
స్వతంత్ర న్యాయ కమిటీతో విచారణ జరపాలి: జేపీ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ప్రభుత్వ అధికారులతో కాకుండా స్వతంత్ర న్యాయ కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో కుల వివక్ష కారణంగా ఓ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం భారతీయులంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం అని పేర్కొన్నారు. కాగా, కులం పేరు సూచించే తోకలను తీసేసుకోవాలని ఆయన యువతను కోరారు. కులం, మతం సంబంధం లేకుండా కులాంతర వివాహాలు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.