Lok Satta Party
-
ఇదెక్కడి మేధావితనం?
గతంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజుల్లో, ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి!’ అనే నినాదం గోడల మీద విస్తృతంగా దర్శనం ఇచ్చేది. ఆ నినాదం నిజమైందో లేదో తెలియదు కానీ, ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రపంచంలో ఉన్న ఒక వర్గం ‘మేధావులంతా ఏకం కండి!’ అనే నినాదాన్ని అంది పుచ్చుకొని వాళ్లంతా ఏకమవుతూ తమ సర్వశక్తుల్నీ ఒడ్డుతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అలియాస్ జేపీ హైదరాబాదు నుంచి విజయవాడ విచ్చేసి, ప్రెస్‌మీట్ పెట్టి తన మద్దతు ఎన్డీయే కూటమికే అంటూ దానికి బహు నిర్వచనాలు ప్రవ చించారు. అంతటితో ఆగకుండా ‘గాంధీ మహాత్ముడు, అంబేడ్కర్లకు కులం అంటగడతామా?’ అంటూ పరోక్షంగా తను కూడా అంతటి మహాత్ము డినే అని ప్రకటించుకున్నారు. అక్కడే చంద్రబాబుతో అంటకాగడంలో అపరాధ భావం ప్రస్ఫుట మవుతోంది. ఇంకా త్రిపురనేని రామస్వామి చౌదరి, గిడుగు రామ్మూర్తి పంతులు పేర్లు కూడా ఉటంకించారు. అసలు ఆయన మాట్లాడేదానికీ, ప్రస్తుత రాజకీయాలకూ; నాటి సంఘ సంస్కర్తలూ, భాషా వేత్తలైన త్రిపురనేని, గిడుగులకు సంబంధం ఏంటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. ఈ జేపీ లోక్‌సత్తా పార్టీని ఎప్పుడో చుట్ట చుట్టే శారు. లోక్ సత్తా ఇకపై రాజకీయ పార్టీ కాదని ప్రకటించేశారు కూడా! అయితే, చంద్రబాబు కోసం అర్జెంటుగా మళ్లీ పార్టీని వెలుగులోకి తెచ్చారు కాబోలు! నిజానికి ఈ పార్టీ పుట్టుక పరిశీలిస్తే, ఒక దశలో చంద్రబాబు నాయుడుతో రామోజీరావుకి తేడాలు వచ్చి, ‘‘నేను కింగ్ మేకర్ని. ఎన్టీఆర్ నుంచి పీఠాన్ని అప్పజెప్పింది నేను. అటువంటిది నాకే ‘మింగుడు పడకపోతే’ ఎలా? మీలాంటి వాడిని జాతీయ స్థాయిలో మరొకడిని తయారుచేస్తా!’’ అని ఈ జేపీని తెర మీదకు లోక్‌సత్తా పేరుతో తీసుకురావ డంలో రామోజీరావు కీలక పాత్ర వహించారని అంటారు పరిశీలకులు. అందుకే కాబోలు! అప్పట్లో ‘ఈనాడు’లో జేపీ వార్తలు పుంఖానుపుంఖాలుగా వచ్చేవి. ఆ పబ్లిసిటీ ప్రభావంతో విద్యావంతులు చాలా మంది లోక్‌సత్తా పట్ల ఆకర్షితులయ్యారు. అయితే జేపీ ‘హై వోల్టేజ్ యారగెన్సీ’కి షాక్ అయి స్వల్పకాలంలోనే జారుకున్నారు. జేపీని ఒకసారి గెలిపించిన హైదరాబాద్ కుకట్పల్లి ప్రజలు కూడా అతడి మేధా అహంకారానికి బెదిరిపోయారు. కాగా, మల్కాజ్‌గిరిలో మైండ్ బ్లాక్ అయ్యే జవాబు ఇచ్చారు జనం. దాంతో రాజకీయాలకు దూరంగా తన మేధాతనాన్ని అప్పుడప్పుడు మాత్రమే ప్రదర్శిస్తూ రోజులు గడుపుతున్నారు జేపీ. ఎంతైనా పబ్లిసిటీకి అలవాటైన ప్రాణం కదా! పైగా తను పేద్ద లౌకిక వాదినని కూడా చాటుకోవాలయ్యె! అందుకే, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, ఒకసారి పవన్ కల్యాణ్‌తో కలిసి ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ అంటూ నాలుగు రోజులు హడావిడి చేసి మళ్లీ సైలెంట్ అయి పోయారు. ఆ మధ్య జగన్ ప్రభుత్వంలో పథకాలను ప్రశంసించారు. ఇప్పుడు మళ్లీ ‘ప్రపంచ మేధా వులారా ఏకం కండి!’ అన్న నినాదాన్ని అంది పుచ్చుకొని చంద్రబాబుకు మద్దతుగా ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే, గాంధీ, అంబేడ్కర్, వైశ్య కులం, దళిత కులం; త్రిపురనేని రామస్వామి చౌదరి, గిడుగు రామ్మూర్తి అంటూ మోకాలికీ బోడి గుండుకీ ముడిపెడుతూ తన మేధాతనాన్ని ప్రదర్శించడానికి చాలా ప్రయాసపడ్డారు. ప్రకటన వికటించింది. చంద్రబాబుకి వర్గ పరంగా బహిరంగ మద్దతు ఇస్తున్నాను అని ఆయన ప్రకటిస్తే ఎవరికీ పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఏదేదో మాట్లాడేసేసి, ఆంధ్ర ప్రదేశ్‌లో ఏదో అరాచకం జరిగి పోతుందని తన భాషా ప్రావీణ్యమంతా ప్రదర్శించే సరికి, ఆయన మీద విమర్శల జడి మొదలైంది. పాపం జేపీని చూసినప్పుడల్లా విదు రుడు చెప్పిన పద్యం ఒకటి గుర్తుకు వస్తుంది. ‘‘ధనమును, విద్యయు, వంశంబును, దుర్మతులకు మదంబు ఒనరించును / సజ్జను లైన వారికి అణకువయును, వినయము ఇవియే తెచ్చును ఉర్వీ నాథా!’’ అంటాడు. ధనం, విద్య, ఉత్తమ కులంలో పుట్టాననే భావన దుష్టులకు మదాన్నీ, అహంకారాన్నీ కలిగిస్తాయి. ఇవే శిష్టులకు అణకువ, వినయం కలిగిస్తాయి అని విదురుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు. ఈ పద్యం చదివితే జేపీ ఏ బాపతు మేధావో చెప్పనవసరం లేదనుకుంటాను. జనానికి ఏమి కావాలో అది చెప్పాలి.లేదంటే నేల విడిచి సాము చేసినట్టు ఉంటుంది. జనం ఏమైనా ‘జేపీలా’? పి. విజయబాబు వ్యాసకర్త పూర్వ సంపాదకులు -
బరిలో డిగ్గీ సొంత సైన్యం!
సాక్షి, న్యూఢిల్లీ: విపక్ష ‘ఇండియా’ కూటమిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమను పట్టించుకోకుండా ఏకపక్షంగా 144 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయడం పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కలిసి పని చేసే పరిస్థితి లేనప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపే అంశాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. తమతో వారి (కాంగ్రెస్) ప్రవర్తన లాగే వారితో తమ ప్రవర్తన ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను మోసగిస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 18 స్థానాల్లో ఈ రెండు పార్టీలు పరస్పరం బలంగా పోటీ పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార బీజేపీ లాభపడుతుందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్‌లో తమకు తగిన బలం ఉందని, గతంలో రెండో స్థానంలో నిలిచామని అఖిలేష్ యాదవ్ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆరు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, చివరకు మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. 'మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలపై తన పట్టును మాజీ రాజ కుటుంబీకుడు దిగ్విజయ్‌సింగ్ మరోసారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది.' 'మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇటీవల విడు దల చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయా లపై తన పట్టును మా జీ రాజ కుటుంబీకుడు దిగ్వి జయ్సింగ్ మరో సారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది...తొలి జాబితా చాలా కారణాలతో వార్తల్లో నిలిచింది. అయితే అందరినీ ఆకర్షించింది మాత్రం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుటుంబంలో ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం! వివాదాస్పదుడైన సోదరుడు లక్ష్మణ్‌సింగ్‌తో పాటు కుమారుడు జైవర్ధన్, అల్లుడు ప్రియవ్రత్, అదే వరుసయ్యే అజయ్‌సింగ్ రాహుల్ పేర్లకు జాబితాలో చోటు దక్కింది.' - దిగ్విజయ్ '68 ఏళ్లు. దిగ్విజయ్‌కి వరసకు కోడలి భర్త. రక్త సంబంధీకుడు కాకున్నా డిగ్గీకి అత్యంత విశ్వాసపాత్రుడు. ఐదుసార్లు ఎమ్మెల్యే. వింధ్య ప్రాంతంలో గట్టి పట్టున్న నాయకుడు. ముఖ్యంగా సిద్ధి జిల్లాపై పలు దశాబ్దాలుగా రాజకీయ పెత్తనం ఆయన కుటుంబానిదే. మధ్యప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ ఇవ్వగలిగింది కేవలం కుటుంబ పాలన మాత్రమేనని దిగ్విజయ్ ఉదంతం మరోసారి నిరూపించింది. ఇది కాంగ్రెస్ రక్తంలోనే ఉంది. నా కుమారుడు ఆకాశ్ తనకు టికెటివ్వొద్దని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఇవీ మా పార్టీ పాటించే విలువలు!’ - అజయ్‌సింగ్ రాహుల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్‌లో పార్టీ సీనియర్ నేత. '68 ఏళ్లు. దిగ్విజయ్ తమ్ముడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. 1990లో రాజకీయాల్లోకి వచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీనీ వదలకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు! 2004లో బీజేపీలో చేరి రాజ్‌గఢ్ నుంచి అసెంబ్లీకి గెలిచారు. 2010లో నాటి బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని విమర్శించి బహిష్కారానికి గురయ్యారు. 2018లో రాష్ట్ర రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు.' - లక్ష్మణ్‌సింగ్ '45 ఏళ్లు. దిగ్విజయ్ మేనల్లుడు. కిల్చీపూర్ సంస్థాన వారసుడు. ఆ స్థానం నుంచే 2003లో అసెంబ్లీకి వెళ్లారు. అభివృద్ధి పనులతో ఆకట్టుకుని 2008లో మళ్లీ నెగ్గారు. 2013లో ఓడినా 2018లో మంచి మెజారిటీతో గెలిచారు. కమల్‌నాథ్ మంత్రివర్గంలో ఇంధన శాఖ దక్కించుకున్నారు.' - ప్రియవ్రత్‌సింగ్ '37 ఏళ్లు. దిగ్విజయ్ కుమారుడు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో సింధియాల కంచుకోటలను చేజిక్కించుకోవడంపై ఈసారి దృష్టి సారించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి కేంద్ర మంత్రి పదవి పొందిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయుల్లో పలువురిని ఇటీవల కాంగ్రెస్ గూటికి చేర్చారు. డూన్ స్కూల్లో చదివిన ఆయన కొలంబియా వర్సిటీలో మాస్టర్స్ చేశారు. 2013లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. తమ మాజీ సంస్థానమైన రాఘవ్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి 59 వేల పైచిలుకు మెజారిటీతో నెగ్గారు. 2018లో దాన్ని 64 వేలకు పెంచుకోవడమే గాక కమల్‌నాథ్ మంత్రివర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు.' - జైవర్ధన్‌సింగ్ -
ఎడ్యుకేట్ చేయాలి
‘‘సినిమా అనేది ఎంటర్టైన్ చేయడంతో పాటు ఎడ్యుకేట్ చేయాలి. అలా ఎడ్యుకేట్ చేసే సినిమాలను ప్రొత్సహించాలి. యువత రాజకీయాల్లో తిరుగుతూ సరైన నాయకుడిని ఎంచుకోకుండా, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అలాటి అంశానికి వినోదం జోడించి తీసిన ‘రామన్న యూత్’ని ఆదరించాలి’’ అని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డా. జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. సెప్టెంబర్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. రిలీజ్ డేట్ ΄ోస్టర్‌ని జయప్రకాశ్ నారాయణ్ ఆవిష్కరించారు. ‘‘గ్రామీణ ్రపాంతాల్లో రాజకీయ నాయకుల కోసం యువత ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు? రాజు అనే ఒక యువకుడు ΄÷లిటికల్ లీడర్‌గా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు అభయ్ నవీన్. -
ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది
వేటపాలెం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని లోక్‌సత్తా నేత ఎన్.జయప్రకాష్ నారాయణ చెప్పారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెంలోని బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతాబ్ది ఉత్సవాల్లో రెండో రోజు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకోసం ఒక్కో విద్యార్థికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం అత్యధికంగా ఒక్కొక్క విద్యార్థికి రూ.90 వేలు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఇది అభినందించాల్సిన విషయమన్నారు. విద్యా, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ బండ్ల బాపయ్యశెట్టి నెలకొల్పిన విద్యాసంస్థలో చదువుకున్న ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నతస్థాయిల్లో ఉన్నారని చెప్పారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని రాణించాలని సూచించారు. ఎన్‌ఏటీసీవో డైరెక్టర్ చెంగపల్లి వెంకట్, నటుడు అజయ్‌ఘోష్, విద్యాసంస్థ అధ్యక్షుడు బండ్ల అంకయ్య, ఉపాధ్యక్షుడు కోడూరి ఏకాంబేశ్వరబాబు, కార్యదర్శి బండ్ల శరత్‌బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ గొల్లపూడి సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పురోగమిస్తున్న విద్య, వైద్య రంగాలు
గుణదల (విజయవాడ తూర్పు): ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కోరారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గుణదల ఈఎస్ఐ రోడ్డులోని రోటరీ క్లబ్ భవనంలో లోక్ సత్తా పార్టీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని, ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు పురోగమిస్తున్నాయని అభినందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కులం, మతం, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పాలన అందించాలని కోరారు. అనంతరం సర్వసభ్య సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. -
సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్నా: జేపీ
విశాఖ: విద్యా, వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభినందించారు. ఏపీలో విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్న జేపీ.. ఇది అభినందనీయమని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ సంకల్పాన్ని అభినందించాలన్నారు. విశాఖలో అందరికీ ఆరోగ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జేపీ మాట్లాడుతూ... ‘విద్యా, వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం మార్పులను అభినందిస్తున్నా. విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్నా. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ లేకుంటే పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీ. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్సార్ దేశానికే ఒక మార్గం చూపారు. ఏపీలో ఫ్రీ డయాగ్నోస్టిక్‌ను బాగా అమలు చేయడం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. -
కొత్త జిల్లాల ఏర్పాటు మంచి నిర్ణయం: జేపీ
ఒంగోలు మెట్రో: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మంచి నిర్ణయమని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్.జయప్రకాష్ నారాయణ ప్రశంసించారు. ప్రకాశం జిల్లా నామకరణ స్వర్ణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నపురి తెలుగు అకాడెమీ ఆధ్వర్యంలో డాక్టర్ తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో వెలువరించిన ‘స్వర్ణ ప్రకాశం’, ‘ప్రకాశం జిల్లా సాహిత్య చరిత్ర’, ‘ఒంగోలు గురించి ఒకింత’ తదితర పుస్తకాల ఆవిష్కరణ సభ శనివారం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘స్వర్ణ ప్రకాశం’ పుస్తకాన్ని జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించి ప్రసంగించారు. కేవలం కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆగిపోకూడదని, అధికార వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటుకు వెలకట్టే సమాజం బాగుపడదని, ఓటుకు, నిరసనకు మధ్య పరిమితమైతే అది బూటకపు ప్రజాస్వామ్యమవుతుందన్నారు. కాగా, ఉన్నం జ్యోతివాసు రచించిన ‘ప్రకాశం జిల్లా సాహిత్య చరిత్ర’, మారేపల్లి సూర్యకుమారి రచించిన ‘ఒంగోలు గురించి ఒకింత’ పుస్తకాలను ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. -
సమగ్ర ఆరోగ్య విధానం అమలు చేయాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో సమగ్ర ఆరోగ్య విధానం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. పైసా ఖర్చు లేకుండా ప్రజలందరికీ వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో ‘అందరికి వైద్యం హక్కుగా వైద్య సేవలు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేపీ మాట్లాడుతూ.... ప్రాధమిక దశలో ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థాను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భవ వంటి పథకాలను ద్వితీయ, తృతీయ స్థాయిల్లో అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రూ.1900 కోట్లు అదనంగా కేటాయిస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు బాగానే ఉన్నా అవి ఎంతమాత్రం సరిపోవని, వైద్య సేవలు మరింతగా మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సదుపాయాలన్నీ విడిగా ఉన్నాయని వాటన్నింటినీ అనుసంధానం చేసి సమగ్ర ఆరోగ్య విధానం అమలు చేయాలన్నారు. స్వాతంత్య్రం అనంతరం నుంచి ఇప్పటివరకు ప్రజారోగ్యం పట్ల పాలకులు పెద్దగా శ్రద్ధగా చూపలేదని ఇప్పటికీ అయినా సమయం మించిపోలేదు. ఆరోగ్య వ్యవస్థ పట్ల దృష్టిని సారించాలని కోరారు. తెలంగాణ లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ ఆకుల నరేష్‌బాబు, డాక్టర్ చింతల రాజేందర్, వర్కింగ్ ప్రసిడెంట్ సత్యప్రకాష్, కటారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ ఆరోగ్య నమూనాలో ఏముందంటే...
సాక్షి, హైదరాబాద్: అందరికీ నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించేలా ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎఫ్డీఆర్), లోక్‌సత్తా సంయుక్తంగా రూపొందించిన ‘టువర్డ్స్ వయబుల్ యూనివర్సల్ హెల్త్‌కేర్’ ఆరోగ్య నమూనాను లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా.. ► అన్ని రకాల ఔట్ పేషెంట్ సేవలకూ ప్రజలు తమకు నచ్చిన డాక్టర్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, వైద్య సేవల మధ్య పోటీతో ఫ్యామిలీ ఫిజీషియన్ నేతృత్వంలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ. ఇది పైస్థాయి ఆస్పత్రి సేవలకు అనుసంధానమై ఉంటుంది. ఆస్పత్రి చికిత్స అవసరమనుకుంటే ఫ్యామిలీ ఫిజీషియనే సిఫార్సు చేస్తారు. ప్రభుత్వం నిధుల్ని సమకూరుస్తుంది. చదవండి: అతనితో సన్నిహిత సంబంధాలు.. ఐజీపై సస్పెన్షన్ వేటు ► ద్వితీయ, తృతీయ స్థాయి చికిత్సల ఆస్పత్రులు ఇన్‌పేషెంట్ సేవలకు మాత్రమే పరిమితం. అయితే అత్యవసరాలు మినహాయించి అన్ని కేసుల్లో కింద స్థాయి వైద్యుని నుండి సిఫార్సు (రెఫరల్) తప్పనిసరి. ► ఆయుష్మాన్ భారత్ నుండి తృతీయ స్థాయి వైద్య సేవలను మినహాయించి, ఆ పథకాలు అన్ని ద్వితీయ స్థాయి చికిత్సలకూ అందరు పౌరులకూ వర్తించేలా వాటి పరిధిని విస్తరించటం. తృతీయ స్థాయిలో నాణ్యమైన, ఖర్చుకు తగ్గ ఫలితాలనిచ్చే వైద్య సేవలందించేలా దేశంలోని జిల్లా, ప్రభుత్వ బోధనాస్పత్రులను అభివృద్ధి చేయటం. అదనపు వనరుల్ని సమకూర్చటం. ►ఈ నమూనాను అమల్లోకి తేవటానికయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరిస్తున్నా, ప్రైవేట్ రంగానికి కూడా కీలక పాత్ర ఉంటుంది. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యాలు, ఆర్థిక వనరుల సేకరణకు వినూత్న పద్ధతులతో ఈ నమూనా రూపొందింది. ►దేశవ్యాప్తంగా ఈ నమూనా అమలుకు అదనం గా అయ్యే వ్యయం ఏడాదికి సుమారు రూ. 85 వేల కోట్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అదనపు వ్యయం వరుసగా సుమారు రూ.1,900 కోట్లు, రూ. 2,600 కోట్లు ఉంటుంది. ► ఈ సంస్కరణల అమలు ఆవశ్యకతను తెలియచెప్పి ఒప్పించే క్రమంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్, ఆర్థిక సలహా మండలి, పార్లమెంటు సభ్యులు, మీడియా, ఈ రంగంలో పనిచేస్తున్న ఇతర అనేక సంస్థలు, వ్యక్తులు ఇలా సంబంధితుందరికీ ఎఫ్డీఆర్ వివరాలను అందించింది. ► ఆరోగ్య రంగం రాష్ట్రాల జాబితాలోని అంశం కాబట్టి, అంతిమంగా సంస్కరణలు రాష్ట్రాల నుండి ప్రారంభం కావాలి. కాబట్టి ఎఫ్డీఆర్ ఈ నమూనాను దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్య మంత్రులు, ఇతర సంబంధిత ఉన్నతాధికారులకు పంపింది. ► ఈ సంస్కరణలను అమలు చేసేలా ప్రభుత్వాలను ఒప్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషాతో మొదలు పెట్టి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులని వ్యక్తిగతంగా కూడా కలవాలని లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ భావిస్తోంది. -
హామీలను వెంటనే అమలుచేస్తే అప్పుల ఊబిలోకే..
