జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణ లాయర్లు | Telangana Lawyers gherav Jayaprakash Narayana | Sakshi
Sakshi News home page

జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణ లాయర్లు

Published Tue, Feb 11 2014 4:33 PM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణ లాయర్లు - Sakshi

జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణ లాయర్లు

న్యూఢిల్లీ: లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణకు ఢిల్లీలో తెలంగాణ సెగ తగిలింది. ఏపీ భవన్ వద్ద ఆయనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.  విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని తెలంగాణ న్యాయవాదులు, విద్యార్థులు అడ్డుకున్నారు. జై తెలంగాణ, జేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

జేపీ చొక్కా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణవాదుల ఆందోళన మధ్య జేపీని పోలీసులు అక్కడిని నుంచి ఏపీ భవన్లోపలికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి ఏపీ భవన్ లో తెలంగాణ వాదుల ఆందోళన కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement