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇదిలావుండగా చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలియజేస్తూ కరీంనగర్ జిల్లాలో యాదవులు వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు. కరీంనగర్ జిల్లా సమీపంలోని గుంటూరుపల్లి వద్ద యాదవ కులస్తులు చంద్రబాబు ఫ్లెక్సీని దగ్ధం చేశారు. యాదవులను కిందచపరిచేలా మాట్లాడిన చంద్రబాబు తీరును నిరసిస్తూ గొర్రెల మందతో రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు వెంటనే యాదవ కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
పరీక్ష అడ్డుకున్నందుకు లాయర్ల అరెస్ట్
హైదరాబాద్ : జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్‌పేటలో జరుగుతున్న జూనియర్ సివిల్ జడ్జిల నియామక పరీక్షను నిర్వహించరాదంటూ, పరీక్షను అడ్డుకునేందుకు తెలంగాణకి చెందిన కొందరు న్యాయవాదులు ప్రయత్నించారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసులు పరీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన న్యాయవాదులను అరెస్ట్ చేశారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోసం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాను తెలంగాణ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ కోరిన విషయం తెలిసిందే. మంజూరు చేసిన పోస్టుల ఆధారంగా తెలంగాణ, ఏపీలకు జిల్లా జడ్జీలు, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీల కేడర్‌ను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేసింది. జేఏసీ కన్వీనర్, కో కన్వీనర్లు ఎం.రాజేందర్‌రెడ్డి, గండ్ర మోహనరావు మంగళవారం ప్రధాన న్యాయమూర్తికి గతంలో లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను తెలంగాణ, ఏపీలకు 42:58 నిష్పత్తిలో కేటాయించాలని, ఖాళీల భర్తీకి ఇరు రాష్ట్రాలకూ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు. జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకి విభజనకు ముందే నోటిఫికేషన్ జారీ చేశారని గుర్తు చేశారు. కేంద్రం ఇప్పటికే హైకోర్టు విభజన చర్యలు ప్రారంభించిందని, అందులో భాగంగా ఇరు హైకోర్టులకు న్యాయమూర్తుల సంఖ్యను ఖరారు చేసిందని తెలిపారు. -
మార్చి 8న జూనియర్ సివిల్ జడ్జిల పరీక్షలు
హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే)ల పరీక్షలకు ఎట్టకేలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో మార్చి 8న జూనియర్ సివిల్ జడ్జిల పరీక్ష యథాతధంగా జరగనుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, అప్పటివరకు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టి. న్యాయవాదులంతా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేసే వరకు జూనియర్ సివిల్ జడ్జిల పరీక్షలు ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. తెలంగాణ న్యాయవాదుల పిటిషన్‌ను తిరస్కరించింది. జేసీజే పరీక్షలను ఆదివారం నాడు నిర్వహించాలని, పరీక్షల అనంతరం తుది ఫలితాలను సీల్డ్ కవర్లో ఉంచాలని హైకోర్టు సూచించింది. -
హైకోర్టు విభజనకు చంద్రబాబు, సీజే అడ్డు
* ప్రత్యేక హైకోర్టుకై నినదించిన తెలంగాణ న్యాయవాదులు * టీడీపీ నేత రమణకు పిండప్రదానం * న్యాయవాదుల ర్యాలీ, అరెస్టు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టును పోలీసుల రక్షణతో నడిపిస్తున్నారని తెలంగాణ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజనను చంద్రబాబు, సీజే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. న్యాయశాఖలో నియామకాలను నిలిపివేయాలని, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ, తెలంగాణ హైకోర్టు సాధన కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో వందలాది మంది న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ కలసి న్యాయవ్యవస్థకు సంకెళ్లు వేశారంటూ న్యాయవాదులు సంకెళ్లతో నిరసన తెలిపారు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణకు పిండప్రదానం జరిపించారు. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ రాజేందర్ రెడ్డి, కో కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి, హైకోర్టు సాధన కమిటీ చైర్మన్ సహోదర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎమర్జెన్సీలో సైతం పోలీసు రక్షణతో న్యాయవ్యవస్థ నిర్వహణ జరగలేదన్నారు. హైకోర్టు ప్రాంగణంలో 144 సెక్షన్ విధించడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజకీయాలు చేయాలనే ఆసక్తి ఉంటే తక్షణమే రాజీనామా చేసి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాలన్నారు. సమస్యలుంటే పరిష్కరించుకుందామంటున్న చంద్రబాబు హైకోర్టు విభజనపై చర్చకు రావాలన్నారు. అనంతరం చలో సెక్రటేరియట్‌కు ర్యాలీగా వెళ్తున్న తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం: ఇంద్రకరణ్ సాక్షి, హైదరాబాద్: హైకోర్టును విభజించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని.. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. హైకోర్టు విభజన, జూనియర్ సివిల్ జడ్జీల నియామక ప్రక్రియ నిలుపుదలపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు శ్రీరంగరావు, రాజేం దర్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి సచివాలయంలో మంత్రిని కలిశారు. హైకోర్టు విభజన చేయకుండా న్యాయశాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తే తెలంగాణ వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. న్యాయవాదులపై పోలీసులు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారన్నారు. స్పందిం చిన మంత్రి ఇది న్యాయవాదులదే కాదు.. తెలంగాణ సమస్య అని, ఇదే అంశంపై సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలిసినట్లు చెప్పారు. -
‘హైకోర్టు విభజనకు చొరవ తీసుకోండి’
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన కోసం చొరవ తీసుకోవాలని, అప్పటి వరకు న్యాయవ్యవస్థలో నియామకాలు చేపట్టకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సాధన కమిటీ గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసింది. బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, సాధన కమిటీ అధ్యక్షుడు ఎం.సహోదర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసింది. తెలంగాణ ఏర్పడి 8 నెలలైనా ఇంకా హైకోర్టును విభజించకపోవడం తగదన్నారు. మా ఉద్యోగాలు మాకు రావాలని, మా పాలన మాకు కావాలనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అయితే ఉమ్మడి హైకోర్టుతో న్యాయవ్యవస్థ నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశముందన్నారు. నియామక ప్రక్రియ ఆపేందుకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు అడ్డంకి కాదని ఈ సందర్భంగా గవర్నర్ అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడిగా నియామకాలు చేపట్టడం తగదన్నారు. ఈ విషయంపై ఇద్దరు సీఎంలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు సహోదర్‌రెడ్డి తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు హరినాథ్, అనంతసేన్‌రెడ్డి, సునీల్‌గౌడ్, జాకీర్ హుస్సేన్ జావీద్లతోపాటు జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులున్నారు. అఖిలపక్షం కూడా: హైకోర్టును విభజించాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ ఎం.రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల బృందం కూడా గవర్నర్‌ను కలిసింది. తెలంగాణ, ఏపీలకు వేర్వేరుగా నియామకాలు చేపట్టాల్సి ఉన్నా.. ఉమ్మడిగానే జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేస్తున్నారని దీంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నివేదించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ప్రొ.కోదండరామ్, ఎమ్మెల్యే లక్ష్మణ్ (బీజేపీ), పెద్దిరెడ్డి (టీడీపీ), శ్రవణ్ (కాంగ్రెస్), అజీజ్‌పాష (సీపీఐ), గోవర్దన్ (న్యూడెమోక్రసీ), హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండారెడ్డి, జగత్పాల్రెడ్డి, రాజిరెడ్డి, బద్రీరాజ్ తదితరులు ఉన్నారు. -
నారా లోకేష్‌పై కేసు నమోదు!
-
యూఎస్ కాన్సులేట్ వద్ద తెలంగాణ లాయర్ల ఆందోళన
హైదరాబాద్: బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ వద్ద తెలంగాణ న్యాయవాదులు సోమవారం ఆందోళనకు దిగారు. భారత జాతిపిత మహాత్మ గాంధీ ని అవమానించినందుకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. అమెరికా కాన్సులేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు న్యాయవాదులు ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. మహాత్మ గాంధీ పేరు, చిత్రాలతో కూడిన బీరు టిన్ లను తయారు చేసి అమెరికా కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేసింది.అమెరికా కనెక్టికట్‌లోని న్యూ ఇంగ్లాండ్ బ్రెవింగ్ కంపెనీ ఈ బీర్ టిన్స్ తయారు చేసింది. దీనిపై భారత్‌తో పాటు అమెరికాలోని భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది. -
ఇక మరిచిపోదాం..!
హైకోర్టు కార్యకలాపాలకు భంగం కలిగించిన కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్య రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక మళ్లీ ఆ విషయం ఎందుకు? కేసీఆర్, కేటీఆర్, ఈటెల, నాయిని, కవిత తదితరులపై కేసుల కొట్టివేత న్యూఢిల్లీ: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగి కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఘటనపై దాఖలైన కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2010 సెప్టెంబరు 13వతేదీ నుంచి 16వ తేదీ వరకు తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించారని... వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు న్యాయవాది పీవీ కృష్ణయ్య, మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాశ్ అదే ఏడాది అక్టోబర్‌లో సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆందోళనలో పాలుపంచుకున్నారంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు(ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి), పార్టీ నేతలు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, కె.తారక రామారావు, కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీలు మధుయాష్కీ, విజయశాంతితోపాటు పలువురు తెలంగాణ న్యాయవాదులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పలుసార్లు విచారణకు వచ్చిన ఈ కేసు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. సోమవారం జరిపిన తుది విచారణలో కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఆర్.కె.అగర్వాల్, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ‘ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని మళ్లీ మనం ఎందుకు ఎత్తుకోవాలి. న్యాయవాదులు మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడబోరని విశ్వసిస్తూ ఈ విషయాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నిద్దాం..’ అని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. ఇకపై ఇలాంటి చర్యలకు దిగబోమని ప్రతివాదులు ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి గుర్తు చేసింది. పలు కేసుల కొట్టివేత మరోవైపు కొందరు న్యాయవాదులు సకలజనుల సమ్మె సందర్భంగా న్యాయమూర్తులతో, ఆంధ్రాకు చెందిన న్యాయవాదులతో దురుసుగా ప్రవర్తించారంటూ దాఖలైన పిటిషన్‌పైనా ఇదే ఉత్తర్వులు ఇచ్చింది. -
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే
సంగారెడ్డి క్రైం : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు జేఏసీ పిలుపు మేరకు జిల్లా కోర్టుతో సహా సిద్దిపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ హైకోర్టుకు సమైక్య సంకెళ్లు ఇంకెన్నాళ్లు అంటూ నినదించారు. తెలంగాణ ప్రత్యేక హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యర్శి వీరన్న పాటిల్, ఆర్ మాణిక్‌రెడ్డి, ఎం జైపాల్‌రెడ్డి, ఆర్ శ్రీనివాస్, బాల్‌రెడ్డి, రవీందర్, సంజీవరెడ్డ, వెంకట్రాములు, శివకుమార్, భగవాన్‌రావు, అంబరీష్, వర్మ, నాగరాజు, ప్రసాద్, బాలరాజు, అరుణ్ నాగిశెట్టి, అమర్నాథ్రావు, కసిరెడ్డి శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నారాయణ, సదానందం, చంద్రయ్యస్వామి, ప్రసాద్, ప్రభుదాన్యం, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జోన్ : స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో అసోసియేషన్ సభ్యులు కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జుడీషియల్కు సంబంధించిన పోస్టుల ను తెలంగాణ ప్రాంత వ్యక్తులచే భర్తీ చే యాలన్నారు. సమస్యలు విస్మరిస్తే భవిష్యత్తులో నిరవధికంగా విధులకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు రమేష్‌బాబు, పవన్‌కుమార్, సంజయ్‌కృష్ణ, నరసింహారెడ్డి, సాయిబాబ, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. నర్సాపూర్ : తెలంగాణ న్యాయవాదులు జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో విధులు బహిష్కరించినట్లు చెప్పారు. -
జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణ లాయర్లు
న్యూఢిల్లీ: లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణకు ఢిల్లీలో తెలంగాణ సెగ తగిలింది. ఏపీ భవన్ వద్ద ఆయనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని తెలంగాణ న్యాయవాదులు, విద్యార్థులు అడ్డుకున్నారు. జై తెలంగాణ, జేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జేపీ చొక్కా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణవాదుల ఆందోళన మధ్య జేపీని పోలీసులు అక్కడిని నుంచి ఏపీ భవన్లోపలికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి ఏపీ భవన్ లో తెలంగాణ వాదుల ఆందోళన కొనసాగుతోంది. -
హైకోర్టులో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో బుధవారం కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. సీమాంధ్ర న్యాయవాదులు మానవహారాన్ని అడ్డుకునేందుకు రంగారెడ్డి, మేడ్చల్ కోర్టుల తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వీరిని హైకోర్టు గేటు దగ్గరే పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం విడుదల చేశారు. విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర న్యాయవాదులు బుధవారం హైకోర్టు బయట మానవహారం నిర్వహించాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న రంగారెడ్డి, మేడ్చల్ కోర్టులకు చెందిన తెలంగాణ న్యాయవాదులు చలో హైకోర్టు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు నెలకుండా మదీనా సెంటర్ నుంచి హైకోర్టు వరకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డు ఉన్నవారినే కోర్టులోకి అనుమతించారు. అయితే మధ్యాహ్నం సమయంలో తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు కోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో వారిని కోర్టు బయటే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, తెలంగాణ న్యాయవాదులకు మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ న్యాయవాదుల అరెస్ట్‌పై న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదుల బృందం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ సేన్‌గుప్తాను కలిసింది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరింది. దీంతో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. ఇదే సమయంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు తెలంగాణ న్యాయవాదుల విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలివ్వడంతో పోలీసులు వారిని విడుదల చేశారు. మానవహారం వాయిదా.. సీమాంధ్ర న్యాయవాదులు బుధవారం తలపెట్టిన మానవహారం కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. హైకోర్టులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తి చేయడంతో మానవహారాన్ని వాయిదా వేస్తున్నట్లు సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ సీవీ మోహన్‌రెడ్డి ప్రకటించారు. అంతకు ముందు మోహన్‌రెడ్డితో ప్రధాన న్యాయమూర్తి చర్చలు జరిపారు. ప్రస్తుతం హైకోర్టులో పరిస్థితులు సరిగా లేవని, మానవహారం కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని , లేకుంటే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని మోహన్‌రెడ్డికి ప్రధాన న్యాయమూర్తి సూచించినట్లు సమాచారం. దీంతో మోహన్‌రెడ్డి ఇతర సీమాంధ్ర న్యాయవాదులతో చర్చించి ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తిని అగౌరవపరచడం మం చిది కాదన్న ఉద్దేశంతో, మానవ హా రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
మాకు, టి-లాయర్లకు అవగాహన ఉంది: మోహన్‌రెడ్డి
-
మాకు, టి-లాయర్లకు అవగాహన ఉంది: మోహన్‌రెడ్డి
తెలంగాణ న్యాయవాదులకు, తమకు స్పష్టమైన అవగాహన ఉందని సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ నేత సి.వి.మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం నాడు మానవహారం నిర్వహిస్తున్న విషయాన్ని తాము తెలంగాణ లాయర్ల జేఏసీకి కూడా చెప్పామని ఆయన వివరించారు. వారు చలో హైకోర్టు నిర్వహిస్తున్నందున ఒకరి కార్యక్రమాలను ఇంకొకరు అడ్డుకోకూడదని అనుకున్నామని, శాంతియుతంగా 20 నిమిషాలసేపు మానవహారం చేద్దామని నిర్ణయించుకున్నామని మోహన్‌రెడ్డి చెప్పారు. హైకోర్టులో శాంతి భద్రతలను కాపాడాలని ప్రధాన న్యాయమూర్తి తమకు చెప్పారని, గొడవలు పడకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా సూచించారని ఆయన తెలిపారు. హైకోర్టు ప్రతిష్టలను కాపాడాలని చీఫ్ జస్టిస్ విజ్ఞప్తి చేశారన్నారు. ఈనెల 14వ తేదీన అనంతపురంలో సమావేశమై.. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. -
పోటాపోటీ ప్రదర్శనకు సిద్దమైన ఇరు ప్రాంత లాయర్లు
-
హైకోర్టు వద్ద టెన్షన్ వాతావరణం
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటన అంశం హైకోర్టును దద్దరిల్లేలా చేస్తోంది. విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర న్యాయవాదులు, దానిని అడ్డుకునేందుకు తెలంగాణ న్యాయవాదుల పోటాపోటీ నిరసనలతో హైకోర్టు పరిసరాలు బుధవారం అట్టుడుకుతున్నాయి. ఓ వైపు సీమాంధ్ర న్యాయవాదుల మానవ హారం, మరోవైపు తెలంగాణ న్యాయవాదులు ర్యాలీ చేపట్టేందుకు సన్నద్దం అవుతుండటంతో హైకోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైకోర్టు 6,7 గేట్ల వద్ద పోలీసులు పహరా కాస్తున్నారు. కాగా నిరసనలు, ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అడిషనల్ సీపీ అంజన్ కుమార్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హైకోర్టు లోపల, వెలుపల ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని ఆయన స్ఫష్టం చేశారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కార్యక్రమాలు చేపడితే అరెస్ట్‌లు తప్పవని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ఛలో హైకోర్టు అంటూ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధం అవుతున్న తెలంగాణ ప్రాంత న్యాయవాదులు పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా
సాక్షి, హైదరాబాద్: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా మంగళవారం సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదులకు స్పష్టం చేశారు. అలా ఎవరైనా చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు ప్రాంగణం, పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీలు,నిరసన కార్యక్రమాలు నిషేధిస్తూ 2010లో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును పాటించాల్సిందేనని చెప్పారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాటు వేగవంతం చేస్తామన్నారు. సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల మధ్య ఇటీవలి హైకోర్టులో ఘర్షణలు, మంగళవారం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ రోహిణి ఇరుపక్షాల న్యాయవాదులతో సమావేశయ్యారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరావు చొరవతో ఏర్పాటైన ఈ సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు చిత్తరవు నాగేశ్వరరావు పాటు సీమాంధ్ర న్యాయవాదుల తరఫున జేఏసీ చైర్మన్ సి.వి.మోహన్‌రెడ్డి, న్యాయవాదులు ఎస్.ఆర్.అశోక్, ఎం.ఎస్.ప్రసాద్, శేషారాజ్యం, భాస్కరలక్ష్మి, కె.చిదంబరం పాల్గొన్నారు. తెలంగాణ న్యాయవాదుల తరఫున జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యుడు సహోధర్‌రెడ్డి, గండ్ర మోహన్‌రావు, డి.జైపాల్‌రెడ్డి, వి.రఘునాథ్, జ్యోతికిరణ్ హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తి చాంబర్లో ఈ సమావేశం గంటకు పైగా సాగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హైకోర్టు, పరిసరాల్లో నిరసన కార్యక్రమాలపై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాపీని సీమాంధ్ర తరఫు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చారు. ఈ తీర్పును ఉల్లంఘించి తెలంగాణ న్యాయవాదులు అనేకసార్లు ర్యాలీలు, ధర్నాలు, నిరసన చేశారని ఆరోపించారు. దీనికి తెలంగాణ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, గతాన్ని తవ్వుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాలూ ఒకేరోజు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకరి కార్యక్రమం గురించి ఒకరు ముందుగానే సమాచార మార్పిడి చేసుకొంటే అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు వీలుంటుందని సూచించారు. అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఇరుపక్షాలకూ హితవు పలికారు. కోర్టు ప్రాంగణంలోకి పోలీసులు ప్రవేశించాల్సిన అవసరం కల్పించొద్దని, వారొస్తే పరిస్థితులు మరోరకంగా ఉంటాయన్న విషయం ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. దీంతో ఇరుపక్షాలూ కొంత అసంతృప్తితోనే ప్రధాన న్యాయమూర్తి సూచనలకు అంగీకారం తెలిపాయి. -
ఎన్జీవోల సభ అనుమతి రద్దుకు హైకోర్టు నో
తెలంగాణ న్యాయవాదుల పిటిషన్ తిరస్కృతి సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు పోలీసులు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలన్న తెలంగాణ న్యాయవాదుల పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది. ఆ మేరకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సభ నిర్వహకులను ఆదేశించింది. సభ నిర్వహణవల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎటువంటి నష్టం చేకూర్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్.బి.స్టేడియంలో 7వ తేదీన ఏపీఎన్జీవోలు నిర్వహించతలపెట్టిన సభకు అనుమతినిస్తూ పోలీసులు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ తెలంగాణ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి, శుక్రవారం ఉదయం ఉత్తర్వులు వెలువరించారు. ఏపీఎన్జీవోల సభను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది గండ్రమోహనరావు న్యాయమూర్తిని కోరగా నిరాకరించారు. అయితే ప్రత్యక్ష ప్రసారాల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్‌జోన్ డీసీపీకి వినతిపత్రం ఇవ్వాలని మోహన్‌రావుకు స్పష్టం చేశారు. ఈ వినతిపత్రంపై 7వ తేదీన ఎన్జీవోల సభ ప్రారంభానికి ముందు నిర్ణయం వెలువరించాల్సి ఉంటుందని డీసీపీని న్యాయమూర్తి ఆదేశించారు. -
న్యాయవాదులే దాడులు చేయడం సమంజసమేనా?
హైకోర్టులో దాడులను ఖండించిన సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమపై తెలంగాణ న్యాయవాదులు భౌతిక దాడులకు దిగారని, మహిళా న్యాయవాదులని కూడా చూడకుండా దుర్భాషలాడారని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు కూడా తెలంగాణ న్యాయవాదులతో కుమ్మక్కై తమపై దాడికి సహకరించారని ఆరోపించారు. సీమాంధ్ర న్యాయవాదులు నలుగురికి రక్త గాయాలయ్యాయని, ఒకరికి ముఖం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ‘‘రాజ్యాంగాన్ని రక్షించాల్సిన న్యాయవాదులే భౌతిక దాడులకు దిగారు. ప్రజాస్వామ్యంలోని కనీస హక్కులకు కూడా భంగం కలిగించేలా వ్యవహరించారు. ఇది ఎంతవరకు సమంజసమో వారే ఒక్కసారి ఆలోచించుకోవాలి’’ అని ఆయన తెలంగాణ న్యాయవాదులకు హితవు పలికారు. హైకోర్టు వద్ద శుక్రవారం సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల పోటాపోటీ నిరసనలు ఘర్షణకు దారితీశాయి. ప్రివెంటివ్ కస్టడీ కింద దాదాపు 60 మంది సీమాంధ్ర న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఉత్తర్వుల ద్వారా విడుదలైన సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం సాయంత్రం గన్‌ఫౌండ్రీలోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మానవహారం నిర్వహించేందుకు పోలీసుల అనుమతి తీసుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మోహన్‌రెడ్డి చెప్పారు. పోలీసులు కూడా దాడికి సహకరించారని అన్నారు. శనివారం నాటి ఏపీఎన్జీవోల సభలో సీమాంధ్ర న్యాయవాదులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
హైకోర్టు రణరంగం: సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ లాయర్ల దాడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు రణరంగమైంది. న్యాయదేవత సాక్షిగా, పోలీసుల సాక్షిగా సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేశారు. ఈ దాడిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏడుగురు న్యాయవాదులు గాయపడగా, వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా శుక్రవారం సీమాంధ్ర న్యాయవాదులు చేపట్టిన ‘మానవహారం’.. శాంతిర్యాలీకి అనుమతి నిరాకరణకు నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ‘చలో హైకోర్టు’ కార్యక్రమాలతో హైకోర్టు అట్టుడికింది. ఈ క్రమంలోనే మానవహారానికి సిద్ధమైన సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు న్యాయవాదులు (హైకోర్టుకు చెందిన వారు కాదు) చేయిచేసుకున్నారు. దీంతో హైకోర్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదంతా పోలీసుల సమక్షంలోనే చోటు చేసుకుంది. దాడికి దిగిన న్యాయవాదుల్లో ఐదుగురిని పోలీసులు ఆ తరువాత అరెస్ట్ చేశారు. అలాగే సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్, సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డితో సహా 25 మందికిపైగా సీమాంధ్ర న్యాయవాదులను అదుపులోకి తీసుకుని సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఏం జరిగిందంటే... రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలకు కొనసాగింపుగా హైకోర్టులోని సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం మధ్యాహ్నం సిటీ కాలేజీ నుంచి మదీనా వరకు మానవహారం నిర్వహించాలని నాలుగురోజుల కిందట నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ న్యాయవాదులు గురువారమే హైకోర్టు నుంచి మదీనా వరకు ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా తమ శాంతిర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించడానికి నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చలో హైకోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా రంగారెడ్డి, నాంపల్లి కోర్టులతోపాటు జంట నగరాల్లో వివిధ కోర్టులకు చెందిన తెలంగాణ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో శుక్రవారం ఉదయం హైకోర్టుకు చేరుకున్నారు. ముందుగానే ఇరుపక్షాల కార్యక్రమాలపై సమాచారం ఉండటంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. మదీనా చౌరస్తా, సిటీ కాలేజీలతో పాటు హైకోర్టు పరిసర ప్రాంతాలు పోలీసులతో నిండిపోయాయి. ముందు నిర్ణయించుకున్న మేరకు సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు మానవహారం కార్యక్రమం నిర్వహించేందుకు బార్ కౌన్సిల్ గేటు వద్దకు చేరుకున్నారు. మాజీ అడ్వొకేట్ జనరల్ మోహన్‌రెడ్డితో పాటు దాదాపు 40 మంది సీమాంధ్ర న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అప్పటికే అక్కడకు తెలంగాణ న్యాయవాదులు వచ్చి ఉన్నారు. మోహన్‌రెడ్డితో పాటు ఓ 30 మంది న్యాయవాదులు గేటు దాటి రోడ్డుపైకి వెళ్లగా, బార్ కౌన్సిల్ వద్ద ఉన్న మిగిలిన న్యాయవాదులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న తెలంగాణ న్యాయవాదులు ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. గేటు బయట ఉన్న మోహన్‌రెడ్డి తదితరులు ఉన్న చోటికి తెలంగాణ న్యాయవాదులు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన పోలీసులు వెంటనే గేటు మూసివేసి, మోహన్‌రెడ్డి తదితరులను అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో మానవహారంలో పాల్గొనడానికి వచ్చిన కొంతమంది సీమాంధ్ర న్యాయవాదులు గేటు లోపల కోర్టు ప్రాంగణంలోనే బార్ కౌన్సిల్ వద్దే ఉండిపోయారు. వారు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బయటినుంచి వచ్చిన న్యాయవాదులు అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారిపై దాడి చేశారు. దాడి.. దూషణలు... సీమాంధ్ర న్యాయవాదులు శ్రీనివాస్, బాలాజీ, విష్ణు తదితరులపై తెలంగాణ న్యాయవాదులు చేయి చేసుకున్నారు. అయ్యప్పదీక్షలో ఉన్న న్యాయవాదుల సంఘం మాజీ కార్యదర్శి జి.ఎల్.నాగేశ్వరరావును కూడా వదిలిపెట్టలేదు. మానవహారంలో పాల్గొనడానికి వచ్చిన మహిళా న్యాయవాదులను సైతం చుట్టుముట్టి, రాయడానికి వీల్లేని భాషలో దూషించారు. ఈ ఘటనను సెల్ఫోన్లో ఫోటోలు తీసిన వారిని చితకబాదారు. సెల్ఫోన్లో ఫోటోలు తీసేసేవరకు వారిని వదల్లేదు. చివరకు హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న తెలంగాణ ప్రాంత న్యాయవాదులు వచ్చి పలుమార్లు సర్దిచెప్పడంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం ‘జై తెలంగాణ’ నినాదాలతో హైకోర్టు కారిడార్లలో ప్రదర్శనలు నిర్వహించారు. ఆ తరువాత భోజన విరామ సమయంలో హైకోర్టు న్యాయవాదుల క్యాంటీన్‌కు చేరుకుని అక్కడ భోజనం చేస్తున్న వెంకటేశ్వరరావు అనే న్యాయవాదిపై దాడి చేశారు. అక్కడే గిన్నెల్లో ఉన్న సాంబార్ పోసి, చితకబాదగా ఆయన పళ్లు కదిలిపోయాయి. దీంతో ఆయనను ప్రాథమిక చికిత్స కోసం హైకోర్టులోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు హైకోర్టులో దాడుల వ్యవహారంలో పోలీసుల తీరుపై మహిళా న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి చెప్పడంతో అప్పటికప్పుడు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మను సమను చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే కమిషనర్ వెళ్లి ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. మహిళా న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులకు పంపి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలా..? వద్దా..? అన్న విషయంపై ప్రధాన న్యాయమూర్తి మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు. అరెస్ట్ చేసిన న్యాయవాదులందరినీ పోలీసులు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విడుదల చేశారు. పోలీసుల ప్రేక్షకపాత్ర హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులు దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పాటించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ హైకోర్టులో ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల పోటాపోటీ ప్రదర్శనల నేపథ్యంలో శుక్రవారం దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు ముందే హెచ్చరించారు. అయినప్పటికీ పోలీసులు ఘర్షణలను, దాడులను నిరోధించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మానవహారం జరిగేముందే ఇరుపక్షాలతో మాట్లాడి వారి వారి కార్యక్రమాల సమయాన్ని మార్చడం, వేదికలను కుదించడం వంటి చర్యలేవీ పోలీసులు చేపట్టలేదు. ఇద్దరు ముగ్గురిపై దాడులు జరిగిన తరువాత పోలీసులు రంగప్రవేశం చేసి కొట్టవద్దని బ్రతిమలాడటం కనిపించింది. -
మాజీ మంత్రి ధర్మానను అడ్డుకున్న తెలంగాణ లాయర్లు
-
న్యాయవాదుల మధ్య ఘర్షణ, హైకోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
న్యాయవాదుల మధ్య ఘర్షణ, హైకోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ - సీమాంధ్ర ప్రాంత న్యాయవాదుల పరస్పర ఘర్షణ - హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ అడ్వకేట్ జనరల్ సి.వి.మోహన్ రెడ్డి సహా అనేక మంది న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా అందరిని వ్యానులో ఎక్కించి దూరం తీసుకెళ్లారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లాయర్లు హైకోర్టు ప్రాంగణంలో నిర్మిస్తున్న మానవహారాన్ని తెలంగాణ ప్రాంత న్యాయవాదులు అడ్డుకున్నారు. చిన్నగా మొదలైన ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. నచ్చజెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైయ్యాయి. హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని... ఎవరూ ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని మైకుల్లో పోలీసులు పదే పదే ప్రకటించినా ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కసారిగా రెండు ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు గుమికూడటంతో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో పోలీసులు మోహరించి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ధర్మానను అడ్డుకున్న తెలంగాణ న్యాయవాదులు
-
ధర్మానను అడ్డుకున్న తెలంగాణ న్యాయవాదులు
హైదరాబాద్ : మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావును తెలంగాణ న్యాయవాదులు అడ్డుకున్నారు. వాన్‌పిక్ కేసులో విచారణ కోసం కోర్టుకు హాజరై తిరిగి వెళ్తుండగా ధర్మాన వాహనాన్ని అడ్డుకున్నారు. తెలంగాణ ద్రోహి ధర్నాన డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పక్కకు తరలించి... పోలీసుల భారీ బందోబస్తు మధ్య ధర్మాన కోర్టు నుంచి బయటకు పంపారు. కాగా శాంతి ర్యాలీకి అనుమతి తిరస్కరించటాన్ని నిరసిస్తూ హైకోర్టు తెలంగాణ ప్రాంత న్యాయవాదులు నిరసనకు దిగారు. మరోవైపు సీమాంధ్ర న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. కాగా ఏపీ ఎన్జీవోల సభ, శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరణ నేపథ్యంలో హైకోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. -
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతి రద్దు చేయాలి: తెలంగాణ న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ఈ నెల 7వ తేదీన ఏపీఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతి రద్దు చేయాలని తెలంగాణ న్యాయవాదులు టి.శ్రీరంగారావు, ఎస్.శ్రీనివాస్‌లు హైకోర్టును కోరారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభకు అనుమతి మంజూరు చేస్తూ డీసీసీ కమలాసన్‌రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను వారు సవాల్ చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ నూతి రామ్మోహనరావు విచారించారు. పిటిషనర్ల తరఫున గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మాత్రమే నిర్ణయం తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనికీ, ఉద్యోగస్తులకు ఎటువంటి సంబంధం లేదని, అయినా ఏపీఎన్జీవోలు గత నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారని, ఇలా సమ్మె చేసే హక్కు వారికి లేదని అన్నారు. ఇక్కడ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వమని, విభజనకూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మె ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం ఎలా అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏపీఎన్జీవోలు ప్రత్యక్షంగా రాజకీయ కార్యకపాల్లో పాల్గొంటున్నారని, ఈ నెల 7న సభ కూడా నిర్వహిస్తున్నారని మోహన్‌రావు చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘30 ఏళ్ల తరువాత ప్రభుత్వ ఉద్యోగులెవరికీ ఎటువంటి పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించబోమని, కేవలం పనిచేసిన రోజులకు మాత్రమే జీతం ఇస్తానంటూ ఓ రాజకీయ పార్టీ తమ ఎజెండాలో భాగంగా ప్రకటన ఇచ్చిందనుకున్నాం. ఆ ప్రకటన ఇచ్చింది ఓ రాజకీయ పార్టీ కాబట్టి, దానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె, ఆందోళనలు కార్యక్రమాల్లో పాల్గొంటే అది చట్ట విరుద్ధం అవుతుందా..? భవిష్యత్తరాలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడున్న ఉద్యోగులు సమ్మె, ఆందోళనలు చేయడం సరికాదంటారా..? అది అన్యాయం అవుతుందా.?’ అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ వెంటనే తమ ఎజెండాలోని అంశాలను అమలు చేస్తుందని, ఇదే రీతిలో ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయడాన్ని అందరం చూశామంటూ వ్యాఖ్యానించారు. గతంలోనూ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం జరిగిందని, అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే తాము 7వ తేదీ సభకు అనుమతిని రద్దు చేయాలని కోరుతున్నామని మోహన్‌రావు చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘ఈ మొత్తం వ్యవహారానికి అనవసర ప్రాముఖ్యతను ఇస్తున్నామని మీకు అనిపించడం లేదా..?’ అని ప్రశ్నించారు. మీరేమంటారని హోంశాఖ తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని అడిగారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే, ఏపీఎన్జీవోల సభకు అనుమతినిచ్చామని ఆయన తెలిపారు. సభకు వచ్చే ప్రతి ఉద్యోగి గుర్తింపు కార్డును పరిశీలించడం జరుగుతుందని, గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే సభకు అనుమతినిస్తారని, ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వివరించారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఓ స్పష్టమైన నియమావళి ఉంది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చిన దాంట్లో నుంచే వారికి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయపరమైన సమావేశాలు, సభలు నిర్వహించవచ్చా..? రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చా..? సభకు ఉద్యోగులు మాత్రమే హాజరు కావాలని ఎందుకు స్పష్టమైన షరతు విధించలేదు.’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
`విజయమ్మ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు`
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజయవాడలో దీక్ష తలపెట్టారని తెలంగాణ న్యాయవాదులు ఆరోపించారు. దీక్షలు, ఆందోళనల ద్వారా విజయమ్మ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ నెల 19 నుంచి విజయవాడలో తలపెట్టిన విజయమ్మ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వరాదని ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్కే కౌముదిని శనివారం కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం న్యాయవాదుల జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా సమైక్యవాదం పేరుతో ప్రజలందరూ కలసి ఉండాలని కోరుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా విజయవాడలో తలపెట్టిన నిరాహారదీక్షకు అనుమతి నిరాకరించాలని ప్రభుత్వం, పోలీసుశాఖను డిమాండ్ చేశారు. అదనపు డీజీని కలిసిన వారిలో తెలంగాణ జేఏసీ నేతలు కొంతం గోవర్ధన్‌రెడ్డి, సీహెచ్ ఉపేంద్ర, సుంకరి జనార్ధనగౌడ్, కోటగిరి శ్రీధర్, ఇంద్రకుమార్‌లు ఉన్నారు.