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం క్లిష్ట స్థితిలో ఉందని.. ఈ సమయంలో కొత్త ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీల జోలికి వెళ్తే రాష్ట్రం మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోవడం ఖాయమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో గొప్ప ప్రజాభిమానాన్ని పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంకటంలో ఉంది. నిరుద్యోగులు ఉపాధి కోసం చూస్తున్నారు. డబ్బుల్లేవు. అందరూ సంఘటితంగా తెలుగు ప్రజలకు న్యాయం చేయడం.. నిజమైన అభివృద్ధిని సాధించడం ఎలాగా.. అన్నవాటిపై దృష్టిపెట్టాలి. ఢిల్లీ నుంచి రావాల్సిన వాటిని ఎలా రాబట్టుకోవాలో చూడాలి. మనం చెల్లించాల్సిన రుణాలను కేంద్రం మాఫీ చేయాలి.. అంతేకాక, ఏపీ అభివృద్ధి కోసం ప్రత్యేక బాండ్లను జారీచేసి, ఆ డబ్బులు రాష్ట్రానికిచ్చి, వాటిని తీర్చే బాధ్యత కేంద్రం తీసుకోవాలి. జగన్మోహన్రెడ్డిని అన్ని పక్షాలు కోరేది ఒక్కటే.. విభేదాలు వదిలి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోండి. జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది. జాగ్రత్తగా చేసుకుంటే రాష్ట్రంలో చాలా అవకాశాలున్నాయి’.. అని జయప్రకాష్ నారాయణ అన్నారు. -
ఇవి ఎన్నికలు కాదు.. వేలం పాటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ ఇప్పుడు జరుగుతున్నవి ఎన్నికలు కాదని, అవి వేలం పాటల్లా సాగుతున్నాయని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో జరిగిన లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోనూ, దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది పరిపాలన కూడా కాదు, ఆ పేరుతో కలెక్షన్లు చేస్తున్నారని, ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు వసూళ్లు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. మొన్న ముగిసిన తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే చూశాం. ఏపీలోనూ చూడబోతున్నామని చెప్పారు. ఓట్లు కోసం రాజకీయ పార్టీలు పోటీపడి వరాలు ఇస్తున్నాయన్నారు. ఇలాంటి చిల్లర, మల్లర కార్యక్రమాల వల్ల ప్రజలకు నిజమైన ఫలితాలు అందకపోగా, వాటిలో నుంచే అవినీతి పుడుతుందన్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టాలన్నా ప్రాంతీయ పార్టీలే కీలకమని, వచ్చే 25 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ పోటీ చేస్తుందా అన్న ప్రశ్నకు తమ పార్టీ పొలిట్ బ్యూరో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని బదులిచ్చారు. లోక్‌సత్తా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన జయప్రకాష్ నారాయణ, ఈ ఎన్నికల సమయంలో దానిపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. -
ఏకపక్ష నివేదికతో ఎవరికి మేలు?
కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాల్ని పొందుపరచకుండా ఏపీకి కేంద్రం నుంచి 85 వేల కోట్లు రావాలంటూ లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఎన్నికల ముందు ఒక నివేదిక ఇవ్వడం కొన్ని రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించటమే అవుతుంది. జేపీ నిపుణుల కమిటీ నివేదిక విడుదల సమయాన్ని చూస్తే తెలియకుండానే వారు ఒక రహస్య ఎజెండాకు దోహదం చేశారా అని అనుమానమేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా కమిటీ నివేదిక తయారైంది. ఏపీకి చెందిన అన్ని అంశాల్లో కేంద్రాన్ని దోషిగా చూపెట్టడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నానికి ఊతమిచ్చే రిపోర్ట్ గానే ఇది మిగిలిపోతుంది. పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ కమిటీ రిపోర్టును విడుదల చేసి ఈ మార్చి నెలకు సరిగ్గా ఒక సంవత్సరం. ఆ రిపోర్టు విడుదలైన వెంటనే జయప్రకాష్ నారాయణ ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో కొంతమంది నిపుణులతో మరి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏర్పడిన తొలి రోజులలో కమిటీ కార్యక్రమాలకు ప్రసార మాధ్యమాలలో విస్తృత ప్రచారం లభించింది. కానీ ఆ పైన ఈ కమిటీ ఏం చేస్తోంది అనేది చాలా గోప్యంగా ఉంచారు. సరిగ్గా పది నెలల తరువాత ఒక వారం క్రితం జేపీ విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం నుంచి రాష్ట్రానికి 85 వేల కోట్లు రావాలని ప్రకటించేవరకు ఈ పది నెలల కాలం ఈ కమిటీ ఏం చేస్తున్నది ఎవరికీ తెలియదు. కమిటీలో ఉన్న వారందరూ వివాద రహితులు వారి వారి రంగాలలో నిష్ణాతులు. కానీ ఈ కమిటీ నివేదిక విడుదల చేసిన సమయాన్ని, విధానాన్ని బట్టి చూస్తే వారికి తెలియకుండానే వారు ఒక రహస్య ఎజెండాకు దోహదం చేశారా అని అనుమానం కలుగక మానదు. పవన్ కళ్యాణ్ ఏర్పాటుచేసిన నిజ నిర్ధారణ కమిటీలో చర్చల సందర్భంగా ఒక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. కమిటీకి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. సమాచార హక్కుల చట్టం క్రింద ఒక పత్రం సమర్పించడం తప్పితే, కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకురావటానికి కానీ సంప్రదింపులు జరపటానికి కానీ కమిటీ పెద్దగా కృషి చేయలేదు. అటువంటి పరిస్థితులలో కమిటీ నివేదికలో ఈ మొత్తాలు కేంద్రం నుంచి రావాల్సిన మొత్తాలుగా చూపెట్టడం భావ్యం కాకపోవచ్చని నేను పేర్కొన్నాను. ఈ వాదనను కమిటీ అంగీకరించి తదనుగుణంగా నివేదికలో ఈ నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవలసిన నిధులుగా పొందుపరచడ మైంది. ఇదే అంశాన్ని ఆరోజు విలేకర్ల సమావేశంలో కూడా నేను ప్రస్తా వించాను. కానీ, జేపీ ఇవి కేంద్రం నుంచి రావాల్సిన మొత్తాలుగా పేర్కొ నటంతో ఆ నివేదికలో పొందుపరచిన అంశాలకు భిన్నంగా ఆ అభి ప్రాయం జనబాహుళ్యంలోకి వెళ్ళింది. ఈ అంశం ఈ నిపుణుల కమిటీ నివేదికకు కూడా ఇంకా ఎక్కువ ప్రాముఖ్యంతో వర్తిస్తుంది. నిపుణుల కమిటీ తన అధ్యయనాన్ని పది నెలల సుదీర్ఘ కాలం కొనసాగించింది. ఈ సమయంలో కేంద్ర ప్రభు త్వాన్ని వారి విధానాన్ని కూడా తెలియజేయవలసిందిగా కమిటీ కోరి ఉండి ఉంటే వారి అభిప్రాయాలు కూడా కమిటీ పరిశీలించి తమ నివేదికలో పొందుపరిచే అవకాశం ఉండి ఉండేది. అప్పుడు కమిటీ నివేదికకు విశ్వసనీయత ఉండేది.అటువంటి ప్రక్రియ కమిటీ చేయలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని మూలంగా తీసుకొని కమిటీ తన నివేదికను తయారుచేసింది. ఇటువంటి ఏకపక్ష నివేదిక వల్ల ఒనగూరే ప్రయోజనం ఉండక పోవచ్చు.ఇక రెండవ అంశం జేఎఫ్ఎఫ్సీ నివేదిక ఇచ్చిన కొన్ని రోజులకే ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. పరిశీలించవలసిన అంశాలు క్లిష్టమైనవీ, బహుళమైనవీ కావు. రెండు మూడు నెలలలోపు ఈ కమిటీ రిపోర్టు వచ్చి ఉంటే దీని మీద నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశం ఉండేది. కానీ, ఎన్నికల ముందు కేంద్ర ప్రభు త్వాన్ని సంప్రదించకుండా వారి అభిప్రాయాల్ని పొందుపరచకుండా కేంద్రం నుంచి 85 వేల కోట్లు రావాలంటూ ఒక నివేదిక ఇవ్వడం కొన్ని రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించటమే అవుతుంది. ఇక కమిటీ నివేదికలోని ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తే చాలా అంశాల్లో స్పష్టత హేతుబద్ధత కనిపించటం లేదు. ఎక్కడా కూడా ప్రత్యేక హోదా అంశాన్ని కమిటీ ప్రస్తావించ లేదు. ఈ విధంగా ఒక ప్రధానమైన, రాష్ట్రంలో ఆవేశపూరితంగా మారిన ఒక అంశంపై కమిటీ నివేదిక నీళ్లు చల్లినట్లయింది. ప్రత్యేక సహాయాన్ని గురించి ప్రస్తావిస్తూ రూ.16,447 కోట్ల మొత్తాన్ని ఈఏపీ స్కీమ్‌ల ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని, ఈ సహాయాన్ని ఇవ్వటానికి ఇతర మార్గాలు అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ అంశంలో నిధులు ఇవ్వటానికి ప్రత్యా మ్నాయ మార్గాలు అన్వేషించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు యూటర్న్ తీసుకుని భీష్మించుకుని కూర్చొని ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆవిధంగా తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అటువంటప్పుడు ఈ మొత్తాన్ని కేంద్రం నుంచి రావాల్సిన నిధు లుగా చూపెట్టడంలో అర్థం లేదు. ఈ మొత్తాన్ని రాష్ట్రం తీసుకోవడానికి ఇష్టపడని మొత్తంగా చూపెట్టాల్సి ఉంటుంది. ఇక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ గురించి పేర్కొంటూ బుందేల్‌ఖండ్ ప్యాకేజీ తరహాలో కేంద్ర ప్రభుత్వం రూ. 24,350 కోట్లు ఇవ్వాలని సూచించింది. అయితే బుందేల్‌ఖండ్ ప్యాకేజీలో.. అప్పటికే అమల్లో ఉన్న ఉపాధి హామీ పథకం లాంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు భాగంగా చేయడం జరిగింది. ఆ మొత్తాన్ని తొలగించిన తర్వాత చేసిన ఎటువంటి పోలిక అయినా సమంజసంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ప్యాకేజీలోనూ కేటాయింపులకు, చివరికి ఇచ్చే విడు దల మొత్తాలకు వ్యత్యాసాలు ఉంటాయి. మనకు జిల్లాకు 50 కోట్ల చొప్పున ప్రతి సంవత్సరం వచ్చిందీ విడుదలైన మొత్తాలూ. వీటిని పోల్చాలి అంటే బుందేల్‌ఖండ్ ప్యాకేజీలో కూడా మిగిలిన పథకాలలోని మొత్తాలను మినహాయించిన తర్వాత విడుదలైన నిధులను తీసుకొని పోలిక చేయాల్సి ఉంటుంది. పైపెచ్చు బుందేల్‌ఖండ్ ప్యాకేజీ 13 జిల్లాలకు వర్తిస్తుంది. మన వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ 7 జిల్లాలకే వర్తిస్తుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా బుందేల్ ఖండ్ ప్యాకేజీని పేర్కొని రూ. 24 వేల కోట్ల దాకా రావాల్సి ఉంటుందని పేర్కొనడం సరైంది కాకపోవచ్చు. ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి చర్చించేటప్పుడు కమిటీ మరో ప్రధాన అంశాన్ని ప్రస్తావిం చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అనే వాస్తవాన్ని పేర్కొంటూ రాయల సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య కోస్తా ప్రాంతానికి సమానంగా అభివృద్ధి చెందాలంటే బయట నుంచి వచ్చే పెట్టుబడిలో 85 శాతం ఈ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. అలాంటప్పుడు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకృతంగా మొత్తం పెట్టుబడులను రాజ ధాని ప్రాంతంలోనే చేయడాన్ని కమిటీ ప్రస్తావించలేదు ప్రశ్నించలేదు. 85 శాతం కొత్తగా వచ్చే పెట్టుబడులన్నీ వెనుకబడిన ప్రాంతాలకు వెళ్లా లని అన్నప్పుడు అది కేవలం కేంద్రం నుంచి వచ్చే సహాయంతోనే జర గదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను పెట్టే పెట్టుబడులను ఒక ప్రణాళిక ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంశాన్ని ఎందుకనో కమిటీ పూర్తిగా విస్మరించింది. ఇక 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ లోటు విషయంలో ఆ సంవత్సరం కాగ్ నిర్ధారించిన మొత్తం రూ. 16 వేల 78 కోట్లు. దీనికి అదనంగా 2015–16 సంవత్సరంలో అయిన ఖర్చు రూ. 6,800 కోట్లు కలిపి మొత్తం రూ. 23 వేల కోట్ల దాకా 2014–15 సంవ త్సరం లోటుగా తేల్చి, దానిలో రూ. 10,300 కోట్ల దాకా ఇంతవరకు భర్తీ చేసిన మొత్తంతో కలిపి కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని కమిటీ సూచించడం జరిగింది. ఈ అంశంపై కేంద్రం ఇప్పటికే ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని తీసుకొని సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. కమిటీ ఈ అంశంమీద కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇక పరిశ్రమల కేంద్ర కార్యాలయాలు హైదరాబాదులో ఉండ టంతో భవిష్యత్తులో కట్టవలసిన పన్నులు అక్కడ కట్టడం వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టాన్ని రూ. 3,800 కోట్లుగా నిర్ధారించారు. ఇది ఆంధ్రప్రదేశ్ తప్పకుండా రావాల్సినటువంటి మొత్తం. కానీ ఇంతవరకు ఈ మొత్తాన్ని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కేంద్రాన్ని అడగలేదు. కేవలం చట్టాన్ని సవరించాలని మాత్రమే కోరింది. సవరణ సాధ్యం కాదని కమిటీ తేల్చినందువలన ఈ మొత్తాన్ని వెంటనే చెల్లిం చవలసిందిగా రాష్ట్రం కేంద్రాన్ని అభ్యర్థిస్తే బాగుంటుంది. పోలవరం విషయంలో కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచా రాన్ని విశ్లేషించకుండా నమ్మి నివేదికను రూపొందించింది. 2019 సంవ త్సరానికి 41 మీటర్ల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని కమిటీ ఎట్లా నమ్మిందో అర్థం కావటం లేదు. మొదటి నాలుగేళ్లు పని మందకొడిగా నడవడానికి కారణాలు, అనూహ్యంగా అంచనాలు పెంచ డానికి కారణాలను కొంత లోతుగా అధ్యయనం చేసి ఉంటే బాగుండేది. జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు కేంద్రానికి కొత్త కాదు. ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటుచేసిన దానికన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంలో అలసత్వం ఉందా అనే అంశాన్ని పరిశీలించి వ్యాఖ్యానించి ఉంటే బాగుండేది. ఆ పని చేయకుండా కొన్ని సంవత్సరాల్లో రావాల్సిన మొత్తం అంతటిని గంపగుత్తగా ఒకేసారి రావాలి అనేవిధంగా నివేదికలో రూపొందించటం కేవలం వాస్తవాలను వక్రీకరించడమే. ఇక రాజధాని అంశాన్ని వివిధ మౌలిక సదుపాయాల కల్పనను కమిటీ ప్రస్తావించింది. గత సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా కేంద్రాన్ని దోషిగా చూపెట్ట డమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రం వైఖరి ఆ విధంగా ఉన్న ప్పుడు ఈ నివేదిక సమస్య పరిష్కారానికి తోడ్పడదు. కేంద్రాన్ని దోషిగా చూపెట్టడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నానికి ఊతమిచ్చే రిపోర్ట్ గానే ఇది మిగిలిపోతుంది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
రాష్ట్రంలో అవినీతి ప్రజ్వరిల్లుతోంది : జయప్రకాష్ నారాయణ
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా అవినీతి ప్రజ్వరిల్లుతుందని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎలాంటి సిఫార్సు లేకుండా నేరుగా పనులు చేయించుకునే వ్యవస్థ ఎప్పుడు వస్తుందోనని ఆశాబావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎ౦తో నమ్మకంతో ప్రభుత్వాలను ఎన్నుకుంటుంటే ఎన్నో పన్నులు కడుతున్నా ఎ౦దుకు మళ్లీ ఎదైనా పనులు చేపించుకోవాలనుకున్నప్పుడు లంచాలు ఇవ్వాల్సి వస్తుందని మండిపడ్డారు. భారత పార్లమెంట్లో అన్ని పార్టీలు కలసి దారుణమైన చట్టాలు తీసుకు వచ్చాయని, లంచం ఇస్తే ఏడు ఏళ్ళ శిక్ష కనీసం మూడేళ్ళు... అదే లంచం తీసుకున్న వాడికి ఎలాంటి కేసు ఉండదు అనే చట్టం తీసుకు వచ్చారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన పనులు గడువులోపల ఆ పని జరిగేలా చట్ట బద్ద౦ చెయ్యాలని చెప్పారు. వీటన్నిటిని అధికమించాలంటే నిజమైన ప్రతిపత్తికల లోకాయుక్త రావాలి అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తికల ఎవ్వరినైనా నిలదీసి శిక్షించగల లోకాయుక్త కావాలని ఆయన తెలిపారు. తెలగాణ ప్రజల్ని ఒక్కటే కోరుతున్న లంచం వేధింపులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎర్పడితే ఎమి లాభం లేదని అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతవ్వడం పై ఈసీ రజత్ కుమార్ క్షమాపణ చెప్పడం సరియైంది కాదని అన్నారు. ఓట్లు గల్లంతుపై ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకపోతోందని, దీనిపై పోస్టాఫీసులను నోడల్ ఎజన్సీలుగా ఏర్పాటు చేసి ఓటర్లు ఎప్పుడైనా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో ఈసీది ఘోరమైన తప్పిదమేని జయప్రకాశ్ ఆరోపించారు. -
ఉత్తుత్తి హామీల్ని నమ్మకండి..
తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఊకదంపుడు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నాయని, వీటిని ప్రజలు ఆమోదించకుండా...స్పష్టమైన ఎజెండాతో ఆయా పార్టీ నేతల నుంచి హామీ తీసుకోవాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. ప్రజలకు భద్రత, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, ఆదాయం పెంపునకు మార్గాలు చూపే పార్టీలకే ఓటేస్తామని చెప్పాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు డిమాండ్ చేయాల్సిన ఆరు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటిలో పౌరసేవల చట్టం ఒకటిగా పేర్కొన్నారు. దీన్ని ప్రజల హక్కుగా డిమాండ్ చేయాలన్నారు. ఇక విద్యార్థికి ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని, ప్రతి కుటుంబానికీ ఉచిత వైద్య వసతి కల్పించాలన్నారు. మహిళల భద్రతకు స్థానికంగానే కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక రుణమాఫీ వంటి పథకాలను కాకుండా రైతులకు వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం వచ్చేలా చూడాలని జేపీ సూచించారు. గిట్టుబాట ధర కల్పించడం, తక్కువ వడ్డీతో రుణాలివ్వడం, దళారులు లేని మార్కెట్ వ్యవస్థ వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఇక పట్టణాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్ నుంచే తలసరి కేటాయింపులు జరపాలని ఆయన సూచించారు. ఈ అంశాలపైనే ప్రజలు నేతల నుంచి హామీలు పొందాలని జయప్రకాశ్ నారాయణ్ కోరారు. -
కొండగట్టు ప్రమాదంపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
కరీంనగర్ జిల్లా: కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కి కరీంనగర్ లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ప్రమాదంలో మృతిచెందిన 60 మందికి రూ.20 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసి తక్షణ చర్యలు చేపట్టాలని హక్కుల కమిషన్‌ను కోరారు. -
లంచం ఇచ్చిన వారికి శిక్ష సబబు కాదు: జేపీ
హన్మకొండ: లంచం ఇచ్చిన వారికి శిక్ష విధించేలా రాజ్యసభలో తీసుకున్న నిర్ణయం మెడ మీద తలకాయ ఉన్నోడు తీసుకునేది కాదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించిన పౌరులను జ్వాలా అవినీతి వ్యతిరేక పోరాట సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండలో శుక్రవారం అశ్వరథంపై ఊరేగించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేపీ మాట్లాడారు. రాజ్యసభలో ఆమోదం పొందిన అవినీతి నిరోధక సవరణ బిల్లుపై ఆయన స్పందిస్తూ లంచం కావాలని ఎవరూ ఇవ్వరని, సంపన్నులు, పలుకుబడి ఉన్నవారికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులవుతున్నాయని, పేదలు, సామాన్యులు ఆఫీసుల చూట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. పనుల కోసం లంచాలు ఇచ్చే వారికి శిక్ష విధించడం సరికాదన్నారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయి గత్యంతరం లేక లంచం ఇచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పని నిర్ణీత సమయంలోపు చేయని అధికారులు, ఉద్యోగులకు జరిమానాలు విధిస్తే లంచాలు ఇవ్వాల్సిన అవసరం రాదని చెప్పారు. -
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేయాలని, అప్పుడే అధికార వికేంద్రీకరణ జరిగి అభివృద్ధికి అవకాశం ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ‘ఇండియా నెక్ట్స్’సదస్సు శనివారం ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో ఐక్యతను చాటే కొన్ని రాజ్యాంగ సంస్థలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలకలుగా మారాయని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలకు అధికారాలు కల్పించే విషయాన్ని కేంద్రంలోని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, గతంలో సీఎంలుగా పని చేసేటప్పుడు చేసిన డిమాండ్లను నేడు ప్రధానులుగా తిరస్కరిస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నరేంద్ర మోదీ అధికారాల వికేంద్రకరణపై చేసిన డిమాండ్లను ఇప్పుడు ప్రధానిగా ఆయనే తిరస్కరిస్తున్నారని తప్పుపట్టారు. కేంద్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీలు రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తి విధానాలను దెబ్బతీస్తూ, కొత్త విధానాలను తమకు నచ్చినట్టుగా పొందుపరుస్తున్నాయని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా... సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వాలు అధికారాలన్నింటినీ తమ చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నాయని జయప్రకాశ్ నారాయణ అన్నారు. గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ సొంత మనుషులను రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ కూడా కొన్ని అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఈ పరిస్థితిని మార్చి రాష్ట్రాలకు, జిల్లాలకు, స్థానిక సంస్థలకు నేరుగా అధికారాల వికేంద్రీకరణ చేయాలని ఆయన సూచించారు. జీఎస్టీతో దేశంలో ఒకే పన్ను అమల్లోకి రావడం వల్ల రాష్ట్రాలకు కొంత మేలు జరుగుతోందని, గతంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు 32 శాతం వచ్చే నిధులు ఇప్పుడు 42 శాతానికి పెరిగాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత సూర్యారావు పేర్కొన్నారు. రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే ఇలాంటి సంస్కరణలు ఇంకా రావాల్సి ఉందన్నారు. సదస్సులో ‘ఇండియా నెక్ట్స్’సంస్థ అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎం.అమరేంద్ర పాల్గొన్నారు. -
వ్యవస్థలో మార్పు అవసరం: జేపీ
సాక్షి, హైదరాబాద్: వ్యవస్థలో మార్పు రావాలని లోక్‌సత్తా అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్.జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వ మాజీ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం రాసిన ‘మేలుకొలుపు’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. కులం, మతం, ప్రాంతం సమాజాన్ని నిట్ట నిలువునా చీలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ చాలాచోట్ల చట్టబద్ధ పాలన సాగడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా ఏ పనీ జరిగే అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటే అన్నింటికీ పరిష్కారమార్గమని చెప్పారు. చిత్తశుద్ధి, నిజాయితీకి మారుపేరైన అజయ్ కల్లం ప్రజలను మేలుకొలుపే విధంగా పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ అవినీతిపై సమరానికి మేలుకొలుపు ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో అవినీతి పెరిగిపోయిందన్నా రు. సమస్యలపట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అజయ్ కల్లం మాట్లాడుతూ పాలనావ్యవస్థ నిలువెల్లా కుళ్లిపోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ, రాజకీయ విలువలు హరించుకుపోతుం డటంతో చట్టసభలు, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ వంటి కీలక పాలనాయంత్రాంగాలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ సచివాలయాలు అవసరమన్నారు. సమాజంపట్ల బాధ్యతను గుర్తు చేసేందుకు జిల్లాలవారీగా ‘మన కోసం మనం’అనే అంశంపై చర్చావేదికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అనంతపురం నుంచి చర్చావేదికలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. మాజీ సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ సమాజ హితం కోసం పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. సమాజంలో మార్పు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. -
జేపీ అలా చెప్పడం హాస్యాస్పదం
అనంతపురం జిల్లా : కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులపై లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ చెప్పటం హాస్యాస్పదంగా ఉందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బలపర్చాలని కోరటం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం కిందకే వస్తుందన్నారు. ఈనెల16న ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ, వామపక్షాలు చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని కోరారు. బంద్ అవసరం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, హోదా ఉద్యమన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. శివరామకృష్ణయ్య నివేదిక బుట్టదాఖలు చేశారని, ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు రాజధాని, పోలవరం పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
రాజకీయ దురుద్దేశంతోనే ఓట్ల తొలగింపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవల జరిగిన ఓటర్ల రివిజన్ ప్రత్యేక సమ్మరీ కార్యక్రమంలో శ్రీకాకుళం నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించారని, అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్టు అధికారులు వ్యవహరించి వాస్తవిక ఓటర్లకి ఓటు లేకుండా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, ఉభయ కమ్యూనిస్టు, లోక్‌సత్తా పార్టీ ప్రతినిధులు మండిపడ్డారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డిని బుధవారం తన ఛాంబర్లో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రీజనల్ కో ఆర్టినేటర్ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇంతలా ఓట్లు రద్దయిన ప్రక్రియ జరగలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా రెండు వేల మంది ఓట్లను తొలగిస్తే.. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలోనే సుమారు 28 వేల ఓట్లను రద్దు చేయడం దారుణమన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రాజకీయ దురుద్దేశంతోనే అధికారులకు చెప్పి, ఓట్లను తొలగించారన్నారు. తమ పార్టీ బలంగా ఉన్న చోట వందలాది ఓట్లును తొలగించారన్నారు. హెచ్‌బీ కాలనీ, చిన్నబరాటం వీధి, మాజీ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి ఉన్న ప్రాంతంలోనూ, వివిధ ప్రాంతాల్లో వందల సంఖ్యలో గత 30 ఏళ్లుగా నివాసం ఉన్నవారు, గతంలో పలు పదవులు చేసినవారి పేర్లు సైతం ఈ కొత్త జాబితాలో లేవన్నారు. పూర్తి వివరాలు, జాబితాను కలెక్టర్‌కు అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాల గొప్పదని, ఈ హక్కును రద్దు చేసే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలకు వెళ్లాలని.. అలాకాకుండా అడ్డదారిలో ఓట్లను తొలగించి ప్రయోజనం పొందాలన్నా దురుద్దేశం మంచిది కాదన్నారు. జిల్లాలోనూ, నగరంలోనూ వేలల్లో ఓట్లు రద్దయినా, స్థానిక శాసన సభ్యురాలు ఉన్న ప్రాంతంలో ఒక్క ఓటు కూడా ఎందుకు పోలేదని, అధికారులు ఎందుకు మార్పులు చేయలేదని కలెక్టర్‌ను ధర్మాన ప్రశ్నించారు. గతంతో పలు పధవులు చేసిన వారి ఓట్లు, వారి కుటుంబ సభ్యుల పేర్లను సైతం తొలగించారని కలెక్టర్‌కు వివరించారు. పట్టణంలో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని హౌసింగ్ బోర్డు కాలనీ, ఆఫీషియల్ కాలనీ ప్రాంతాలో వేలాది ఓట్లను తొలగించారన్నారు. తొలగించిన వారి వివరాలను కలెక్టర్‌కు నేతలు అందజేశారు. తొలగించిన ఓట్లను తిరిగి చేర్పించాలని కోరారు. తొలగించిన వారి ఓట్లు చేర్పించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి, ఇంటింటా సర్వేలు చేసి అర్హులందరికీ ఓటు హక్కును కల్పించాలన్నారు. ప్రజా స్వామ్యానికి అగాధం:తమ్మినేని శ్రీకాకుళం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఓట్ల తొలగింపు ప్రజా స్వామ్యానికి పెద్ద అగాధమన్నారు. రాజకీయాల్లో ఓట్లు తొలగించడం అన్యాయమన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు అధికారులు కూడా ఓట్లను తొలగించడం సరికాదని వ్యాఖ్యానించారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకొకపోతే ప్రతిసారి ఇవే పొరపాట్లు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓట్లు తమకు అనుకూలంగా లేవనే ఇబ్బందితోనే అధికార పార్టీ ప్రమేయంతో 28 వేల ఓట్లను నగరంలో తొలగించడం దారుణమన్నారు. దీనిపై ఎన్నిక కమిషన్ పరిధిలో చర్యలు తీసుకోవాలని, అప్పటికీ చర్యల్లేకపోతే న్యాయస్థానం ద్వారా రక్షణ పొందాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ముందుగానే అ«ధికారులు చర్యలు తీసుకొని, వాస్తవంగా తొలగించిన ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని కలెక్టర్‌కు తమ్మినేని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తమ పార్టీ యువ నేత స్వరూప్, తదితరులకూ పూర్తి అవగాహన ఉందని, వారి సాయం తీసుకోవాలని, ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా చూడాలని కోరారు. సూర్యమహాల్ ప్రాంతంలో దళితులకు చెందిన 250 ఓట్లను తొలగించారని, మాజీ కౌన్సిలర్ రఫీ కుటుంబ సభ్యుల ఓట్లు లేవని, చిన్నబరాటం వీధిలో 321 నుంచి 610 వరకు, శిమ్మ రాజశేఖర్ వార్డు పరిధిలో 168 ఓట్లు లేవన్నారు. హౌసింగ్ బోర్టు కాలనీలో జేఎం శ్రీను, వారి కుటుంబ సభ్యులు ఓట్లు లేవని, కొంతమందిన ఓట్లను ఓ పోలింగ్ కేంద్రం నుంచి దూరంగా ఉన్న మరో కేంద్రానికి పంపించారని కలెక్టర్‌కు తమ్మినే వివరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, çటెక్కలి, పలాస నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మార్పు ధర్మారావు, పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి ఎంవీ పద్మావతి, జిల్లా అధికార ప్రతినిధి శిమ్మ రాజశేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మామిడి శ్రీకాంత్, శ్రీకాకుళం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ అందవరపు సూరిబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ వైవీ సూర్యనారాయణ, డాక్టర్ సెల్ జిల్లా కన్వీనర్ పైడి మహేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, కమ్యూనిస్టు పార్టీ నాయకులు బైరి కృష్ణమూర్తి, కోరాడ నారాయణరావు, లోక్ సత్తా నాయకుడు పంచాది రాంబాబు ఉన్నారు. -
మాట తప్పటం సరికాదు: జేపీ
హైదరాబాద్: దేవుడి పెళ్లికి అందరం పెద్దలమేనని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు కోసం ఓ వేదిక ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను అభినందిస్తున్నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్ బేగంపేటలోని లోక్‌సత్తా కార్యాలయంలో జేపీతో సుమారు గంటపాటు పవన్‌కల్యాణ్ సమావేశం అయ్యారు. అనంతరం జేపీ విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరు ఏరుదాటాక తెప్ప తగలేసిన మాదిరిగా ఉందని విమర్శించారు. విభజన హామీలను చట్టంలో చేర్చాక, పార్లమెంట్లో లోతైన చర్చ జరిగాక కూడా ఇలా వ్యవహరించటం చాలా ప్రమాదకరమైన పరిణామమని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వాలు, పార్టీలు, పార్లమెంట్‌పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని హెచ్చరించారు. దేశ ప్రధాని, హోంశాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు చట్టంలో లేవని, తమ ఇష్టం అనడం ధర్మం కాదన్నారు.విభజన హామీల అమలుకు సంబంధించి ఏం చేస్తే కేంద్రంలో కదలిక వస్తుందనే అంశాలపై జేపీతో చర్చించినట్లు పవన్‌కల్యాణ్ చెప్పారు. -
లోక్‌సత్తా ప్రజల కోసమే: జేపీ
హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ ప్రజల కోసమే ఆవిర్భవించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) తెలిపారు. శనివారం హైదరాబాద్ మల్కాజిగిరి కృష్ణలీల ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జేపీ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావడానికి సమయం పడుతుందన్నారు. ఇప్పటి రాజకీయాలకు అర్థాలే వేరుగా ఉన్నాయన్నారు. కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై స్పందించడం కన్నా వసూళ్లకు పాల్పడటం, ఇతరత్రా పనులు చేయడమే రాజకీయం అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 21 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో మూడు రాజ్యాంగ సవరణలు, 2జీ స్పెక్ట్రమ్ కేసు, 8 చట్టాలు చేయించిన ఘనత పార్టీకి ఉందన్నారు. రాష్ట్రం లో యజ్ఞాలు చేస్తేనే అన్నీ అయిపోవన్నారు. కేంద్రంలో మోదీ విజ్ఞతతో పనిచేయకపోవడం తో ఆయనపై నమ్మకం పోయిందన్నారు. ఆవు గురించి, తలాక్‌ల గురించి ఆలోచించే నేతలకు కోట్ల మంది జీవితాల గురించి ఆలోచించే తీరిక లేదన్నారు. తెలంగాణలో కూడా త్వరలోనే సురాజ్య యాత్ర నిర్వహిస్తామన్నారు. -
మూడేళ్లలో కనీస అభివృద్ధి కూడా జరగలేదు
లక్కవరపుకోట(శృంగవరపుకోట): దేశంలో గడిచిన మూడేళ్లలో కనీస అభివృద్ధి కూడా జరగలేదని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలోని జమ్మాదేవిపేటలో సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతం కన్నా ఇప్పడు మెరుగైన సేవలు అందుతున్నాయని ప్రధాని మోదీ అనడం దారుణమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్యం అందక జనం విలవిల లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. -
న్యాయ వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలి
తాడితోట (రాజమహేంద్రవరం): న్యాయ వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. జనం కోసం జేపీ సురాజ్య యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ హాల్లో ‘న్యాయవాదులతో జేపీ’ కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేపీ మాట్లాడుతూ ప్రపంచ న్యాయ వ్యవస్థలో మన దేశం వెనుకబడి ఉందన్నారు. ఈ విషయంలో యువ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఎగువ కోర్టుల తీర్పులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని, తమకు న్యాయం జరిగిందని ఫిర్యాదీ సంతృప్తి చెందే విధంగా ఉండాలన్నారు. రాజకీయ నాయకుల వత్తిళ్ళతో న్యాయం జరగదనే అసంతృప్తి ప్రజల్లో ఉండకూడదని అన్నారు. ప్రతీపనికీ కాలపరిమితి హక్కు ఉండాలన్నారు. పట్టణీకరణ నేపథ్యంలో మహిళల పై శారీరకంగాను, మానసికంగాను దాడులు జరుగుతున్నాయని, వీటికి తక్షణ శిక్షలు అమలు జరిగేలా వ్యవస్థలో మార్పులు రావాలన్నారు. రిజర్వేషన్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ల పిల్లలకు అవసరం లేదన్నారు. నిజమైన నిరుపేదలకు రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడే రిజర్వేషన్లకు సార్థకత ఉంటుందన్నారు. కొన్ని రాష్ట్రాలలో అభివృద్ధి చెందిన కులాలు కూడా రిజర్వేషన్లు కోరుతున్నాయన్నారు. విద్య, ఆరోగ్యం, నిరుద్యోగం, కుల వివక్ష, రిజర్వేషన్ల ఘర్షణ, స్థానికసంస్థలకు అధికారాలు లేకపోవడం, లంచాలు, మహిళలపై వేధింపులు, అప్పుల వ్యవసాయం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలనే జరుగుతున్నాయన్నారు. ముమ్మారు తలాక్ అనే ఇస్లామ్ మతాచారం చెల్లదని షరియా చట్టాలను పరిగణనలోకి తీసుకుంటూ దీని పై పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మానవ హక్కులు, మహిళా స్వేచ్ఛ, హేతుబద్ధ భావాలకు లభించిన పెద్ద విజయమని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు, తవ్వల వీరేంద్రనాథ్ తదితరులు ప్రసంగించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి దివాన్‌చెరువు (రాజానగరం):గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని సీబీఎ‹స్ఈ పాఠశాలలకు మూడు రోజులపాటు జరిగే క్లస్టర్ మీట్ – 7 ఖోఖో పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. పై రెండు రాష్ట్రాలకు చెందిన 38 సీబీఎస్ఈ పాఠశాలల నుంచి 754 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సీహెచ్ విజయప్రకాష్, ప్రిన్సిపాల్ మూర్తి, లోక్‌సత్తా ఉద్యమ జిల్లా అధ్యక్షుడు యు.మాచిరాజు, సురాజ్యయాత్ర రాష్ట్ర సమన్వయకర్త బండారు రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలం
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ కాకినాడ సిటీ: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ విమర్శించారు. సురాజ్య యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన బుధవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. తునిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 650 మంది విద్యార్థులకు గానూ ఆరుగురు లెక్చరర్లు మాత్రమే ఉండగా.. వైఎస్సార్ జిల్లా మైదుకూరులోని డిగ్రీ కళాశాలలో 50 మంది విద్యార్థులకు 13 మంది లెక్చరర్లు ఉన్నారని చెప్పారు. ఇలాంటి సమస్యలనూ పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వముండటం దౌర్భాగ్యమన్నారు. స్థానిక సంస్థలు బలోపేతం కావాల్సిన అవసరముందన్నారు. -
మలిదశ ఉద్యమానికి ‘లోక్‌సత్తా’ శ్రీకారం
హైదరాబాద్: వ్యవస్థను మార్చేందుకు, పాలనలో ప్రజల్ని భాగస్వామ్యం చేసేందుకు లోక్‌సత్తా పార్టీ మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 13, తెలంగాణలోని 31 జిల్లాల్లో పర్యటించి ‘యూత్ ఫర్ బెటర్ ఇండియా’, ‘సిటిజన్ ఫర్ బెటర్ ఇండియా’ నినాదంతో ముందుకు సాగనున్నట్లు లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. ‘జనం కోసం జేపీ సురాజ్య యాత్ర’ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు, రెండు వెబ్సైట్లను బుధవారం ఇక్కడ ఆవిష్కరించారు. సురాజ్యయాత్రలో ముఖ్యంగా ఆరు అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ యాత్రలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనా యాత్ర లక్ష్యం జాతీయస్థాయిదని పేర్కొన్నారు. యువతను భాగస్వామ్యం చేసేందుకు www.youthforbetterindia.com ప్రత్యేక వెబ్సైట్ రూపొందించినట్లు చెప్పారు. యాత్ర ఖర్చుతో కూడుకున్నది కావున ప్రోత్సహించేందుకు దాతలు తమవంతు విరాళాలు అందించాలని, వారు అందించే ప్రతీ పైసాకు పదిపైసల పని చేసి చూపిస్తామని తెలిపారు. దాతలు www.fdrindia.orgలో సంప్రదించాలని సూచించారు. -
15 నుంచి జేపీ సురాజ్య యాత్ర
అక్కయ్యపాలెం (విశాఖ ఉత్తరం): భ్రష్టుపట్టిపోతున్న రాజకీయవ్యవస్థపై ప్రజల్లో చైతన్యం తెచ్చి మంచి రాజకీయాల వైపు వారిని మళ్లించేందుకు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్‌నారాయణ రాష్ట్రంలో వందరోజుల సురాజ్య యాత్ర చేపట్టనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి చెప్పారు. అక్కయ్యపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జేపీ చేపట్టనున్న సురాజ్య యాత్ర ఈ నెల 15న విశాఖ జిల్లా నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. విశాఖ జిల్లాలో 5 రోజులపాటు యాత్ర కొనసాగుతుందని, యువత, రైతులు, బీసీలు, దళితులు, మధ్యతరగతి ప్రజలతో జేపీ సమావేశమవుతారని చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం పోరాడనున్నట్లు చెప్పారు. విద్య, వైద్యం వంటివి లంచాలు లేకుండా అందే పరిస్థితి లేదని, ప్రజల్లో ప్రశ్నించేతత్వం వస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుందని, ఆ మేరకు ప్రజలో చైతన్యం తెచ్చేలా జేపీ యాత్ర సాగుతుందని బాబ్జి వివరించారు. -
ప్రజాసమస్యలపై ‘పీపుల్స్ పార్లమెంట్’
సెప్టెంబర్ 1, 2 తేదీల్లో కడపలో సదస్సు - ప్రజాసమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లటానికే... - పీపుల్స్ పార్లమెంట్ వెబ్సైట్ ప్రారంభం - పాల్గొననున్న జాతీయ నేతలు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో చట్టసభలు కేవలం తిట్టుకోవటానికి, అవాకులు చవాకులు పేల్చుకోవటానికి తప్ప, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎక్కడా కూడా తావు ఇవ్వటం లేదని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ వాపోయారు. ఈ నేపథ్యంలో పీపుల్స్ పార్లమెంట్ పేరిట జాతీయ సదస్సు నిర్వహించటం గొప్ప విషయమన్నారు. బుధవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పీపుల్ అగనెస్ట్ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. కడపలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరిగే ఈ పీపుల్స్ పార్లమెంటులో వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, పౌర సేవా హక్కు చట్టం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. అందరూ ఇందులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సాక్షి ఈడీ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ పార్లమెంట్, శాసనసభల్లో రచ్చ తప్ప, ప్రజా సమస్యలపై, విధాన పరమైన అంశాలపై చర్చేలే లేవన్నారు. ఎత్తులు వేసి సభలు జరగకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. 1998 నుంచి రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని, అప్పటి నుంచి వ్యవసాయదారుని స్థితిగతులపై ప్రత్యేక సమావేశాలు జరగాలని తాము కోరుతూ వస్తున్నామని చెప్పారు. చట్టసభల్లో జరగాల్సిన చర్చలు జరగకపోవటం సిగ్గు చేటని పేర్కొన్నారు. కొంతమంది చదువుకున్న యువకులు ముందుకు వచ్చి మోడల్ పార్లమెంట్ అంటూ చర్చలు, సదస్సులు ఏర్పాటు చేయటం సంతోషకరమని అన్నారు. రైతుల ఆత్మహత్యలపై ఎన్నో పరిష్కార మార్గాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నామన్నారు. ఏ ప్రభుత్వమూ, పాలకులు సరైన రీతిలో స్పందించటం లేదని తెలిపారు. ఈ తరుణంలో రైతుల గురించి, వ్యవసాయ రంగ సమస్యల గురించి చర్చకు తీసుకురావటం ఆశాజనకంగా ఉందని చెప్పారు. ప్రజల హక్కుల అణచివేత ఏపీ సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ పి. విజయబాబు మాట్లాడుతూ ప్రజల హక్కులను కాపాడాల్సిన పాలకులు వాటిని తుంగలో తొక్కి భవిష్యత్తు తరాలతో ఆడుకుంటున్నారన్నారు. క్లిష్ట సమయంలో జనరంజక అంశాలపై జరిగే ఈ సదస్సుకు అన్ని రకాల మీడియా సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొనటం చూస్తుంటే మార్పు మరెంతో దూరంలో లేదని అర్థం అవుతోందని చెప్పారు. ఉన్నత విద్యావంతులైన యువజన బృందం సమాజంలో మార్పు కోసం నిర్వహించే ఈ సదస్సులో భాగస్వాములు అయ్యేందుకు యువతీ, యువకులు వెబ్సైట్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. సంస్థ వ్యవస్థాపకులు మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ సదస్సుకు జాతీయ స్థాయిలో ప్రముఖులు, మేధావులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు– ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు– మాజీ ఎమ్మెల్సీలు హాజరవుతాయని చెప్పారు. సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు – యువజనులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను సాక్షి ఈడీ రామచంద్రమూర్తి ఆవిష్కరించారు. కార్యక్రమ పోస్టర్‌ను పి.విజయబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీపుల్స్ పార్లమెంట్ ముఖ్య నేతలు మనోజ్ చిట్టిమల్ల, గురు మల్లి, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘పబ్లిసిటీ పిచ్చితో రోడ్డున పడేశారు’
విశాఖపట్నం: విశాఖ భూకబ్జాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. లక్ష ఎకరాల భూమి కబ్జా అయిందని స్వయంగా కలెక్టరే చెప్పారని గుర్తు చేశారు. విశాఖలో భూముల కబ్జాలపై గురువారం వివిధ పార్టీ నేతలంతా కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి వైఎస్ఆర్సీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, సీపీఎం నేత నర్సింగరావు, సీపీఐ నేత స్టాలిన్, లోక్‌సత్తా నేత బాబ్జీ, బీఎస్పీ నేత బంగారి పలువురు విద్యావేత్తలు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారంతా మాట్లాడారు. అవేంటో ఒకసారి గమనిస్తే.. విజయసాయిరెడ్డి: ‘భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి. లక్ష ఎకరాల భూమి కబ్జా అయిందని కలెక్టరే చెప్పారు. అధికార పార్టీ నేతలకు భూకబ్జాలతో సంబంధం ఉంది. పలువురు మంత్రులు పాత్ర కూడా ఉంది. భూకబ్జాలపై వచ్చే నెల 14న హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలుస్తాం. ఆ తర్వాత రాష్ట్రపతిని కలుస్తాం. ఈ నెల 15న కలెక్టరేట్లో పబ్లిక్ హియరింగ్‌లో ప్రజావాణిని వినిపిస్తాం. బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. బొత్ససత్యనారాయణ: ‘రాష్ట్రంలో అవినీతి మరోసారి బట్టబయలైంది. అసెంబ్లీలో వర్షపు నీరు లీకుపై స్పీకర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం. కుట్ర జరిగిందని చెప్పి స్పీకర్ పక్కదారి పట్టిస్తున్నారు. అసెంబ్లీలో డొల్లతనం ఒక్క వర్షానికే తేటతెల్లమైంది. చదరపు అడుగు నిర్మాణానికి రూ.రెండు వేలకు బదులు రూ.తొమ్మిది వేలు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారు. సీఆర్డీఏ కమిషనర్ వ్యాఖ్యలకు, స్పీకర్ వ్యాఖ్యలకు పొంతనే లేదు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌కే విచారణను పరిమితం చేయడమేమిటి? మొత్తం లీకులపై దర్యాప్తునకు ఆదేశించండి’ సీపీఎం నేత నర్సింగరావు: ‘కంప్యూటరీకరణ పేరుతో టీడీపీ నేతలు భూములు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను వదిలిపెట్టలేదు. భూకబ్జాల విషయంలో మంత్రి అయ్యన్నపాత్రుడు, బీజేపీ ఎల్పీ నేత విష్ణు కుమార్ రాజు మాటపై నిలబడాలి. భూములు కోల్పోయిన బాధితుల పక్షాన మేం ఉంటాం. అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకునే వరకు వదిలపెట్టం’ సీపీఐ నేత స్టాలిన్: ‘పేదల భూములను అధికార పార్టీ నేతలు గద్దల్లా తన్నుకెళ్లారు. పేదలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం’ లోక్‌సత్తానేత బాబ్జీ:‘ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి పట్టింది. బాధితులు రోడ్డున పడ్డా కనీస స్పందన లేదు’ -
ధర్నాచౌక్‌ను రణరంగంగా మార్చారు: లోక్‌సత్తా
సాక్షి, హైదరాబాద్: సర్కారు వైఫల్యాలు, ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ఉద్దేశించిన ధర్నాచౌక్‌లో ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడికి పోలీసులను వాడుకోవడం దారుణమని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ విమర్శించింది. సోమవారం జరిగిన ఘటనలో కాలనీవాసుల ముసుగులో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, వాకర్ల ముసుగులో మఫ్టీ పోలీసులు ధర్నాచౌక్‌ను రణరంగంగా మార్చారని ధ్వజ మెత్తింది. ఉద్యమ సమయంలో ఆంధ్ర, తెలంగాణ అంటూ ఏ విధంగానైతే పబ్బం గడిపారో, అదే తరహాలో ధర్నాచౌక్ దగ్గర లోకల్–నాన్‌లోకల్ అంటూ తెలంగాణ ప్రజల మధ్యే చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని ఆ పార్టీ నేత జన్నేపల్లి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. -
రెతులపై కపట ప్రేమ: లోక్‌సత్తా
సాక్షి, హైదరాబాద్: మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను చూపుతున్నాయని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ ధ్వజ మెత్తింది. కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.5వేలు ఏ మూలకూ సరిపోవని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మరో రూ.5వేలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటన విడుదల చేశారు. -
రాజకీయ వ్యవస్థలో మౌలిక మార్పులు రావాలి
లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్‌నారాయణ సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి లేకుండా సుపరి పాలన జరగాలంటే రాజకీయ వ్యవస్థలో మౌలిక మార్పులు తేవాల్సిన అవసరం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు, ఫౌండేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఎఫ్డీఆర్) ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ చెప్పారు. ‘తక్షణ ఎన్నికల సంస్కరణల’ పై అన్నా హజారే నాయకత్వం లో ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ కార్యకర్తలు ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన సదస్సు లో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో రావా ల్సిన మార్పులపై దేశంలో పార్టీలకు అతీతం గా చర్చ జరగాలన్నారు. సీఎంను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని, అందువల్ల పలు ప్రయోజనాలున్నాయని చెప్పారు. ఓటు విలువ ప్రజలకు ఇంకా తెలియడంలేదని, అది తెలిస్తే డబ్బుకు అమ్ముడుపోవడం తగ్గుతుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్యేల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలన్నారు. సీఎంను ప్రజలు నేరుగా ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు అడ్డుకోలేరని, అందువల్ల స్థానిక ప్రభుత్వాలు బలపడడమే కాకుండా మంచి పరిపాలనకు అవకాశం ఉంటుందని చెప్పారు.రాజకీయం మారాలంటే కుటుంబ వ్యాపారం కాకుండా, రాజకీయమనేది ఒక ప్రైవేట్ సామ్రాజ్యం కాకుండా, మౌలికమైన మార్పులు తెచ్చి సామాన్యులకు ఓటు విలువ తెలిసే పరిస్థితి రావాలని జేపీ అన్నారు. -
సీఎంలను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులను ప్రత్యక్ష ఎన్నిక పద్దతిన ఎన్నుకోవాలని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఎన్నికల సంస్కరణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల రాజ్యం పోవాలని, అప్పుడే సీఎం సరైన పాలన ఇవ్వగలరని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాలని జేపీ అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక సందర్భంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సంఘటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలాంటివి రాజకీయ ఉన్మాదమని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థలో మార్పు వస్తే కానీ నిజమైన ప్రజాస్వామ్యం రాదని చెప్పారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పైరవీలు లేకుండా పనులు జరిగే రోజు రావాలని జేపీ పేర్కొన్నారు. గుడివాడ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలో అధికార టీడీపీ నాయకులు ఓటుకు 7 వేల నుంచి 10 వేల రూపాయల వరకు డబ్బు పంచినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
మేనిఫెస్టోలపై సీజేఐ వ్యాఖ్యలు హర్షణీయం
తెలంగాణ లోక్‌సత్తా పార్టీ సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సత్తా పార్టీ (తెలంగాణ) హర్షం వ్యక్తం చేసింది. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయకపోతే దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని, ఈమేరకు చట్టాలు చేయాలని గతంలోనే తమ పార్టీ స్పష్టం చేసిందని పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు డా.పాండురంగారావు అధ్యక్షతన సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో గతంలో లోక్‌సత్తా చేసిన సూచనలపై చర్చించారు. హామీల అమలుకు ఎంత డబ్బు అవసరం, దానిని ఎలా సమకూర్చుకుంటారనేది మేనిఫెస్టోలో స్పష్టచేయడం తప్పనిసరి చేయాలని సూచించారు. -
‘ఇక్కడ వ్యతిరేకించి.. అక్కడ పదవులా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై లొల్లి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం తన మంత్రివర్గంలో ఫిరాయింపుదారులకు చోటివ్వడంపై లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో రాజకీయ అనైతికత, ప్రజాస్వా మ్యం అపహాస్యానికి ప్రస్తుత పరిస్థితి అద్దం పడుతోందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్, గవర్నర్ సైతం ఈ ఫిరాయింపులను పట్టించుకోక పోవడం దారుణమన్నారు. -
ఇక్కడ వ్యతిరేకించి అక్కడ పదవులిస్తారా?: లోక్‌సత్తా
సాక్షి, హైదరాబాద్: ఏపీ కేబినెట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై విమర్శలు వెళ్లువెత్తున్నాయి. రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఇవ్వడంపై పలు రాజకీయపార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గంలో ఫిరాయింపుదారులకు చోటివ్వడంపై లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై హైడ్రామా చేసిన చంద్రబాబు, ఏపీలో ఫిరాయించిన నేతలకు మాత్రం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అనైతికత, ప్రజాస్వామ్య అపహాస్యానికి ప్రస్తుత పరిస్థితి స్పష్టం చేస్తోందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే స్పీకర్, గవర్నర్లు సైతం ఈ ఫిరాయింపులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వాలకు ప్రజలు తగిన విధంగా బుద్ది చెబుతారని ఆయన అన్నారు. -
నైతికత లేకుండా మంత్రి వర్గ విస్తరణ జరిగింది
-
'ధర్నాచౌక్ తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'
హైదరాబాద్: ధర్నాచౌక్ తరలింపును వ్యతిరేకిస్తూ నిసరనలు చేస్తున్న వారిని అరెస్టుచేయడంపై లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిన్నేపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పట్ల నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కని, వాటిని వ్యక్తపర్చే ప్రాంతాన్ని తరలించడం సరైన నిర్ణయం కాదన్నారు. టీజేఏసీ చైర్మన్ కోదండరామ్‌తో సహా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేసి ధర్నాచౌక్ తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన నిరంకుశంగా మారిందని, ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం ధర్నాచౌక్ తరలింపునకు ఉపక్రమించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. -
బడ్జెట్‌కూ కులం రంగా?: లోక్‌సత్తా
సాక్షి, హైదరాబాద్: అందరి అభివృద్ధిని సమానంగా చూడాల్సిన ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా కుల బడ్జెట్‌గా మార్చడం శోచనీయమని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ శాఖ ధ్వజ మెత్తింది. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని భావిస్తే బార్లు, వైన్‌షాపులకు లైసెన్స్‌లు ఇస్తూ, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ప్రజలను కుల భవనాల పేరిట విచ్ఛిన్నం చేస్తున్నారంది. బడ్జెట్లో విద్య,ఆరోగ్యరంగాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించకపోవడం బాధాకరమని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
బడ్జెట్‌కు కులం రంగా?: లోక్‌సత్తా
చైతన్యపురి(హైదరాబాద్‌సిటీ): భిన్నత్వంలో ఏకత్వంగా వెలుగొందుతున్న ప్రజలను కులం పేరిట విచ్ఛిన్నం చేయడమే గాక ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా కుల బడ్జెట్‌గా మార్చడం శోచనీయమని లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిన్నేపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ వస్తే విద్య, వైద్యం, ఉద్యోగాల ద్వారా బ్రతుకులు బాగుపడతాయన్నారు. ఇప్పుడు ప్రజలకు బంగారు తెలంగాణ పేరిట బార్లకు, వైన్‌షాపులకు లైసెన్సులు ఇస్తున్నారని విమర్శించారు. ప్రజల అందరి అభివృద్ధిని సమానంగా చూడాల్సిన ప్రభుత్వం కుల ప్రాతిపదికన బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్యాయమన్నారు. విద్య, వైద్య రంగాలలో ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడాలని శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వంపై మండి పడ్డారు. -
సమాజంలో మార్పు తెచ్చే నాయకత్వం అవసరం
లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ సీతంపేట (విశాఖ ఉత్తర): మూడేళ్ల పాలన ముగిసినా ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని, దీనిపై ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్ద నోట్లు రద్దు చేసినా దేశంలో ఎక్కడా అవినీతి తగ్గలేదని, మరింత పెరిగిందన్నారు. కనీసం వెయ్యిమంది అవినీతి అధికారులనైనా ఇంటికి పంపించాలని, ఆ అధికారం ప్రధానికి ఉందన్నారు. రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఆ పని చేయాలన్నారు. అపుడే లంచం తీసుకోవడానికి భయపడే వ్యవస్థ వస్తుందన్నారు. సమాజం మార్పు కోసం పనిచేసే నాయకత్వం రావాలన్నారు. సంప్రదాయ రాజకీయాల నుంచి ప్రజల వైపు గొంతువిప్పే నాయకులు పార్టీలోకి రావాలన్నారు. ఒక్క ఎమ్మెల్సీ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంత కష్టపడటం అవసరమా అని ప్రశ్నించారు. విలాసాలు, దుబారా వల్లే ఆర్థిక సంక్షోభం రాష్ట్రంలో విలాసాలు, దుబారా వ్యయం వల్ల ఆర్థిక సంక్షోభం మరింత పెరిగిందన్నారు. ఉపాధి అవకాశాలు పొందేలా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేలా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్ యార్డులు చొరవ చూపాలన్నారు. దేశంలో ఆరోగ్యం కోసం కేటాయిస్తున్న నిధులను రెట్టింపు చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పాత్రికేయుడు వి.వి.రమణమూర్తికి మద్దతు తెలిపారు. మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, నాయకులు నాయుడు వేణుగోపాల్, రావెల ఝాన్సీ, ఎం.ఎస్.ఎం మూర్తి, రాజవర్మ, రామానాయుడు,వడ్డి హరిగణేష్, ఎమ్మెల్సీ అభ్యర్థి వి.వి.రమణమూర్తి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో సంస్కార హీనమైన రాజకీయం
జేపీ తూర్పారపట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంస్కార హీనమైన రాజకీయం, పరిపాలన మనం చూస్తున్నామంటూ లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ చేసిన వ్యాఖ్యల వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పేస్బుక్ వీడియో పోస్ట్‌కు వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌లో వదిలివేసిన సంఘటనపై జేపీ చేసిన కొన్ని వ్యాఖ్యల వీడియో అది. ‘రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన మాత్రమే కాదు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న గూండాగిరి పరిపాలన మాత్రమే కాదు... ఒక సంస్కార హీనమైన పరిపాలనకు నిదర్శనం ఇది. గతంలో తమిళనాడులో ఇలాంటివి వింటుండేవాడ్ని. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని తప్పులున్నా ఇలాంటి దుర్మార్గం లేదు. మన భావప్రకటన స్వేచ్ఛకు అడ్డుపడే పరిస్థితి లేదు’ అని జేపీ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. సమాజంలో అత్యధికులు అమాయకులు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పినా ఖామోస్ అనుకుంటారు కాబట్టి తమ మాట చెల్లుతుంది... తమకు పెద్ద బాకాలున్నాయని పాలకులు గడుసుగా మాట్లాడుతున్నారన్నారు. -
హోదా కోసం ఐక్య పోరాటానికి సిద్ధం కావాలి
పలు పార్టీల నేతలకు ముద్రగడ పద్మనాభం లేఖ కిర్లంపూడి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఐక్య పోరా టానికి సిద్ధం కావాలని పలు పార్టీల నేతలకు, సినీ ప్రముఖు లకు మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు, వామపక్షాలకు, సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవి, మోహన్‌బాబుతో పాటు ఇతర నేతలకు రాసిన లేఖను తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో మంగళవారం మీడియాకు విడుదల చేశారు. అందరూ కలిసి పోరాడితే ప్రత్యేక హోదా సాధించుకోవచ్చన్నారు. బాధ్యతగల సీఎం మూడేళ్ల కాలంలో పలుమార్లు హోదాపై మాట మార్చడం తగదన్నారు. -
ఆర్భాటం జాస్తి.. వాస్తవం నాస్తి: జేపీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ పాలన ‘ఆర్భాటం జాస్తి – వాస్తవం నాస్తి’ అన్నట్టు ఉందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. బుధవారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘అంతా ఈవెంట్ మేనేజ్మెంట్. ప్రతి రోజూ పెద్ద ఆర్భాటం. ఏదో చేస్తున్నామని భ్రమలు కల్పిస్తున్నారు. దీర్ఘకాలిక దృక్పథంతో మన పిల్లలకు ఉపాధి కల్పించడం కోసం ఏం చేయాలన్న దానిపై లోతైన అవగాహన, దిశా నిర్దేశం కొరవడింది’ అన్నారు. విద్య, ఆరోగ్యం విషయంలో ఏ రాష్ట్రంతో పోల్చినా పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. నిజాయితీతో కూడిన ప్రయత్నాలు చేయకుండా మ్యాజిక్‌లు, చిట్కాలతో ఏ రాష్ట్రం బాగుపడలేదని చెప్పారు. ఆర్భాటాలు, ప్రగల్బాల రాష్ట్రంగా, పత్రికల్లో ప్రచారం పొందే రాష్ట్రంగా మిగిలిపోతోందని అన్నారు. ప్రత్యేక హోదానా.. ప్రత్యేక ప్యాకేజీనా అనేది అనవసర చర్చ అని, యువతకు ఉపాధి అవకాశాలు కలిగేలా కేంద్రం నుంచి పారిశ్రామిక రాయితీలు పొందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సీఎంను ఎన్నుకోవాలి : తమిళనాడు ఉదంతం చూస్తుంటే రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు దిగజారుతున్నాయన్నది మరోసారి నిరూపణ అయిందని జయప్రకాష్ నారాయణ అన్నారు. సీఎం పదవికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలకు తెరపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొందరు ప్రజాప్రతినిధులు ఎన్నికలప్పుడు ఏ పార్టీలో ఉన్నారు.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటూ పార్టీ మారిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా?
