ధర్మానను అడ్డుకున్న తెలంగాణ న్యాయవాదులు | Dharmana faces flak from Telangana lawyers | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 6 2013 12:25 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావును తెలంగాణ న్యాయవాదులు అడ్డుకున్నారు. వాన్పిక్ కేసులో విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టుకు శుక్రవారం హాజరైన ఆయనను న్యాయవాదులు అడ్డుకుని నిరసన తెలిపారు. కాగా శాంతి ర్యాలీకి అనుమతి తిరస్కరించటాన్ని నిరసిస్తూ హైకోర్టు తెలంగాణ ప్రాంత న్యాయవాదులు నిరసనకు దిగారు. మరోవైపు సీమాంధ్ర న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. కాగా ఏపీ ఎన్జీవోల సభ, శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరణ నేపథ్యంలో హైకోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement