
కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించండి: ధర్మాన
హైదరాబాద్ : మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ....మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి విచక్షణ అధికారాలు ఉపయోగించి.... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించాలని ధర్మాన ఈ సందర్భంగా తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు రెండు నెలల క్రితమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి కూడా సమర్పించారు. క్విడ్ ప్రోకో కేసులో ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.