రోజా సంఘటనపై జయప్రకాశ్ నారాయణ స్పందన సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పాలన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోందా అని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఇటీవల విశాఖపట్నంలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించి వెనక్కి పంపడం, జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే ప్రభుత్వం అడ్డుకోవడం వంటి వరుస సంఘటనలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో సామాన్య వ్యక్తిని పాల్గొనకుండా అడ్డుకున్నా పెద్ద తప్పుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. అలాం టిది ప్రజలెన్నుకున్న మహిళా ప్రజాప్రతినిధిని ఆ సదస్సులో పాల్గొనకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇతరులను కించపరిచేలా ప్రవర్తించారని ఎమ్మెల్యే రోజా కానీ, ఇంకెవరైనా కానీ అనుకుంటే న్యాయపరంగా వారిపై పరువు నష్టం దావా వేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఇలాంటి పరిణామాలు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రాష్ట్ర ప్రభుత్వానికి, చివరికి రాష్ట్రానికే చెడ్డపేరు తెస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పోలీసులు సైతం రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. -
హోదా అడిగితే దేశ ద్రోహమా?
-
హోదా అడిగితే దేశ ద్రోహమా?
‘సాక్షి’ ఇంటర్వ్యూలో జయప్రకాష్ నారాయణ ♦ పారిశ్రామిక రాయితీలు హోదాలో భాగం కాదనడం అవాస్తవం ♦ ప్యాకేజీ ఒక నాన్సెన్స్.. హోదా ఉన్న రాష్ట్రాలకే రాయితీలు దక్కాయి ♦ హోదా ప్రైవేట్ వ్యవహారం కాదు సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తామని ఆరు నెలల కిత్రం వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఇతర కేంద్ర మంత్రులు చెప్పిన మాటలనే ఇప్పుడు రాష్ట్రంలో యువత, ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేయడానికి పూనుకుంటే అది దేశద్రోహ చర్య ఎలా అవుతుందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. నిన్నటి దాకా వారు చేసిన వాదన అధికారంలో ఉన్న వారికి నచ్చకపోతే అన్యాయమైపోతుందా? అక్రమమైపోతుందా? ఆ మాట ఎత్తడమే తప్పు అవుతుందా? అని ప్రశ్నించారు. పాలకుల్లో ఇలాంటి అసహనం పెరగడం ఆంధ్రప్రదేశ్‌కు ఏ మాత్రం మంచిది కాదన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం ప్రజాస్వామిక చర్య అనిపించుకోబోదన్నారు. తిమ్మిని బమ్మి చేసి ప్రజలను భ్రమింపజేసేందుకు టీడీపీ, బీజేపీ ప్రత్యేక హోదా నిర్వచనాన్ని మార్చి, పారిశ్రామిక రాయితీలు అందులో భాగం కానట్టు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న సహాయానికి ప్యాకేజీ అన్న పేరు పెట్టడాన్ని ఆయన నాన్సెన్స్గా పేర్కొన్నారు. ‘సాక్షి’కి ఆయన ప్రత్యేకంగా ఇంటర్వూ్య ఇచ్చారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ► ప్రత్యేక హోదాతో పన్ను రాయితీలు వస్తాయి.. రాయితీలు వస్తే ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమల పెట్టుబడులు గణనీయంగా వచ్చే అవకాశం ఉంది. హోదా ఉన్న రాష్ట్రాలకే పారిశ్రామిక రాయితీలు దక్కాయి. ► అధికారంలో ఉన్నవారికి నచ్చినా, నచ్చకపోయినా, ప్రజలు తమ కోరికకు అనుగుణంగా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. రాష్ట్రంలో ఫలానాది జరిగితే బాగుండని.. ఎవరూ పట్టించుకోవడం లేదని పది మంది గుమికూడి నిరసన తెలపచ్చు. ఇది ప్రజాస్వామ్య హక్కు. ఇతరులకు ఇబ్బంది లేకుండా ఎవరైనా, ఎంతమందైనా గుమిగూడొచ్చు. ఇవన్నీ ప్రజాస్వామ్య హక్కులు. ► ప్రత్యేక హోదా కోసం అడిగితే అది దేశద్రోహం ఎలా అవుతుంది? ప్రత్యేక హోదా అవసరం లేదనుకుంటే శ్వేతపత్రం ప్రకటించి, పన్ను రాయితీ అవసరం లేదు, ప్యాకేజీ సరిపోతుందని చెప్పమనండి. నిన్నటిదాకా వాళ్లు చేసిన వాదన ఇప్పుడు అన్యాయమైపోయింది, అక్రమమైపోయింది. మాట ఇచ్చారు కాబట్టి అడుగుతున్నారు. ఇది తప్పు ఎలా అవుతుం ది? అడిగేవారి గొంతు నొక్కడం విజ్ఞత కాదు. బలవంతంగా నోరు మూసే ప్రయత్నం చేస్తే ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది కాని తగ్గదు. ► రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీల కోసం ఇప్పుటి వరకు ప్రభుత్వ పరంగా ప్రయత్నమే జరగలేదు. అది కచ్చితంగా తప్పు. ►అధికారంలో ఉంటే మేం ఫలానా పని చేశామని చెప్పుకుంటారు. ప్రతిపక్షం వాళ్లు ఫలానాది చేయడం లేదని ప్రచారం చేస్తారు. దీనిని భయంకరమైన కుట్రగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా వారికి ఆ హక్కు ఉందని గుర్తించండి. ఈ హక్కు మీరు ఇవ్వలేదు. ఇది రాచరికం కాదు. ఒక అధికారో, ప్రభుత్వమో ఈ హక్కులను ఇవ్వలేదు. ► ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించడం హర్షించదగ్గ విషయం కాదు. ప్రజాస్వామ్యంలో హింసను ప్రేరేపించకుండా, ఇతరులకు భంగం కలగకుండా ఎవరైనా ఏదైనా చెప్పుకునే హక్కు ఉంది. ఈ ఫండమెంటల్ గుర్తించకపోతే ప్రజస్వామ్యం నడవదు. అధికారంలో ఉన్న వారు తమకు ఇష్టంలేని ప్రతివారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించడం ప్రజాస్వామ్యం కానేకాదు. ప్రభుత్వానికి ఆ హక్కు లేదు. ► రాష్ట్రానికి కేంద్రం పెద్దలు ఏయే హామీలు ఇచ్చారు. ఏవి జరిగాయి, ఏవి జరగలేదు. ఏం సాధించుకోవాలి. సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో ప్రభుత్వం శ్వేతప్రతం రూపం లో చెప్పాలి. కానీ ఇదంతా జరగలేదు. ఇది ప్రైవేట్ వ్యవహారం కాదు. ప్రజల ముందు పెట్టాలి. ప్యాకేజీ అంటున్నారు. ఆ పదమే నాన్సెన్స్. -
'అవినీతి పరులెవరో అందరికీ తెలుసు'
హైదరాబాద్: వ్యవస్థను మార్చాలంటే మ్యాజిక్ అవసరం లేదు.. నీతి, నిజాయితీ ఉంటే చాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అవినీతిపరులు ఎవరో నాయకులందరికీ తెలిసినా తెలియనట్టు డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన పలు అంశాలపై విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి వంద మంది చొప్పున భయంకర అవినీతి పరులను గుర్తించండి అని ప్రభుత్వానికి సూచించారు. కనీసం దేశంలో 1000 మంది అక్రమార్కులను గుర్తించినా అవినీతిని నియంత్రించినట్లేనని అన్నారు. అధికారం అంటే పెద్ద గోడలు, రాజ భవనాలు కట్టడం, చార్టెడ్ విమానాల్లో తిరగడం కాదు.. ప్రజలకు సేవ చేయటమేననిన్నారు. నోట్ల రద్దుపై... కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో మొదటి ప్రభావం సామాన్యులపైనే పడిందని, ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిందని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. నిజాయితీగా డబ్బు సంపాదించినా.. డబ్బు రూపంలోకి మార్చటం తప్పనిసరి అని అన్నారు. సామాన్యులకు డబ్బు, క్యాష్ లెస్ అవకాశాలు పెరగకపోతే నోట్ల రద్దు నిర్ణయం వృథా అయినట్లేనని తెలిపారు. రాష్ట్రం, కేంద్రం కలిసి కూర్చుని చర్చిస్తే ఇలాంటి సమస్యల పరిష్కారం ఈజీ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకుని రియల్ ఎస్టేట్ రంగంలో క్యాష్ వాడకం లేకుండా చేయాలని సూచించారు. ఇప్పుడూ అవే రాజకీయాలు.. తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రామీణ పోలీస్ అధికారులను నియమించడం మంచిదేనన్నారు. అలాగే, ఆరోగ్య రక్ష పథకం మంచి ఆలోచన అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెంచాలని సూచించారు. జిల్లాల విభజన వల్ల నిధుల అందుబాటు పెరిగిందన్నారు. కొత్త జిల్లాలకు అధికారం వెళ్ళిందని చెప్పారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాజకీయమే ఇప్పుడూ కొనసాగుతోందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తీరులో పెద్ద మార్పు లేదన్నారు. శాసనసభ్యుడిని రాజకీయ పార్టీకి బానిస చేశారన్నారు. రెండు రాష్ట్రాలు చెడు విషయాల్లో కాకుండా మంచి విషయాల్లో పోటీ పడాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల అవసరాలు తీరటం ముఖ్యం.. ప్రజలకు సేవలు అందేలా చూడటం ముఖ్యం. లోక్‌సత్తా కార్యక్రమాల ఫలితంగా రాజకీయాల పట్ల ప్రజల్లో విముఖత తగ్గింది. జల్లికట్టు అంశంపై... జల్లికట్టు విషయంలో జాతీయ స్థాయి నిర్ణయాలు ఎందుకన్నారు జయప్రకాశ్ నారాయణ్. ఈ విషయాన్ని ఆ రాష్ట్రం చూసుకుంటుందని అన్నారు. అధికార కేంద్రీకరణ చాలా అపాయకరమని చెప్పారు. నలబై ఏళ్ల క్రితం కందిమల్లయ్యపల్లెలో జంతు బలి సందర్భంగా పోలీసు కాల్పుల్లో ప్రజలు చనిపోయారని గుర్తు చేశారు. -
‘రిజర్వేషన్లు శాశ్వత పరిష్కారం కాదు’
హైదరాబాద్: రిజర్వేషన్లు కల్పించడం తాత్కాలిక పరిహారమే కానీ శాశ్వత పరిష్కారం కాదని లోక్‌సత్తా తెలంగాణ విభాగం పేర్కొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా రిజర్వేషన్లు రావణకాష్టంగా రగులుతూనే ఉండడానికి పాలకుల ఓటుబ్యాంకు రాజకీయాలే కారణమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కుల, మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత నాణ్యమైన విద్య, ఆరోగ్యం కల్పిస్తే ఆర్థికాభివృద్ధికి అవి దోహదపడతాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రిమీలేయర్‌ను గుర్తించి వారికి రిజర్వేషన్లు తొలగించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు, నెలవారీ వేతనాలు వచ్చే ప్రైవేట్ ఉద్యోగులకు గ్యాస్, రేషన్, పింఛన్లు తదితర రాయితీలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లుక కల్పించాలని, ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలు పోవాలని, రిజర్వేషన్లపై పునః సమీక్ష జరపాలని తెలంగాణ ప్రభుత్వానికి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి సూచించారు. -
ల్యాండ్ పూలింగ్‌లో రూ.కోట్ల అక్రమాలు
సీతంపేట (విశాఖ): విశాఖ జిల్లాలో అనందపురం, భీమిలి మండలాల్లో ఉడా సేకరించిన ల్యాండ్‌పూలింగ్ వ్యవహారంలో రూ.600 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పత్రికల్లో అనేక కథనాలొచ్చాయని, దీనిపై లోక్‌సత్తా పార్టీ కీలక అంశాలను పరిశీలించి అక్రమాలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చిందన్నారు. సీఎం బాబు తక్షణమే ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. పూలింగ్ అక్రమాల వల్ల పెద్ద ఎత్తున పేద రైతులు నష్టపోతారన్నారు. పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం, ఆనందపురం మండలం దబ్బంద, గండిగుండం, కొమ్మాది, భీమిలి మండలంలో నేరెâýæ్ళవలస గ్రామాల్లో కొన్ని నెలలుగా రాజకీయ దళారీలు పక్కా ప్రణాళికలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దీని వెనుక ప్రభుత్వ అధికారుల హస్తం ఉన్నట్టు స్పష్టమైందని తెలిపారు. తొలిదశలో ఉడా సేకరించిన 359 ఎకరాలు, రెండో దశలో 183 ఎకరాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ల్యాండ్‌పూలింగ్ కోసం మూడు జీవోలు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. భూమి సేకరించనున్న రైతుల పేర్లు, సర్వే నంబర్లతో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎం.ఎస్.ఎ¯ŒS.మూర్తి, వడ్డిహరి గణేష్, చంద్రమౌళి, చిరంజీవి, హర్ష, పక్కి శంకర్ పాల్గొన్నారు. -
అవినీతి రహిత సమాజం యువతతోనే సాధ్యం
లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ బద్వేలు అర్బన్: అవినీతి రహిత సమాజం యువతతోనే సాధ్యమవుతుందని లోక్‌సత్తాపార్టీ జాతీయ అధ్యక్షులు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక రాచపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీజీ కళాశాలలో దేశాభివృద్ధిలో, అవినీతి రహిత సమాజ స్థాపనలో యువత పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారన్నారు. అందరికీ విద్య అందించినపుడే సమాజ నిర్మాణం కూడా బాగుంటుందన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గంగిరెడ్డి తరుణ్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంపై అవగాహన పెంచుకోవడంతోపాటు అనుకున్నది సాధించాలనే సంకల్పం ఏర్పరుచుకోవాలని అప్పుడే విజయం సాధించగలుగుతారన్నారు. సదస్సు అనంతరం పీపుల్ అగైనెస్ట్ కరప్షన్ అనుబంధ సంస్థ ప్రజ్ఞ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీ పరీక్షలలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలలో గెలుపొందిన పి.సుబ్బరాయుడు, రాజశేఖర్, ఐ.సునీల్‌కుమార్‌లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు రాచపూడి నాగభూషణం, ఏవో రాచపూడి సాయిక్రిష్ణ, పీపుల్ అగైనెస్ట్ కరప్షన్ వ్యవస్థాపకులు మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ఎస్ఐలు నరసింహారెడ్డి, రఫి, నూర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. -
బాబుకు ప్రజాదరణ తగ్గింది: లోక్‌సత్తా
సాక్షి, విజయవాడ: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని, అందుకే ఆయనకు ప్రజాదరణ తగ్గిందని లోక్‌సత్తా పార్టీ అభిప్రాయపడింది. విజయవాడ రోటరీ చిల్డ్రన్స్ ఆడిటోరియంలో మంగళవారం లోక్‌సత్తాపార్టీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు వల్ల ప్రజలకు ఎటువంటి లాభం లేదని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు పెరిగిపోయాయని, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా గురించి కనీసం మాట్లాడలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. -
లోక్‌సత్తా రద్దు కాలేదు
► ఎన్నికల్లో పోటీ చేస్తాం: పార్టీ తీర్మానం ► తాత్కాలిక విరమణే.. నిష్ర్కమణ కాదని వెల్లడి సాక్షి, హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ రద్దు కాలేదని, ఎన్నికల్లో పోటీ చేస్తుందని పార్టీ స్పష్టం చేసింది. ప్రజాభిప్రాయాన్ని జాగృతం చేశాక మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఇది తాత్కాలిక విరమణే తప్ప నిష్ర్కమణ కాదని రాజకీయ తీర్మానంలో వెల్లడించింది. గతంలో తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేయలేదని, పార్టీగా పుంజుకున్నాక ఎన్నికల్లో పోటీచేసిన విషయాన్ని తీర్మానంలో ప్రస్తావించింది. శనివారం జరిగిన లోక్‌సత్తా పార్టీ 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఎన్నికల్లో పోటీపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారావు మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ఓడినంత మాత్రాన మునిగిపోయిందేమీ లేదన్నారు. మూడు ఎన్నికల్లో పాల్గొన్నామని.. ఓటేయలేదంటూ జయప్రకాశ్ నారాయణ్ ఆగ్రహంతోనో, ఆవేదనతోనో ఇక పోటీ చేయమని ప్రకటించారని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు జేపీ మాట్లాడుతూ.. ‘పోటీ చేద్దామనుకుంటే మీ ఇష్టం. అయితే ఏ లక్ష్యం కోసం చేయదలుచుకున్నారనేది ముఖ్యం’ అన్నారు. ఆగ్రహంతోనో, ఆవేశంతోనో ఎన్నికల్లో పోటీ చేయొద్దనే నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దేశంలో ధన రాజకీయాలకు (ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం) తెలుగు గడ్డ పునాది వేసిందని.. అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు విస్తరించి జమ్మూకశ్మీర్‌కు కూడా ఈ జాఢ్యం చేరుకుందని జేపీ ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణకు జిమ్మిక్కులు పనికిరావు బంగారు తెలంగాణ దిశలో సాగాలంటే జిమ్మిక్కులు పనికిరావని, నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని లోక్‌సత్తా పేర్కొంది. వివిధ వర్గాల సంక్షేమానికి చేసిన వాగ్దానాలు ప్రభుత్వం అమలుచేయాలని తీర్మానించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోం దని విమర్శించింది. కార్యక్రమంలో లోక్‌సత్తా జాతీయ అధ్యక్షు డు సురేంద్ర శ్రీవాస్తవ, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కన్వీనర్ బండా రు రామ్మోహనరావు, పార్టీ రాష్ట్ర కోశాధికారి పి.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఏ ప్యాకేజీ.. ప్రత్యేక హోదాతో సరితూగదు
శ్రీకాకుళం అర్బన్ : లోక్‌సత్తా మార్కు రాజకీయాలే రాష్ట్రాన్ని నిజమైన అభివృద్ధి వైపు నడిపిస్తాయని ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు పంచాది రాంబాబు అన్నారు. శ్రీకాకుళంలోని రామలక్ష్మణ కూడలి వద్దనున్న క్రాంతి భవన్లో ఆదివారం లోక్‌సత్తా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. కేంద్రం ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా... అవి ప్రత్యేకSహోదాతో సరితూగవని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.పోలినాయుడు మాట్లాడుతూ పార్టీ భావజాలాన్ని యువతలోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ఇటీవల రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన పంచాది రాంబాబును ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు అభినందించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.విష్ణుమూర్తి, జిల్లా కార్యదర్శి ఎం.సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఎ.నాగేశ్వరరావు, బి.గౌరీశంకర్, ఆమదాలవలస, శ్రీకాకుళం, పలాస, నరసన్నపేట, ఎచ్చెర్ల నియోజకవర్గాల పార్టీ బాధ్యులు, సీనియర్ నాయకులు కె.అన్నంనాయుడు, వి.అప్పలరాజు, టి.మాధవరావు, ఆర్.గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
నియంతలా న్యాయ వ్యవస్థ: జేపీ
హైదరాబాద్: న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభాగ్యులకు సత్వర న్యా యం అందేలా చూసినప్పుడే న్యాయవాద వృత్తికి సార్ధకత చేకూరుతుందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. సోమాజిగూడలో మినర్వా కాఫీషాప్‌లో ఆది వారం ‘లా స్కూల్101.. క్రిసెండో-2016’ పేరుతో నిర్వహించిన మ్యూట్ కోర్ట్‌లో ఆయన పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థ పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తమను తామే న్యాయమూర్తులుగా నియమించుకునే విధానం సరైంది కాదన్నారు. అత్యున్నత న్యాయవ్యవస్థ నియంతలా వ్యవహరిస్తుందని, ప్రజాస్వామ్యానికి ఇది మంచి ది కాదన్నారు. దేశంలో దాదాపు 3కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వ్యాజ్యాల పరిష్కారంలో సుదీర్ఘ జాప్యం తో వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం న్యాయ విద్యార్థులకు జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజశేఖర్ గోపాల జోస్యుల, పవన్ కళ్లెం, సత్యేంద్రసింగ్, సునీల్ నీలకంఠన్, శ్లోక, వెన్నల కృష్ణ సహా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ! ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు !
-
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
జిల్లాల పునర్విభజనపై.. లోక్‌సత్తా ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం కౌడిపల్లి: జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని లోక్‌సత్తా నర్సాపూర్ నియోజకవర్గం కన్వీనర్ నాగేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం కౌడిపల్లి బస్టాండ్ ఆవరణలో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించారు. నర్సాపూర్ నియోజక వర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయడంతోపాటు ఏ జిల్లాలో కలపాలన్న ప్రజలు ఆభిప్రాయాన్ని పోస్టుకార్డుపై రాసిన సీసీఎల్ఏ అడ్రస్ బాక్స్‌లో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులన్నారు. జిల్లా, రెవెన్యూ మండలాల పునర్విభజనలో ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వారి సౌలభ్యం కోసం ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు, పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్నందున అనుకూలంగా ఉండేట్లు చూడాలన్నారు. గ్రామస్తులు కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలపై అభిప్రాయాలను తెలియజేయాలి
భువనగిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా ఏర్పాటు చే యనున్న జిల్లాలపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కన్వీనర్ బండారు రామ్మోహన్రావు కోరారు. శుక్రవారం స్థానికంగా జరిగిన సంఘం డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ప్రతినిధులు జంపాల అంజయ్య, కాచరాజు జయప్రకాశ్ తదితరులు ఉన్నారు. -
లోక్‌సత్తా పార్టీ రద్దు కాలేదు
దేవీచౌక్ (రాజమహేంద్రవరం) : రానున్న ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని మాత్రమే లోక్‌సత్తా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుందని, దీని అర్ధం పార్టీ రద్దయినట్టు కాదని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కన్వీనర్ బండారులంక రామ్మోహనరావు తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకపై లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామని పేర్కొన్నారు. పార్టీ అంశాలపై వివిధ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎంవీ రాజగోపాల్, ఎన్ఎస్ రామచంద్రమూర్తి, బి.శ్రీనివాస్, సీఎస్ కామేశ్వరరావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
3నుంచి లోక్‌సత్తా ఆవిర్భావ వారోత్సవాలు
పరకాల : ఉద్యమ సంస్థ లోక్‌సత్తా ఆవి ర్భావ వారోత్సవాలను 3 నుంచి నిర్వహిం చనున్నట్లు సంస్థ తెలంగాణ, ఏపీ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహనరావు తెలిపారు. పట్టణంలో ఆదివా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ, పాలనా సంస్కరణల కోసం ఏ ర్పడిన లోక్‌సత్తా ఇప్పటికే అనేక విజయా లు సాధించిందన్నారు. ఈ మేరకు మలిదశ ఉద్యమంలో మరికొన్ని లక్ష్యాలతో 3 నుంచి 10 వరకు ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పోటీలు, రౌండ్ టేబుల్ స మావేశాలు తదితర కార్యక్రమాలు ఉంటాయని, ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కన్వీనర్ కామిడి సతీష్‌రెడ్డి, వీణవంక రమణాచారి పాల్గొన్నారు. -
సీఎంలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి
లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ సాక్షి, హైదరాబాద్: నిజాయితీ, సమర్థతతో అధికారంలో మనుగడ సాధించడం ప్రస్తుత వ్యవస్థలో కష్టమని లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ముఖ్యమంత్రులను ఎన్నుకొనేందుకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు. అవిశ్వాసం, బడ్జెట్లకే విప్‌లను పరిమితం చేయాలని, ఆర్టికల్-356ను నామమాత్రం చేయడం వంటి సంస్కరణలు చేపడితేనే అరుణాచల్ వంటి రాజకీయ సంక్షోభాలు, నీతిమాలిన రాజకీయాలను కట్టడి చేయవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కేవలం గవర్నర్, స్పీకర్, విశ్వాస పరీక్షలకు, కొన్ని రాజకీయపార్టీలకు పరిమితమైనది కాదన్నారు. రాష్ట్రాల్లో ప్రోత్సహిస్తున్న డబ్బు రాజకీయాలు, పార్టీలు విప్ల పేరుతో చట్టసభ సభ్యుల గొంతునొక్కడం అసలైన సమస్యలని ఆయన తెలిపారు. -
స్థానిక పార్టీలకు ఈసీ షాక్
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఎంఐఎంతో సహా 191 స్థానిక పార్టీల రిజస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఆదాయ పన్ను రిటర్నులు, తనిఖీ చేసిన ఖాతాల వివరాలు సమర్పించకపోవడమే కారణమని తెలిపింది. వేటు పడిన పార్టీల్లో ఆర్పీఐ-కోబ్రాగడే ఫ్యాక్షన్, తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సత్తా, యూపీకి చెందిన పీస్ పార్టీలున్నాయి. ప్రస్తుతం 359 పార్టీలు కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. వీటిలో 17 గుర్తింపు పొందినవి ఉన్నాయి. అవసరమైన పత్రాలు సమర్పించని 326 పార్టీలకు నోటీసులు పంపామని కమిషనర్ జేఎస్ సహారియా చెప్పారు. గడువు పొడిగించినా, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఈ 191 పార్టీల నుంచి స్పందన రాలేదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీచేయాలనుకునే పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి. ముంబై మహానగర ఎన్నికలు, ఇతర స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతోన్న ఎంఐఎంకు ఈ పరిణామం ఎదురు దెబ్బే. ఎన్నికల నియమావళిని అనుసరించి కొన్ని లోపాలు జరిగిన మాట వాస్తవమేనని పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
లోక్ సత్తా అధికార ప్రతినిధి అరెస్ట్
హైదరాబాద్: లోక్ సత్తా అధికార ప్రతినిధి సాంబిరెడ్డిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 2014లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి సాంబిరెడ్డిని రిమాండ్‌కు తరలించారు. -
'గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి'
- 'సాక్షి' టీవీ ప్రసారాల నిలిపివేతపై లోక్‌సత్తా పార్టీ డిమాండ్ హైదరాబాద్: ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను తామే నిలిపివేశామని స్వయంగా రాష్ట్ర మంత్రులే ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వమే భావప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించిందని, దీనిపై తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని లోక్‌సత్తా పార్టీ డిమాండ్ చేసింది. రాజ్యాంగ ప్రమాణాలకు విరుద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ శనివారం ఓ ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. తప్పుగా ఆలోచించడమే తనకు తెలియదని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాలను ఎందుకు నిలిపివేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రులకు సాక్షి టీవీ ప్రసారాలపై అభ్యంతరాలుంటే మీడియా ముందు తమ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు. -
రాజకీయ ఫిరాయింపులు దారుణం: లోక్‌సత్తా
విజయవాడ: రాష్ట్రంలో రాజధాని చుట్టూ రాజకీయం నడుస్తోందని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ తెలిపారు. పరిపాలన పూర్తిగా స్తంభించిందన్నారు. ఆదివారం ఇక్కడ వర్మ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ ఫిరాయింపులు దారుణమన్నారు. ఎమ్మెల్యే రాజ్య వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని... దాంతో ఎమ్మెల్యేలు కోట్లు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికారపక్షంలోకి ఫిరాయిస్తున్నారని అన్నారు. చంద్రబాబు సమర్థుడైతే తెలంగాణలో టీడీపీ నాయకులు టీఆర్ఎస్లోకి ఎందుకు ఫిరాయిస్తున్నారని ప్రశ్నించారు. -
కార్మిక హక్కులను కాలరాస్తున్నాయి: నారాయణ
హైదరాబాద్: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ కేంద్ర కమిటీ కార్యదర్శి నారాయణ అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్ నుంచి నారాయణగూడ ఏఐటీయూసీ భవన్ వరకు కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏఐటీయూసీ భవన్ వద్ద జరిగిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడారు. కార్మిక వర్గానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హక్కులు లేకుండా చేస్తున్నాయని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. లోక్‌సత్తా ఆధ్వర్యంలో...: లోక్‌సత్తా ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షులు పాండురంగారావు, ఆర్గనైజేషన్ చైర్పర్సన్ సరోజనీదేవి, ఉపాధ్యక్షులు దుర్గారావు పాల్గొన్నారు. -
ఫిరాయింపులు అప్రజాస్వామికం: జేపీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ మారేలా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం అప్రజాస్వామికం, అనైతికమని లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి, అధికారంలో ఉన్న పార్టీలోకి ఫిరాయించడాన్ని ఒక వ్యాపారంగా భావిస్తున్నారని ఆరోపించారు. ‘‘రాజకీయాలు, డబ్బును సమానంగా చూసేవారిని, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టేవారిని, ఎన్నికయ్యాక రూ.కోట్లు సంపాదించుకునే వారినే పార్టీలు ఎంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పార్టీలు ఎలాంటి వారికి టిక్కెట్లిచ్చాయి? వారు సమయం రాగానే అధికార పక్షంవైపు వెళ్లిపోయారు. రేపు మరోపార్టీ అధికారంలోకి వస్తే అందులో చేరిపోతారు. సామర్థ్యం, నైతిక విలువలు, సమాజంలో గౌరవం ఉన్నవారు ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి పనులు చేయగలరు’’ అని జేపీ చెప్పారు. ‘‘స్పీకర్ అధికార పార్టీకి చెందిన మనిషి కాబట్టి ఫిరాయింపుదారులకు అడ్డుచెప్పే వారే కనిపించడం లేదు. స్పీకర్ చేతిలో అధికారం ఉన్నంత కాలం ఇలాగే ఉంటుంది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని ఎన్నికల సంఘానికి, గవర్నర్‌కు కల్పించాలి. ఎన్నికల సంఘాన్ని సంప్రదించి గవర్నర్ నిర్ణయం తీసుకునే విధానాన్ని అమలు చేయాలి’’ అని స్పష్టం చేశారు. -
ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో..
ఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల నిరోధకానికి కఠిన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం ఎలక్షన్ కమిషన్‌కు ఇవ్వాలన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో సాక్షి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులు అనైతకమని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాప్రతినిధులను పక్కన పెడుతున్నారని జేపీ విమర్శించారు. -
సీఎంను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి: జేపీ
అప్పుడే ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించరు సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సీఎంలను ఎన్నుకునే విధానాన్నితీసుకురావాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పుడే ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించరని అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు పార్టీలు మారడం నుంచి రాష్ట్రపతి పాలన వరకు జరుగుతున్న పరిణామాలు ప్రేక్షకపాత్ర వహించాల్సినవి కాదన్నారు. విలువలకు, ప్రజా ప్రయోజనాలకు అధికారం ఎంతో దూరమైందనడానికి పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలే తాజా రుజువని పేర్కొన్నారు. -
'లోక్‌సత్తా' జేపీ రాయని డైరీ
ప్రజాస్వామ్యంలో ఏదీ ఎవరిదీ కాదు. యూపీఏ సోనియాది కాదు. ఎన్డీఏ మోదీది కాదు. టీఆరెస్ కేసీఆర్‌దీ కాదు. పైన ఉన్నది ఏదైనా కింది వరకు అందరికీ చెందాలి. టీవీలో ఓ యాడ్ చూశాను. ‘ఎక్స్క్యూజ్ మీ.. మీరేదైతే తింటున్నారో దాన్నే నన్ను కూడా తిననివ్వండి’ అంటాడు అతను ఆమెతో. బహుశా ఆమె.. చాక్లెట్ బార్ లాంటిదేదో తింటూ ఉంటుంది. అదీ ప్రజాస్వామ్యం అంటే! అది కూడా పూర్తి ప్రజాస్వామ్యం కాదు. హాఫ్ డెమోక్రసీ. ‘తిననివ్వండి’ అని అడగడం పోరాటం. ‘తినిపెట్టండి’ అని ఇవ్వడం సామ్యవాదం. రెండూ కలిస్తేనే పూర్ణ ప్రజాస్వామ్యం. పాలిటిక్స్ నుంచి ‘లోక్‌సత్తా’ను ఎత్తేసి వారం అవుతోంది. మొత్తుకున్నవాళ్లు ఒక్కరూ లేరు. ‘ఎత్తేయడం ఏంటి?’ అని పాపం ఒకరిద్దరూ మాత్రం ఆశ్చర్యంగా అడిగారు. ‘పార్టీ ఉంటుంది. ఫైట్ చేసేవాళ్లు ఉంటారు. ఎలక్షన్స్‌కి మాత్రం వెళ్లం’ అని చెప్పాను. వాళ్లింకా ఆశ్చర్యంగానే చూస్తున్నారు. ఏదైనా ఉంటేనే కదా ఎత్తేయడానికి వీలౌతుంది. లేనిదాన్ని ఎలా ఎత్తేస్తారని వాళ్ల సందేహం! లోక్‌సత్తా ఈ పదేళ్లలో ప్రజల్లోకి వెళ్లిందా? ప్రజలకు దూరంగా వెళ్లిందా? ఫైల్స్ తిరగేయాలి. లోపల అన్నీ జీవోలే ఉంటాయేమో! ప్రజలకు హామీలు తప్ప జీవోలు అర్థం కావు. హామీలు ఇవ్వకుండా చేయించుకొచ్చిన జీవోలు అసలే అర్థం కావు. ఒక్కొక్కరూ వచ్చి పరామర్శిస్తున్నారు! అరె, ఏం జరిగిందని? పార్టీ ఆఫీస్ నుంచి ఫామ్ హౌస్‌కి వచ్చినట్టు, పాలిటిక్స్ నుంచి పబ్లిక్‌లోకి వచ్చాను. అంతే కదా! పవన్ కల్యాణ్ ఒప్పుకోవడం లేదు. ‘ఇది కరెక్టు కాదేమో జేపీజీ’ అంటున్నాడు. ‘పోనీ కరెక్ట్ అయిందేదో నువ్వు చెప్పు కల్యాణ్’ అన్నాను. ఏమీ మాట్లాడలేదు. బెరుగ్గా చూశాడో, కరుగ్గా చూశాడో గానీ గుడ్లురిమి చూశాడు. ‘లోక్‌సత్తా జెండాలో స్టార్ ఉంది. జనసేన జెండాలో స్టార్ ఉంది. పాలిటిక్స్‌లో మాత్రం మన స్టార్డమ్ లేదు. మీ సత్తా తగ్గినట్టే.. నా సేనా తగ్గిపోదు కదా జేపీజీ..’ అన్నాడు కల్యాణ్. ఇంకోమాట కూడా అన్నాడు. ‘మీరిలా సడెన్‌గా పాలిటిక్స్ నుంచి బయటికి రావడం చూస్తే నాకేదో సందేశాన్నో, సంకేతాన్నో ఇస్తున్నట్లుంది’ అన్నాడు. నిజమే!! ‘ప్రశ్నిద్దాం రండి’ అని నేను పాలిటిక్స్‌లోకి వెళ్లాను. ‘ప్రశ్నించండి పొండి’ అని కల్యాణ్ పాలిటిక్స్‌లోకి వచ్చాడు. జనం ప్రశ్నించడం లేదు. సమాధానం అడగడం లేదు. టీవీల్లో బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు చూస్తూ ఏడాదంతా హ్యాపీగా గడిపేస్తున్నారు. సినిమాల్లో నటించలేక కల్యాణ్‌కి, పాలిటిక్స్‌లో జీవించలేక నాకు అలసట వస్తోంది. ఇద్దరం ఒకే పడవలో ఉన్నట్లున్నాం. ‘అదే బెటర్ జేపీజీ.. ఒకళ్లం రెండు పడవల మీద లేకుండా’ అనేసి వెళ్లిపోయాడు కల్యాణ్. తర్వాత రాజమౌళి వచ్చాడు. సిరివెన్నెల సీతా రామశాస్త్రి వచ్చారు. రాజకీయాలను సంస్కరించ డానికి వచ్చి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటని వాళ్లిద్దరూ ప్రశ్నించారు. నవ్వాను. ప్రజాస్వా మ్యంలో ఏదీ ఎవరిదీ కాదు. జేపీ లేనంత మాత్రాన లోక్‌సత్తా లేనట్టు కాదు. జేపీకి సత్తా లేనట్టూ కాదు. - మాధవ్ శింగరాజు -
జేపీ నిర్ణయం అభినందనీయం: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీః ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ నిర్ణయించడాన్ని వ్యక్తిగతంగా అభినందిస్తున్నట్టు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ ప్రారంభ సందర్భంలో ఇష్టాగోష్టిగా చర్చించినప్పుడు కొత్త పార్టీ స్థాపించి దానిని విజయపథంలోకి తీసుకెళ్లడం అంత సులభం కాదనీ, ఎన్నికల రాజకీయాలకు అతీతంగా ముందుకెళితే మరింత ప్రభావం ఉంటుందని తాను సూచించినట్టు వివరించారు. రాజకీయం ద్వారానే మార్పు వస్తుందని ఆనాడు భావించారని, ఇప్పుడు ఆ అభిప్రాయం వేరుగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా చైతన్యం కలిగించి సంబంధిత వ్యవస్థలపై మార్పు కోసం ఒత్తిడి తేవడం ఆహ్వానించదగిన పరిణామమని, జేపీ నిర్ణయం ప్రజాస్వామ్య పటిష్టతకు ఉపయోగపడగలదని భావిస్తున్నానని చెప్పారు. -
‘సత్తా’ ఎందుకు చాటలేదు?
