మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ మంగళవారం నోటీసులు జారీ చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూకేటాయింపులపై ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. భూకేటాయింపుల సమయంలో ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,848 ఎకరాలను ఏపీఐఐసీ కేటాయించింది. అయితే లేపాక్షి నాలెడ్జ్ హబ్ సిటీ సంస్థకు కేటాయించిన భూముల్లో ఏళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాకపోవడంతో ఆ భూములను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.