హైదరాబాద్ : మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావును తెలంగాణ న్యాయవాదులు అడ్డుకున్నారు. వాన్పిక్ కేసులో విచారణ కోసం కోర్టుకు హాజరై తిరిగి వెళ్తుండగా ధర్మాన వాహనాన్ని అడ్డుకున్నారు. తెలంగాణ ద్రోహి ధర్నాన డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పక్కకు తరలించి... పోలీసుల భారీ బందోబస్తు మధ్య ధర్మాన కోర్టు నుంచి బయటకు పంపారు.
కాగా శాంతి ర్యాలీకి అనుమతి తిరస్కరించటాన్ని నిరసిస్తూ హైకోర్టు తెలంగాణ ప్రాంత న్యాయవాదులు నిరసనకు దిగారు. మరోవైపు సీమాంధ్ర న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. కాగా ఏపీ ఎన్జీవోల సభ, శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరణ నేపథ్యంలో హైకోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.