సందర్భం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లోక్‌సత్తా అధ్యాయం ముగి సింది. ’కొత్త తరానికి కొత్త రాజ కీయం’ అనే నినాదంతో లోక్ సత్తా పార్టీని ప్రారంభించిన జయప్రకాష్ నారాయణ్ పదేళ్ళ ప్రస్థానం తర్వాత, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రక టించారు. ఐఏఎస్ అధికారిగా అత్యంత విజయవంతమైన జేపీ, ఒక రాజకీయ నాయ కుడిగా మాత్రం విఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీని స్థాపించి వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్ని కలకు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ వంటివారు లోక్ సత్తా వైఫల్యం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? 1996 నుండి ఇప్పటిదాకా అంటే 20 ఏళ్ళు జేపీతో కలసి పనిచేసిన వ్యక్తిగా, ఆయన్ని అతి దగ్గర నుండి చూసిన వ్యక్తిగా నా అభిప్రాయాల్ని పాఠకుల ముందు ఉంచుతున్నాను. ఒక రాజకీయ పార్టీగా లోక్‌సత్తా విఫలం కావ డంలో, 50% పరిస్థితుల ప్రభావం ఉంటే, 50% జేపీ స్వయంకృతం. దేశం మీద ప్రేమ, నిజాయితీ ఈ రెండింటి విషయంలో జేపీని వేలెత్తి చూపడం సూర్యు డిపైకి ఉమ్మి వేయడం లాంటిదే. కాని, ఒక లీడర్‌గా జేపీలో చాలా లోపాలు ఉన్నాయి. ఆయన చాలా పొర పాట్లు చే శారు. లోక్‌సత్తాకి బలమైన కేడర్ లేకపోవడం పెద్ద మైనస్. లోక్‌సత్తా ఉద్యమసంస్థగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, ఓ 10% గ్రామాల్లో లోక్‌సత్తా శాఖలు ఉండేవి. వీటిని ఉపయోగించుకుని పార్టీకి కేడర్ నిర్మాణం చేసుకోకుండా, జేపీ హడావుడిగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఇప్పుడు పవన్ వంటివాళ్లు తమ అభిమానుల్ని కేడర్‌గా మార్చుకుని, వచ్చే ఎన్నికలనాటికి వారిని సిద్ధం చేసుకోవాలని భావిస్తు న్నట్లయితే, వారికి ఇప్పటి నుంచే రాజకీయ శిక్షణ, ఆర్గనైజేషన్ అనుభవం కోసం చిన్న చిన్న కార్యక్రమాలు అప్పగించడం అవసరం. లోక్‌సత్తా పార్టీ ప్రారంభించినప్పుడు మంచి నాయకులు పార్టీలో చేరారు. కాని వారిని ఉపయోగించు కోవడంలో జేపీ విఫలం అయ్యారు. ఎవరు ఏ పనికి ఉపయోగపడతారు అనే అంచనా వేయడంలో జేపీది అత్యంత పేలవమైన రికార్డ్. ఉదాహరణకి ఓ ప్రముఖ సామాజిక కార్యకర్త, డాక్టర్ లోక్‌సత్తాలో చేరారు. ఆయన హైదరాబాద్ స్థాయిలో నెట్ వర్కింగ్ చేయగలరు, మంచి అధికార ప్రతినిధిగా వ్యవహరించగలరు. ప్రజలతో, కేడర్‌తో డీల్ చేయడం ఆయనకు రాదు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి సంస్థాగత వ్యవహారాలు చూడమని చెప్పారు. ఆయన ఏ జిల్లాకి వెళ్ళినా జేపీకి ఆయనపై ఆరోపణలు వచ్చేవి, దీనితో జేపీ ఆయన మీద కోప్పడ్డారు, దానితో ఆయన అలిగి ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. జేపీ కనుక, ఆ వ్యక్తి చేయగల్గిన పనులు మాత్రమే అప్పగించి ప్రోత్సహిస్తే ఆయన ఒక పెద్ద అసెట్ అయ్యే వారు. జేపీ చేసిన ఇంకో పెద్ద తప్పు ఏంటంటే.. ఆయన దగ్గరికి రకరకాల భావజాలాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తులు వచ్చారు. అందరూ వారివారి రంగాలలో కాస్త పేరున్న వారే. వీరు పార్టీని ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా నడపమని జేపీకి సలహాలు ఇచ్చేవారు. వీరందర్నీ కలిపి కూర్చోపెట్టి, ఒక తాటి మీదకు తీసుకొచ్చి, పార్టీకి ఒక డెరైక్షన్ చూపించే పని జేపీ ఎప్పుడూ చేయలేదు. అలాగే కార్యక్రమాలను సమీక్షించి పనిచేసింది ఎవరు? షో చేసింది ఎవరు? అనేది కూడా అంచనా వేసేవారు కాదు. ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేసేటప్పుడు, నిలకడైన నిర్ణయాలు ఉండాలి. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటుందో, మార్గం కూడా అంతే స్పష్టంగా ఉండాలి. జేపీకి తన మార్గం మీద ఎప్పుడూ నిలకడలేదు. లోక్‌సత్తా ఉద్యమసంస్థ ద్వారా ఆయన కొన్ని సంస్కరణలు సాధించారు. మార్పుని వేగవంతం చేయడం కోసం ఆయన పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచి ఢిల్లీని ప్రభావితం చేయాలనుకున్నారు. అయితే, ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక, అధికారం ద్వారానే దేశాన్ని మార్చగలం అని నమ్మాక ఇక పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలి. కాని, జేపీ కాసేపు పార్టీ ద్వారా, కాసేపు లోక్‌సత్తా ఉద్యమం ద్వారా, కాసేపు సురాజ్య ఉద్యమం ద్వారా, కొన్నాళ్ళు అధికా రంలో ఉన్న వాళ్లు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయటం ద్వారా మార్పులు తేవాలని ప్రయత్నం చేశారు. అధికారం లేదా, గణనీయమైన ఓట్ల శాతం సాధించి దేశాన్ని మార్చాలనుకున్న ఆయన, ఆ దిశగా నిలకడ అయిన కృషి చేయలేదు. జేపీకి జనంలో కలవడం అంత ఇష్టం ఉండదు. మనసులో జనం మీద అంతులేని ప్రేమ ఉన్నా, దాన్ని ఆయన వ్యక్తం చేయలేరు. పుస్తకాలు చదవడం, రాయడం, చర్చించడం మీద ఉన్న శ్రద్ధ, ఫీల్డ్ మీద ఉండదు. పదేళ్ళ పార్టీ ప్రస్థానంలో ఆయనంతట ఆయన ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడా తీసుకోలేదు. 2009 ఎన్నికల ముందు అయితే, ఆయన తాను ముఖ్యమంత్రి అయితే ఏ రంగాన్ని ఎలా బాగు చేయాలి అంటూ ఆలోచించిన దాన్లో పది శాతం సమయం కూడా, తాను అధికారంలోకి ఎలా రావాలో ఆలోచించి ఉండలేదు.. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడవడం దగ్గర నుంచి చూశాక జేపీకిమనుషుల మీద నమ్మకం పోయింది. తల్లి మీద ఒట్టు వేసి, ఎన్టీఆర్‌కు ద్రోహం చేయం అని జేపీకి మాట ఇచ్చిన వ్యక్తి, 24 గంటల్లో మాట మార్చి బాబు వైపు చేరిపోవడంతో ఆయనకు మనుషు లంటే నమ్మకం పోయింది. నమ్మితే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉన్నమాట నిజమే; కాని, రాజకీయాల్లో కనీసం నలుగురైనా నమ్మకస్తులు లేకపోతే మనుగడ సాగించడం కష్టం. కొత్తపార్టీ, అదీ ఒక ఆదర్శంతో పెట్టినప్పుడు, ఎంతో మంది యువత ఎన్నోరకాల ఆలోచనలతో వస్తారు. వీరిని వెన్నుతట్టి ప్రోత్సహించడం, పొరపాట్లను సరి దిద్దడం చాలా అవసరం. జేపీ గుడ్డిగా అందర్నీ ప్రోత్స హించేవారు. పార్టీలో జేపీ తర్వాతి స్థానంలో ఎక్కువ కాలం పనిచేసిన ఒకాయన మాత్రం అందర్నీ నిరాశ పర్చేవారు. యువత చిన్న విషయాలకే అసంతృప్తి చెందుతారు. ఇలా అసంతృప్తికి గురైన చాలా మంది యువత పార్టీకి దూరం అయ్యారు. ఇవన్నీ కలసి ఎన్నికల రంగం నుంచి లోక్‌సత్తా నిష్ర్కమణకు దారితీశాయి. - నరేష్ శిరమని వ్యాసకర్త పాత్రికేయుడు మొబైల్: 9912655225 -
ఇక ఎన్నికలకు దూరం
‘లోక్‌సత్తా 2.0’గా కొత్త అవతారం: జేపీ సాక్షి, హైదరాబాద్: ఉద్యమ సంస్థగా, పార్టీగా రాజకీయాలలో వచ్చిన మార్పులు, ప్రజల ఆలోచనా తీరుకు అనుగుణంగా కొత్త తీరుతో, సవరించిన ఎజెండాతో పోరాడాలని నిర్ణయించినట్లు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. మూడు కీలకాంశాల సాధనకు కార్యాచరణ రూపొందించుకొని ‘లోక్‌సత్తా 2.0’ పేరిట ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో జేపీ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు దూరంగా ఉండి పార్టీలకు అతీతంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మూడు కీలకాంశాలపై తక్షణ కార్యాచరణను చేపట్టనున్నామన్నారు. మొదటి అంశంగా ఫెడరలిజాన్ని పునర్నిర్వచించి... కేంద్రం అధికారాలు, దేశ సమగ్రతకు భంగం కలగకుండా రాష్ట్రాలకు పూర్తి స్వీయనిర్ణయాధికారాలనిచ్చి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించే వెసులుబాటు ఇవ్వటమని జేపీ తెలిపారు. ఉత్తమ ప్రమాణాలతో విద్య, వైద్యాన్ని ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం రెండో అంశమన్నారు. స్థానిక ప్రభుత్వం, పౌరులకు పూర్తి బాధ్యతలు, పన్నుల్లో వాటా అందించి స్థానిక సమస్యల పరిష్కారం, విధానాల అమల్లో వారిని పూర్తి భాగస్వాములను చేయడం మూడవ అంశమన్నారు. -
'రాజకీయాలు వ్యాపారంగా మారాయి'
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలు వ్యాపారంగా మారాయి అనడానికి ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీని వదిలి అధికారపార్టీ వైపు వెళ్లాలనే ప్రయత్నాలే తాత్కారణమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం సాక్షితో మాట్లాడుతూ... ఓట్లు వేసే ప్రజలకు పార్టీలు వేర్వేరు అనే భావనలో ఉండొచ్చుకాని... ఎన్నికైన ఈ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది పార్టీలకు మధ్య వ్యత్యాసంలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలు రాజకీయాలు అభిమానించే వారికి బాధకలిగించేవి అయినా అశ్యర్యాన్ని మాత్రం తెప్పించడంలేదన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు రాష్ట్రంలో ఉన్న అధికారాల మొత్తాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవడం వల్ల ఎమ్మెల్యేలు పనుల కోసం అధికార పార్టీ వైపు వెళ్లక తప్పడంలేదన్న భావన వ్యక్తమవుతుందని చెప్పారు. కేవలం ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్న అధికారం మంత్రులు, జిల్లా నాయకులు, గ్రామ స్థాయికి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నా గ్రామాల్లో మాకు కావాల్సిన పనులు మేము చేసుకోగలమన్న పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడే ఇలాంటి పరిమాణాలకు ముగింపు ఉంటుందని తెలిపారు. -
జలం కోసం కదిలిన జనం
రైవాడ నీటికోసం నిరసన పాదయాత్ర నాలుగో రోజు వికలాంగుల మద్దతు కృష్ణారాయుడుపేట(వేపాడ): రైవాడ జలాశయం నీటిని అదనపు ఆయకట్టుకు అందించాలని, పైపులైన్ నిర్మాణ ప్రతిపాదనలను శాశ్వతంగా విరమించుకోవాలన్న డిమాండ్లతో చేస్తున్న పాదయాత్ర నాలుగో రోజు బుధవారం కొనసాగింది. రైవాడ జలాశయం సాగునీటి సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కృష్ణారాయుడుపేట గ్రామ సమీపంలో రైవాడ కాలువ వద్ద గ్రామపెద్దలు అలబోని పైడిబాబు, బోజంకి శ్రీనివాస్ నేతృత్వంలో అధికసంఖ్యలో మహిళలు కాళీబిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాగునీటి సాధన కమిటీ నాయకుడు వేచలపు వెంకట చినరామునాయుడు మాట్లాడుతూ తమ ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందించాలని దశాబ్దాల కాలంగా ఆందోళన చేస్తున్నామని, జీవీఎంసీ చెల్లించాల్సిన రూ.112 కోట్లతో పంట కాలువలు నిర్మించాలన్న డిమాండ్లతో పాదయాత్ర చేస్తున్నామన్నారు. పాదయాత్రకు మద్దతు పలికిన లోక్‌సత్తా నేత బీశెట్టి బాబ్జి మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తక్షణమే అదనపు ఆయకట్టుకు సాగునీరందించాలన్నారు. ధన కమిటీ సభ్యుడు చల్లా జగన్ మాట్లాడుతూ కాలువను ఆనుకున్న గ్రామాలతో పాటు అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో చినగుడిపాల సర్పంచ్ శీరంరెడ్డి సింహాద్రప్పడు, కండిపల్లి పెదనాయుడు, గండి నాయనబాబు, మల్లునాయుడు, నెక్కల శ్రీను, బి.వెంకన్న, కన్నబాబు, సూర్యనారాయణ, అధిక సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొన్నారు. జమ్మాదేవిపేటలో ప్రారంభమైన పాదయాత్ర ఆనందపురం, ఏకేజేపాలెం, కృష్ణారాయుడుపేట, పోతనవలస, ఉగ్గినవలస, ఆరైవై అగ్రహారం, కేజేపురం, ముషిడిపల్లి చేరుకుని రాత్రి బస చేశారు. చివరిరోజు పాదయాత్రనిర్వహించే గ్రామాలు: పాదయాత్ర చివరిరోజు గురువారం ఎల్.కోట మండ లం భూమిరెడ్డి పాలెంలో ప్రారంభమై గవరపాలెం, దాలివలస, కేకే అగ్రహారం, వారాడ, సంతపాలెం, మీదుగా ఆనందపురం కూడలికి చేరుకుంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ముగింపు సభ జరగనుంది. -
ఓటింగ్, షౌటింగ్ స్థాయికి దిగజారిపోయింది
ప్రజాస్వామ్యంపై జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో నాయకత్వాన్ని చూడకుండా కేవలం తాత్కాలిక ధోరణులతో, భావోద్వేగాలతో ఓటు వేయడం.. తర్వాత ప్రతిరోజూ దిగిపోండంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేయడం వల్ల భారతదేశ ప్రజాస్వామ్యమే వక్రమార్గం పడుతోందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. అమెరికాలోని హర్వర్డ్ విశ్వవిద్యాలయంలో శని, ఆదివారాల్లో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్‌లో జేపీ పాల్గొని అక్కడి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగ వివరాలను పార్టీ సోమవారం మీడియాకు విడుదల చేసింది. స్థానిక స్వయం పాలన, సరైన విధివిధానాలు లేకపోవడం వల్లే భారత ప్రజాస్వామ్యం ఓటింగ్, షౌటింగ్ స్థాయికి దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. అమెరికా ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థి ఖరారు కావడానికే విద్య, ఆరోగ్య విధివిధానాలపై హోరాహోరీగా రాజకీయ నాయకులు తలపడుతుంటే.. భారత్‌లో పార్టీలు, నేతల మధ్య విధానాలు, ఆలోచనల కనీస పోరాటమే లేదన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశ పరిపాలన రంగంలో మూడు మార్పులు చోటుచేసుకోవాలని జేపీ సూచించారు. మొదటిది.. ఢిల్లీ అధికారాలను కేంద్ర, విదేశాంగ అంశాలకే పరిమితం చేయాలి. రెండోది సొంత పాలనను, అందుకు విధానాలను రూపొందించుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకివ్వాలి. అవి స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి. మూడోది ప్రభుత్వ అధికార యంత్రాంగంలో నైపుణ్యాలను పెంపొందించి పారదర్శక వ్యవస్థను ప్రవేశపెట్టాలని జేపీ వివరించారు. -
సుపరిపాలనకే పట్టం కట్టండి
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చైతన్యపురి: ప్రజాసమస్యల పరిష్కారానికి కనీసం కాల్‌సెంటర్ కూడా ఏర్పాటు చేయలేని శక్తిహీనులు మన పాలకులని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. అలాంటి వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి, సుపరిపాలనను అందించే వారికే పట్టం కట్టాలని యువతకు పిలుపునిచ్చారు. గడ్డిఅన్నారం డివిజన్ పీఅండ్‌టీ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అధికారాలు లేకుండా మేయర్ పదవిని ఉత్సవ విగ్రహంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాయకులు డబ్బు, కులంతో జనాలను శాసిస్తున్నారు. ఎన్నికలు రాజకీయ నాయకుల కుటుంబాలకు ఉపయోగపడుతున్నాయో తప్ప, పన్నులు కట్టే ప్రజలకు కాదు. నాయకులు రాజకీయాన్ని ఓ వ్యాపారంలా చూస్తూ, ఏ పార్టీలో లాభముంటే అక్కడికి వలస పోతున్నారన్నా’రు. తాము గెలుపు కోసం బరిలోకి దిగలేదని, నిర్దిష్టమైన అజెండా కోసం లోక్‌సత్తా ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు. -
మార్పు కోసమే వన్ హైదరాబాద్
♦ స్వచ్ఛ, అవినీతి రహిత రాజకీయాలే లక్ష్యం ♦ నిర్దిష్ట ఎజెండాతోనే కూటమి ఏర్పాటు ♦ గ్రేటర్‌లోనూ డబ్బు రాజకీయమే... ♦ గూండాలు, కబ్జాదారులు పోటీలో ఉన్నారు. ♦ ఓటర్లు ఆలోచించి ఓటేయాలి ♦ లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ‘మార్పు’ కోసం అంటూ రాజకీయ రంగప్రవేశం చేసిన జయప్రకాష్ నారాయణ జేపీగా అందరికీ సుపరిచితులు. 1996లో ఐఏఎస్‌కు రాజీనామా చేసిన ఆయన సుపరిపాలన కోసం లోక్‌సత్తా ఉద్యమం ప్రారంభించారు. 2006లో లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా విస్తరించారు. ప్రస్తుతం ఆ పార్టీకి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గ్రేటర్ పరిధిలో అవినీతిని అంతం చేయాలని, ప్రజలకు మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. డబ్బు రాజకీయాలకు ఓటర్లు చెక్‌పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా, స్వచ్ఛ రాజకీయాల కోసమే మొదటిసారిగా వామపక్షాలతో కలిసి ‘వన్ హైదరాబాద్’ కూటమిని ఏర్పాటు చేశామంటున్న జేపీతో.... - సాక్షి, సిటీబ్యూరో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి ఎన్ని స్థానాల్లో గెలవబోతోంది? రాజకీయాలను మార్చటానికి ‘వన్ హైదరాబాద్ కూటమి’ని ఏర్పాటు చేశాం. నిర్ధిష్టమైన ఎజెండాతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇక్కడ గెలుపోటముల అంచనాలకు వెళ్లదలుచుకోలేదు. గెలవాలన్న ఆశతో.. సంప్రదాయ పార్టీలు కోట్లు ఖర్చు పెట్టి పోటీలో నిలుస్తున్నాయి. కానీ మేము అలా కాదు. నిజమైన ప్రత్యామ్నాయ విధానాలతో, ఎజెండాతో ప్రతి బస్తీలో జనాభాకు తగ్గట్టుగా అధికారాలు ప్రజల చేతిలో ఉండాలని కోరుకుంటున్నాం. స్థానికంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఎలా సాగింది. కొన్ని పార్టీల్లో కొందరు నాయకులు సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై మీరేమంటారు? రాజకీయం అంటే అధికారం అనుకుంటున్నారు. అధికారం అంటే...దోచుకోవటం, పైరవీలు చేసుకోవటంగా మారింది. ఎన్నికలు ఓటు వేసే వారి గురించి కాదు, పోటీ చేసే వారి కోసమనేలా మారింది వ్యవస్థ. ఎన్నికలు జాక్‌పాట్‌గా, వ్యాపారంగా మారాయి. అందుకే ...