Jayaprakash Narayana
-
ఇదెక్కడి మేధావితనం?
గతంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజుల్లో, ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి!’ అనే నినాదం గోడల మీద విస్తృతంగా దర్శనం ఇచ్చేది. ఆ నినాదం నిజమైందో లేదో తెలియదు కానీ, ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రపంచంలో ఉన్న ఒక వర్గం ‘మేధావులంతా ఏకం కండి!’ అనే నినాదాన్ని అంది పుచ్చుకొని వాళ్లంతా ఏకమవుతూ తమ సర్వశక్తుల్నీ ఒడ్డుతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అలియాస్ జేపీ హైదరాబాదు నుంచి విజయవాడ విచ్చేసి, ప్రెస్‌మీట్ పెట్టి తన మద్దతు ఎన్డీయే కూటమికే అంటూ దానికి బహు నిర్వచనాలు ప్రవ చించారు. అంతటితో ఆగకుండా ‘గాంధీ మహాత్ముడు, అంబేడ్కర్లకు కులం అంటగడతామా?’ అంటూ పరోక్షంగా తను కూడా అంతటి మహాత్ము డినే అని ప్రకటించుకున్నారు. అక్కడే చంద్రబాబుతో అంటకాగడంలో అపరాధ భావం ప్రస్ఫుట మవుతోంది. ఇంకా త్రిపురనేని రామస్వామి చౌదరి, గిడుగు రామ్మూర్తి పంతులు పేర్లు కూడా ఉటంకించారు. అసలు ఆయన మాట్లాడేదానికీ, ప్రస్తుత రాజకీయాలకూ; నాటి సంఘ సంస్కర్తలూ, భాషా వేత్తలైన త్రిపురనేని, గిడుగులకు సంబంధం ఏంటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. ఈ జేపీ లోక్‌సత్తా పార్టీని ఎప్పుడో చుట్ట చుట్టే శారు. లోక్ సత్తా ఇకపై రాజకీయ పార్టీ కాదని ప్రకటించేశారు కూడా! అయితే, చంద్రబాబు కోసం అర్జెంటుగా మళ్లీ పార్టీని వెలుగులోకి తెచ్చారు కాబోలు! నిజానికి ఈ పార్టీ పుట్టుక పరిశీలిస్తే, ఒక దశలో చంద్రబాబు నాయుడుతో రామోజీరావుకి తేడాలు వచ్చి, ‘‘నేను కింగ్ మేకర్ని. ఎన్టీఆర్ నుంచి పీఠాన్ని అప్పజెప్పింది నేను. అటువంటిది నాకే ‘మింగుడు పడకపోతే’ ఎలా? మీలాంటి వాడిని జాతీయ స్థాయిలో మరొకడిని తయారుచేస్తా!’’ అని ఈ జేపీని తెర మీదకు లోక్‌సత్తా పేరుతో తీసుకురావ డంలో రామోజీరావు కీలక పాత్ర వహించారని అంటారు పరిశీలకులు. అందుకే కాబోలు! అప్పట్లో ‘ఈనాడు’లో జేపీ వార్తలు పుంఖానుపుంఖాలుగా వచ్చేవి. ఆ పబ్లిసిటీ ప్రభావంతో విద్యావంతులు చాలా మంది లోక్‌సత్తా పట్ల ఆకర్షితులయ్యారు. అయితే జేపీ ‘హై వోల్టేజ్ యారగెన్సీ’కి షాక్ అయి స్వల్పకాలంలోనే జారుకున్నారు. జేపీని ఒకసారి గెలిపించిన హైదరాబాద్ కుకట్పల్లి ప్రజలు కూడా అతడి మేధా అహంకారానికి బెదిరిపోయారు. కాగా, మల్కాజ్‌గిరిలో మైండ్ బ్లాక్ అయ్యే జవాబు ఇచ్చారు జనం. దాంతో రాజకీయాలకు దూరంగా తన మేధాతనాన్ని అప్పుడప్పుడు మాత్రమే ప్రదర్శిస్తూ రోజులు గడుపుతున్నారు జేపీ. ఎంతైనా పబ్లిసిటీకి అలవాటైన ప్రాణం కదా! పైగా తను పేద్ద లౌకిక వాదినని కూడా చాటుకోవాలయ్యె! అందుకే, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, ఒకసారి పవన్ కల్యాణ్‌తో కలిసి ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ అంటూ నాలుగు రోజులు హడావిడి చేసి మళ్లీ సైలెంట్ అయి పోయారు. ఆ మధ్య జగన్ ప్రభుత్వంలో పథకాలను ప్రశంసించారు. ఇప్పుడు మళ్లీ ‘ప్రపంచ మేధా వులారా ఏకం కండి!’ అన్న నినాదాన్ని అంది పుచ్చుకొని చంద్రబాబుకు మద్దతుగా ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే, గాంధీ, అంబేడ్కర్, వైశ్య కులం, దళిత కులం; త్రిపురనేని రామస్వామి చౌదరి, గిడుగు రామ్మూర్తి అంటూ మోకాలికీ బోడి గుండుకీ ముడిపెడుతూ తన మేధాతనాన్ని ప్రదర్శించడానికి చాలా ప్రయాసపడ్డారు. ప్రకటన వికటించింది. చంద్రబాబుకి వర్గ పరంగా బహిరంగ మద్దతు ఇస్తున్నాను అని ఆయన ప్రకటిస్తే ఎవరికీ పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఏదేదో మాట్లాడేసేసి, ఆంధ్ర ప్రదేశ్‌లో ఏదో అరాచకం జరిగి పోతుందని తన భాషా ప్రావీణ్యమంతా ప్రదర్శించే సరికి, ఆయన మీద విమర్శల జడి మొదలైంది. పాపం జేపీని చూసినప్పుడల్లా విదు రుడు చెప్పిన పద్యం ఒకటి గుర్తుకు వస్తుంది. ‘‘ధనమును, విద్యయు, వంశంబును, దుర్మతులకు మదంబు ఒనరించును / సజ్జను లైన వారికి అణకువయును, వినయము ఇవియే తెచ్చును ఉర్వీ నాథా!’’ అంటాడు. ధనం, విద్య, ఉత్తమ కులంలో పుట్టాననే భావన దుష్టులకు మదాన్నీ, అహంకారాన్నీ కలిగిస్తాయి. ఇవే శిష్టులకు అణకువ, వినయం కలిగిస్తాయి అని విదురుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు. ఈ పద్యం చదివితే జేపీ ఏ బాపతు మేధావో చెప్పనవసరం లేదనుకుంటాను. జనానికి ఏమి కావాలో అది చెప్పాలి.లేదంటే నేల విడిచి సాము చేసినట్టు ఉంటుంది. జనం ఏమైనా ‘జేపీలా’? పి. విజయబాబు వ్యాసకర్త పూర్వ సంపాదకులు -
JPకి దేవులపల్లి అమర్ కౌంటర్
-
‘జగనన్న ఆరోగ్య సురక్ష’ దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం దేశానికే ఆదర్శం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం దగ్గరకు వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను పంపించడం గొప్ప విషయం’ అంటూ లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ కొనియాడారు. మంగళవారం ఆయన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ను ప్రశంసిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘బేస్‌లైన్ ఆరోగ్య పరీక్షలతో పాటు హెల్త్ స్క్రీనింగ్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా పేదల ఆరోగ్యంపై శ్రద్ధకు శ్రీకారం చుట్టారు. తెలుగునాట మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ రూపంలో, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ‘ఆరోగ్య సురక్ష’ ద్వారా అధ్వానంగా ఉన్న ప్రజారోగ్య వ్యవస్థకు జీవం పోశారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు కేవలం అనారోగ్యం, సరైన వైద్యం అందక, వైద్య ఖర్చులు భరించలేక పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. అలాంటి సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం శుభపరిణామం. ఆరోగ్యశ్రీలో పేదలు తమకు నచ్చిన నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుండటంతో.. ఆస్పత్రులు కూడా మెరుగైన వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రస్తుతం జీవనశైలి మార్పులతో దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ముందుగానే వాటిని గుర్తించి సరైన వైద్య సహాయం అందిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది’ అంటూ వీడియో సందేశంలో జయప్రకాశ్ నారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. -
సినిమా అనేది ఎంటర్టైన్ చేస్తూనే ఎడ్యుకేట్ చేయాలి
‘చాలామంది యువత రాజకీయాలు అంటూ సరైన నాయకుడిని ఎంచుకోకుండా గుడ్డిగా తిరిగి జీవితాలు పాడుచేసుకుంటున్నారు అనే బాధ నాకు ఎప్పుడూ ఉండేది. అలాంటి అంశాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి వినోదాన్ని జోడించి ఒక మంచి సినిమా చేశారు. ‘రామన్న యూత్’ సినిమా గురించి చెప్పగానే నాకు చాలా ఆనందమేసింది.ఇలాంటి సినిమాలని మనమందరం సపోర్ట్ చేయాలి’అని లోక్ సత్తా పార్టీ ఫౌండర్ డాజ జయప్రకాశ్ నారాయణ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ ను జయప్రకాష్ నారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా అనేది ఎంటర్టైన్ చేస్తూనే ఎడ్యుకేట్ చేయాలన్నారు. రామన్న యూత్ మూవీ టీజర్ చాలా బాగుందని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాక్షించారు. ‘విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయ నాయకుల కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు. ఆ యువతను కొందరు నేతలు ఎలా తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అనేది “రామన్న యూత్” సినిమాలో వినోదాత్మకంగా, ఆలోచింపజేసేలా తెరకెక్కించాం’ హీరో,దర్శకుడు అభయ్ నవీన్ అన్నారు. -
జయ ప్రకాష్ నారాయణ ముందే చెప్పారు.. మీరు వినలేదు..
-
ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది
వేటపాలెం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని లోక్‌సత్తా నేత ఎన్.జయప్రకాష్ నారాయణ చెప్పారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెంలోని బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతాబ్ది ఉత్సవాల్లో రెండో రోజు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకోసం ఒక్కో విద్యార్థికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం అత్యధికంగా ఒక్కొక్క విద్యార్థికి రూ.90 వేలు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఇది అభినందించాల్సిన విషయమన్నారు. విద్యా, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ బండ్ల బాపయ్యశెట్టి నెలకొల్పిన విద్యాసంస్థలో చదువుకున్న ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నతస్థాయిల్లో ఉన్నారని చెప్పారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని రాణించాలని సూచించారు. ఎన్‌ఏటీసీవో డైరెక్టర్ చెంగపల్లి వెంకట్, నటుడు అజయ్‌ఘోష్, విద్యాసంస్థ అధ్యక్షుడు బండ్ల అంకయ్య, ఉపాధ్యక్షుడు కోడూరి ఏకాంబేశ్వరబాబు, కార్యదర్శి బండ్ల శరత్‌బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ గొల్లపూడి సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పురోగమిస్తున్న విద్య, వైద్య రంగాలు
గుణదల (విజయవాడ తూర్పు): ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కోరారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గుణదల ఈఎస్ఐ రోడ్డులోని రోటరీ క్లబ్ భవనంలో లోక్ సత్తా పార్టీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని, ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు పురోగమిస్తున్నాయని అభినందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కులం, మతం, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పాలన అందించాలని కోరారు. అనంతరం సర్వసభ్య సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. -
తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ప్రశంసించారు. ఆరో గ్యం, ఇళ్లు, వృద్ధాప్య పెన్షన్ల కోసం ఈ రెండు రాష్ట్రాలు పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉచిత డయాగ్నొస్టిక్ సేవలనూ కొనియాడారు. ‘ఆరోగ్యశ్రీ, 108 సేవలను ప్రవేశపెట్టడం వల్ల వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆరోగ్య, 108లు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ 85% మందికి అందుతోంది’ అని అన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ కోసం ఎక్కు వగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ప్రజలు తమ జేబుల్లో నుండి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా అందరికీ నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించేలా ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎఫ్డీఆర్), లోక్‌సత్తా సంయుక్తంగా రూపొందించిన ‘టువర్డ్స్ వయబుల్ యూనివర్సల్ హెల్త్‌కేర్’ను మంగళవారం జయప్రకాశ్ నారాయణ విడుదల చేశారు. ఈ విధాన నమూనాను ఇప్పటికే ప్రధాని సహా సంబంధిత వర్గాలందరికీ పంపామని చెప్పారు. అమలు కోసం త్వరలో ఏపీ, తెలంగాణ సీఎంలను కలుస్తానని, ఆ మేరకు వారికి లేఖ కూడా రాశానని తెలిపారు. ఖరీదైన ఆధునిక వైద్యం ‘ఆధునిక వైద్యం ఖరీదుగా మారింది. ఒక పడకను యూనిట్‌గా తీసుకుంటే సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏడాదికి కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సాధారణ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ గాంధీ, కాకతీయ, ఉస్మానియా వంటి ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఒక్కో పడకకు రూ.25లక్షలు ఖర్చు చేస్తుంటే, జిల్లా ఆసుపత్రుల్లో రూ.20 లక్షలే ఖర్చు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు ఉండటంలేదు’అని జయప్రకాశ్ నారాయణ అన్నారు. అమెరికాలో ప్రతీ ఐదు డాలర్లలో ఒక డాలర్ ఆరోగ్యం కోసం అక్కడి ప్రజ లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయం మన దేశంలో అతి తక్కువగా, జాతీయాదాయంలో 1.2% మాత్రమే ఉంటోందన్నారు. వైద్యం కోసం ఖర్చు చేయడం వల్ల ఏటా దాదాపు ఆరు కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి జారిపోతున్నారన్నారు. ‘హుజూరాబాద్’ ఖర్చుపై ఆందోళన హుజూరాబాద్ ఎన్నికల ఖర్చు ప్రపంచ రికార్డని జయప్ర కాశ్ నారాయణ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్ని కలో వివిధ పార్టీలు పెట్టిన ఖర్చుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ కంటే బ్రిటన్ 18–20 రెట్లు ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశమని, అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో 2 ప్రధాన పార్టీలు పెట్టిన ఖర్చుకంటే హుజూరాబాద్‌లో పెట్టిన ఖర్చు చాలా ఎక్కువన్నారు. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ సరైంది కాదని, దామాషా లేదా ప్రత్యక్ష ఎన్నికల పద్ధతే సరైందని అభిప్రాయపడ్డారు. -
జగన్ సర్కార్ నిర్ణయాన్ని అభినందిస్తున్నా: జేపీ
సాక్షి, అమరావతి: ప్రజలెనుకున్న ప్రభుత్వాలు విధానపరంగా తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడాన్ని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ తప్పుబట్టారు. ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా మన రాష్ట్రం పేరెత్తకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికైన ప్రభుత్వానికి రాజధాని ఎక్కడ ఉండాలనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. మంచో చెడో పక్కన పెట్టండి.. మనకు ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఒకసారి ఓటువేసి ఎన్నుకున్న ప్రభుత్వం చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటే నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ, మీరు చేయకూడదనడం సరైంది కాదు. దానికి కోర్టులుగానీ మరొకటిగానీ పరిష్కారం కాదు’.. అని జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు, కోర్టులు, చట్టసభలు తమతమ పాత్రలు పోషించాలని.. కానీ, మనదేశంలో పలు సందర్భాల్లో కలగాపులగం అయిపోతోందన్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టులు ప్రభుత్వ పనిచేస్తున్నాయి.. ప్రభుత్వాలు కోర్టుల్లా వ్యవహరిస్తున్నాయి.. న్యాయ నిర్ణయం మేం చేస్తామంటున్నాయి.. మనకీ గందరగోళం పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. (చదవండి: ‘అమరావతి’ మా నిర్ణయం కాదు) మీటర్లు పెట్టడం మంచి నిర్ణయం రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించే కనెక్షన్లకు మీటర్లు బిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జయప్రకాష్ నారాయణ సమరి్థంచారు. ‘విద్యుత్ రంగంలో నాకు తెలిసి ఒక మంచి ప్రయత్నం జరుగుతోంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టినప్పుడు ఆయనతో నేను గట్టిగా వాదించాను. నచ్చజెప్పే ప్రయత్నం చేశా. మీరు ఉచిత విద్యుత్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ, మీటర్ పెట్టమని చెప్పా. కనీసం ఎక్కడ ఖర్చవుతోంది, ఎక్కడ వృథా అవుతోందో మనకు అర్ధమైతే ఎనర్జీ ఆడిటింగ్ సరిగ్గా ఉంటుంది.. విద్యుత్‌ను పొదుపు చెయ్యొచ్చు అని చెప్పా. ఆయన మీటర్లు పెట్టాలనే ప్రయత్నం చేశారు. కానీ, మనకెందుకీ గొడవంతా అని కేబినెట్లో అనడంతో విరమించుకున్నారు. ఇప్పుడు జగన్ సర్కార్ అమలుచేస్తున్నందుకు అభినందిస్తున్నా. కొన్ని రంగాల్లో ఖర్చవుతున్నప్పుడు, అది ఎంతవుతుందో.. ఎక్కడ అవుతున్నదో తెలియకపోయినట్లైతే.. పొదుపు పాటించకపోతే, సాంకేతిక నష్టాన్ని దొంగతనాన్ని నివారించకపోతే ఖజానా ఖాళీ అయిపోతుంది‘.. అని జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. (చదవండి: మరో మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్) -
ఒకే వారంలో అన్ని ఎన్నికలు నిర్వహిస్తే మంచిది
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు ఒక వారం వ్యవధిలో ఎన్నికలు నిర్వహించేలా చూస్తే మంచిదని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఏడాదంతా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో వీటిపైనే పార్టీలు దృష్టి పెట్టడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీసుకునే చర్యలతోపాటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. గురువారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంగణంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్, ఐఎస్‌బీల ఆధ్వర్యంలో ‘రాజకీయాల్లో ధనబలం’అంశంపై ఏర్పాటు చేసిన రెండ్రోజుల సదస్సును వెంకయ్య ప్రారంభించారు. నోటుతో.. ప్రశ్నించే గొంతు కోల్పోతాం ఓటుకు నోటు తీసుకుంటే ప్రశ్నించే గొంతును కోల్పోతామని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు బస్సు, బీరు, బిర్యానీ అనే త్రీ బీ సర్వసాధారణమై పోయాయని, వీటికి ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌పై విశ్వవ్యాప్తంగా గౌరవం ఉందని.. అయితే.. ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యంగా మన దేశాన్ని తీర్చిదిద్దుకోవాలంటే ఎన్నికల్లో, ధన, అంగబలంపై నియంత్రణ అవసరమన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు, పార్టీల విధానాలపై సమీక్ష అవసరమన్నారు. ప్రజలు నిబద్ధత, సత్ప్రవర్తన, పనిచేయగలిగే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను చట్టసభలకు పంపడం వల్లే వారి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలన్నారు. కోటీశ్వరులే ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితులుంటే.. నిజంగా ప్రజాసేవ చేసే వారికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండదన్నారు. ఆర్థికపరమైన అంశాల్లో పార్టీలు జవాబుదారీతనాన్ని అలవాటు చేసుకుని ప్రజల్లో విశ్వాసం చూరగొనాలని ఆయన సూచించారు. అందరికీ సమాన అవకాశాలు ఉండటం లేదు: జేపీ ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోవడం వల్ల ధనికులే పోటీ చేయగలుగుతున్నారని, పోటీకి అందరికీ సమాన అవకాశాలు ఉండటం లేదని ఎఫ్డీఆర్ ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ నారాయణ అన్నారు. ఎన్నికల్లో ధన బలాన్ని, ధన ప్రవాహాన్ని తగ్గించకపోతే అవినీతి, అక్రమాలు మరింతగా పెచ్చుమీరే అవకాశాలున్నాయన్నారు. దేశంలో ఎన్నికల ద్వారా శాంతియుతమైన పద్ధతుల్లో అధికార మార్పిడి జరుగుతున్నా ప్రజాస్వామ్యం పూరిస్థాయిలో పనిచేయడం లేదన్నారు. మరింత మెరుగైన పద్ధతుల్లో ప్రజలకు సేవలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. -
ఇది ప్రజాస్వామ్య వైఫల్యం
హైదరాబాద్: పరిపాలన ప్రజలకు అర్థం కాకపోవటం అంటే అది ప్రజాస్వామ్య వైఫల్యమేనని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో ‘స్థానిక ప్రభుత్వాలు– సాధికారత, ఆవశ్యకత’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు విద్య అందటం లేదంటే సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. ఇన్నాళ్ల ప్రజాస్వామ్యంలో పిల్లలకు చదువు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 40 వేల కోట్లు పాఠశాల విద్యకు ఖర్చు అవుతున్నా నూటికి 60 శాతం మందికి చదువు రావటం లేదన్నారు. స్థానిక నాయకత్వ లోపం వల్లనే మెరుగైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నామమాత్రంగా విద్యకు ఖర్చు చేసినప్పుడే మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇప్పుడు కోట్లు ఖర్చు చేసినా ఫలితాలు లేవన్నారు. ఇన్ని అనర్థాలకు మూలం అధికారాన్ని ప్రజలకు దూరం చేయటమేనన్నారు. మనుషులు మారుతున్నారే తప్ప పాలన మారటం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వేల కోట్ల మిగులు తో ఏర్పడినప్పటికీ ఇప్పుడు ఏమీ లేదని, వృథా ఖర్చులు పెరగటం వల్లనే అప్పుల పాలవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, లోక్‌సత్తా పార్టీ కన్వీనర్ తుమ్మనపల్లి శ్రీనివాసు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, కటారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
హామీలను వెంటనే అమలుచేస్తే అప్పుల ఊబిలోకే..
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం క్లిష్ట స్థితిలో ఉందని.. ఈ సమయంలో కొత్త ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీల జోలికి వెళ్తే రాష్ట్రం మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోవడం ఖాయమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో గొప్ప ప్రజాభిమానాన్ని పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంకటంలో ఉంది. నిరుద్యోగులు ఉపాధి కోసం చూస్తున్నారు. డబ్బుల్లేవు. అందరూ సంఘటితంగా తెలుగు ప్రజలకు న్యాయం చేయడం.. నిజమైన అభివృద్ధిని సాధించడం ఎలాగా.. అన్నవాటిపై దృష్టిపెట్టాలి. ఢిల్లీ నుంచి రావాల్సిన వాటిని ఎలా రాబట్టుకోవాలో చూడాలి. మనం చెల్లించాల్సిన రుణాలను కేంద్రం మాఫీ చేయాలి.. అంతేకాక, ఏపీ అభివృద్ధి కోసం ప్రత్యేక బాండ్లను జారీచేసి, ఆ డబ్బులు రాష్ట్రానికిచ్చి, వాటిని తీర్చే బాధ్యత కేంద్రం తీసుకోవాలి. జగన్మోహన్రెడ్డిని అన్ని పక్షాలు కోరేది ఒక్కటే.. విభేదాలు వదిలి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోండి. జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది. జాగ్రత్తగా చేసుకుంటే రాష్ట్రంలో చాలా అవకాశాలున్నాయి’.. అని జయప్రకాష్ నారాయణ అన్నారు. -
ఇవి ఎన్నికలు కాదు.. వేలం పాటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ ఇప్పుడు జరుగుతున్నవి ఎన్నికలు కాదని, అవి వేలం పాటల్లా సాగుతున్నాయని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో జరిగిన లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోనూ, దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది పరిపాలన కూడా కాదు, ఆ పేరుతో కలెక్షన్లు చేస్తున్నారని, ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు వసూళ్లు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. మొన్న ముగిసిన తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే చూశాం. ఏపీలోనూ చూడబోతున్నామని చెప్పారు. ఓట్లు కోసం రాజకీయ పార్టీలు పోటీపడి వరాలు ఇస్తున్నాయన్నారు. ఇలాంటి చిల్లర, మల్లర కార్యక్రమాల వల్ల ప్రజలకు నిజమైన ఫలితాలు అందకపోగా, వాటిలో నుంచే అవినీతి పుడుతుందన్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టాలన్నా ప్రాంతీయ పార్టీలే కీలకమని, వచ్చే 25 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ పోటీ చేస్తుందా అన్న ప్రశ్నకు తమ పార్టీ పొలిట్ బ్యూరో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని బదులిచ్చారు. లోక్‌సత్తా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన జయప్రకాష్ నారాయణ, ఈ ఎన్నికల సమయంలో దానిపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. -
మన్మోహన్‌కు ‘పీవీ’ పురస్కారం
హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నర్సింహారావు పేరిట అందించే జీవన సాఫల్య పురస్కారాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అందించనున్నారు. ఫిబ్రవరి 28న ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్లో మన్మోహన్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇండియా నెక్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జ్యూరీ కమిటీ ఈ మేరకు వెల్లడించింది. శుక్రవారం ఇక్కడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశమైన జ్యూరీ సభ్యులు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఇండియా నెక్ట్స్ సలహా మండలి సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్లు పీవీ నర్సింహారావు జీవన సాఫల్య పురస్కారానికి మన్మోహన్‌ను అన్ని విధాలా అర్హుడిగా నిర్ణయించినట్లు ప్రకటించారు. విశ్రాంత న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య అధ్యక్షతన డాక్టర్ సుభాష్ కశ్యప్, కార్తికేయన్ జ్యూరీ కమిటీ సభ్యులందరం కలిసి మన్మోహన్ సింగ్‌ను అవార్డుకు అర్హుడిగా ఎన్నుకున్నట్లు జయప్రకాష్ నారాయణ తెలిపారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు జీవన సాఫల్య పురస్కారం మన్మోహన్ సింగ్‌కు ఇవ్వడం సముచితమన్నారు. ఇండియా నెక్ట్స్ జాతీయ కన్వీనర్ ఎస్వి.సూర్యప్రకాశ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. -
విద్య, వైద్యం బాధ్యత ప్రభుత్వాలదే
సాక్షి, సుందరయ్యవిజ్ఞానకేంద్రం: విద్య, వైద్యం బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. రాష్ట్రంలో వైద్య రంగంలో నైపుణ్యానికి తగిన సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ కమిటీ, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సదస్సు జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేపీ మాట్లాడుతూ.. బ్రిటన్‌లో అమలు చేస్తున్న నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే బ్రిటన్ తరహా వైద్య విధానం మొదటి వరుసలో నిలిచిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల సంఖ్యను పెంచి స్థానిక వైద్య రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రజా ఆరోగ్య కేంద్రంగా వైద్య ఆరోగ్య రక్షణకు ఒక నిర్ధిష్టమైన పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీడీపీలో ఆరోగ్య రంగానికి కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండాల్సిన వైద్య రంగాన్ని కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంటుందని అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి.ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంజీవ్ సింగ్, వైద్యులు అర్జున్, అశోక్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరినీ నొప్పించాలనుకోను
‘‘నేను ఏ సినిమా తీసినా ఎవర్నీ హర్ట్ చేయకూడదనుకుంటాను. నా కాన్సంట్రేషన్ అంతా ఆడియన్స్ పైనే. పర్సనల్‌గా సెటైర్ వేసి సినిమాకు మైలేజ్ పొందుదామనుకునే చీప్ ఫిల్మ్ మేకర్ని కాను నేను. ప్రజలను మోటివేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇష్యూస్‌ను అడ్రస్ చేశాను. పీపుల్స్‌కు నా సినిమా రీచ్ అవ్వాలి, నిర్మాతకు డబ్బులు రావాలి, ఎప్రిషియేషన్ కూడా రావాలి అనే ఫ్యాక్టర్స్‌ని కూడా ఆలోచిస్తా’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ‘భరత్ అనే నేను’. ఈ సినిమా సక్సెస్‌ను చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొరటాల శివ మాట్లాడుతూ –‘‘సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ఇంత ఎప్రిషియేషన్ రావడం చాలా ఆనందంగా ఉంది. కేటీఆర్‌గారు, జయప్రకాశ్ నారాయణ లాంటి వారు సినిమా బాగుందని చెప్పడం హ్యాపీ. ఎవరైనా కొత్త ఆలోచనలతో వస్తే నేను ప్రొడ్యూస్ చేస్తా. ఆ ఆలోచన ఉంది. ‘శ్రీమంతుడు’ అంటే గ్రామాల దత్తత మాత్రమే. అదే సీయం క్యారెక్టర్ మోర్ పవర్ఫుల్ అయితే మరిన్ని ఇష్యూస్ అడ్రెస్ చేయవచ్చని ఈ కథను తీసుకున్నాం. ప్రతి సినిమాలో కొత్త చాలెంజ్‌ను కోరుకునే నటుడు మహేశ్‌బాబు. ఆలా ప్రయోగాలు చేసే హీరో కెరీర్లో ఓన్లీ హిట్స్ మాత్రమే ఉండకపోవచ్చు. నేను రెండు సార్లు మహేశ్‌గారికి లైఫ్ ఇచ్చానని ఆయన చెప్పారు. అది మహేశ్‌గారి గొప్పదనం. బాలీవుడ్లో ఆఫర్లు వచ్చాయి. ‘మిర్చి’ సినిమాను రీమేక్ చేయమని చాలామంది అడిగారు. టాలీవుడ్లో నాకు కంఫర్ట్ అనిపించింది. రామ్‌చరణ్‌గారితో రెండు సినిమాలు ఉన్నాయి. మహేశ్‌గారితో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను. అయితే నెక్ట్స్ సినిమా ఏంటి? అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. హాలిడేకి వెళ్లాలనుకుంటున్నా. వచ్చిన తర్వాత పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నా’’ అన్నారు. ‘భరత్ అనే నేను’ గురించి ఇంకా చెబుతూ – ‘‘మొదట్లో టు పార్ట్స్ చేస్తే బాగుండు అనుకున్నాం. అంత కంటెంట్ కూడా ఉంది.చెప్పాల్సిన ఇష్యూస్ ఇంకా ఉన్నాయి. అందుకే అలా అనిపించింది. ఏమో ఎప్పటికైనా చెస్తామేమో! మహేశ్ క్యారెక్టర్ కోసం ఓన్లీ పొలిటీషియన్స్నే రిఫరెన్స్‌గా తీసుకోలేదు. లీడర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్‌ను తీసుకొన్నాను. ఆ లీడర్ ఒక సోషల్ వర్కర్ అయ్యి ఉండచ్చు. ఇన్స్ట్యూషన్ హెడ్ అయ్యి కూడా ఉండచ్చు. ఏ ఇండస్ట్రీ అయినా ఫస్ట్ చాన్స్ వారసులకే ఇస్తుంది. సినిమాలో భరత్ రామ్ క్యారెక్టర్ అలానే సీయం అయ్యాడు’’ అన్నారు. ఇటీవల పోసానిగారు మీ కథలను కొందరు తీసుకున్నారు అన్నారు. దీని గురించి ఏమంటారు? అన్న ప్రశ్నకు బదులిస్తూ– ‘‘ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం. పాత ఇష్యూస్ అవి. ఒక జాబ్‌లోకి వెళ్లినప్పుడు పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఉంటాయి. ఇది ఇండస్ట్రీలో ఉంది. వాటిని ఓవర్‌కమ్ చేసుకుని ముందుకు వెళ్లాలి’’ అని అన్నారు. -
జేపీ వ్యాఖ్యలు అభ్యంతరకరం
సాక్షి, హైదరాబాద్ : 'జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ' (జేఎఫ్సీ) సమావేశంలో లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ...‘ఓ ప్రత్యేక ప్రాజెక్ట్ లేదా పథకానికి కేంద్రం నిధులు కేటాయిస్తే ఆ నిధులకు సంబంధించిన లెక్కలను కేంద్రం అడగకూడదని జేపీ అన్నారు. జేపీ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. నిధులు కేటాయించినప్పుడు వాటిని దేనికి ఖర్చు చేశారో, అడిగే హక్కు కేంద్రానికి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా జేఎఫ్సీ విధివిధానాల్లో చేర్చితే అర్థవంతంగా ఉంటుంది.’ అని అభిప్రాయపడ్డారు. -
లోక్‌సత్తా ప్రజల కోసమే: జేపీ
హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ ప్రజల కోసమే ఆవిర్భవించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) తెలిపారు. శనివారం హైదరాబాద్ మల్కాజిగిరి కృష్ణలీల ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జేపీ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావడానికి సమయం పడుతుందన్నారు. ఇప్పటి రాజకీయాలకు అర్థాలే వేరుగా ఉన్నాయన్నారు. కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై స్పందించడం కన్నా వసూళ్లకు పాల్పడటం, ఇతరత్రా పనులు చేయడమే రాజకీయం అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 21 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో మూడు రాజ్యాంగ సవరణలు, 2జీ స్పెక్ట్రమ్ కేసు, 8 చట్టాలు చేయించిన ఘనత పార్టీకి ఉందన్నారు. రాష్ట్రం లో యజ్ఞాలు చేస్తేనే అన్నీ అయిపోవన్నారు. కేంద్రంలో మోదీ విజ్ఞతతో పనిచేయకపోవడం తో ఆయనపై నమ్మకం పోయిందన్నారు. ఆవు గురించి, తలాక్‌ల గురించి ఆలోచించే నేతలకు కోట్ల మంది జీవితాల గురించి ఆలోచించే తీరిక లేదన్నారు. తెలంగాణలో కూడా త్వరలోనే సురాజ్య యాత్ర నిర్వహిస్తామన్నారు. -
'ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది'
సాక్షి, భీమవరం: ప్రజలు చెల్లిస్తున్న పన్నుల్లో కేంద్రం నుంచి వాటా రాబట్టుకుంటున్న రాష్ట్రాలు స్ధానిక సంస్ధలకు మాత్రం నిధులు మంజూరు చేయడం లేదని లోక్‌సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. సరైన మొత్తంలో నిధులు కేటాయించకపోవడంతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ది చెందడం లేదని ఆయన అన్నారు. భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా కేంద్రం నుంచి 51 శాతం నిధులు రాబట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, స్ధానిక సంస్ధలకు నిధుల మంజూరులో నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలకు సకాలంలో సేవలందించని అధికారులపై చర్యలు తీసుకుంటే లంచం సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. సేవలు సక్రమంగా అందకపోవడం వల్లే, లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటున్న వారు సుమారు 65 శాతం ఉన్నట్లు ఒక సర్వేలో తేలిందన్నారు. లంచం ఇచ్చేవారికి మూడు నుంచి ఏడేళ్లు జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్త చట్టాన్ని అమలులోకి తేనున్నదని, అయితే లంచం తీసుకునే వారిపై కనీసం కేసు కూడా లేకుండా ఆ చట్టం రూపకల్పన జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అవినీతిని తగ్గించడానికి జీఎస్టీ విధానం కొంతమేరకు ఉపకరిస్తుందని, అయితే ప్రజలకు అత్యవసరమైన గృహనిర్మాణ రంగంపై 28 శాతం జీఎస్టీ విధానం అమలు చేయడం సరికాదని అన్నారు. తాను చేపట్టిన స్వరాజ్య ఉద్యమంలో యువతను భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నామని, ఇప్పటివరకు అయిదు జిల్లాల్లో పర్యటించినట్లు చెప్పారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి ఆరు ప్రధాన రంగాలపై దృష్టిపెట్టామని వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కృషిచేస్తున్నామని జేపీ అన్నారు. -
మూడేళ్లలో కనీస అభివృద్ధి కూడా జరగలేదు
లక్కవరపుకోట(శృంగవరపుకోట): దేశంలో గడిచిన మూడేళ్లలో కనీస అభివృద్ధి కూడా జరగలేదని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలోని జమ్మాదేవిపేటలో సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతం కన్నా ఇప్పడు మెరుగైన సేవలు అందుతున్నాయని ప్రధాని మోదీ అనడం దారుణమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్యం అందక జనం విలవిల లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలం
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ కాకినాడ సిటీ: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ విమర్శించారు. సురాజ్య యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన బుధవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. తునిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 650 మంది విద్యార్థులకు గానూ ఆరుగురు లెక్చరర్లు మాత్రమే ఉండగా.. వైఎస్సార్ జిల్లా మైదుకూరులోని డిగ్రీ కళాశాలలో 50 మంది విద్యార్థులకు 13 మంది లెక్చరర్లు ఉన్నారని చెప్పారు. ఇలాంటి సమస్యలనూ పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వముండటం దౌర్భాగ్యమన్నారు. స్థానిక సంస్థలు బలోపేతం కావాల్సిన అవసరముందన్నారు. -
రాజకీయ వ్యవస్థలో మౌలిక మార్పులు రావాలి
లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్‌నారాయణ సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి లేకుండా సుపరి పాలన జరగాలంటే రాజకీయ వ్యవస్థలో మౌలిక మార్పులు తేవాల్సిన అవసరం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు, ఫౌండేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఎఫ్డీఆర్) ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ చెప్పారు. ‘తక్షణ ఎన్నికల సంస్కరణల’ పై అన్నా హజారే నాయకత్వం లో ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ కార్యకర్తలు ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన సదస్సు లో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో రావా ల్సిన మార్పులపై దేశంలో పార్టీలకు అతీతం గా చర్చ జరగాలన్నారు. సీఎంను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని, అందువల్ల పలు ప్రయోజనాలున్నాయని చెప్పారు. ఓటు విలువ ప్రజలకు ఇంకా తెలియడంలేదని, అది తెలిస్తే డబ్బుకు అమ్ముడుపోవడం తగ్గుతుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్యేల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలన్నారు. సీఎంను ప్రజలు నేరుగా ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు అడ్డుకోలేరని, అందువల్ల స్థానిక ప్రభుత్వాలు బలపడడమే కాకుండా మంచి పరిపాలనకు అవకాశం ఉంటుందని చెప్పారు.రాజకీయం మారాలంటే కుటుంబ వ్యాపారం కాకుండా, రాజకీయమనేది ఒక ప్రైవేట్ సామ్రాజ్యం కాకుండా, మౌలికమైన మార్పులు తెచ్చి సామాన్యులకు ఓటు విలువ తెలిసే పరిస్థితి రావాలని జేపీ అన్నారు. -
సీఎంలను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులను ప్రత్యక్ష ఎన్నిక పద్దతిన ఎన్నుకోవాలని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఎన్నికల సంస్కరణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల రాజ్యం పోవాలని, అప్పుడే సీఎం సరైన పాలన ఇవ్వగలరని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాలని జేపీ అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక సందర్భంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సంఘటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలాంటివి రాజకీయ ఉన్మాదమని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థలో మార్పు వస్తే కానీ నిజమైన ప్రజాస్వామ్యం రాదని చెప్పారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పైరవీలు లేకుండా పనులు జరిగే రోజు రావాలని జేపీ పేర్కొన్నారు. గుడివాడ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలో అధికార టీడీపీ నాయకులు ఓటుకు 7 వేల నుంచి 10 వేల రూపాయల వరకు డబ్బు పంచినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
ఆర్భాటం జాస్తి.. వాస్తవం నాస్తి: జేపీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ పాలన ‘ఆర్భాటం జాస్తి – వాస్తవం నాస్తి’ అన్నట్టు ఉందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. బుధవారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘అంతా ఈవెంట్ మేనేజ్మెంట్. ప్రతి రోజూ పెద్ద ఆర్భాటం. ఏదో చేస్తున్నామని భ్రమలు కల్పిస్తున్నారు. దీర్ఘకాలిక దృక్పథంతో మన పిల్లలకు ఉపాధి కల్పించడం కోసం ఏం చేయాలన్న దానిపై లోతైన అవగాహన, దిశా నిర్దేశం కొరవడింది’ అన్నారు. విద్య, ఆరోగ్యం విషయంలో ఏ రాష్ట్రంతో పోల్చినా పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. నిజాయితీతో కూడిన ప్రయత్నాలు చేయకుండా మ్యాజిక్‌లు, చిట్కాలతో ఏ రాష్ట్రం బాగుపడలేదని చెప్పారు. ఆర్భాటాలు, ప్రగల్బాల రాష్ట్రంగా, పత్రికల్లో ప్రచారం పొందే రాష్ట్రంగా మిగిలిపోతోందని అన్నారు. ప్రత్యేక హోదానా.. ప్రత్యేక ప్యాకేజీనా అనేది అనవసర చర్చ అని, యువతకు ఉపాధి అవకాశాలు కలిగేలా కేంద్రం నుంచి పారిశ్రామిక రాయితీలు పొందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సీఎంను ఎన్నుకోవాలి : తమిళనాడు ఉదంతం చూస్తుంటే రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు దిగజారుతున్నాయన్నది మరోసారి నిరూపణ అయిందని జయప్రకాష్ నారాయణ అన్నారు. సీఎం పదవికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలకు తెరపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొందరు ప్రజాప్రతినిధులు ఎన్నికలప్పుడు ఏ పార్టీలో ఉన్నారు.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటూ పార్టీ మారిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
'అందుకే ఎమ్మెల్యేలు శశికళతో ఉన్నారు'
విజయవాడ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమంగా వేల ఆస్తులు కూడబెట్టారు కాబట్టే ఎమ్మెల్యేలు ఆమె వైపు చూస్తున్నారని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు మాత్రం పన్నీరుసెల్వం ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. శశికళకు సీఎంగా అయ్యేందుకు ఏమి అర్హత ఉందని ప్రశ్నించారు. దేశంలో డబ్బు రాజకీయం పోవాలంటే రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలన్నారు. దీనివలన మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఎన్నికల వ్యవస్థను లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే ద్వారా కాకుండా ప్రజలే సీఎంను ఎన్నుకోనే విధానం ద్వారా రాష్ట్రాల్లో అవినీతి తగ్గుతుందని చెప్పారు. ఎమ్మెల్యేలనే కాకుండా సమాజంలో ఉండే నిజాయితీ పరులను మంత్రులుగా చేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు సమస్యలు మీద కాకుండా సంపాదన మీద దృష్టి సాధిస్తున్నారని విమర్శించారు. ఏపీలో ప్రతి విషయాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారని.. దీర్ఘకాలిక ప్రయోజనాలపై ప్రభుత్యం దృష్టి సాధించటం లేదని ఆరోపించారు. ప్రతి విషయాన్ని మ్యాజిక్ చేయాలనీ సీఎం చూస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చివరికి ప్రగల్బాల, ఆర్భాటాల రాష్ట్రంగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. -
రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా?
రోజా సంఘటనపై జయప్రకాశ్ నారాయణ స్పందన సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పాలన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోందా అని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఇటీవల విశాఖపట్నంలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించి వెనక్కి పంపడం, జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే ప్రభుత్వం అడ్డుకోవడం వంటి వరుస సంఘటనలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో సామాన్య వ్యక్తిని పాల్గొనకుండా అడ్డుకున్నా పెద్ద తప్పుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. అలాం టిది ప్రజలెన్నుకున్న మహిళా ప్రజాప్రతినిధిని ఆ సదస్సులో పాల్గొనకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇతరులను కించపరిచేలా ప్రవర్తించారని ఎమ్మెల్యే రోజా కానీ, ఇంకెవరైనా కానీ అనుకుంటే న్యాయపరంగా వారిపై పరువు నష్టం దావా వేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఇలాంటి పరిణామాలు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రాష్ట్ర ప్రభుత్వానికి, చివరికి రాష్ట్రానికే చెడ్డపేరు తెస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పోలీసులు సైతం రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. -
హోదా అడిగితే దేశ ద్రోహమా?
-
హోదా అడిగితే దేశ ద్రోహమా?
‘సాక్షి’ ఇంటర్వ్యూలో జయప్రకాష్ నారాయణ ♦ పారిశ్రామిక రాయితీలు హోదాలో భాగం కాదనడం అవాస్తవం ♦ ప్యాకేజీ ఒక నాన్సెన్స్.. హోదా ఉన్న రాష్ట్రాలకే రాయితీలు దక్కాయి ♦ హోదా ప్రైవేట్ వ్యవహారం కాదు సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తామని ఆరు నెలల కిత్రం వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఇతర కేంద్ర మంత్రులు చెప్పిన మాటలనే ఇప్పుడు రాష్ట్రంలో యువత, ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేయడానికి పూనుకుంటే అది దేశద్రోహ చర్య ఎలా అవుతుందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. నిన్నటి దాకా వారు చేసిన వాదన అధికారంలో ఉన్న వారికి నచ్చకపోతే అన్యాయమైపోతుందా? అక్రమమైపోతుందా? ఆ మాట ఎత్తడమే తప్పు అవుతుందా? అని ప్రశ్నించారు. పాలకుల్లో ఇలాంటి అసహనం పెరగడం ఆంధ్రప్రదేశ్‌కు ఏ మాత్రం మంచిది కాదన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం ప్రజాస్వామిక చర్య అనిపించుకోబోదన్నారు. తిమ్మిని బమ్మి చేసి ప్రజలను భ్రమింపజేసేందుకు టీడీపీ, బీజేపీ ప్రత్యేక హోదా నిర్వచనాన్ని మార్చి, పారిశ్రామిక రాయితీలు అందులో భాగం కానట్టు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న సహాయానికి ప్యాకేజీ అన్న పేరు పెట్టడాన్ని ఆయన నాన్సెన్స్గా పేర్కొన్నారు. ‘సాక్షి’కి ఆయన ప్రత్యేకంగా ఇంటర్వూ్య ఇచ్చారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ► ప్రత్యేక హోదాతో పన్ను రాయితీలు వస్తాయి.. రాయితీలు వస్తే ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమల పెట్టుబడులు గణనీయంగా వచ్చే అవకాశం ఉంది. హోదా ఉన్న రాష్ట్రాలకే పారిశ్రామిక రాయితీలు దక్కాయి. ► అధికారంలో ఉన్నవారికి నచ్చినా, నచ్చకపోయినా, ప్రజలు తమ కోరికకు అనుగుణంగా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. రాష్ట్రంలో ఫలానాది జరిగితే బాగుండని.. ఎవరూ పట్టించుకోవడం లేదని పది మంది గుమికూడి నిరసన తెలపచ్చు. ఇది ప్రజాస్వామ్య హక్కు. ఇతరులకు ఇబ్బంది లేకుండా ఎవరైనా, ఎంతమందైనా గుమిగూడొచ్చు. ఇవన్నీ ప్రజాస్వామ్య హక్కులు. ► ప్రత్యేక హోదా కోసం అడిగితే అది దేశద్రోహం ఎలా అవుతుంది? ప్రత్యేక హోదా అవసరం లేదనుకుంటే శ్వేతపత్రం ప్రకటించి, పన్ను రాయితీ అవసరం లేదు, ప్యాకేజీ సరిపోతుందని చెప్పమనండి. నిన్నటిదాకా వాళ్లు చేసిన వాదన ఇప్పుడు అన్యాయమైపోయింది, అక్రమమైపోయింది. మాట ఇచ్చారు కాబట్టి అడుగుతున్నారు. ఇది తప్పు ఎలా అవుతుం ది? అడిగేవారి గొంతు నొక్కడం విజ్ఞత కాదు. బలవంతంగా నోరు మూసే ప్రయత్నం చేస్తే ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది కాని తగ్గదు. ► రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీల కోసం ఇప్పుటి వరకు ప్రభుత్వ పరంగా ప్రయత్నమే జరగలేదు. అది కచ్చితంగా తప్పు. ►అధికారంలో ఉంటే మేం ఫలానా పని చేశామని చెప్పుకుంటారు. ప్రతిపక్షం వాళ్లు ఫలానాది చేయడం లేదని ప్రచారం చేస్తారు. దీనిని భయంకరమైన కుట్రగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా వారికి ఆ హక్కు ఉందని గుర్తించండి. ఈ హక్కు మీరు ఇవ్వలేదు. ఇది రాచరికం కాదు. ఒక అధికారో, ప్రభుత్వమో ఈ హక్కులను ఇవ్వలేదు. ► ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించడం హర్షించదగ్గ విషయం కాదు. ప్రజాస్వామ్యంలో హింసను ప్రేరేపించకుండా, ఇతరులకు భంగం కలగకుండా ఎవరైనా ఏదైనా చెప్పుకునే హక్కు ఉంది. ఈ ఫండమెంటల్ గుర్తించకపోతే ప్రజస్వామ్యం నడవదు. అధికారంలో ఉన్న వారు తమకు ఇష్టంలేని ప్రతివారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించడం ప్రజాస్వామ్యం కానేకాదు. ప్రభుత్వానికి ఆ హక్కు లేదు. ► రాష్ట్రానికి కేంద్రం పెద్దలు ఏయే హామీలు ఇచ్చారు. ఏవి జరిగాయి, ఏవి జరగలేదు. ఏం సాధించుకోవాలి. సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో ప్రభుత్వం శ్వేతప్రతం రూపం లో చెప్పాలి. కానీ ఇదంతా జరగలేదు. ఇది ప్రైవేట్ వ్యవహారం కాదు. ప్రజల ముందు పెట్టాలి. ప్యాకేజీ అంటున్నారు. ఆ పదమే నాన్సెన్స్. -
కేంద్రం మాట తప్పకూడదు.. బాబైనా అడగాలి
► హోదా దగా.. కింకర్తవ్యం? పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జేపీ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న మాటకు కేంద్రం కట్టుబడి ఉండాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్‌నారాయణ అన్నారు. హోదా దగా.. కింకర్తవ్యం? పేరుతో లోక్‌సత్తా పార్టీ రూపొందించిన పుస్తకాన్ని ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ పారిశ్రామిక పన్ను రాయితీలు హోదాలో భాగమేనన్నారు. ఉద్యోగాలు, పన్ను రాయితీలు, అభివృద్ధి వస్తాయన్న ఆశతోనే 2014 ఎన్నికల్లో ప్రజలు టీడీపీ- బీజేపీ కూటమిని గెలిపించారని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ఏరుదాటక తెప్ప తగలేసినట్టు వ్యవహరిస్తుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూడా హోదా విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ విజ్ఞతతో మిగిలిన రాజకీయ పక్షాలను కలుపుకొని పనిచేయాలన్నారు. చంద్రబాబే హోదాపై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. విదేశాల్లో నల్లదనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేయడం మన చేతుల్లో లేదుగానీ, రాజకీయ సంకల్పం ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని జేపీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తాయనుకుంటే, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ సహా వెనుకబడిన జిల్లాలకు హోదా ఇవ్వమని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరాలన్నారు. హోదా దగా.. కింకర్తవ్యం? బుక్‌లెట్‌లో ఈ అంశాలన్నింటినీ వివరంగా పేర్కొన్నందున ప్రజలలోకి విరివిరిగా తీసుకెళ్లాలని జేపీ పార్టీ నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పార్టీ అధ్యక్షుడు బీశెటి బాబ్జీతో పాటు పలువురు లోక్‌సత్తా నాయకులు పాల్గొన్నారు. -
'బాబు ప్రత్యేక విమానాలకా..పన్నులు చెల్లించేది'
► పెద్ద నోట్ల రద్దు చాలదు ► మళ్లీ పెద్ద నోట్లు తేవడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి ► బాబు క్యాంప్ కార్యాలయాన్ని 10 కోట్లతో వృధాగా అలకరించారు ► బాబు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడంపై జేపీ ఆగ్రహం అమరావతి : అమరావతిలో ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయాన్ని రూ. 10 కోట్లతో వృధాగా అలకరించడం, ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం వంటి వాటి కోసమా ప్రజలు పన్నులు చెల్లించేది అని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. మోదీ సర్కార్ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చలామణీలో ఉన్న పెద్ద నోట్లను తక్షణం రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య నల్లధనాన్ని, నకిలీ నోట్లను నిరోధించడంలో ముందడుగేగానీ, మళ్లీ అవినీతి జరగకుండా చేస్తూ ప్రజలకు సమర్ధ పాలన అందించడానికి మాత్రం సరిపోదన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ రాజకీయ గిమ్మిక్కు మిగిలిపోకూడదంటే.. ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన, పన్నుల తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల పన్నుల డబ్బును నాయకుల విలాసాలకు, ఉద్యోగుల జీత భత్యాలు భారీ పెంపునకు కాకుండా ప్రజల సేవల కోసం సద్వినియోగం చేసే సంస్కరణను చేపట్టాలని సూచించారు. జనన ధృవ పత్రం లాంటి ప్రభుత్వ సేవల కోసం గతి లేక లంచం ఇచ్చిన వారికి కూడా కారాగార శిక్ష విధించాలన్నారు. అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వ ఉద్యోగి మీద పోలీసు కేసు పెట్టాలన్నా అనుమతి కావాలని అవినీతి నిరోధక చట్టానికి ప్రతిపాదించిన దుర్మార్గపు సవరణల్ని మోదీ సర్కార్ ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. మోదీ సర్కార్ నిర్ణయంతో ప్రభుత్వానికి పన్నుల వసూళ్ల పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా పన్ను రేటు తగ్గింపునకు చర్యలు చేపట్టాలని జేపీ సూచించారు. చలామణీలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి, కొత్తగా రూ. 500, 2000 వంటి పెద్ద నోట్లు మళ్లీ తేవడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి
* రౌండ్‌టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీల డిమాండ్ * స్పెషల్ చీఫ్ సెక్రటరీతో ప్రత్యేక బృందాన్ని నియమించాలి * లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ గుంటూరు వెస్ట్: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీ నాయకులతో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.. లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీతో ప్రత్యేక బృందాన్ని నియమించాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు, వేలం, రిజిస్ట్రేషన్, ఇతర అన్ని ప్రక్రియలు నిర్వహించడంతోపాటు బాధితులకు పరిహారం ఇచ్చే అధికారాన్ని ప్రత్యేక బృందానికి కట్టబెట్టాలని సూచించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి సంబంధించిన 87 కంపెనీల డైరెక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. దేశంలో ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయని, వీటి నియంత్రణకు 1996లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం అమలు కావడం లేదని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. అధైర్య పడొద్దు... వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ వ్యవహారం 20 లక్షల మందికి చెందిన సమస్య అని, దీనిని ప్రజా సమస్యగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోరుతూ నవంబర్ 9న విజయవాడ నుంచి వెలగపూడి వరకు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్‌కుమార్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్‌వలి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ ప్రసంగించారు. -
నియంతలా న్యాయ వ్యవస్థ: జేపీ
హైదరాబాద్: న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభాగ్యులకు సత్వర న్యా యం అందేలా చూసినప్పుడే న్యాయవాద వృత్తికి సార్ధకత చేకూరుతుందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. సోమాజిగూడలో మినర్వా కాఫీషాప్‌లో ఆది వారం ‘లా స్కూల్101.. క్రిసెండో-2016’ పేరుతో నిర్వహించిన మ్యూట్ కోర్ట్‌లో ఆయన పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థ పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తమను తామే న్యాయమూర్తులుగా నియమించుకునే విధానం సరైంది కాదన్నారు. అత్యున్నత న్యాయవ్యవస్థ నియంతలా వ్యవహరిస్తుందని, ప్రజాస్వామ్యానికి ఇది మంచి ది కాదన్నారు. దేశంలో దాదాపు 3కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వ్యాజ్యాల పరిష్కారంలో సుదీర్ఘ జాప్యం తో వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం న్యాయ విద్యార్థులకు జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజశేఖర్ గోపాల జోస్యుల, పవన్ కళ్లెం, సత్యేంద్రసింగ్, సునీల్ నీలకంఠన్, శ్లోక, వెన్నల కృష్ణ సహా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
సీఎంను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి: జేపీ
అప్పుడే ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించరు సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సీఎంలను ఎన్నుకునే విధానాన్నితీసుకురావాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పుడే ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించరని అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు పార్టీలు మారడం నుంచి రాష్ట్రపతి పాలన వరకు జరుగుతున్న పరిణామాలు ప్రేక్షకపాత్ర వహించాల్సినవి కాదన్నారు. విలువలకు, ప్రజా ప్రయోజనాలకు అధికారం ఎంతో దూరమైందనడానికి పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలే తాజా రుజువని పేర్కొన్నారు. -
ఇక ఎన్నికలకు దూరం
‘లోక్‌సత్తా 2.0’గా కొత్త అవతారం: జేపీ సాక్షి, హైదరాబాద్: ఉద్యమ సంస్థగా, పార్టీగా రాజకీయాలలో వచ్చిన మార్పులు, ప్రజల ఆలోచనా తీరుకు అనుగుణంగా కొత్త తీరుతో, సవరించిన ఎజెండాతో పోరాడాలని నిర్ణయించినట్లు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. మూడు కీలకాంశాల సాధనకు కార్యాచరణ రూపొందించుకొని ‘లోక్‌సత్తా 2.0’ పేరిట ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో జేపీ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు దూరంగా ఉండి పార్టీలకు అతీతంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మూడు కీలకాంశాలపై తక్షణ కార్యాచరణను చేపట్టనున్నామన్నారు. మొదటి అంశంగా ఫెడరలిజాన్ని పునర్నిర్వచించి... కేంద్రం అధికారాలు, దేశ సమగ్రతకు భంగం కలగకుండా రాష్ట్రాలకు పూర్తి స్వీయనిర్ణయాధికారాలనిచ్చి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించే వెసులుబాటు ఇవ్వటమని జేపీ తెలిపారు. ఉత్తమ ప్రమాణాలతో విద్య, వైద్యాన్ని ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం రెండో అంశమన్నారు. స్థానిక ప్రభుత్వం, పౌరులకు పూర్తి బాధ్యతలు, పన్నుల్లో వాటా అందించి స్థానిక సమస్యల పరిష్కారం, విధానాల అమల్లో వారిని పూర్తి భాగస్వాములను చేయడం మూడవ అంశమన్నారు. -
'రాజకీయాలు వ్యాపారంగా మారాయి'
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలు వ్యాపారంగా మారాయి అనడానికి ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీని వదిలి అధికారపార్టీ వైపు వెళ్లాలనే ప్రయత్నాలే తాత్కారణమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం సాక్షితో మాట్లాడుతూ... ఓట్లు వేసే ప్రజలకు పార్టీలు వేర్వేరు అనే భావనలో ఉండొచ్చుకాని... ఎన్నికైన ఈ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది పార్టీలకు మధ్య వ్యత్యాసంలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలు రాజకీయాలు అభిమానించే వారికి బాధకలిగించేవి అయినా అశ్యర్యాన్ని మాత్రం తెప్పించడంలేదన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు రాష్ట్రంలో ఉన్న అధికారాల మొత్తాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవడం వల్ల ఎమ్మెల్యేలు పనుల కోసం అధికార పార్టీ వైపు వెళ్లక తప్పడంలేదన్న భావన వ్యక్తమవుతుందని చెప్పారు. కేవలం ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్న అధికారం మంత్రులు, జిల్లా నాయకులు, గ్రామ స్థాయికి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నా గ్రామాల్లో మాకు కావాల్సిన పనులు మేము చేసుకోగలమన్న పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడే ఇలాంటి పరిమాణాలకు ముగింపు ఉంటుందని తెలిపారు. -
ఓటింగ్, షౌటింగ్ స్థాయికి దిగజారిపోయింది
ప్రజాస్వామ్యంపై జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో నాయకత్వాన్ని చూడకుండా కేవలం తాత్కాలిక ధోరణులతో, భావోద్వేగాలతో ఓటు వేయడం.. తర్వాత ప్రతిరోజూ దిగిపోండంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేయడం వల్ల భారతదేశ ప్రజాస్వామ్యమే వక్రమార్గం పడుతోందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. అమెరికాలోని హర్వర్డ్ విశ్వవిద్యాలయంలో శని, ఆదివారాల్లో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్‌లో జేపీ పాల్గొని అక్కడి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగ వివరాలను పార్టీ సోమవారం మీడియాకు విడుదల చేసింది. స్థానిక స్వయం పాలన, సరైన విధివిధానాలు లేకపోవడం వల్లే భారత ప్రజాస్వామ్యం ఓటింగ్, షౌటింగ్ స్థాయికి దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. అమెరికా ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థి ఖరారు కావడానికే విద్య, ఆరోగ్య విధివిధానాలపై హోరాహోరీగా రాజకీయ నాయకులు తలపడుతుంటే.. భారత్‌లో పార్టీలు, నేతల మధ్య విధానాలు, ఆలోచనల కనీస పోరాటమే లేదన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశ పరిపాలన రంగంలో మూడు మార్పులు చోటుచేసుకోవాలని జేపీ సూచించారు. మొదటిది.. ఢిల్లీ అధికారాలను కేంద్ర, విదేశాంగ అంశాలకే పరిమితం చేయాలి. రెండోది సొంత పాలనను, అందుకు విధానాలను రూపొందించుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకివ్వాలి. అవి స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి. మూడోది ప్రభుత్వ అధికార యంత్రాంగంలో నైపుణ్యాలను పెంపొందించి పారదర్శక వ్యవస్థను ప్రవేశపెట్టాలని జేపీ వివరించారు. -
సుపరిపాలనకే పట్టం కట్టండి
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చైతన్యపురి: ప్రజాసమస్యల పరిష్కారానికి కనీసం కాల్‌సెంటర్ కూడా ఏర్పాటు చేయలేని శక్తిహీనులు మన పాలకులని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. అలాంటి వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి, సుపరిపాలనను అందించే వారికే పట్టం కట్టాలని యువతకు పిలుపునిచ్చారు. గడ్డిఅన్నారం డివిజన్ పీఅండ్‌టీ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అధికారాలు లేకుండా మేయర్ పదవిని ఉత్సవ విగ్రహంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాయకులు డబ్బు, కులంతో జనాలను శాసిస్తున్నారు. ఎన్నికలు రాజకీయ నాయకుల కుటుంబాలకు ఉపయోగపడుతున్నాయో తప్ప, పన్నులు కట్టే ప్రజలకు కాదు. నాయకులు రాజకీయాన్ని ఓ వ్యాపారంలా చూస్తూ, ఏ పార్టీలో లాభముంటే అక్కడికి వలస పోతున్నారన్నా’రు. తాము గెలుపు కోసం బరిలోకి దిగలేదని, నిర్దిష్టమైన అజెండా కోసం లోక్‌సత్తా ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు. -
మార్పు కోసమే వన్ హైదరాబాద్
♦ స్వచ్ఛ, అవినీతి రహిత రాజకీయాలే లక్ష్యం ♦ నిర్దిష్ట ఎజెండాతోనే కూటమి ఏర్పాటు ♦ గ్రేటర్‌లోనూ డబ్బు రాజకీయమే... ♦ గూండాలు, కబ్జాదారులు పోటీలో ఉన్నారు. ♦ ఓటర్లు ఆలోచించి ఓటేయాలి ♦ లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ‘మార్పు’ కోసం అంటూ రాజకీయ రంగప్రవేశం చేసిన జయప్రకాష్ నారాయణ జేపీగా అందరికీ సుపరిచితులు. 1996లో ఐఏఎస్‌కు రాజీనామా చేసిన ఆయన సుపరిపాలన కోసం లోక్‌సత్తా ఉద్యమం ప్రారంభించారు. 2006లో లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా విస్తరించారు. ప్రస్తుతం ఆ పార్టీకి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గ్రేటర్ పరిధిలో అవినీతిని అంతం చేయాలని, ప్రజలకు మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. డబ్బు రాజకీయాలకు ఓటర్లు చెక్‌పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా, స్వచ్ఛ రాజకీయాల కోసమే మొదటిసారిగా వామపక్షాలతో కలిసి ‘వన్ హైదరాబాద్’ కూటమిని ఏర్పాటు చేశామంటున్న జేపీతో.... - సాక్షి, సిటీబ్యూరో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి ఎన్ని స్థానాల్లో గెలవబోతోంది? రాజకీయాలను మార్చటానికి ‘వన్ హైదరాబాద్ కూటమి’ని ఏర్పాటు చేశాం. నిర్ధిష్టమైన ఎజెండాతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇక్కడ గెలుపోటముల అంచనాలకు వెళ్లదలుచుకోలేదు. గెలవాలన్న ఆశతో.. సంప్రదాయ పార్టీలు కోట్లు ఖర్చు పెట్టి పోటీలో నిలుస్తున్నాయి. కానీ మేము అలా కాదు. నిజమైన ప్రత్యామ్నాయ విధానాలతో, ఎజెండాతో ప్రతి బస్తీలో జనాభాకు తగ్గట్టుగా అధికారాలు ప్రజల చేతిలో ఉండాలని కోరుకుంటున్నాం. స్థానికంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఎలా సాగింది. కొన్ని పార్టీల్లో కొందరు నాయకులు సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై మీరేమంటారు? రాజకీయం అంటే అధికారం అనుకుంటున్నారు. అధికారం అంటే...దోచుకోవటం, పైరవీలు చేసుకోవటంగా మారింది. ఎన్నికలు ఓటు వేసే వారి గురించి కాదు, పోటీ చేసే వారి కోసమనేలా మారింది వ్యవస్థ. ఎన్నికలు జాక్‌పాట్‌గా, వ్యాపారంగా మారాయి. అందుకే ...కార్పొరేటర్ అభ్యర్థి రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బు రాజకీయాలను ప్రజలే అంతం చేయాలి. వామపక్షాలతో కలిసి కూటమిగా లోక్‌సత్తా పోటీ చేయటానికి కారణమేమిటి? ఈ పార్టీల మధ్య భావ సారూప్యత ఉందంటారా? ఇది నిజమైన, నిజాయితీ కలిగిన కూటమి. అధికారం ప్రజల చేతిలో ఉండాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా, స్వచ్ఛ రాజకీయాలను ఆహ్వానిస్తున్నాయి. అభిప్రాయభేదాలు ఏ మాత్రం లేవు. అందువల్లనే సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎజెండా లేదు. నిర్ధిష్టమైన ఎజెండా, జనం సమస్యలపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లుతున్నది మా కూటమే. నగర ప్రజలు గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల్లో పార్టీల ఎన్నికల ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపిక ఎలా ఉందనుకుంటున్నారు? ఎన్నికల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఒక్కో డివిజన్లో రూ. 8 కోట్ల చొప్పున జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1200 కోట్లు ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. పైగా టికెట్లు కూడా గూండాలు, భూ కబ్జాదారులకు ఇచ్చారు. అలాంటి వారు ప్రజలకు మంచి పనులు ఏమి చేస్తారు? గెలిచిన తర్వాత దోచుకోవటమే పరమాధిగా పైరవీలు చేసుకుంటారు. వన్ హైదరాబాద్ కూటమి దీనికి పూర్తి భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా, స్వచ్ఛ రాజకీయాల కోసం పని చేస్తుంది. ప్రజలకు కనీస సౌకర్యాల కల్పించేందుకు కృషి చేస్తుంది. మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పార్కులు...ఒక్కటేమిటి 90 శాతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుంది. సామాన్యుడి చేతిలో అధికారముండాలి. పన్నుకట్టే వాడే ప్రభువు కావాలని కోరుకుంటున్నాం. మీ హయాంలో హైదరాబాద్‌కు ఏం చేశారు. ఇంకా ఎం చేయబోతున్నారు? హైదరాబాద్ నగరానికి కృష్ణా మూడవ దశ ద్వారా మంచినీరు రావటానికి కృషి చేశాను. దీనిపై అసెంబ్లీలో పోరాడి సాధించాను. కూకట్‌పల్లికి 8 ఎంజీడీల మంచి నీరు మాత్రమే సరఫరా అయ్యేది. ఈ నీటి సరఫరాను రెట్టింపు చేశాను. కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.2400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. పైప్లైన్ల కోసమే రూ. 700 కోట్లు ఖర్చు చేశాం. మెట్రో రైలు రాక సందర్భంగా అదనంగా ఏడు రహదారులకు ప్రణాళిక రూపొందించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించగలిగాను. ప్రతి పాఠశాలలో మాత్రశాలలు, మరుగుదొడ్లు, అదనపు గదులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అర్బన్ హెల్త్ సెంటర్లకు భవనాలతో పాటు, ప్రసూతి వసతులు కల్పించాలని కోరాం. నగరాభివృద్ధికి మేం ప్రత్యేకంగా దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాం. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ పాలన ఎలా ఉంది? మీరెన్ని మార్కులు వేస్తారు? ఇద్దరూ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు. ఇద్దరికీ మార్కులు ఏమి వేయను. కానీ పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. మోదీ ఆర్థిక వ్యవస్థ గట్టిపడేందుకు ప్రయత్నిస్తున్నారు. అవినీతి లేకుండా పారదర్శకంగా పనిచేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మంచి నినాదం. ఇది ఊరు,వాడ,పట్టణం, నగర స్థాయికి చేర్చాలి. నల్లగొండలో ఒక అమ్మాయి మరుగుదొడ్డి లేదని ఆత్మహత్య చేసుకోవటం తీవ్రంగా బాధించింది. కేసీఆర్ పూర్తిగా అధికార కేంద్రీకరణతో పనిచేస్తున్నారు. మంత్రులు, అధికారుల భాగస్వామ్యం ఏమీ ఉండడం లేదు. పనులు జనం దగ్గరికి వెళ్లటం లేదు. ప్రజల భాగస్వామ్యం గురించి మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఈ పద్ధతి మారితే మంచిదని నా అభిప్రాయం. మెరుగైన సమాజం కోసం...ఓటేద్దాం ‘గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లంతా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. కుల, మత, వర్గ విభేదాలు మరిచిపోయి మంచితనం, నిజాయితీ కలిగిన అభ్యర్థులకే ఓటు వేయాలి..’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం కమిషనర్ కార్యాలయంలో సొసైటీ ఫర్ స్మాల్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్యం కోసం రూపొందించిన కరపత్రాలు, డోర్ స్టిక్లర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గతంలోకంటే ఈసారి ఓటింగ్ శాతం తప్పనిసరిగా పెరగాలన్నారు. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఓటేయాలన్నారు. మచ్చలేని వ్యక్తులకే ఓటేయాలని లేకుంటే..ఐదేళ్లు నష్టపోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వినేష్రాజ్, ప్రధానకార్యదర్శి నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. - కవాడిగూడ -
యువత ఓటు విలువ తె లుసుకోవాలి
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చైతన్యపురి: యువత ఓటు విలువ తెలుసుకోవాలని లోక్‌సత్తా వ్యవ స్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. గడ్డిఅన్నారం డివిజన్ పీఅండ్‌టీ కాలనీ ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన ‘మీలో ఎవరు కార్పొరేటర్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని యువతతో ముచ్చటించారు. బడ్జెట్, మేయర్, స్థానిక సంస్థల అధికారాలు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై యువత ప్రశ్నలకు జేపీ సమాధానాలిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని, ప్రజా సమస్యలు పరిష్కరించే అభ్యర్థుల్ని ఎన్నుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా యువతకు క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా గ్రేటర్ అధ్యక్షుడు దోసపాటి రాము పాల్గొన్నారు. -
స్వతంత్ర న్యాయ కమిటీతో విచారణ జరపాలి: జేపీ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ప్రభుత్వ అధికారులతో కాకుండా స్వతంత్ర న్యాయ కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో కుల వివక్ష కారణంగా ఓ పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం భారతీయులంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం అని పేర్కొన్నారు. కాగా, కులం పేరు సూచించే తోకలను తీసేసుకోవాలని ఆయన యువతను కోరారు. కులం, మతం సంబంధం లేకుండా కులాంతర వివాహాలు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్
- అలా ఉంది సీఎం నిర్వాకం - చంద్రబాబుపై జయప్రకాశ్‌నారాయణ్ ధ్వజం విజయవాడ(గాంధీనగర్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వాకం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్’ అన్నట్లుగా ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ విమర్శించారు. రాజధాని శంకుస్థాపన విషయంలో డబ్బును లెక్క చేయకుండా గొప్ప వేడుక నిర్వహించామన్న సంతృప్తే మిగిలింది తప్ప, ఫలితం రాలేదని, శంకుస్థాపనకు వచ్చిన ప్రధానమంత్రిని ఏం కావాలో కోరకుండా 'సార్ సార్ మీ దయ మా ప్రాప్తం' అన్నట్లు చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఈవెంట్ మేనేజర్లా కాకుండా, ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఇకనైనా డ్రామాలు మానాలని, ప్రజాధనంతో ఆర్భాటాలు తగవని, వినోదాలు, విలాసాలు పక్కన పెట్టాలని హితవు పలికారు. రాష్ట్రంలో లక్షలకోట్ల ప్రజాధనం మూలుగుతున్నట్లు.. వేడుకకు పదుల కోట్లు, క్యాంప్ ఆఫీసుకు రూ.10 కోట్లు, విమానాలకు వందల కోట్లు ఖర్చు చేయడమేమిటని ఆయన నిలదీశారు. లోక్‌సత్తా పార్టీ సమావేశం ఆదివారం విజయవాడ రోటరీ చిల్డ్రన్స్ ట్రస్ట్ భవన్లో జరిగింది. సమావేశానంతరం జేపీ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంటే మంత్రులు, అధికారులకు రూ.40 లక్షలు, 50 లక్షల విలువ చేసే ఏసీ కార్లు అవసరమా? అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన నాటినుంచి కొంతకాలం పుష్కరాలు, అధికారుల విభజన, పట్టిసీమ, అమరావతి శంకుస్థాపన సంరంభాలు అంటూ కాలం వెళ్లదీశారని విమర్శించారు. -
బాబువన్నీ ప్రచార ఆర్భాటాలే: జేపీ
సాక్షి, హైదరాబాద్: మట్టి-నీరు, హోమాలు, యజ్ఞాలంటూ రూ. కోట్లాది ప్రజాధనం ఖర్చుచేసిన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. ఆప్ట్రాల్ లంచాలు గుంజే ప్రభుత్వ కార్యాలయాలు ఉండే రాజధాని నగరానికి ఇంత ఆర్భాటం అవసరమా? అని ప్రశ్నించారు. పార్టీ నేతలు పోతినేని హైమ, కూనంపూడి శ్రీనివాస్‌లతో కలిసి శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇంత ఆర్భాటంగా జరిగిన సభలోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, సాయం కావాలని బాబు అడగా లేదు, మోదీ ఇవ్వా లేదన్నారు. విభజన వల్ల ఏపీకి ఒరిగింది లేకపోయినా కనీసం చంద్రబాబు ప్రశ్నించే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. కేంద్రమిచ్చిన వంద.. వెయ్యి కోట్లే మహాభాగ్యం, మీ దయ వల్లే బతుకున్నాం అనే రీతిలో సీఎం అమరావతి వేదిక మీద మాట్లాడడాన్ని జయప్రకాశ్ నారాయణ తప్పుపట్టారు. ఐఐటీ, ఐఐఎం, వంటివి ప్రతి రాష్ట్రానికి ఇస్తున్నారని.. ఏపీ నగరాలకు అమృత్ పథకం పెట్టాం.. స్మార్ట్‌సిటీల సాయం అందిస్తాం.. 24 గంటల విద్యుత్తు ఇచ్చే రాష్ట్రాల్లో ఏపీని చేర్చాం వంటివి మభ్యపెట్టే మాటలని, ఇలాంటి సాయం అన్ని రాష్ట్రాలకూ అందుతోందని, తన మాటలు అబద్ధమైతే రుజువు చేయాలని సవాల్ చేశారు. బాబుకు రెండు సూటి ప్రశ్నలు రాయలసీమ, ఉత్తరాంధ్రలోని పరిస్థితులను చూపి రాష్ట్రానికి లేదంటే కనీసం ఆ ఏడు జిల్లాలకైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని మీరు కేంద్రాన్ని ఎప్పుడైనా కోరారా? అని జయప్రకాష్ ప్రశ్నించారు. పరిశ్రమలు పెరిగి యువతకు ఉపాధి వచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ కార్పోరేట్ ఆదాయ పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్నడైనా అడిగారా? అని ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీలో ప్రధానిని కలిసిన తరువాత చంద్రబాబే విలేకరుల సమావేశంలో తాను రాజధాని ప్రాంతానికి మాత్రమే పన్నురాయితీలు కోరినట్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రతిదీ ఓ తంతులా...: ప్రతిదీ ఒక తంతుగా, ఆర్భాటంగా మార్చడం తప్ప పరిపాలనపై శ్రద్ధ, పిల్లల భవిష్యత్ మీద ఆలోచన చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదని జయప్రకాశ్‌నారాయణ దుయ్యబట్టారు. ‘మొదట పుష్కరాల పేరుతో ఊదరగొట్టేశారు. పట్టిసీమ పూర్తయితే చాలు అందరి బతుకులు బాగుపడతాయన్న భ్రమ కలిగించారు. ఇప్పుడు అమరావతి నిర్మాణమే అన్నింటికీ పరిష్కారమని చెబుతున్నారు. రేపు ఇంకొకటి..’ అని ఎద్దేవా చేశారు. సభలో సామాన్యుల ఆకలి కేకలు వీవీఐపీల సేవలో తరించిన ప్రభుత్వం సాక్షి, విజయవాడ: అట్టహాసంగా సాగిన అమరావతి శంకుస్థాపనకు హాజరైన సామాన్య ప్రజలు చివరకు కడుపు మాడ్చుకొని తిరుగుముఖం పట్టారు. ఈ కార్యక్రమం కోసం వ్యక్తి స్థాయిని బట్టి కేటగిరీల వారీగా రూ. 150 నుంచి రూ. 1000 వరకు వివిధ ధరల్లో పలు రకాల మెనూతో కూడిన విందును సిద్ధం చేశారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లకుపైగా ఖర్చు పెట్టింది. మహిళా మంత్రులు గత మూడు రోజులుగా వంటశాల వద్ద ఉండి పర్యవేక్షించారు. అయినప్పటికీ సభకు హాజరైన వారిలో సగం మందికి మాత్రమే ఆహారం అందించగలిగారు. మిగిలిన వారంతా ఆకలితో వెనుదిరగాల్సి వచ్చింది. -
హోదా కావాలని బాబు అడగనేలేదు
⇒ వెనకబడిన ప్రాంతాలకు రాయితీలు కోరలేదు: జేపీ ⇒ ఆయన ఆర్భాటం అంతా రాజధాని కోసమే ⇒ స్పష్టంగా అడగకపోతే.. ఇచ్చేవాళ్లు ఎలా ఇస్తారు? ⇒ రెవెన్యూ లోటుపై ఇప్పటివరకూ ప్రకటించలేదు ⇒ హోదా సంజీవని కాకపోతే.. ఏది సంజీవనో వెంకయ్య, చంద్రబాబు చెప్పాలి ⇒ ప్యాకేజీతో ఆర్భాటమే తప్ప ప్రయోజనం ఉండదు ప్రత్యేక హోదా కల్పించమని కానీ, కనీసం వెనకబడిన ప్రాంతాలకు పన్ను రాయితీలు ప్రకటించమని గానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పటివరకు కేంద్రాన్ని అడగనే లేదని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. హోదా సంజీవని కాకపోతే.. ఇంకేది సంజీవనో చెప్పాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ప్యాకేజీ పేరిట ఇచ్చే డబ్బు పాలకుల ఆర్భాటాలకే తప్ప ప్రజలకు ఉపయోగపడదన్నారు. పరిశ్రమలకు పన్ను రాయితీల వల్ల కేంద్రం మీద ఒక్క పైసా భారం కూడా పడదని, పైగా అదనపు ఆదాయం వస్తుందని విశ్లేషించారు. ప్రత్యేక హోదా పేరు లేకపోయినా, హోదా వల్ల ఒనగూడే ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. - సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. దాన్ని కాస్తయినా సరిదిద్దడానికి పార్లమెంట్లో అప్పటి ప్రధాని ‘ప్రత్యేకహోదా’ హామీ ప్రాధాన్యం ఏమిటి? గతాన్ని తవ్వి విభజన గురించి మాట్లాడుకోవడం అనవసరం. రాష్ట్రాన్ని కోరుకున్న తెలంగాణ ప్రజల సాకారమయింది. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంది. కానీ ఏపీకి ఆ పరిస్థితి లేదు. ఏపీకి ప్రధానంగా రెండు సమస్యలున్నాయి. మొదటిది రెవెన్యూ లోటు. 2012-13 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం రూ. 7 వేల కోట్ల లోటు ఉంది. ఇది ఏటా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఎంత లోటు అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడం లేదు. ఇక రెండోది వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగానే పరిశ్రమలు వచ్చాయి. ఏపీలోని 13 జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పారిశ్రామికీకరణ జరగలేదు. ఫలితంగా ఉపాధి అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. రాయితీలిస్తే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి లభిస్తుంది. అందుకే ప్రత్యేక హోదాను నేనే తొలుత ప్రతిపాదించాను. ప్రత్యేక హోదా సంజీవని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... హోదా కల్పించడానికి కావాల్సిన అర్హతలు ఏపీకి లేవని కేంద్ర మంత్రులు... ఇతర రాష్ట్రాలూ అడుగుతున్నాయని నేతలు సాకులు చెబుతున్నారు కదా? మరి సంజీవని ఏదో వారినే చెప్పమనండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, యువతకు ఉపాధి లభించాలంటే ఏం చేస్తారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి. ఒరిస్సా కూడా ప్రత్యేకహోదా అడిగితే ఇవ్వమనండి, మనకు ఎలాంటి అభ్యంతరం లేదు. మనకు ఇవ్వమని మనం అడుగుతున్నాం. సాంకేతికంగా ప్రత్యేక హోదా ప్రకటన సాధ్యం కాకపోతే.... హోదా వల్ల ఒనగూడే ప్రయోజనాలు అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఏపీకి ఐదేళ్లలో రూ.23,500 కోట్లు రెవెన్యూలోటు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం చెప్పింది. అది కరెక్టా? కాదా? సరిపోతుందా? లేదా?అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెవెన్యూ లోటు ఎంత ఉందనే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ రాబడి, ఖర్చు ఎంత? లోటు ఎంత? శ్వేతపత్రం ప్రకటించాలని నేను చాలాసార్లు డిమాండ్ చేశాను. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా లోటును లెక్కగట్టి నిర్దిష్టమైన ప్రకటన చేయలేకపోయింది. అలా ఎందుకు చేయలేదో పాలకులకే తెలియాలి. ప్యాకేజీ వస్తే సరిపోతుంది. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చంద్రబాబు, వెంకయ్య అంటున్నారు. ప్యాకేజీ న్యాయం చేయగలదా? ఐఐటీ, ఐఐఎం, రాజధానికి సహాయం.. ఇవన్నీ విభజన చట్టంలో చెప్పినవే. అవన్నీ ఎలాగూ ఇవ్వాల్సిందే. బిహార్‌కు రూ. లక్ష కోట్లు ప్యాకేజీ ప్రకటించారు. అవన్నీ ఆ రాష్ట్రానికి ఇస్తున్నవే. ఇవ్వాల్సిన దానికి ఐదో పదో కలిపి ప్యాకేజీ అంటున్నారు. ఇవ్వాల్సిన దానికి అదనంగా ఎంత ఇచ్చినా సంతోషమే. కానీ రూ. లక్ష కోట్లు ఇస్తామంటే.. మనం బోల్తా పడకూడదు. ప్యాకేజీ పేరుతో నిధులిస్తే పాలకులు ఆర్భాటాలకు ఖర్చు పెట్టడం తప్ప ప్రజలకు అందేదేమీ ఉండదు. ప్రజలకు ఉపాధి కల్పించాలంటే పెట్టుబడులు, పరిశ్రమలు రావడం తప్ప మరో మార్గం లేదు. పన్ను రాయితీలు ఇస్తేనే పరిశ్రమలు వస్తాయి. ప్యాకేజీనే హోదాకు ప్రత్యామ్నాయంగా చూడొచ్చా? చేపల కూర వండిపెట్టడం కాదు.. చేపలు పట్టడం నేర్పాలి అని చైనా సామెత. ప్యాకేజీ అంటే చేపల కూర. పన్ను రాయితీలు.. చేపలు పట్టడానికి ఉపయోగపడే గాలం లాంటిది. గాలం ఇవ్వాలని అడగాలి తప్ప.. చేపలకూర వండిపెట్టమని అడగకూడదు. పన్ను రాయితీల సాధనకు ఏం చేయాలి? బాబు ఢిల్లీ వెళ్లి.. రాజధాని ప్రాంతానికి రాయితీలు ఇవ్వమని అడిగారే తప్ప.. రాష్ట్రానికి మొత్తం ఇవ్వమని కానీ, కనీసం వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వమని గాని అడగనే లేదు. ఇది అన్యాయం. ఆర్భాటమంతా రాజ ధాని కోసమేనా! అడిగేవారు స్పష్టంగా అడగపోతే.. ఇచ్చేవాళ్లు ఎలా ఇస్తారు? ఉపాధి కల్పన కోసం నిర్దిష్టంగా పన్ను రాయితీలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అడిగిన సందర్భమే లేదు. ఉపాధి కల్పించడానికి ఉపయోగపడే ప్రత్యేక హోదా(పన్ను రాయితీలు) ఇవ్వడం వల్ల కేంద్రం మీద ఎంత భారం ఉంటుంది? ప్రత్యేక హోదా కానీ.. పేరు ఇంకేదైనా కానివ్వండి. పన్ను రాయితీలు కల్పించమని అడుగుతున్నాం. పన్ను రాయితీలు ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క పైసా భారం కూడా పడదు. కొత్త పరిశ్రమల ఏర్పాటు వల్ల అదనంగా వచ్చే పన్నులు పదేళ్ల పాటు రావు. అంతే తప్ప వస్తున్న ఆదాయానికి నష్టం లేదు. ఉపాధి పెరిగితే, ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతుంది. కేంద్రం సాంకేతిక కారణాలు చూపిస్తూ హోదా ప్రకటన వాయిదా వస్తే నష్టం తీవ్రంగా ఉంటుంది కదా? రాష్ట్ర శాసనసభ అనుమతి లేకున్నా, ఒక ప్రాం త ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్రాన్ని విభజిం చింది. పరిశ్రమలన్నీ హైదరాబాద్ పరిసరాల్లోనే ఉన్నాయని అంగీకరించింది. ఏపీలో పరి శ్రమల ఏర్పాటుకు అనుకూలంగా రాయితీలు ఇస్తామనీ ప్రకటించింది. కానీ ఇప్పుడు వెనక్కి పోతోంది. వెనకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని దేశంలో చాలా రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక రాయితీలు ఇచ్చింది. రాష్ట్రమంతా కలిపి చూస్తే వెనకబాటుతనం పెద్దగా కనిపిం చకపోవచ్చు. కానీ రాయలసీమలోని 4, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో వెనకబాటుతనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ జిల్లాలకు ప్రత్యేక రాయితీలు వెంటనే ప్రకటించాలి. ఆ జిల్లాలో పెట్టుబడులు వస్తే.. రాష్ట్రమే అభివృద్ధి చెందుతుంది. పన్ను రాయితీల గడువు ముగిసినా అభివృద్ధి కొనసాగుతుందా? ఏదో పెట్టుబడి రాయితీ కింద రూ. 20 లక్షల మినహాయింపు, రవాణా రాయితీ కల్పిస్తామంటే సరిపోదు. కార్పొరేట్ ఆదాయపు పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ నూటికి నూరు శాతం మినహాయింపు ఇవ్వాలి. అలా ఇస్తే.. ఇక్కడ తయారయ్యే వస్తువు ఖరీదు కనీసం 30 శాతం తగ్గుతుంది. అంటే దేశంలో ఎక్కడైనా ఒక వస్తువును తయారు చేయడానికి 100 ఖర్చయితే, రాయితీలున్న రాష్ట్రంలో రూ.70కే తయారు చేయవచ్చు. తక్కువ ధరలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటే పరిశ్రమలు ఆటోమేటిక్‌గా వస్తాయి. పదేళ్లు రాయితీలు ఉండి పారిశ్రామికీకరణ జరిగితే.. తర్వాత అభివృద్ధి కొనసాగుతుంది. -
'సుప్రీం తీర్పును ప్రజలు, పార్లమెంటు తిరస్కరించాలి'
లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ సాక్షి, హైదరాబాద్: జాతీయ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజలు, పార్లమెంట్ నిర్ద్వందంగా తిరస్కరించాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్‌జేఏసీ ఏర్పాటుకు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన 99వ రాజ్యాంగ సవరణను కొట్టివేస్తూ.. జడ్జీలను జడ్జీలే నియమించుకునే పాత కొలీజియం వ్యవస్థనే కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు. దేశ చరిత్రలోనే కీలక ఘట్టమైన ఈ తీర్పుపై పార్లమెంటు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, లోతైన చర్చ జరపాలన్నారు. న్యాయమూర్తులు స్వయంభువులు, దైవదూతలు, చక్రవర్తులు కాదని పేర్కొన్నారు. జడ్జీలు రాజ్యాంగ, ప్రజాస్వామ్య సూత్రాలకు లోబడి పనిచేయాల్సిందేనని తెలిపారు. రాష్ట్రపతి సహా అందరి మద్దతు కూడగడతా.. శనివారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి సహా అందరినీ కలుస్తానని, సుప్రీంకోర్టు తాజా తీర్పుపై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తానని జయప్రకాశ్ నారాయణ చెప్పారు. పార్లమెంటు అత్యవసరంగా సమావేశమై, కనీసం వారం రోజులపాటైనా దీనిపై చర్చించాలన్నారు. దేశంలో రాజకీయాలు దిగజారడమే ఈ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేందుకు కారణమన్న విషయాన్ని పార్లమెంటు గుర్తించాలని సూచించారు. -
వాళ్లే 'సుప్రీం'లా... అదెలా?
హైదరాబాద్ : న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును... లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటు, ప్రజల భాగస్వామ్యం లేకుండా న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దశాబ్దకాలంగా జాతీయ న్యాయ నియామక వ్యవస్థను సమర్ధించిన వారిలో తానూ ఒకడినని జేపీ శుక్రవారమిక్కడ అన్నారు. కాగా జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టిపారేసింది. పాత పద్ధతిలోని కొలీజియం ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కొలీజియం వ్యవస్థను పక్కకు పెట్టి నేషనల్ జ్యూడిషియల్ కమిషన్ తీసుకొచ్చింది. అయితే, ఇందులో రాజకీయ జోక్యం ఎక్కువవుతోందని కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కీలక తీర్పును వెల్లడించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వ్యవస్థను కొట్టి పారేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. -
వాళ్లే 'సుప్రీం'లా... అదెలా?
-
బాబు పై జేసీ ఫైర్
-
అమెరికా అధ్యక్షులు కూడా అంత చేయరేమో?
విజయనగరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లోక్సత్త అధినేత జయప్రకాష్ నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు అమరావతి తప్ప...ఏమీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం కోసం ఇంత రాద్ధాంతం అవసరమా అని జేపీ బుధవారమిక్కడ ప్రశ్నించారు. గతంలో అన్నింటిని హైదరాబాద్‌లోనే పెట్టి...మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఇప్పుడూ కూడా చంద్రబాబు అలానే చేస్తున్నారని జేపీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు విమాన ప్రయాణాలకు చేసిన ఖర్చు అమెరికా అధ్యక్షులు కూడా చేయరేమో అని, హుద్‌హుద్ నుంచి జనం కోలుకుంటుంటే సంబరాలు చేస్తారా? అని సూటిగా ప్రశ్నలు సంధించారు. ఢిల్లీకెళ్లిన చంద్రబాబు....ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి కాకుండా రాయితీల గురించి మాట్లాడుతున్నారని జేపీ ధ్వజమెత్తారు. -
'కులతత్వానికి చిరునామా ఏపీ'
సాక్షి, హైదరాబాద్: కులతత్వానికి, అధికార దుర్వినియోగానికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారిందని లోక్‌సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. ర్యాగింగ్ పేరుతో క్రూర వేధింపుల బారిన పడి నాగార్జున యూన్సివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటనతో ప్రజలందరూ కదలాలని, ఈ ఉదంతంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. కులం, మనం - వాళ్లు అనే విష సంస్కృతిలో యూనివర్సిటీలు, విద్యార్థులు కూరుకుపోవడం, వివక్షల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం సిగ్గుచేటని, ఇలాంటి పరిస్థితులు తలెత్తడం అత్యంత బాధాకరమని జేపీ అభిప్రాయపడ్డారు. ఓట్ల కొనుగోలు, కులం చుట్టూ తిరిగే ఆటవిక రాజకీయాలు సమాజాన్ని విషతుల్యం చేశాయని, కుల వివక్ష వదిలించేందుకు భారీ ప్రజా చైతన్య కార్యక్రమాల అవసంరం ఉన్నదని పేర్కొన్నారు. -
'రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్రంలో కుల రాజకీయాలే అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇస్తున్నవారికి మరోచోట భూములు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వానికి సూచించారు. -
మోసపూరిత హామీలిచ్చిన బాబు: జేపీ
గుంటూరు: ఎన్నికల వేళ మోసపూరితమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలులో పూర్తి నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం లోక్‌సత్తా 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు బాండ్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు ఆ బాండ్లను నగదుగా మార్చుకునేవరకు ఆయన పదవిలో ఉంటారో.. లేదోనని ఎద్దేవా చేశారు. రైతుల కళ్ల నీళ్లు తుడిచేందుకే ఈ బాండ్ల పంపకమని వ్యాఖ్యానించారు. అవినీతి నిర్మూలనలో అన్నాహజారేకు అన్నగా చెప్పుకున్న బాబు ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చుచేసి అధికారంలోకి వచ్చారనీ, ఇప్పుడెందుకు అవినీతి గురించి ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. దేశంలో రాజకీయ మార్పు కోసం లోక్‌సత్తా పోరాడుతోందన్నారు. కులం, ధనం, ప్రాంతీయతలను ముడిపెట్టుకుంటూ రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, వాటికి స్వస్తి పలకడానికి ప్రాణం ఉన్నంత వరకు ఉద్యమిస్తానని చెప్పారు. రాజధాని నిర్మాణం విషయంలో మంగళగిరి, తుళ్ళూరు ప్రజలను ప్రభుత్వం అయోమయానికి గురి చేస్తోందని మండిపడ్డారు. రాజధానికి 2 వేల ఎకరాలు ఉంటే సరిపోతుందని, దానిని ఆసరా చేసుకుని రైతుల వద్ద ఎక్కువ భూములు తీసుకుని అనుయాయులు, బంధువులకు అప్పగించేలా మంత్రులు కుయుక్తులు చేస్తున్నారని విమర్శించారు. లోక్‌సత్తా పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. -
రాజధానికి రెండువేల ఎకరాలు చాలు: జేపీ
గుంటూరు : రాజధాని పేరుతో అడ్డగోలుగా భూములు సేకరిస్తే సహించేది లేదని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హెచ్చరించారు. రాజధాని కోసం రెండు, మూడువేల ఎకరాలు సరిపోతాయని, ముప్పై వేల ఎకరాలంటూ భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వాళ్లను పెంచి పోషించాలనుకుంటున్నారా అని ఆయన శనివారమిక్కడ ప్రశ్నించారు. లోక్‌సత్తా పార్టీ 8వ వార్షికోత్సవ సభలో జయప్రకాష్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ రైతుల దగ్గర తీసుకున్న భూమిలో అభివృద్ధి చేసిన సగం తిరిగి వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన పనికిమాలిన హామీలతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని జయప్రకాష్ నారాయణ విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో రైతులను నిలువునా ముంచారని ఆయన వ్యాఖ్యానించారు. -
నోరు విప్పిన జయప్రకాశ్ నారాయణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై చాలా కాలం తరువాత లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ నోరు విప్పారు. ప్రభుత్వ నిధులను ఖర్చుపెట్టే తీరును తప్పుపట్టారు. 30 కోట్ల రూపాయలతో ఆర్భాటంగా ప్రమాణం చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? అని అడిగారు. ఆర్థిక, పాలన కేంద్రీకరణ జాతి ప్రగతికి హానికరం అని హెచ్చరించారు. తెలుగుజాతి విడిపోవడానికి ఇదే కారణం అని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు అవసరమంటూ మోసపూరితమైన కోరికలు కోరడం సరికాదని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ** -
అగ్రగామి రాష్ట్రాన్ని విడగొట్టి దిగజార్చారు
నాయుడుపేటటౌన్: దేశంలో అగ్రగామిగా ఎదుగుతున్న ఆంధ్రరాష్ట్రాన్ని విడగొట్టి దిగజార్చే పరిస్థితిని ఢిల్లీ పెద్దలు తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నా రు. నాయుడుపేటలో ఓడూరు నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం అప్పటి ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టినా వారు అనుకున్న లక్ష్యంనెరవేరలేదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ స్వయంగా అంగీకరించారన్నారు. టీడీపీ పాలనలో దౌర్జన్యాలు : టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, దుర్మార్గాలు పెరుగుతున్నాయని ఎంపీ ఘాటుగా విమర్శించారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శాంతిభద్రతలపై చర్చించాలని అసెంబ్లీలో కోరగా తాతముత్తాతల కాలంలో జరిగిన ఘటనలను ప్రస్తావించి పక్కదారి మళ్లించడం పద్ధతి కాదన్నారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చకుంటే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని ఎంపీ మేకపాటి హెచ్చరించారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్రానికి సహకరిస్తాం : ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంటుందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తే వాటిని తప్పక అడ్డుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారన్నారు. ఎంపీ వెంట పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మేరిగ మురళీధర్, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యవర్గ సభ్యుడు ఓడూరు గిరిధర్‌రెడ్డి, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా స్టీరింగ్ క మిటీ సభ్యులు వెంకటేశ్వర్లురెడ్డి, నాయకులు చేవూరు వెంకటరామిరెడ్డి, ఓడూరు బాలకృష్ణరెడ్డి ఉన్నారు. పథకాలన్నీ అమలైతేనే దేశాభివృద్ధి : సూళ్లూరుపేట: స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ ప్రకటించిన పథకాలన్నింటినీ అమలు చేస్తే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడవచ్చని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా గత 20 ఏళ్లుగా వింటున్నామన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా చూడాలంటే తాను ప్రకటించిన పథకాలను ప్రధాని అమలు చేయాలన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు దబ్బల రాజారెడ్డి కుమారుడి నిశ్చితార్థానికి రాలేకపోవడంతో మంగళవారం ఎంపీ పట్టణానికి వచ్చి దబ్బలను పలకరించారు. దబ్బల రాజారెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని ప్రకటించిన పథకాల్లో ఈ నెల 28న ప్రారంభించనున్న జన-ధన యోజన పథకం దేశంలో మారుమూల ప్రాంతాల వారికి బ్యాంక్ ఖాతా తెరుస్తారన్నారు. ఈ పథకం మంచిదన్నారు. వచ్చే నెల 11న జనతాపార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఎంపీ తమ నియోజకవర్గ పరిధిలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. 2019 నాటికి భారతదేశంలో కేరళ రాష్ర్ట తరహాలో ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి నిర్మాణంతో పాటు తాగునీటి వసతిని ఏర్పాటు చేయడానికి కూడా ఒక పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పనులన్నీ 2019 నాటికి పూర్తయితే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ షమీ మ్, వార్డు కౌన్సిలర్లు పేర్నాటి దశయ్య, కలిశెట్టి బాబు, ఉమ్మిటి జానకీరామ్, ఇలుపూరు సుధాకర్, నలుబోయిన రాజసులోచనమ్మ, కళత్తూరు శేఖర్‌రెడ్డి, గండవరం సురేష్‌రెడ్డి, గోగుల తిరుపాల్, ముత్తుకూరు రవి పాల్గొన్నారు. -
ఈల మోగలేదు...గోల చేయలేదు
నూతన రాజకీయాలు, నీతివంతమైన ఆదర్శ రాజకీయాలు.. భారత రాజ్యాంగం .... ఇది లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ నిత్యం చెప్పే మాటలు. ప్రస్తుతమున్న రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ప్రజల చేతికి అధికారం రావాలి. రాజకీయాలంటే ఐదేళ్లకోసారి అధికార మార్పిడి కాదంటూ ఐదేళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చదువుతున్న యువతతో పాటు, పట్టణ, నగర ఓటర్లలో ఆలోచనలు రేకెత్తించారు. నూతన విధానాల పేరిట వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఐదేళ్లు తిరిగిచూసేసరికి ఇప్పుడు లోక్ సత్తా అధినేత ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన విషయం స్పష్టమైంది. జేపీ మాటల్లో చెప్పిన ఆదర్శాలను ఆచరణలో నిరూపించుకోలేక రాజకీయాల్లో నామమాత్ర పాత్రకు పరిమితమయ్యారు. ఐదేళ్ల కిందట కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ నియోజకవర్గ ప్రజలకు సైతం తాను చేయదల్చుకున్న నూతన రాజకీయాలేమిటో, అభివృద్ది ఏమిటో చూపించలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర విభజన మొదలుకొని.. అనేక అంశాల్లో జేపీ అనుసరించిన విధానం కూడా ఫక్తు రాజకీయ నాయకుడిలా పూటకో మాట తరహాలో ఉండటం.. ఆయనను అభిమానించినవారిలో సైతం వ్యతిరేకత వచ్చేందుకు కారణమైంది. ఇక సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే.. జేపీ నేతృత్వంలోని లోక్ సత్తా పార్టీ మిగతా రాజకీయ పార్టీల్లాగే వ్యవహరించిందన్న విషయం స్పష్టమైంది. లోక్ సత్తాలో జేపీ తర్వాత పేరున్న నేత కటారి శ్రీనివాస్. ఆ తర్వాత చెప్పుకోదగిన నేతలెవరూ లేరు. ఆపార్టీలో మిగతా నేతల పేర్లు కూడా జనాలకు చేరనేలేదు. గత ఎన్నికల్లో లోక్ సత్తా గట్టి పోటీ ఇవ్వలేకపోయినప్పటికీ చాలాచోట్ల ఓట్లను చీల్చింది. హైదరాబాద్‌లో పలుచోట్ల బీజేపీ కన్నా మెరుగ్గా ఉండి నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ....ఈల వేసి గోల చేసిన లోక్‌సత్తా ఈసారి మాత్రం ఎలాంటి సత్తా చూపలేకపోయింది. గత ఎన్నికల్లో వచ్చిన ఒక్క సీటును కూడా ఈసారి నిలుపుకోలేకపోయింది. ఆయన ఈ సారి లోక్ సభ సీటకు పోటీ చేసి 1,47,458 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మల్కాజిగిరి ఎంపీ స్థానానికి మారిన జేపీ.. అక్కడ గెలుపు కోసం సినీ ప్రముఖుల్ని వాడుకున్నారు. అంతే కాకుండా మోడీ బొమ్మను ప్రచారంలో ఉపయోగించుకోవటంతో పాటు పవన్ కల్యాణ్ మద్దతు కోసం పాకులాడినా ఫలితం లేకపోయింది. ఇంత చేసి.. బీజేపీతో అంటకాగినా జేపీ సత్తా చూపలేక మల్కాజ్‌గిరిలో సోదిలో లేకుండా పోయారు. ఇవన్నీ ఇలా ఉండగా జేపీ నీతిమంతమైన రాజకీయాల గుట్టు విప్పారు ఆయన పార్టీ ఢిల్లీ కన్వీనర్ ఒకాయన. అంతర్గతంగా రాజకీయ నాయకులతో కుమ్మక్కు కావడం.. పారిశ్రామికవేత్తల కోసం సెటిల్మెంట్లు చేయడం, తన మేధావితనాన్ని అంత ఉపయోగించుకొని ఢిల్లీ స్థాయిలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలతో లాబీయింగ్ జరుపడం ద్వారా లోలోపల చీకటి వ్యవహారాలు చక్కదిద్దడంలో దిట్ట జేపీ అని ఆయన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో కుండబద్దలు కొట్టడం సంచలనం సృష్టించింది. -
నేటినుంచి సీమాంధ్రలో జేపీ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఇక సీమాంధ్ర జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. గురువారం నుంచి ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారం ప్రారంభిస్తారని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, కాకినాడలో, 2న విజయవాడలో, 3న గుంటూరు, ఒంగోలులో, 4న నెల్లూరు, తిరుపతిలో, 5న నంద్యాల, కర్నూలులో ప్రచారం చేస్తారని తెలిపింది. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ డీవీవీఎస్ వర్మలు కూడా వివిధ జిల్లాల్లో రోడ్‌షోల ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని ఆ ప్రకటనలో తెలియజేశారు. -
సుజనాచౌదరిపై పత్రికల్లో వచ్చిన వార్తలు చూడలేదు: జేపీ
హైదరాబాద్: టైటానియం కుంభకోణంలో పాత్ర కలిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి ఆస్తులు జప్తు చేయాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... టైటానియం ఖనిజ వనరుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు 18.5 మిలియన్ డాలర్ల బేరసారాలు జరిపారని పత్రికల్లో వచ్చిన వార్తలు చదివినట్లు చెప్పారు. కేవీపీతో పాటు మరికొందరిపై దర్యాప్తు సంస్థలు వేగంగా విచారణ చేపట్టాలని కోరారు. కేవీపీపై పత్రికల్లో వచ్చిన వార్తలు చదివినట్లు చెప్పిన జేపీ... చంద్రబాబు ఆత్మబంధువులా వ్యవహరించే సుజనాచౌదరిపై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును పత్రికల్లో చదవలేదన్నారు. మారిషస్ బ్యాంక్‌కు దాదాపు రూ.102 కోట్లు కుచ్చుపోటీ పెట్టిన కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన వార్తలు తాను చదివే పత్రికల్లో రాలేదని జేపీ చెప్పారు. -
ఐఏఎస్... ఐపీఎస్... ఓ ప్రొఫెసర్!
ఎన్నికలకు మరో వారం రోజులు సమయం మాత్రమే ఉండడంతో తెలంగాణలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. పోలింగ్‌కు సమయం దగ్గరపడడంతో ఇప్పుడు అందరి దృష్టి 'హాట్ సీటు'పై నెలకొంది. మల్కాజ్గిరి లోకసభ స్థానంపై స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల వారు దృష్టి సారించారు. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారో ఇతమిత్థంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యావంతులు పోటీ పడుతుండడంతో అమితాసక్తి నెలకొంది. ఒక ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్ ప్రత్యర్థులుగా బరిలో ఉండడంతో మల్కాజ్గిరి ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర డీజీపీగా పదవీవిరమణ చేసిన దినేష్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ లోక్‌సత్తా తరపున పోటీకి దిగారు. జర్నలిజం ప్రొఫెసర్ డాక్టర్ కె. నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎవరి విజయంపై వారు దీమాగా ఉన్నారు. కిందిస్థాయి నాయకులను కలుపుకుని దినేష్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైఎస్ జగన్, షర్మిల ప్రచారం తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. షర్మిల ఇప్పటికే ప్రచారం పూర్తిచేయగా, జగన్ త్వరలో ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. జయప్రకాష్ నారాయణ, నాగేశ్వర్ విద్యావంతుల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఈ ముగ్గురిని ప్రజలను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. -
సరైన నాయకున్ని ఎన్నుకోండి: జయప్రకాష్‌నారాయణ
లోక్‌సత్తా అధినేత, మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి జయప్రకాష్‌నారాయణ శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: సమాజం బాగుపడాలంటే సరైన నాయకున్ని ఎన్నుకోవాలని లోక్‌సత్తా అధినేత, మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి జయప్రకాష్‌నారాయణ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్యం, డబ్బుకు అమ్ముడు పోయి ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. 50 కోట్లతో లోక్‌సభ టికెట్ కొని, 100 కోట్లు ఖర్చుపెట్టి గెలుపొందితే ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఎక్కడ చూచినా అవినీతి, కుంభకోణాలే కనిపిస్తున్నాయన్నారు. రైతులకు మద్దతు ధర కలిపించడానికి, ఆహార ధాన్యాలు విదేశాలకు ఎగుమతి కావటానికి ఎంతగానో కృషి చేశానన్నారు. ప్రతి యేడాదికి కోటిన్నర మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా కేవలం 10, 15 లక్షల మందికే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విదేశీ ఉత్పత్తుల పై మన దేశం ఆధారపడుతుందన్నారు. పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఇంతకు ముందు కూకట్పల్లి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ఒక్కసారి అవకాశం కలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాన్నారు. మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థి లింగమూర్తి మాట్లాడుతూ... నిస్వార్థంగా ఓటు వేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాల్లో నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో లోక్‌సత్తానాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆరోపణలపై విచారణకు సిద్ధం: జేపీ
అనురాగ్ కేజ్రీవాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్టు వెల్లడి హైదరాబాద్: అనురాగ్ కేజ్రీవాల్‌పై స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో.. లోక్‌సత్తా పార్టీ మీద వచ్చిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ పార్టీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్‌ది క్షమార్హం కాని ప్రవర్తన అని పేర్కొంటూ.. అందుకుగాను ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించామని వెల్లడించారు. లోక్‌సత్తాపార్టీ ఇంత బాధ్యతాయుతంగా స్పందించినా మీడియాలో ఒక వర్గం, చానళ్లు లోక్‌సత్తా ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో వ్యవహరించాయంటూ జేపీ తప్పుపట్టారు. ఇదిలా ఉండగా లోక్‌సత్తా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురేంద్ర శ్రీవాస్తవ ఆదివారం ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించిన అనురాగ్ కేజ్రీవాల్‌ను తక్షణం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్టు తెలిపారు. పార్టీ ఢిల్లీ శాఖ కమిటీని రద్దు చేసి.. కొత్తగా ఐదుగురు సభ్యులతో తాత్కాలిక ప్యానల్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. -
బాబు జేబులో జేపీ
బాబు, జేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం టీడీపీ, బీజేపీ ఓడిపోవద్దంటూ.. జేపీ మమ్మల్ని పోటీ నుంచి తప్పించారు జేపీ కోసమే బాబు రేవంత్‌రెడ్డిని మల్కాజ్గిరి బరిలో నిలపలేదు గెలిస్తే.. బీజేపీకి మద్దతిచ్చి కేంద్రమంత్రి అవ్వాలని జేపీ ఆశ సిద్ధాంతాలు వదిలి పొత్తుల కోసం వెంపర్లాడారు లోక్‌సత్తా రాష్ట్ర కార్యదర్శి ఏనుగు రామారావు ఆరోపణ ఎలక్షన్ సెల్ తెలంగాణలో లోక్‌సత్తా పార్టీ నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్గిరి నుంచి ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ, చేవెళ్ల నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏనుగు రామారావు, సికింద్రాబాద్ నుంచి పి.రోహిత్‌కుమార్, మహబూబాబాద్ నుంచి రెడ్యానాయక్‌లను పార్టీ అభ్యర్థులుగా ఈ నెల ఆరో తేదీన ప్రకటించింది. జయప్రకాశ్ నారాయణ మాత్రం మల్కాజ్గిరి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. మిగతా ముగ్గురు నామినేషన్లు వేసేందుకు సిద్ధం కాగా చివరి క్షణంలో జేపీ వారికి బీ ఫారాలు ఇవ్వలేదు. ‘మనం ఆ మూడు చోట్ల పోటీ చేస్తే ఓట్లు చీలి టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఓడిపోతారు. అందువల్ల మీరు పోటీ చేయొద్ద’ని అభ్యర్థులకు నచ్చజెప్పి తానుమాత్రం లోక్‌సభ బరిలో నిలిచారు. ఈ మొత్తం తతంగం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జయప్రకాశ్ నారాయణల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ఉందని లోక్‌సత్తా పార్టీ నుంచి చేవెళ్ల టిక్కెట్టు లభించి బీఫారం పొందని ఏనుగు రామారావు ఆరోపిస్తున్నారు. ఆయన ‘సాక్షి’కిచ్చిన ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లోనే..! ఫోనోచ్చింది.. ఒప్పందం కుదిరింది నన్ను చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా ఈ నెల ఆరున అధికారికంగా ప్రకటించారు. 9వ తేదీ నామినేషన్లకు చివరి గడువు కావడంతో 8వ తేదీ రాత్రి బీ-ఫారం కోసం పార్టీ ఆఫీసుకు వెళ్లాను. ఎంత రాత్రయినా బీ-ఫారం ఇవ్వలేదు.చివరకు మనం ఆ మూడుచోట్లా (మల్కాజిగిరి మినహా) పోటీ చేయడంలేదంటూ జేపీ చావు కబురు చల్లగా చెప్పారు. లోక్‌సత్తా పోటీలో ఉంటే ఓట్లు చీలి టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఓడిపోతారనే కుంటి సాకు చెప్పారు. ‘మల్కాజిగిరిలో కూడా టీడీపీ అభ్యర్ధి రంగంలో ఉన్నాడు కదా. టీడీపీ కోసం మీరు కూడా తప్పుకోవాలి కదా’ అంటే సమాధానం లేదు. వాస్తవానికి ఆ రోజు జరిగిందేంటంటే.. జేపీకి ఆ రోజు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో ఏదో మాట్లాడారు. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘చేవెళ్లలో దేవేందర్‌గౌడ్ కొడుకు వీరేంద్రగౌడ్ టీడీపీ తరపున పోటీ చేస్తున్నాడు. ఏనుగు రామారావు పోటీ చేస్తే వీరేంద్రగౌడ్ గెలవడు.. అందువల్ల ఏనుగు రామారావును బరిలోకి దింపొద్ద’ని చంద్రబాబు చెప్పడం వల్లే నాకు బీ ఫామ్ ఇవ్వలేదు. దేవేందర్‌గౌడ్ కొడుకు కోసం చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకొని నన్ను తప్పించారు. చేవెళ్లలో నేను పోటీ చేస్తే కనీసం లక్ష ఓట్లు వస్తాయి. ఇప్పుడు నేను పోటీ నుంచి తప్పుకుంటే.. ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని అమ్ముడుపోయానని ప్రజలు పొరబడే అవకాశం ఉంది. కాబట్టి జేపీ బహిరంగంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. జేపీ మల్కాజిగిరీలో పోటీలో ఉంటే వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను. లోక్‌సత్తా స్థాయిని దిగజార్చారు మద్యం, డబ్బులు పంచొద్దు.. నేరచరితులకు టిక్కెట్లు ఇవ్వొద్దనేది లోక్‌సత్తా విధానం. అలా చేసే పార్టీలకు మద్దతు ఇవ్వొద్దనేది నిబంధన. టీడీపీ, బీజేపీలతో పొత్తుకోసం వెంపర్లాడి.. లోక్‌సత్తా స్థాయిని జేపీ దిగజార్చారు. వామపక్షాలతో పొత్తు అన్నాడు. కానీ వాళ్ల వల్ల తనకు ప్రయోజనం లేదనుకొని టీడీపీ, బీజేపీ పంచన చేరాడు. ఆమ్ఆద్మీతో పొత్తు అన్నాడు. కానీ వాళ్లు విలీనం అన్నారు. దీంతో అహం దెబ్బతిని దానికి దూరంగా ఉన్నాడు. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి పార్టీని ఎదగనీయడం లేదు. తనకు తాను మేధావినని అనకుంటూ.. పార్టీలోని ఇతర నాయకులకు విలువ ఇవ్వడు. ప్రైవేటు ఎస్టేట్‌లా పార్టీని తయారుచేశాడు. అవినీతిపరులతో చేతులు చంద్రబాబు-జయప్రకాశ్ నారాయణ ఇద్దరూ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ఇష్టపడ్డా మల్కాజిగిరి నుంచి ఆయనను చంద్రబాబు నిలబెట్టలేదు. జేపీతో ఒప్పందం చేసుకవడం వల్లనే బలమైన రేవంత్‌రెడ్డిని తప్పించి ఈ మధ్యే టీడీపీలో చేరిన మల్లారెడ్డికి టిక్కెట్టు ఇచ్చారు. బలహీన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా జేపీకి మార్గం సుగమం చేశారు. అందుకు కృతజ్ఞతగా జేపీ మమ్మల్ని బలి చేశాడు. ఒకవేళ గెలిస్తే బీజేపీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి పొందొచ్చన్నది జేపీ దురాలోచన. వయస్సు మీద పడుతుండటంతో ఆయనకు పదవీ వ్యామోహం పెరిగింది. అంతేకాదు తన స్వప్రయోజనాల కోసం కటారి శ్రీనివాసరావును ఈసారి కూకట్పల్లి నుంచి పోటీ చేయిస్తున్నారు. ఎందుకంటే ఆ అసెంబ్లీ స్థానం మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఓట్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆయన్ను ఇక్కడి నుంచి నిలబెట్టారు. జేపీలాంటి దేశద్రోహులకు బుద్ధి చెప్పాలి. జేపీ మాయమాటలకు ఎందరో బలయ్యారు. అవినీతిపరులు, నేరచరిత్రులకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి ఇప్పుడు వాళ్లతోనే చేతులు కలుపుతున్నార -
ఎవరికీ పట్టని లోక్‌సత్తా !
* నిర్వేదంలో జేపీ సాక్షి, హైదరాబాద్: జెండా, ఎజెండా పక్కనబెట్టినా లోక్‌సత్తా పార్టీకి ఫలితం దక్కలేదు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో కలిసి ఎన్నికల బరిలో దిగాలని కలలుగన్న లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు భంగపాటు ఎదురైంది. ఈసారి ఎలాగైనా టీడీపీ, బీజేపీలతో కలిసి మహాకూటమిగా జట్టుకట్టి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన భావించారు. అందుకనుగుణంగా కొంతకాలంగా ముమ్మర ప్రయత్నాలు చేశారు. బీజేపీని మచ్చిక చేసుకోవాలని అవకాశం వచ్చినప్పుడల్లా ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఆకాశానికెత్తారు. అయినా కమలదళం నుంచి పిలుపు రాలేదు సరికదా, లోక్‌సత్తా నేతలే ఆ పార్టీ తలుపు తట్టినా పట్టించుకోలేదట. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబును సంప్రతించడం కోసం వారి సామాజిక వర్గానికి చెందిన బడాబాబులతో విశ్వప్రయత్నాలు చేయించారు. చివరికి ఒక పత్రికాధినేత స్వయంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం నెరిపారు. అయితే, చంద్రబాబు చెప్పిన అభిప్రాయం విని మధ్యవర్తులు సహా జేపీ కూడా కంగుతిన్నట్టు తెలిసింది. ‘ఇప్పటికే బీజేపీతో పొత్తుతో తలబొప్పి కడుతోంది. మధ్యలో మీరు దూరితే ఇంకేమైనా ఉందా’ అని చంద్రబాబు అనడంతో జేపీ నివ్వెరపోయినట్టు సమాచారం. -
లోక్‌సత్తా రెండో జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో కలసి వెళ్లాలని భావించిన లోక్‌సత్తాకు భంగపాటు కలిగింది. పొత్తుల కోసం ఎన్ని మార్లు ప్రయత్నించినా ఆ రెండు పార్టీల నుంచి స్పందన రాలేదు. దీంతో ఆ పార్టీ సోమవారం అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. పార్లమెంట్: సికింద్రాబాద్- పి.రోహిత్‌కుమార్, చేవెళ్ల- ఏనుగు రామారావు, మహబూబాబాద్- రవీంద్రనాయక్. అసెంబ్లీ: ఉప్పల్- బండారు రాంమోహన్, కంటోన్మెంట్- దాసరి రత్నం, అంబర్‌పేట- మెట్ల జగన్మోహన్, మహేశ్వరం- దేవి ప్రసాద్, ఇబ్రహీంపట్నం- మల్లారెడ్డి, కార్వాన్- సాయిబాబ, మలక్‌పేట- ఎ.హనుమంతరావు, కామారెడ్డి- పద్మా చంద్రశేఖర్, జుక్కల్- ఏకే లత, బాల్కొండ- బండారి అనంత్, నిజామాబాద్ అర్బన్- దొడ్ల శేఖర్, పటాన్చెరు- సుధీర్‌రెడ్డి, సంగారెడ్డి- మాధవరెడ్డి, మహబూబ్‌నగర్- గౌస్‌మొహినుద్దీన్, షాద్‌నగర్- డా.నరేంద్ర, మిర్యాలగూడ- శ్రీనివాసరెడ్డి, కోదాడ- గోవిందరావు, తుంగతుర్తి- శ్రీనివాసరావు, హుజూర్నగర్- కృష్ణనాయక్ బుక్యా, వరంగల్‌వెస్ట్-చంద్రశేఖర్, వరంగల్ఈస్ట్- జగదీశ్వర్‌రావు, వర్దన్నపేట- జట్టురవి, మహబూబాబాద్- మూల్‌చంద్, సిరిసిల్ల- సంవర్ధిని, రామగుండం- డా.జి.మహేశ్వర్, కోరుట్ల- వి.భూమానందం, కరీంనగర్- వంశీకృష్ణ, బెల్లంపల్లి- రాంమోహన్‌రావు, చెన్నూరు- మేకల సరోజ. మల్కాజ్గిరి నుంచి జేపీ నామినేషన్ దాఖలు సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సినీ దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, భార్య శ్రీవల్లి, పార్టీ నేతలు బండారు రాంమోహన్, కార్తీక్ చంద్రలతో కలిసి వెళ్లి జేపీ నామినేషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మధ్యాహ్నం నామినేషన్ జేపీ దాఖలు చేశారు. -
మల్కాజ్గిరి నుంచే పోటీ : జెపి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఈరోజు ప్రకటించారు. ప్రజా సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గంపై వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల కన్నుపడిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర నాయకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సామాజికవేత్త, నటి చందనా చక్రవర్తిని పోటీకి దించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భావిస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి తరపున పోటీ చేయడానికి రేవంత్ రెడ్డితోపాటు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావులు పోటీ పడుతున్నారు. -
బీజేపీ, టీడీపీతో పొత్తులుంటాయి: జేపీ
జనసేనతోనూ కలిసి పనిచేస్తామని వెల్లడి లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, లోక్‌సత్తా, జనసేన పార్టీలు కలసి పనిచేస్తాయని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ(జేపీ) వెల్లడించారు. కొన్ని టీవీ చానళ్లతో శనివారం మాట్లాడుతూ జేపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పుడున్న పరిస్థితిలో మా పార్టీకి పొత్తులు అవసరమనే నిర్ణయానికి వచ్చాం. బీజేపీతో కలసి పనిచేయడానికి లోక్‌సత్తా సిద్ధంగా ఉంది. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి మూడు పార్టీలు కలసి పనిచేస్తాయి. పవన్ మద్దతు ఇస్తానని ముందుకొస్తున్నారు కాబట్టి అందరం కలిసి ఈ రోజు ప్రజల కోసం ఒక స్పష్టమైన విధానాన్ని ఇస్తాం’ అని తెలిపారు. -
'బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి పోటీచేస్తాం'
-
బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి పోటీచేస్తాం
హైదరాబాద్: బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తామని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. తమ పార్టీ పెట్టుకోబోయే పొత్తులకు సంబంధించి కొన్ని రోజుల్లో స్ఫష్టత వస్తుందని జేపీ తెలిపారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని మతతత్వ పార్టీగా చిరంజీవి విమర్శించడాన్ని జేపీ తప్పుబట్టారు. బీజేపీని మతతత్వ పార్టీగా విమర్శించడం చిరంజీవి తగదని సూచించారు. ఈసారి మల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి పోటీకి దిగుతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తునకు లోక్‌సత్తా సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాల దృష్ట్యా పొత్తులకు సానుకూలమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పేర్కొంటూ.. రాబోయే ఎన్నికల్లో కలసి పనిచేయడానికి బీజేపీని మెరుగైన భాగస్వామిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆరుపేజీల లేఖను శుక్రవారం మీడియాకు విడుదలచేశారు. ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ స్వచ్ఛందంగా కండబలం, ఉచిత తాయిలాల రాజకీయం చేయకుండా వ్యవహరిస్తుందో.. ఎన్నికల విజయాలమార్గం ముళ్లబాటగా మారుతుంది’అని పేర్కొన్నారు. -
రేవంత్ మల్కాజ్ 'గురి'
మల్కాజ్‌గిరిపై గురి పెట్టే రాజకీయ నేతల లిస్ట్ పెరిగిపోతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. రంగారెడ్డి జిల్లాలో అత్యంత ఖరీదైన, ప్రతిష్ఠాత్మకమైన మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంపై వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కన్నేశారు. అక్కడ నుంచి పోటి చేస్తే గెలుపు నల్లేరు మీద నడేకనని నాయకులంతా భావిస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఇటు తెలంగాణావాదులు , ఇటు సీమాంధ్ర నాయకులు భారీగా పోటీపడుతున్నారు. సెటిలర్లతో పాటు విద్యాధికులు ఎక్కువగా ఉండటంతో.. అన్నిపార్టీల నేతలు మల్కాజ్గిరి స్థానంపై కర్చీప్ వేసుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేశారు కూడా. మరోవైపు ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ హఠావో...దేశ్ బచావో అనే నినాదంతో జనసేన పార్టీతో తెరమీదకు వచ్చిన సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా మల్కాజ్గిరి నుంచే పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా కోడంగల్ టీడీపీ రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిసి విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతంలో స్థానికేతరులు ఎలా పోటీకి దిగుతారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. స్థానికుడిగా మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగే అర్హత తనకే ఉందంటూ ఘంటా బజాయించి మరీ చెబుతున్నారు. కాగా రేవంత్‌తో పాటు ఈసారి ఎంపీ బరిలోకి దిగుదామనుకున్న మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావులు కూడా ఈ పోటీలో ఉన్నారు. అయితే గ ఇదే వ్యూహంతో గత రెండేళ్లుగా నియోజకవర్గానికి చెందిన నేతలతో రేవంత్ రెడ్డి సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. యువనేత కావడం, తెలంగాణావాదాన్ని గట్టిగా వినిపించిన రేవంత్‌కి సానుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా సర్వే సత్యనారాయణ, ఇంకా చాలామంది ఈ స్థానం మీద కన్నేశారు. ఇక్కడ నుంచే ఓ దశలో చంద్రబాబు పోటీ చేస్తారని.... అలాగే విజయశాంతి, కేసీఆర్, జయసుధ కూడా మల్కాజ్గిరి నుంచే బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. అయితే మల్కాజ్ గిరి స్థానం నుంచి విజయం సులువుగా దక్కుతుందా? మల్కాజ్ గిరి అంత హాట్ కేక్ గా ఎందుకు మారింది.. అనేదే రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో విద్యావంతులు, యువత, సెటిలర్స్, మహిళలు ఎక్కువగా ఉండడంతో వారిని ఆకట్టుకుంటే తమను ఆదరిస్తారని నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణా ఉద్యమ ప్రభావం ఉన్నా సరే.. సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో ఆశావహుల చూపులన్నీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇంతమంది ఆశపడుతున్న మల్కాజ్గిరి, చివరకు ఎవరికి పట్టం కడుతుందో చూడాలి మరి!! -
లోక్‌సత్తా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ స్థానిక ఎన్నికల మేనిఫెస్టోని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఈరోజు ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువులోగా ఎన్నికలు జరపాలని తాము తొలి నుంచీ పోరాడుతున్నామన్నారు. రాష్ర్ట బడ్జెట్ రూ.1 లక్ష 82వేల కోట్ల బడ్జెట్‌ను నేతలు కేవలం మూజువాని ఓటుతో ప్రవేశపెట్టడం బాధాకరమన్నారు. ఏడాదికి తలసరి ఖర్చు రూ.22, 500 పెట్టాల్సి ఉన్నా అది జరగడం లేదని చెప్పారు. కనీసం వార్డు స్థాయిలోనైనా వ్యక్తికి రూ.1000 ఖర్చుచేసి అభివద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం నుంచి ఏపీకి ఏటా వస్తున్న రూ.4లక్షల50వేల కోట్లలో గ్రామాల్లో కనీసం 1/3వ వంతు కూడా ఖర్చుచేయకపోవడం ఆందోళనకరమన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులేమయ్యోయన్నారు. ఓటర్ల జాబితా తప్పులతడకగా మారిందని, రాజకీయనేతలు వారికి కావాల్సిన ఓట్లు తప్పితే ఇతరుల ఓట్లను మాత్రం తొలగించే పనిలో పడ్డారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ర్టంలో తమ పార్టీ 110మున్సిపాలిటీ, 8కార్పోరేషన్లలోనూ పోటీచేస్తోందని, స్థానిక ఎన్నికల్లో చిన్నచిన్న సర్దుబాట్లు తప్పవని స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టో జన మేనిఫెస్టో అని తాము చెబుతున్నవన్నీ పరిష్కరించదగినవేనని, చిన్నచిన్నవేనని తెలిపారు. -
15 మందితో తెలంగాణ లోక్‌సత్తా పార్టీ కమిటీ
హైదరాబాద్: 15 మంది సభ్యులతో లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర పార్టీ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి బండారు రామ్మోహన్రావు కన్వీనర్‌గా, నందిపేట రవీందర్, పీఆర్ రావు, విజయేందర్‌రెడ్డి, లక్ష్మణ్ బాలాజీ కో కన్వీనర్లగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పవన్ కళ్యాణ్ వస్తే స్వాగతిస్తాం: జేపీ
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తమ పార్టీలో చేరతామంటే స్వాగతిస్తామని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాలనుకునే వారికి లోక్‌సత్తా బహిరంగ వేదిక అని ఆయన చెప్పారు. సమాజాన్ని సానుకూల మార్పు దిశగా నడిపించాలనుకునే వారిని తమ పార్టీ ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని అన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాబోతున్నారని తాజాగా వార్తలు వచ్చాయి. ఆయన ఎంపీగా పోటీ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈనెల రెండో వారంలో మీడియా ముందుకు రానున్నట్టు పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. తన రాజకీయ ఆలోచనల గురించి ఆయన స్పష్టం చేయనున్నారు. -
సమస్య ప్రజల మధ్య కాదు: జేపీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఉత్పన్నమయ్యే సమస్యలకు కేంద్ర ప్రభుత్వమే పరిష్కారం చూపాలని లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. విభజన అనంతర సమస్యలకు ముందే పరిష్కారం చూపాల్సిన అవసరముందన్నారు. గతం కంటే భవిష్యత్ బాగుంటుందన్న భరోసా కలిగించాలన్నారు. విడిపోయాక అన్ని ప్రాంతాల ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే అందరికీ న్యాయం జరిగేలా పరిష్కారం సాధ్యమేనని చెప్పారు. తాము సూచించిన రోడ్‌మ్యాప్‌లో రెండు ప్రతిపాదనలే కేంద్రం పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో తాము ప్రతిపాదించిన సూచనలను యుద్ధప్రాతిపతికన ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా గుర్తించాలని కోరామన్నారు. బిల్లుకు సంబంధించి అన్ని పార్టీలకు 5 అంశాలతో లేఖలు రాశామన్నారు. ప్రస్తుత సమస్య తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య కాదన్నారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని జేపీ విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. -
జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణ లాయర్లు
న్యూఢిల్లీ: లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణకు ఢిల్లీలో తెలంగాణ సెగ తగిలింది. ఏపీ భవన్ వద్ద ఆయనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని తెలంగాణ న్యాయవాదులు, విద్యార్థులు అడ్డుకున్నారు. జై తెలంగాణ, జేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జేపీ చొక్కా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణవాదుల ఆందోళన మధ్య జేపీని పోలీసులు అక్కడిని నుంచి ఏపీ భవన్లోపలికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి ఏపీ భవన్ లో తెలంగాణ వాదుల ఆందోళన కొనసాగుతోంది. -
ఇరుప్రాంత వాదనలు పరిగణలోకి తీసుకోవాలి: జెపి
-
మళ్లీ కూకట్పల్లి నుంచే జేపీ
25 మందితో లోక్‌సత్తా తొలి జాబితా సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కూడా హైదరాబాద్‌లోని కూకట్పల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజలు మరోసారి లోక్‌సత్తానే గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 25 మంది అభ్యర్థులతో తొలి జాబితాను లోక్‌సత్తా శుక్రవారం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తొమ్మిది, తెలంగాణలో ఐదు, కోస్తా, రాయలసీమ ప్రాంతంలోని మరో 11 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ప్రజలు కోరుకుంటే నూటికి నూరుపాళ్లు ముఖ్యమంత్రి అవుతానని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. విభజనపై సీమాంధ్రలో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జనవరి 30లోగానే కేంద్రం మూడు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసే ఏర్పాట్లను ప్రకటించాలని కోరారు. లోక్‌సత్తా తొలి జాబితా అభ్యర్థులు వీరే... కూకట్పల్లి- జయప్రకాష్ నారాయణ, శేరిలింగంపల్లి- కటారి శ్రీనివాసరావు, ఎల్బీనగర్- దోసపాటి రాము, సనత్‌నగర్- హైమా ప్రవీణ్, జూబ్లీహిల్స్- బొంతు సాంబిరెడ్డి, ముషీరాబాద్- కొంగర గంగాధరరావు, నాంపల్లి- కంతిమతి కన్నన్, మల్కాజ్గిరి- దిలీప్ శంకరరెడ్డి, రాజేంద్రనగర్- కొత్త సోల్కర్‌రెడ్డి, ఎల్లారెడ్డి- డాక్టర్ మర్రి రాంరెడ్డి, సిద్దిపేట- టి.శ్రీనివాస్, హుస్నాబాద్- గొల్లం రవి, భూపాలపల్లి- గట్టయ్య, ఖమ్మం- పి.రవిమారుత్, విశాఖపట్నం ఉత్తరం- భీశెట్టి బాబ్జీ, విశాఖ పశ్చిమ- నాయుడు వేణుగోపాలరావు, కాకినాడ టౌన్- వైడీ రామారావు, పెడన- సీహెచ్ వజీర్, గుంటూరు పశ్చిమ- జే ఐరామూర్తి, ఒంగోలు- అల్లు శివరమేష్‌రెడ్డి, నెల్లూరు- నర్రా శ్రీధర్, గూడూరు- కృష్ణయ్య, సూళ్లూరు పేట- వెంకటేశ్వర్లు, తిరుపతి- సిద్ధయ్య నాయుడు, నంద్యాల- డాక్టర్ శౌరిరెడ్డి. -
'ఇంతకీ నేను ఏ ప్రాంతానికి చెందినవాడిని?'
హైదరాబాద్ : 'నా బాల్యం మహారాష్ట్రలో...విద్యాభ్యాసం కోస్తాంధ్రలో.... ఐఏఎస్ శిక్షణ కరీంనగర్లో.... అసెంబ్లీకి ఎన్నికైంది హైదరాబాద్ నుంచి .... ఇంతకీ నేను ఇప్పుడు ఏ ప్రాంతానికి చెందినవాడినో చెప్పాలని' లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రావనిలో రాజకీయాలు అంపశయ్యపై ఉందని అన్నారు. రాష్ట్ర విభజనతో పచ్చని నేలపై చిచ్చు రేగిందని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో వందల రాత్రులు నిద్ర లేకుండా గడిపానని ఆయన అన్నారు. ఇవాళ పార్టీలు చచ్చిపోయాయని, కేవలం ప్రాంతాలు మాత్రమే మిగిలాయన్నారు. విభజన నిర్ణయంతో తెలుగు మాట్లాడే ప్రజల్లో ఎన్నో ఆశలు, భయాలు ఉన్నాయని జేపీ అన్నారు. దీనిపై పార్టీలకు అతీతంగా చర్చ జరగాలని ఆయన కోరారు. ఏడు అంశాలపై పెద్ద మనుషుల ఒప్పందం జరిగిందని...అయితే అందులో అయిదు మాత్రమే అమలు అయ్యాయన్నారు. దాంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న భావన తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. తెలుగు ప్రజల మధ్య కేంద్రం చిచ్చు పెట్టిందని...బలవంతంగా ఐక్యత కొనసాగించటం కష్టమన్నారు. విరిగిన మనసుల్ని అతికించటం కష్టం అన్నారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందని సకాలంలో స్పందించి ఉంటే ప్రజల మధ్య అగాధం వచ్చేది కాదన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ప్రాంతీయ భావం పెరిగిపోయిందని జేపీ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికి అస్థిత్వం ఎంతో అవసరం అని, అయితే అది హద్దు మీరకూడదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం, ఆవశ్యమని జేపీ స్పష్టం చేశారు. బలవంతంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే అపార నష్టం కలుగుతుందన్నారు. ప్రజలను ఒప్పించి విభజన చేపట్టాలని ఆయన అన్నారు. -
'ఇంతకీ నేను ఏ ప్రాంతానికి చెందినవాడిని?'
-
అవినీతి నిరోధక చట్టానికి సవరణలు సూచించిన జేపీ
సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధక చట్టానికి పలు సవరణలు చేయాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కోరారు. ఈమేరకు పార్లమెంటరీ సంఘాన్ని జేపీ న్యూఢిల్లీలో కలిసి పలు సవరణలు సూచించారని లోక్‌సత్తా పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లో లంచం ఇవ్వడానికి, లాలూచీ పడి అవినీతికి పాల్పడటానికి మధ్య స్పష్టమైన తేడా ఉంచేలా చూడాలని బృందం కోరింది. లాలూచీ అవినీతి కేసులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన భారం నిందితుడి మీదే ఉండాలని సూచించింది. లంచం ఇచ్చిన వారికి రక్షణ కల్పించేందుకు ప్రస్తుత అవినీతి నిరోధక చట్టంలో ఉన్న సెక్షన్‌ను తొలగించటం వల్ల ఫిర్యాదుల ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారని పేర్కొంది. ప్రకృతి వనరుల కేటాయింపు వేలం పాట ద్వారానే జరగాలని, బిడ్ దక్కించుకున్న వారు అనూహ్య లాభాల్ని అర్జిస్తే పన్ను విధించే అధికారాన్ని ప్రభుత్వానికి ఉండాలని బృందం కోరింది. -
పొత్తుపై కేజ్రీవాల్‌తో చర్చలు
-
పొత్తుపై కేజ్రీవాల్‌తో చర్చలు
న్యూఢిల్లీ: లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ(జెపి) ఈరోజు ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో పొత్తు విషయమై ఆయన కేజ్రీవాల్‌తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో లోక్‌సత్తా పార్టీ ఉంది. అనంతరం జెపి మాట్లాడుతూ కేజ్రీవాల్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పార్టీ విలీనమా? పొత్తా? అనేది మున్ముందు మీకే తెలుస్తుందన్నారు. దేశ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. తెలంగాణకు తమ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. అయితే విభజన అనేది ఏకపక్షంగా జరుగకూడదని తాము చెబుతున్నట్లు తెలిపారు. అతి తక్కువ వ్యవధిలోనే ఆప్ ఢిల్లీలో అధికారం చేపట్టడంతో అందరి దృష్టి దానిపై పడింది. సామాన్యుల పార్టీగా ముద్రపడటంతో ప్రజలు కూడా ఆప్ వైపు చూస్తున్నారు. కేజ్రీవాల్ అధికార పీఠాన్ని అధిష్టించి పేద ప్రజలకు ఆశలు కల్పించారు. అయితే ఆప్ పైపు ఆశగా చూసే కొందరు కాంగ్రెస్ మద్దతు స్వీకరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.