Dharmana prasadarao
-
సంబరంలా పార్వతీపురం సాధికార యాత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార యాత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సాధికారతకు సూచికగా ఓ సంబరంలా సాగింది. జిల్లాలోని సీతానగరం మండలం లచ్చయ్యపేటలో ఆరంభమైన బస్సు యాత్ర పార్వతీపురం పట్టణంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రవేశించింది. మోటారు బైకు ర్యాలీతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు యాత్రలో పాల్గొన్నారు. మహిళల కోలాటం, తప్పిటగుళ్ల కళాకారుల ప్రదర్శనలు, తీన్మార్ వాయిద్యాల నడుమ యాత్ర ముందుకు సాగింది. జై జగన్ నినాదాలతో పార్వతీపురం పట్టణం హోరెత్తింది. పార్వతీపురం బస్టాండ్ వద్ద జరిగిన సభలో రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటాపాట అందరినీ అలరించింది. సభకు తరలివచ్చిన జనంతో పార్వతీపురం పట్టణంలోని అంతర్రాష్ట్ర రహదారి కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు మంత్రులు, నేతలు ప్రసంగించారు. రాజ్యాంగం ఆశయాలు ఇన్నాళ్లకు సాకారమయ్యాయి: మంత్రి ధర్మాన భారత రాజ్యాంగ ఆశయాలను స్వాతంత్య్రం వచ్చి న ఇన్నాళ్లకు దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ సాకారం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం అర్హత ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు. దీనివల్ల పేదవారు సైతం పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడానికి, ఉచిత వైద్యం పొందడానికి, సొంత ఇంటిలో ఉండటానికి, స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం లభించిందన్నారు. ధనిక వర్గాలకే పరిమితమైన ఆంగ్ల విద్యను అందరికీ అందిస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు. జగన్‌తోనే బడుగులకు మేలు: మంత్రి రాజన్నదొర రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్‌తోనే మేలు జరిగిందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. ఎస్సీల కోసం టీడీపీ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తే, సీఎం జగన్ రూ.61 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. పోడు, బంజరు భూములను గిరిజనులకు పంపిణీ చేసిన ఘనత జగన్‌దేనన్నారు. దశాబ్దాల సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలంనాటి సమస్యలను సీఎం జగన్ ప్రత్యక శ్రద్ధతో పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే అలజంగి జోగారావు చెప్పారు. అరి్టకల్ 11, 17, 1 5(సి)ని పూర్తిగా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ రిజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన్నఅప్పలనాయుడు, కంబాల జోగులు, పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ విజయనగరం, పారీ్వతీపురం మన్యం జిల్లాల అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, నవరత్నాల కమిటీ ఉపాధ్యక్షుడు నారాయణమూర్తి పాల్గొన్నారు. -
లక్ష్య సాధనకు అనుగుణంగా పనిచేస్తా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యసాధనకు అనుగుణంగా పనిచేస్తానని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. సచివాలయంలోని ఐదో బ్లాకులోని తన చాంబర్లో బుధవారం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్రిటీషర్లు సర్వే చేశాక 75 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం భూముల సమగ్ర సర్వే నిర్వహించలేకపోయిందన్నారు. తమ ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పెద్దఎత్తున భూ సర్వే నిర్వహించడం ద్వారా టైటిల్ ఫ్రీ చేయడం ద్వారా భూ యాజమాన్య హక్కులను అందరికీ బదిలీ చేయడం జరుగుతోందన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ–స్టాంపులకు అనుమతిచ్చే ఫైలుపై తొలి సంతకం చేశారు. కాగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ్, సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి,రామకృష్ణ తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. -
రికార్డుల స్వచ్ఛీకరణ సవాలే!
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వేకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో తప్పుల తడకగా ఉన్న భూ రికార్డుల స్వచ్ఛీకరణ ప్రక్రియ రెవెన్యూ శాఖకు అతి పెద్ద యజ్ఞంలా మారింది. ప్రస్తుత ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం కేవలం స్వచ్ఛీకరణ కాదని, ఇది రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ అని రెవెన్యూ శాఖ మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ధర్మాన ప్రసాదరావు పలుమార్లు పేర్కొన్నారు. దీనిని పకడ్బందీగా చేస్తే చాలా వరకు భూ వివాదాలు పరిష్కారమవుతాని రెవెన్యూ, న్యాయ రంగాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. పక్కాగా, లోప రహితంగా రికార్డులను అప్డేట్ చేయాలంటే రెవెన్యూ ఉద్యోగులు జవాబుదారీతనంతో పని చేయాల్సి ఉంటుంది. కష్టమైన ప్రక్రియే.. ► రాష్ట్రంలో 4 కోట్ల ఎకరాలకు (1.63 లక్షల చదరపు కిలోమీటర్ల) పైగా ప్రభుత్వ, ప్రయివేటు భూములున్నాయి. 17,460 గ్రామాల పరిధిలో 1.96 కోట్ల సర్వే నంబర్ల పరిధిలో 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి 90 లక్షల మంది రైతుల చేతుల్లో ఉంది. ► మొత్తం 3 కోట్ల ల్యాండ్ హోల్డింగ్స్ ఉండగా, వీటిలో ప్రభుత్వానికి చెందినవి 43 లక్షలు. ఇందులో లక్షలాది ఎకరాలు ఆక్రమణదారుల గుప్పెట్లో ఉన్నాయి. ► చాలా చోట్ల భూ అనుభవ రికార్డులు (అడంగల్), భూ యాజమాన్య రికార్డులు (1బి)లను మార్చి వేశారు. అసైన్మెంట్ రిజిష్టర్లను మాయం చేశారు. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం సేకరించిన భూమి చాలా చోట్ల ఇప్పటికీ ప్రయివేటు వ్యక్తుల పేర్లతోనే ఉంది. అక్రమాల పుట్టలు.. ► రెవెన్యూ రికార్డులు అక్రమాల పుట్టలుగా మారాయి. ఏటా జరపాల్సిన రెవెన్యూ జమా బందీ దశాబ్దాలుగా నిర్వహించకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ► ఒకే భూమికి ఇద్దరు ముగ్గురికి దరఖాస్తు (డీకేటీ) పట్టాలు ఇచ్చిన సంఘనటలు కోకొల్లలుగా ఉన్నాయి. కొందరు రిటైర్డు రెవెన్యూ ఉద్యోగులు కూడా ఇలా నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడ్డారు. ► ఒక సర్వే నంబరులో 10 ఎకరాల భూమి ఉంటే 20 ఎకరాలకు డీకేటీ పట్టాలు/ అడంగల్స్ ఉన్నవి కూడా చాలా చోట్ల ఉన్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు లెక్కే లేదు. దశాబ్దాలుగా మార్పులే లేవు ► ఎప్పటికప్పుడు రికార్డుల్లో మార్పులు చేర్పులు (అప్డేట్) చేయడాన్నే స్వచ్ఛీకరణ (మ్యుటేషన్) అంటారు. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా భూ రికార్డులు అప్డేట్ చేయకుండా వదిలేశారు. దశాబ్దాల కిందట చనిపోయిన వారి పేర్లతో లక్షలాది ఎకరాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాస్తవ భూమి విస్తీర్ణానికీ, రికార్డుల్లో ఉన్న దానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ► ఇలా రికార్డుల్లో తేడా ఉన్న సర్వే నంబర్లలోని భూమి యజమానులతో మాట్లాడి ఒప్పించి ఆయా వ్యక్తుల పేర్లతో ఉన్న భూమి విస్తీర్ణాన్ని ఆర్ఎస్ఆర్ ప్రామాణికంగా తగ్గించడం చాలా క్లిష్టమైన సమస్య. ► తల్లిదండ్రులు చనిపోయినా వారి పిల్లలు భాగపరిష్కారాలు చేసుకోకుండా తలా కొంత దున్నుకుంటున్నారు. రికార్డుల్లో చనిపోయిన తల్లిదండ్రుల పేరుతోనే భూమి ఉంది. ► చాలా చోట్ల భూమి కొన్న వారి బదులు అమ్మిన వారి పేర్లతోనే అడంగల్, 1బీలో భూమి ఉంది. వీటిని సరిచేయాల్సి ఉంది. ► భూమిలేని పేదల పేరుతో ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇస్తోంది. భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అసైన్మెంట్ రిజిస్టర్లను మాయం చేసి చాలా మంది ప్రభుత్వ భూములను అసైన్మెంట్ పట్టాలంటూ దున్నుకున్నారు. మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాల ద్వారా అమ్ముకున్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి భూ రికార్డులను పకడ్బందీగా, పారదర్శకంగా స్వచ్ఛీకరించాల్సి ఉంది. జనవరి ఒకటో తేదీ నుంచి తొలి విడత రీసర్వే చేపట్టనున్న 6,500 గ్రామాల్లో రికార్డులు ముందు పెట్టుకుని టేబుల్ వెరిఫికేషన్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఎస్ఆర్, అడంగల్ మధ్య విస్తీర్ణంలో తేడాలు ఇక్కడ చాలా వరకు తేలే అవకాశం ఉంది. భూ రికార్డుల స్వచ్ఛీకరణకు ఒకపక్క, భూముల సమగ్ర రీసర్వేకు మరో పక్క చకచకా ఏర్పాట్లు చేస్తున్నాం. – వి.ఉషారాణి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ఎస్ఆర్ అడంగల్ మధ్య 33.54 లక్షల ఎకరాల తేడా రెవెన్యూ శాఖలో అత్యంత ప్రామాణికమైనది రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్). బ్రిటిష్ కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం భూమిని సర్వే చేసినప్పుడు సర్వే నంబర్ల వారీగా ఎంతెంత భూమి ఉందో ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదు చేశారు. అయితే ఆర్ఎస్ఆర్, అడంగల్ మధ్య 33.54 లక్షల ఎకరాలకుపైగా వ్యత్యాసం ఉండటం రెవెన్యూరికార్డులు తప్పుల తడకలుగా ఉన్నాయనడానికి నిదర్శనం. అడంగల్, భూమి కొలతల పుస్తకం (ఎఫ్ఎంబీ) మధ్య కూడా ఇలాగే భారీ తేడా ఉంది. భూమి ఎవరిదో రెవెన్యూకే తెలియదు! రాష్ట్రంలో చాలా కుటుంబాలకు వంశ పారంపర్యంగా భూమి సంక్రమించి ఉంటుంది. ఇలాంటి వారిలో కొందరి వద్ద భూమి తమదేననడానికి రాత పూర్వకమైన ఆధారాలు ఉండకపోవచ్చు. రెవెన్యూ శాఖ వద్ద కూడా చాలా వరకు రికార్డులు లేవు. అందుకే వెబ్‌ల్యాండ్, అడంగల్‌లో చాలా భూమి అన్‌సెటిల్డ్ అని, తెలియదు అని ఉంది. ఇలాంటి భూమి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఉంది. -
శాసనసభకు ఎన్నికైన మేము...
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర శాసనసభ కొలువుదీరింది. ప్రజాక్షేత్రంలో విజయాన్ని దక్కించుకున్న జిల్లాకు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు శాసనసభలో సభ్యులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాసనసభ తొలి సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సభలో ఆరోసారి అడుగుపెడుతున్న ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అత్యంత సీనియర్ నాయకుడిగా నిలిచారు. శాసనసభాపతిగా గురువారం ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే! రెడ్డి శాంతి, డాక్టర్ సీదిరి అప్పలరాజు, గొర్లె కిరణ్‌కుమార్ తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఎన్నో విశేషాలు ఈసారి శాసనసభలో జిల్లాకు సంబంధించి అనేక విశేషాలున్నాయి. పది నియోజకవర్గాల్లో ఎనిమిది చోట్ల వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. 2014 ఎన్నికలలో మూడు స్థానాలకే పరిమితమైన వైఎస్సార్సీపీ ఈసారి మాత్రం తిరుగులేని ఆధి క్యం సాధించింది. అధికార పార్టీగా బరిలోకి దిగిన టీడీపీ చావుతప్పి లొట్టబోయి రెండు స్థానాలకు పరిమితమైంది. ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి బెందాళం అశోక్ రెండోసారి గెలుపొందారు. గత ఐదేళ్లలో జిల్లా మంత్రిగా చక్రం తిప్పిన కింజరాపు అచ్చెన్నాయుడికి టెక్కలిలో మరోసారి గె లుపొందడానికి ముచ్చెమటలు పట్టాయి. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఈసారి టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా బుధవారం అడుగుపెట్టారు. శాసనసభలో సీనియారిటీ... ఎన్నోసారి ఎంతమంది ఎవరు ఆరోసారి ఒకరు తమ్మినేని సీతారాం (ఆమదాలవలస) ఐదోసారి ఇద్దరు ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం) కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి) నాలుగోసారి ఒకరు ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట) మూడోసారి ఒకరు కంబాల జోగులు (రాజాం) రెండోసారి ఇద్దరు విశ్వాసరాయి కళావతి (పాలకొండ) బెందాళం అశోక్ (ఇచ్ఛాపురం) తొలిసారి ముగ్గురు రెడ్డి శాంతి (పాతపట్నం) డాక్టరు సీదిరి అప్పలరాజు (పలాస) గొర్లె కిరణ్‌కుమార్ (ఎచ్చెర్ల) అత్యంత సీనియర్ తమ్మినేని ఆమదాలవలస నుంచి ఆరోసారి విజయం సాధించిన తమ్మినేని సీతారాం జిల్లాలోనే సీనియర్ నాయకుడిగా నిలిచారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన ఆయన నాటి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైడి శ్రీరామమూర్తిని ఓడించారు. 1985 ఎన్నికలలోనూ ఆయనపైనే గెలిచినా 1989లో మాత్రం పరాజయం తప్పలేదు. కానీ శ్రీకాకుళం రాజకీయ ఉద్దండుడైన బొడ్డేపల్లి రాజగోపాలరావును 1991 ఉప ఎన్నికలలో ఓడించి సంచలనం సృష్టించారు. టీడీపీ నుంచే 1994, 1999 ఎన్నికలలోనూ విజయం సాధించారు. అయితే 2004లో మాత్రం మహానేత డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో ఓటమి తప్పలేదు. తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసినా బొడ్డేపల్లి సత్యవతి చేతిలో ఓడిపోయారు. 2014లోనూ త్రుటిలో విజయం చేజారింది. ఇలా వరుసగా మూడుసార్లు ఓటమి ఎదురైనా మొక్కవోని దీక్షతో, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనంతో 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించారు. బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. శాసనసభాపతిగా గురువారం ఆయన ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. జిల్లా నుంచి ఈ పదవిని నిర్వహించిన మూడో వ్యక్తిగా సీతారాం నిలిచారు. గతంలో తంగి సత్యనారాయణ, కావలి ప్రతిభాభారతి స్పీకరుగా పనిచేశారు. నాడు తమ్ముడు... నేడు అన్న... నరసన్నపేట నియోజకవర్గం నుంచి 1989, 1999 ఎన్నికలలోనూ, తర్వాత శ్రీకాకుళం నుంచి 2004, 2009 ఎన్నికలలోనూ, తాజాగా 2019 ఎన్నికలలోనూ విజయం సాధించిన ధర్మాన ప్రసాదరావు నలుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో పని చేశారు. ఇప్పుడు అదే నరసన్నపేట నుంచి నాలు గోసారి భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన అన్న ధర్మాన కృష్ణదాస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో రోడ్లు–భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సోదరులిద్దరూ బుధవారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరెంతో ప్రత్యేకం... ఎమ్మెల్యేగా మూడోసారి శాసనసభలో అడుగుపెట్టిన కంబాల జోగులు, రెండోసారి అడుగుపెట్టిన విశ్వాసరాయి కళావతి బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. రాజాం నియోజకవర్గంలో 2014 ఎన్నికలలో మాజీ స్పీకరు, మాజీ మంత్రి కావలి ప్రతిభాభారతిని, 2019 ఎన్నికలలో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ను మట్టికరిపించిన ఘనత జోగులుకు దక్కుతుంది. ఆ ముగ్గురికీ తొలి అడుగు... 2014 ఎన్నికలలో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి త్రుటిలో ఓటమి పొందిన రెడ్డి శాంతి ఈసారి మాత్రం పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలుపొంది తర్వాత చంద్రబాబు ప్రలోభాలతో టీడీపీలోకి ఫిరాయించిన కలమట వెంకటరమణను కంగుతినిపించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమె బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక గౌతు కుటుంబానికి కంచుకోటగా ఉన్న పలాసలో శివాజీ వారసురాలు శిరీషపై భారీ విజయం సాధించిన డాక్టర్ సీదిరి అప్పలరాజు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయనతో పాటు ఎచ్చెర్ల నుంచి విజయం పొందిన గొర్లె కిరణ్‌కుమార్ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు వంటి సీనియర్ నాయకుడిని కిరణ్ అవలీలగా ఓడించారు. -
ప్యాకేజీని అంగీకరించడానికి మీరెవరు?
-
ప్యాకేజీని అంగీకరించడానికి మీరెవరు?
విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలందరి హక్కు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజలందరు సాధించుకున్న హక్కు అయిన హోదాను కాదని, ప్యాకేజీని అంగీకరించడానికి ప్రభుత్వం ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ప్రజలందరి ఆకాంక్షలను తెలియజేయడానికే వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ‘ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేశారు. ఈ ప్రకటనను సమర్థించిన అప్పటి ప్రతిపక్షం బీజేపీ పదేళ్లు హోదా కావాలని కోరింది’ అని గుర్తుచేశారు. విభజనతో జరిగే నష్టాన్ని పూడ్చేందుకు, విభజన ఇష్టం లేని ప్రజలందరినీ సముదాయించేందుకు ప్రత్యేక హోదా హామీని అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను వదిలేసుకుంటున్నట్టు చంద్రబాబు చల్లగా చెప్పారని విమర్శించారు. దీంతో అర్ధరాత్రి ప్యాకేజీ ఇస్తే చాలన్నట్టుగా అరుణ్ జైట్లీ అర్ధరాత్రి ప్రకటన చేశారని, ఒక ప్రాంతం ప్రజలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ ఎలా వదిలేస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలతో, ప్రతిపక్షంతో ఏమాత్రం సంప్రదించకుండా గుట్టుచప్పుడు కాకుండా హోదా అంశాన్ని పక్కనపెట్టేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. -
'ఎవ్వరికీ భయపడం.. వెనుకడుగు వేయం'
అమరావతి: ప్రజల తరుపున పోరాడేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. కోట్లాది విలువైన సదావర్తి సత్రం భూములను లక్షలకే అమ్మేశారని చెప్పారు. ఈ అమ్మకానికి సంబంధించిన మొత్తం వ్యవహారం తేల్చేందుకు తమ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక నిజనిర్ధారణ కమిటీ వేశారని తెలిపారు. అందులో భాగంగానే తాము వాస్తవాలు తెలుసుకునేందుకు ఇక్కడి వచ్చామని చెప్పారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై నగర సరిహద్దులో ఉన్న విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం తన సన్నిహితులకు తక్కువ ధరకు కట్టబెట్టిన తీరుపై అధ్యయనం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. రూ. 1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నాయకుల నుంచి విడిపించి దేవస్థానానికి వెనక్కి ఇప్పించేలా పోరాడేందుకు పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో అమరేశ్వరుడి భూముల పరిరక్షణ కమిటీని నియమించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు, రెండు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నాఉ. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ కమిటీ అమరావతిని సందర్శించింది. ఈ సందర్భంగా వారిని కొందరు టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, గ్రామస్తులు వారికి అండగా నిలిచి సత్రం ప్రాంతాన్ని సందర్శించేలా చేశారు. ఈ సందర్భంగా ధర్మానా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సత్రం భూముల అమ్మకాలకు సంబంధించి విలువైన సమాచారం సేకరించామని తెలిపారు. కోట్లాది విలువైన ఈ భూములను లక్షలకే అమ్మేయడం పెద్దలకు, పీఠాధిపతులకు విచారం కలిగించిందని అన్నారు. నిజనిజాలు ప్రజలకు దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకెళతామని అన్నారు. త్వరలోనే చెన్నై వెళతామని, అక్కడ భూముల రేట్లు కనుక్కుంటామని చెప్పారు. అసలు చట్టప్రకారం ఈ భూములు అమ్మకాలు చేశారా? కోర్టు పరిధికి లోబడి పనిచేశారా? ఈ కుట్రకు ప్రధాన కారకులు ఎవరనే విషయం త్వరలోనే తేల్చి ఐదుకోట్ల ప్రజానీకానికి తెలియజేస్తామని అన్నారు. -
చంద్రబాబు చేసిందేమీ లేదు: ధర్మాన
విజయవాడ : ప్రభుత్వ తీరును ఎండగట్టడమే ప్రతిపక్ష పార్టీ లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రభుత్వ దొంగ విధానాలను ప్రజలకు చెప్పడమే ప్రతిపక్షం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ 'దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో పాలన నడుస్తోంది. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు అన్యాయమైన పాలన చేస్తున్నారు. అవినీతి దశ వైపు ఈ ప్రభుత్వం పయనిస్తోంది. ముడుపుల కోసం పోలవరాన్ని పక్కనపెట్టి...పట్టిసీమపై దృష్టి పెట్టారు. 24 గంటల విద్యుత్ విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదు. కానీ బాబు మహానాడు వేదికగా విద్యుత్‌పై గొప్పలు చెప్పుకున్నారు. గత ప్రభుత్వాలు చేసిన మంచి పనుల వల్ల ఈ రోజు అవసరానికి మించి దేశంలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. పంచాయతీలను నిర్వీర్యం చేసి గ్రామాల్లో కిరికిరి కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు రూ.1000 పింఛన్‌కు రూ.100 నొక్కేస్తున్నారు. గతంలో చంద్రబాబు 9ఏళ్ల పాలనలో మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ...వైఎస్ఆర్ ఆ వ్యవస్థలకు మళ్లీ జీవం పోశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు వితండ వాదం చేస్తున్నారు. ఒకవైపు జీడీపీ పెరుగుతుందంటునే...మరోవైపు డబ్బులు లేవంటున్నారు. జీడీపీ పెరిగితే ఆ మేరకు రాష్ట్రాదాయం కూడా పెరగాలి కదా?. మరి ఆ పెరిగిన రెవెన్యూను ఏం చేశారు?. కమీషన్లు, కక్కుర్తి, కన్సల్టెన్సీలకు చంద్రబాబు డబ్బు తగలేస్తున్నారు. చంద్రబాబు అవాస్తవ ప్రచారాలను వైఎస్ఆర్ సీపీ శ్రేణులు తిప్పి కొట్టాలి' అని పిలుపునిచ్చారు. -
'ఇప్పటికైనా బాబు కేంద్రం నుంచి బయటకు రావాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం నుంచి బయటకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ....ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వం వైఖరి స్పష్టమైందన్నారు. అందరం కలిసి పోరాడుదాం...ప్రత్యేక హోదా సాధించుకుందామని ధర్మాన పిలుపునిచ్చారు. ప్రభుత్వం పోరాటం చేసినా తాము మద్దతిస్తామని చెప్పారు. ఈ నెల 10న ప్రత్యేక హోదా ఆకాంక్షను కేంద్రప్రభుత్వానికి తెలియజేద్దామన్నారు. చంద్రబాబు కాకమ్మ కథలు చెప్పడం మాని...తెగించి నిర్ణయం తీసుకోవాలని ధర్మాన సూచించారు. ఈ నెల 10న ఏపీకు ప్రత్యేక హోదా ఆకాంక్షిస్తూ వైఎస్సార్సీపీ అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టిన విషయం తెలిసిందే. -
'ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వమ్ము చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రత్యేక హోదా అనేది ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని, ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం అధికార టీడీపీ ఎందుకు పోరాడటం లేదని ధర్మాన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ మాత్రమే అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. ఈమేరకు ఈ నెల 26 వ తేదీ నుంచి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టే నిరవధిక నిరాహారదీక్షను విజయవంతం చేయాలని ప్రజలకు ధర్మాన పిలుపునిచ్చారు. -
ఇసుక మాఫియాలా టీడీపీ నేతలు
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఇసుక రేవును తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లగొడుగున్నారని, ఆ పార్టీ నాయకులంతా ఇసుక మాఫియాలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడుతున్న తమ పార్టీ నేతలకు బాబు సర్కార్ తోడ్పాటు అందిస్తున్నదని ఆరోపించారు. అక్రమార్కులపై చర్చలు తీసుకునేందుకు జిల్లాల్లో అధికారులు ఎందుకు బయపడుతున్నరని ప్రశ్నించారు. -
అప్పుడు అవినీతి జీఓ.. ఇప్పుడు మంచిదైపోయిందా?
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంటే ఒకలా, అధికారపక్షంలో ఉంటే మరోలా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ విపక్ష స్థానంలో ఉన్నప్పుడు రూ. 22 వేల కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని ఆరోపించగా ఆగిపోయిన జీఓను... అధికారంలోకి రాగానే అమలుకు చేయాలనుకుంటోందన్నారు. దీని వెనుక ఎంత అవినీతి దాగి ఉందని ఆయన ప్రశ్నించారు. ఈపీసీ విధానంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు అధిక రేట్లు (ప్రైస్ ఎస్కలేషన్) చెల్లించేలా గత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో జీవో నెం 13 జారీ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తీవ్రంగా తప్పుపట్టింద ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ నరసింహన్ ఈ జీవో అమలును నిలిపి వేశారన్నారు. గవర్నర్ నిలిపివేసిన జీవోను తిరిగి అమలు చేసేందుకు బాబు ప్రభుత్వం గత నెల 23వ తేదీన కొత్తగా 22 నంబర్ జీఓను జారీ చేసిందన్నారు. మంత్రి మాటల సీడీ ఇదిగో గతంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు ఈ జీఓను జారీ చేసినపుడు రూ. 22 వేల కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారంటూ మంత్రి ఉమామహేశ్వరరావు ఆరోపించారన్నారు. ఇందుకు సంబంధించిన సీడీని మీడియా ముందు ప్రదర్శించారు. ఈ జీవో జారీ వెనుక అవినీతి దాగి ఉందంటూ అప్పటి టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత ముద్దుకృష్ణమనాయుడు కూడా విమర్శించారన్నారు. ఏ ఆర్థిక ప్రయోజనాల్ని ఆశించి టీడీపీ ప్రభుత్వం అప్పడు ఆరోపణలు చేసిన జీవోను తిరిగి అమలు చేసేందుకు పూనుకుందని ప్రశ్నించారు. మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే బాబు సర్కారు దీనిపై కొత్తగా జీవో జారీ చేసిందా? అని ప్రశ్నించారు. రూ. 100 కోట్ల కన్నా ఎక్కువగా చెల్లింపులు జరపాల్సిన సందర్భంలో తప్పనిసరిగా కేబినెట్లో చర్చించాలనే నిర్ణయం ఉందని, అటువంటపుడు ఇంత పెద్ద విషయాన్ని మంత్రివర్గంలో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన జవాబివ్వాలని ధర్మాన డిమాండ్ చేశారు. మా ఆరోపణలే నిజమవుతున్నాయి! రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన భూ ముల్లో 1,000 ఎకరాల్ని రెండు సింగపూర్ కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాన ప్రస్తావించారు. పైకి తియ్యటి మాటలు చెబుతున్నా... రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనేదే చంద్రబాబు సర్కారు ఉద్దేశమని తమ పార్టీ ఆదినుంచీ చెబుతూనే ఉందన్నారు. అదే నిజమనే విషయం క్రమంగా తేలుతోందన్నారు. రాజధాని నిర్మాణంవల్ల ప్రభుత్వం ఉన్న వారికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అందువల్లనే రాజధాని కోసం అటవీ భూములను డీనోటిఫై చేస్తామని కేంద్రం ప్రకటించినా రాష్ర్ట ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని ముఖ్యమంత్రి ఇప్పటిదాకా చెబుతూ వచ్చారని, అయితే సింగపూర్ మంత్రి మాత్రం అందుకు భిన్నంగా చెప్పారన్నారు. సింగపూర్ ప్రభుత్వం మాత్రం కాదని, తమ దేశానికి చెందిన రెండు ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందమని చె ప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాలకుల్లో కొందరికి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని, అందువల్లనే సీఆర్డీఏ బిల్లులో రైతుల నుంచి ప్రభుత్వం సేకరించే భూమి ఇతరులకు బదిలీ చేయవచ్చనే నిబంధన పెట్టారన్నారు. రెండు సింగపూర్ కంపెనీలకు కేవలం నామినేషన్ పద్ధతిన ప్రభుత్వం 1,000 ఎకరాల భూమి ఎలా ఇవ్వగలదని ప్రశ్నించారు. ప్రభుత్వం రాజధాని విషయంలో అంతర్జాతీయ బిడ్డింగ్ పిలవగలదా ప్రశ్నించారు. రాజదాని భూముల విషయంలో పవన్‌కల్యాణ్ ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వగానే ఆయనకు అవగాహన లేదని కొందరు మంత్రులు మాట్లాడారని, అలాంటి వారిని ఎన్నికల సమయంలో పక్కన పెట్టుకొని ఎలా ప్రచారం చేశారో వాళ్లే జవాబు ఇవ్వాలని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
జీవో 22ను ఎలా అమల్లోకి తెస్తారు: ధర్మాన
హైదరాబాద్ : అభయన్స్‌లో ఉన్న జీవో 22ను తెలుగుదేశం సర్కార్ ఎందుకు అమల్లోకి తెచ్చిందో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్ట్‌లలో రూ.22వేల కోట్ల దోపిడీకి బరితెగించారా ధ్వజమెత్తారు. గవర్నర్ నిలుపుదల చేసిన జీవోను మంత్రివర్గంలో చర్చించకుండా ఎలా అమల్లోకి తెస్తారని ధర్మాన సూటిగా అడిగారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అయిందని గగ్గోలు పెట్టిన టీడీపీ...ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే పని చేస్తోందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజధాని నిర్మాణంలో రెండు ప్రయివేట్ కంపెనీలకు 10వేల ఎకరాల భూమి ఇస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, దీని వెనుక మతలబు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ బిడ్డింగ్‌లకు ప్రభుత్వం ఎందుకు వెళ్లడం లేదని ధర్మాన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌కు అవగాహన లేదన్న టీడీపీ నేతలు ఎన్నికల ముందు పొత్తు ఎందుకు పెట్టుకొన్నారో చెప్పాలన్నారు. -
జీవో 22ను ఎలా అమల్లోకి తెస్తారు: ధర్మాన
-
టీడీపీ సంపద గల పార్టీ.. వైఎస్ఆర్ సీపీ పేదల పార్టీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ సంపద గల పార్టీ అని, తమ పార్టీ పేదల పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇంకా బలపడాల్సివుందని అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమ శిక్షణతో మెలగాలని ధర్మాన సూచించారు. -
టి.బిల్లును తిరస్కరించడం బీజేపీ చేతుల్లోనే ఉంది
శ్రీకాకుళం: టి.బిల్లును తిరస్కరించే అంశం బీజేపీ చేతిల్లోనే ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రాల ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే బీజేపీ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని సూచించారు.ఈ అంశంపై సోమవారం మీడియాతో మాట్లాడిన ధర్మాన..టి.బిల్లు తిరస్కరించడం బీజేపీ చేతిల్లోనే ఉందన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు దేశ వ్యాప్తంగా ఒకే వైఖరి ఉండాలని ధర్మాన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని పదే పదే చెబుతున్న బీజేపీ బిల్లును అడ్డుకుని తమ విజ్ఞతను చాటుకోవాలన్నారు. -
కాంగ్రెస్ నన్ను ముద్దాయిని చేసింది: ధర్మాన
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తనను ముద్దాయిని చేసిందని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ముద్దాయిలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అంటున్నారని... ముద్దాయిగా రాజకీయాల నుంచి తప్పుకోవటం సరికాదని ఆయన అసెంబ్లీ లాబీలో అన్నారు. తనకు కాంగ్రెస్ లో స్థానం లేదని ధర్మాన పేర్కొన్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని... అందుకే రాజకీయాల్లో కొనసాగుతానని ధర్మాన తెలిపారు. మొదటి నుంచి టీడీపీకి తాను వ్యతిరేకంగా పోరాడుతున్నానని అందుకే ఆ పార్టీలోకి వెళ్లలేనని.... ఇక ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ధర్మాన అన్నారు. త్వరలో ఆపార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమామవేశాల్లో విభజన బిల్లు చర్చకు రాదని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సిందేనని ధర్మాన అన్నారు. -
కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించండి: ధర్మాన
హైదరాబాద్ : మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ....మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి విచక్షణ అధికారాలు ఉపయోగించి.... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించాలని ధర్మాన ఈ సందర్భంగా తన లేఖలో విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు రెండు నెలల క్రితమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి కూడా సమర్పించారు. క్విడ్ ప్రోకో కేసులో ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
నాంపల్లి కోర్టుకు హాజరైన వైఎస్ జగన్
-
నాంపల్లి కోర్టుకు హాజరైన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. గురువారం ఉదయం తన నివాసం నుంచి ఆయన సీబీఐ కోర్టుకు బయల్దేరారు. తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్ జగన్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు అయ్యారు. బెయిల్ పొందిన తర్వాత ఆయన మొదటిసారిగా కోర్టుకు హాజరు అయ్యారు. గత నెల 23న బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు.. కేసు విచారణలో భాగంగా ప్రతి వాయిదాకు హాజరుకావాలని షరతు విధించిన విషయం తెలిసిందే. కాగా జగన్‌ను చూసేందుకు ఆయన నివాసం వద్దకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాగా ఇదే కేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరు కాగా మోపిదేవి వెంకట రమణ కోర్టుకు హాజరు కావల్సి ఉన్నా.... అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు. మరోవైపు జగన్ కోర్టుకు హాజరు అయిన నేపథ్యంలో ....పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, మీడియా ప్రతినిధులను తప్ప, అనుమతి పత్రాలు ఉంటేనే మిగతావారిని కోర్టు లోపలకు అనుమతిస్తున్నారు. -
ధర్మానను అడ్డుకున్న తెలంగాణ న్యాయవాదులు
-
ధర్మానను అడ్డుకున్న తెలంగాణ న్యాయవాదులు
హైదరాబాద్ : మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావును తెలంగాణ న్యాయవాదులు అడ్డుకున్నారు. వాన్‌పిక్ కేసులో విచారణ కోసం కోర్టుకు హాజరై తిరిగి వెళ్తుండగా ధర్మాన వాహనాన్ని అడ్డుకున్నారు. తెలంగాణ ద్రోహి ధర్నాన డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పక్కకు తరలించి... పోలీసుల భారీ బందోబస్తు మధ్య ధర్మాన కోర్టు నుంచి బయటకు పంపారు. కాగా శాంతి ర్యాలీకి అనుమతి తిరస్కరించటాన్ని నిరసిస్తూ హైకోర్టు తెలంగాణ ప్రాంత న్యాయవాదులు నిరసనకు దిగారు. మరోవైపు సీమాంధ్ర న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. కాగా ఏపీ ఎన్జీవోల సభ, శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరణ నేపథ్యంలో హైకోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. -
సీబీఐ ఎదుట హాజరైన ధర్మాన
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. దిల్‌కుశ అతిథిగృహంలో సీబీఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ ధర్మానకు సీఆర్పీపీ సెక్షన్ 160 కింద సీబీఐ నిన్న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో ఇందూ కంపెనీకి సంబంధించి లేపాక్షి నాలెడ్జి ప్రాజెక్టుకు భూకేటాయింపుల వ్యవహారంలో ఆయనను సీబీఐ విచారిస్తోంది. కాగా ఇప్పటికే ధర్మానపై సీబీఐ ఒక ఛార్జిషీట్ దాఖలు చేసింది. మూడోసారి ధర్మాన ప్రసాదరావు సీబీఐ ఎదుట హాజరయ్యారు. -
ధర్మానకు నోటీసులు జారీ చేసిన సీబీఐ
-
ధర్మానకు నోటీసులు జారీ చేసిన సీబీఐ
హైదరాబాద్ : మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ మంగళవారం నోటీసులు జారీ చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూకేటాయింపులపై ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. భూకేటాయింపుల సమయంలో ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,848 ఎకరాలను ఏపీఐఐసీ కేటాయించింది. అయితే లేపాక్షి నాలెడ్జ్ హబ్ సిటీ సంస్థకు కేటాయించిన భూముల్లో ఏళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాకపోవడంతో ఆ భూములను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.