కార్పొరేటర్ అభ్యర్థి రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బు రాజకీయాలను ప్రజలే అంతం చేయాలి. వామపక్షాలతో కలిసి కూటమిగా లోక్‌సత్తా పోటీ చేయటానికి కారణమేమిటి? ఈ పార్టీల మధ్య భావ సారూప్యత ఉందంటారా? ఇది నిజమైన, నిజాయితీ కలిగిన కూటమి. అధికారం ప్రజల చేతిలో ఉండాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా, స్వచ్ఛ రాజకీయాలను ఆహ్వానిస్తున్నాయి. అభిప్రాయభేదాలు ఏ మాత్రం లేవు. అందువల్లనే సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎజెండా లేదు. నిర్ధిష్టమైన ఎజెండా, జనం సమస్యలపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లుతున్నది మా కూటమే. నగర ప్రజలు గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల్లో పార్టీల ఎన్నికల ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపిక ఎలా ఉందనుకుంటున్నారు? ఎన్నికల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఒక్కో డివిజన్లో రూ. 8 కోట్ల చొప్పున జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1200 కోట్లు ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. పైగా టికెట్లు కూడా గూండాలు, భూ కబ్జాదారులకు ఇచ్చారు. అలాంటి వారు ప్రజలకు మంచి పనులు ఏమి చేస్తారు? గెలిచిన తర్వాత దోచుకోవటమే పరమాధిగా పైరవీలు చేసుకుంటారు. వన్ హైదరాబాద్ కూటమి దీనికి పూర్తి భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా, స్వచ్ఛ రాజకీయాల కోసం పని చేస్తుంది. ప్రజలకు కనీస సౌకర్యాల కల్పించేందుకు కృషి చేస్తుంది. మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పార్కులు...ఒక్కటేమిటి 90 శాతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుంది. సామాన్యుడి చేతిలో అధికారముండాలి. పన్నుకట్టే వాడే ప్రభువు కావాలని కోరుకుంటున్నాం. మీ హయాంలో హైదరాబాద్‌కు ఏం చేశారు. ఇంకా ఎం చేయబోతున్నారు? హైదరాబాద్ నగరానికి కృష్ణా మూడవ దశ ద్వారా మంచినీరు రావటానికి కృషి చేశాను. దీనిపై అసెంబ్లీలో పోరాడి సాధించాను. కూకట్‌పల్లికి 8 ఎంజీడీల మంచి నీరు మాత్రమే సరఫరా అయ్యేది. ఈ నీటి సరఫరాను రెట్టింపు చేశాను. కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.2400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. పైప్లైన్ల కోసమే రూ. 700 కోట్లు ఖర్చు చేశాం. మెట్రో రైలు రాక సందర్భంగా అదనంగా ఏడు రహదారులకు ప్రణాళిక రూపొందించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించగలిగాను. ప్రతి పాఠశాలలో మాత్రశాలలు, మరుగుదొడ్లు, అదనపు గదులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అర్బన్ హెల్త్ సెంటర్లకు భవనాలతో పాటు, ప్రసూతి వసతులు కల్పించాలని కోరాం. నగరాభివృద్ధికి మేం ప్రత్యేకంగా దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాం. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ పాలన ఎలా ఉంది? మీరెన్ని మార్కులు వేస్తారు? ఇద్దరూ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు. ఇద్దరికీ మార్కులు ఏమి వేయను. కానీ పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. మోదీ ఆర్థిక వ్యవస్థ గట్టిపడేందుకు ప్రయత్నిస్తున్నారు. అవినీతి లేకుండా పారదర్శకంగా పనిచేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మంచి నినాదం. ఇది ఊరు,వాడ,పట్టణం, నగర స్థాయికి చేర్చాలి. నల్లగొండలో ఒక అమ్మాయి మరుగుదొడ్డి లేదని ఆత్మహత్య చేసుకోవటం తీవ్రంగా బాధించింది. కేసీఆర్ పూర్తిగా అధికార కేంద్రీకరణతో పనిచేస్తున్నారు. మంత్రులు, అధికారుల భాగస్వామ్యం ఏమీ ఉండడం లేదు. పనులు జనం దగ్గరికి వెళ్లటం లేదు. ప్రజల భాగస్వామ్యం గురించి మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఈ పద్ధతి మారితే మంచిదని నా అభిప్రాయం. మెరుగైన సమాజం కోసం...ఓటేద్దాం ‘గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లంతా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. కుల, మత, వర్గ విభేదాలు మరిచిపోయి మంచితనం, నిజాయితీ కలిగిన అభ్యర్థులకే ఓటు వేయాలి..’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం కమిషనర్ కార్యాలయంలో సొసైటీ ఫర్ స్మాల్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్యం కోసం రూపొందించిన కరపత్రాలు, డోర్ స్టిక్లర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గతంలోకంటే ఈసారి ఓటింగ్ శాతం తప్పనిసరిగా పెరగాలన్నారు. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఓటేయాలన్నారు. మచ్చలేని వ్యక్తులకే ఓటేయాలని లేకుంటే..ఐదేళ్లు నష్టపోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వినేష్రాజ్, ప్రధానకార్యదర్శి నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. - కవాడిగూడ -
యువత ఓటు విలువ తె లుసుకోవాలి
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చైతన్యపురి: యువత ఓటు విలువ తెలుసుకోవాలని లోక్‌సత్తా వ్యవ స్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. గడ్డిఅన్నారం డివిజన్ పీఅండ్‌టీ కాలనీ ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన ‘మీలో ఎవరు కార్పొరేటర్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని యువతతో ముచ్చటించారు. బడ్జెట్, మేయర్, స్థానిక సంస్థల అధికారాలు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై యువత ప్రశ్నలకు జేపీ సమాధానాలిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని, ప్రజా సమస్యలు పరిష్కరించే అభ్యర్థుల్ని ఎన్నుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా యువతకు క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా గ్రేటర్ అధ్యక్షుడు దోసపాటి రాము పాల్గొన్నారు. -
'గెలుపు కోసం సామదానభేద దండోపాయాలు'
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ సామదానభేద దండోపాయాలను ప్రయోగిస్తోందని సీపీఎం ధ్వజమెత్తింది. కులసంఘాలు, ఇతర సంస్థలకు తాయిలాలు ప్రకటించే దుస్థితితోపాటు, బెదిరించడం, లొంగదీసుకోవడం, డబ్బులు ఆశ చూపించడం వంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. అదేసమయంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం ఆంతరంగిక సంక్షోభంలో, రెబెల్స్ గొడవతో ప్రచారం చేసుకోలేని స్థితిలో ఉన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యల పరిష్కారానికి మెరుగైన స్వచ్ఛ హైదరాబాద్ కోసం సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ, లోక్‌సత్తా, ఎంబీసీ జేఏసీ, వివిధ సామాజిక సంఘాలు, కాలనీ సంఘాలతో కూడిన వన్ హైదరాబాద్ కూటమిని గెలిపించాలని కోరింది. శనివారం ఎంబీ భవన్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహారావు, పార్టీ నాయకులు ఎం.శ్రీనివాస్, కె.రవి జీహెచ్ఎంసీ ఎన్నికల బ్రోచర్‌ను విడుదల చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం వన్ హైదరాబాద్ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 31 వరకు బస్సుజాతాలను నిర్వహిస్తున్నట్లు డీజీ నరసింహారావు విలేకరులకు తెలిపారు. ఈ ప్రచారంలో జయప్రకాష్ నారాయణ (లోక్‌సత్తా), బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం (సీపీఎం), కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి (సీపీఐ), మహ్మద్ గౌస్ (ఎంసీపీఐ) పాల్గొంటారని తెలిపారు. ఈ కూటమి పోటీ చేయనిచోట్ల భావసారూప్యత ఉన్న స్వతంత్ర అభ్యర్థులను గుర్తించి ఈ నెల 26న ప్రకటిస్తామన్నారు. -
స్వతంత్ర న్యాయ కమిటీతో విచారణ జరపాలి: జేపీ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ప్రభుత్వ అధికారులతో కాకుండా స్వతంత్ర న్యాయ కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో కుల వివక్ష కారణంగా ఓ పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం భారతీయులంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం అని పేర్కొన్నారు. కాగా, కులం పేరు సూచించే తోకలను తీసేసుకోవాలని ఆయన యువతను కోరారు. కులం, మతం సంబంధం లేకుండా కులాంతర వివాహాలు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
92 స్థానాల్లో ‘వన్ హైదరాబాద్ కూటమి’ పోటీ
లోక్‌సత్తా -35,సీపీఎం-33. సీపీఐ-22,ఎంసీపీఐ-2 సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి 92 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా లోక్‌సత్తా 35,సీపీఎం 33,సీపీఐ 22.ఎంసీపీఐ 2 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. గురువారం హైదరాబాద్ ఎంబీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నేతలు మాజీ ఎంపీ అజీజ్‌పాషా(సీపీఐ), డీజీ నర్సింహారావు(సీపీఎం), పాండురంగారావు(లోక్‌సత్తా), తాండ్రకుమార్(ఎంసీపీఐ) మాట్లాడుతూ స్వచ్ఛ రాజకీయాలు, వార్డు స్థాయిల్లో స్థానిక ప్రజలకే అధికారాలు అన్న ప్రాతిపదికన కనీస ఉమ్మడి కార్యక్రమంతో జీహెచ్ఎంసీ ఎన్నికల బరి లోకి దిగటానికి తాము ‘వన్ హైదరాబాద్ కూటమి’గా ఏర్పడినట్లు తెలిపారు. తమకు ఎంబీసీ-జేఏసీ, లౌకిక ప్రజాతంత్ర శక్తులు, కాలనీ కమిటీలు,వెల్ఫేర్ అసోసియేషన్లు మద్దతు ప్రకటించాయన్నారు. కొన్ని సీట్లల్లో వారు కూడా పోటీ చేస్తారన్నారు. టీఆర్ఎస్-ఎంఐఎం , టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుళ్లు రాజకీయాల నుంచి బయటపడేందుకు నగర ప్రజ లకు ప్రత్యామ్నాయ ఫ్రంట్ వన్ హైదరాబాద్ కూటమి మాత్రమేనన్నారు. సమావేశంలో నాయకులు ఎం.శ్రీనివాస్, సోమయ్య(సీపీఎం),డాక్టర్ సుధాకర్, నర్సింహా (సీపీఐ), తారకృష్ణ స్వామి, శ్రీనివాస్(లోక్‌సత్తా), మల్లేష్(ఎంసీపీఐ) పాల్గొన్నారు. పార్టీల వారీగా వివరాలు ఇవీ లోక్‌సత్తా 35 స్థానాలు: ఏస్రావు నగర్(డివిజన్-2), చర్లపల్లి(3),హయత్‌నగర్(13), బీన్రెడ్డినగర్(14), వనస్థలిపురం(15), కొత్తపేట(21), చైతన్యపురి(22),గడ్డిఅన్నారం(23), మూసారంగ్బాగ్(25), మెహిదీపట్నం(70), నల్లకుంట(81), రాంనగర్(87), గాంధీనగర్(89), బంజరాహిల్స్(93), జూబ్లీహిల్స్(95), యూసఫ్‌గూడ(96), సోమాజీగూడ(97), అమీర్‌పేట(98), సనత్‌నగర్(100), రహమత్‌నగర్(102), మాదాపూర్(107), హఫీజ్‌పేట(109), చందానగర్(110), కేపీహెచ్‌బీ కాలనీ(114),అల్లాపూర్(116),మూసాపేట(117),ఓల్డ్‌బోయినపల్లి(119),కూకట్పల్లి(121),వివేకానందనగర్(122),అల్విన్‌కాలనీ(124),అల్వాల్(134),వినాయక్‌నగర్(137),ఈస్ట్ ఆనంద్‌బాగ్(139),మల్కాజిగిరి(140),బేగంపేట(149). సీపీఎం-33 సీట్లు: కాప్రా(డివిజన్-1),మీర్‌పే హెచ్‌బీకాలనీ(4),హబ్సీగూడ(8),రామంతాపూర్ ఈస్ట్(9),ఉప్పల్(10),మన్సూరాబాద్(12),చంపాపేట (17),లింగోజీగూడ(18),సంతోష్‌నగర్(39),ఉప్పుగూడ(44),బేగంబజార్(50),గోషామహాల్(51),మైలారదేవపల్లి(59),జియాగూడ(62),లంగర్‌హౌజ్(66), గుడి మల్కాపూర్(71), గోల్నాక(82),బాగ్ అంబర్‌పేట (84),ముషీరాబాద్(86),భోలక్‌పూర్(88),కవాడీగూడ (90),వెంగళరావునగర్(99),ఎర్రగడ్డ(101),బోరబండ (103),గచ్చిబౌలి(105),శేరిలింగంపల్లి(106),బాలాజీనగర్(115),సూరారం(129),మౌలాలి(138),అడ్డగుట్ట (142),మెట్టుగూడ(144),బౌద్ధనగర్(146), బన్సీలాల్‌పేట(147). సీపీఐ -22 స్థానాలు: మల్లాపూర్(డివిజన్-5),నాగోల్ (11),సరూర్‌నగర్(19): అక్బర్‌బాగ్(27),పత్తర్పట్టి (32),గౌలీపుర(35),లలితాబాగ్(36),ఐఎస్‌సదన్(38),జంగంమెట్(45),రాజేంద్రనగర్(60),గోల్కొండ(67),అంబర్‌పేట(83), కోండాపూర్(104),రామచంద్రాపురం(112),బాలానగర్(120),జగద్గిరిగుట్ట(126),గాజుల రామారం(125),రంగారెడ్డి నగర్(127),వెంకటాపురం (135),నేరేడ్మెట్(136), గౌతంనగర్(141),తార్నాక (143). ఎంసీపీఐయూ-2 స్థానాలు: షేక్‌పేట, మియాపూర్ (108). -
GHMC బరిలోకి 'లోక్‌సత్తా' కుటమి
-
గ్రేటర్ బరిలో లోక్‌సత్తా, వామపక్షాల కూటమి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలతో కలసి లోక్‌సత్తా రంగంలోకి దిగనుంది. నాలుగు పార్టీలు కలసి 92 సీట్లలో పోటీ చేయనున్నాయి. లోక్‌సత్తా 35, సీపీఎం 33, సీపీఐ 22, ఎంసీపీఐ 2 సీట్లలో పోటీ చేయనున్నట్లు కూటమి తెలిపింది. ఆదివారంతో గ్రేటర్ నామినేషన్లకు గడువు ముగియనుంది. -
'ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధం'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సి ఉందని లోక్‌సత్తా అధినేత జేపీ అభిప్రాయపడ్డారు. గురువారం అనంతపురంలో జేపీ మాట్లాడుతూ... దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధికి పాటుపడతానని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాల వల్లే కాల్-మనీ గ్యాంగ్‌లు పెట్రేగిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని జేపీ స్పష్టం చేశారు. -
ఇసుక మాఫియా తెలుగు తమ్ముళ్లదే: లోక్‌సత్తా
తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో ఇసుక మాఫియా సూత్రధారులు తెలుగు తమ్ముళ్లేనని ఆంధ్రప్రదేశ్ లోక్‌సత్తా అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఇసుక దందా ద్వారా 35 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రూ. 2 వేల కోట్ల వరకు దండుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 400 మండలాలు కరువుతో అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. కరువు మండలాల్లో రుణమాఫీ పథకాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు. రైతులను ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రభుత్వం చెబుతోందే తప్ప.. నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయని, ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రరూపం దాల్చాయని అన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకలు కూడా పట్టలేని స్థితికి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల హాస్టళ్లు పోలీసు లాకప్‌ల మాదిరిగా తయారయ్యాయన్నారు. అమరావతిలో స్వప్రయోజనాల కోసం స్థలాల లీజు గడువును 33 సంవత్సరాల నుంచి 99 ఏళ్లకు పెంచడం సరికాదన్నారు. రాజధాని అవసరమేనని.. అయితే, అభివద్ది ఒకేచోట కేంద్రీకృతం కాకూడదని పేర్కొన్నారు. అభివృద్ధి అన్ని జిల్లాల్లో జరగాలని అభిప్రాయపడ్డారు. ఇదే నినాదంతో ఈ నెల 22న ఒంగోలులో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. ఏడాదిన్నర కాలంగా రాయలసీమను తాగునీటి సమస్య పట్టిపీడిస్తోందని, అక్కడి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రం నుంచి పనుల కోసం వలసలు పోయే పరిస్థితిని నివారించాలన్నారు. -
బాబువన్నీ ప్రచార ఆర్భాటాలే: జేపీ
సాక్షి, హైదరాబాద్: మట్టి-నీరు, హోమాలు, యజ్ఞాలంటూ రూ. కోట్లాది ప్రజాధనం ఖర్చుచేసిన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. ఆప్ట్రాల్ లంచాలు గుంజే ప్రభుత్వ కార్యాలయాలు ఉండే రాజధాని నగరానికి ఇంత ఆర్భాటం అవసరమా? అని ప్రశ్నించారు. పార్టీ నేతలు పోతినేని హైమ, కూనంపూడి శ్రీనివాస్‌లతో కలిసి శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇంత ఆర్భాటంగా జరిగిన సభలోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, సాయం కావాలని బాబు అడగా లేదు, మోదీ ఇవ్వా లేదన్నారు. విభజన వల్ల ఏపీకి ఒరిగింది లేకపోయినా కనీసం చంద్రబాబు ప్రశ్నించే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. కేంద్రమిచ్చిన వంద.. వెయ్యి కోట్లే మహాభాగ్యం, మీ దయ వల్లే బతుకున్నాం అనే రీతిలో సీఎం అమరావతి వేదిక మీద మాట్లాడడాన్ని జయప్రకాశ్ నారాయణ తప్పుపట్టారు. ఐఐటీ, ఐఐఎం, వంటివి ప్రతి రాష్ట్రానికి ఇస్తున్నారని.. ఏపీ నగరాలకు అమృత్ పథకం పెట్టాం.. స్మార్ట్‌సిటీల సాయం అందిస్తాం.. 24 గంటల విద్యుత్తు ఇచ్చే రాష్ట్రాల్లో ఏపీని చేర్చాం వంటివి మభ్యపెట్టే మాటలని, ఇలాంటి సాయం అన్ని రాష్ట్రాలకూ అందుతోందని, తన మాటలు అబద్ధమైతే రుజువు చేయాలని సవాల్ చేశారు. బాబుకు రెండు సూటి ప్రశ్నలు రాయలసీమ, ఉత్తరాంధ్రలోని పరిస్థితులను చూపి రాష్ట్రానికి లేదంటే కనీసం ఆ ఏడు జిల్లాలకైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని మీరు కేంద్రాన్ని ఎప్పుడైనా కోరారా? అని జయప్రకాష్ ప్రశ్నించారు. పరిశ్రమలు పెరిగి యువతకు ఉపాధి వచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ కార్పోరేట్ ఆదాయ పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్నడైనా అడిగారా? అని ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీలో ప్రధానిని కలిసిన తరువాత చంద్రబాబే విలేకరుల సమావేశంలో తాను రాజధాని ప్రాంతానికి మాత్రమే పన్నురాయితీలు కోరినట్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రతిదీ ఓ తంతులా...: ప్రతిదీ ఒక తంతుగా, ఆర్భాటంగా మార్చడం తప్ప పరిపాలనపై శ్రద్ధ, పిల్లల భవిష్యత్ మీద ఆలోచన చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదని జయప్రకాశ్‌నారాయణ దుయ్యబట్టారు. ‘మొదట పుష్కరాల పేరుతో ఊదరగొట్టేశారు. పట్టిసీమ పూర్తయితే చాలు అందరి బతుకులు బాగుపడతాయన్న భ్రమ కలిగించారు. ఇప్పుడు అమరావతి నిర్మాణమే అన్నింటికీ పరిష్కారమని చెబుతున్నారు. రేపు ఇంకొకటి..’ అని ఎద్దేవా చేశారు. సభలో సామాన్యుల ఆకలి కేకలు వీవీఐపీల సేవలో తరించిన ప్రభుత్వం సాక్షి, విజయవాడ: అట్టహాసంగా సాగిన అమరావతి శంకుస్థాపనకు హాజరైన సామాన్య ప్రజలు చివరకు కడుపు మాడ్చుకొని తిరుగుముఖం పట్టారు. ఈ కార్యక్రమం కోసం వ్యక్తి స్థాయిని బట్టి కేటగిరీల వారీగా రూ. 150 నుంచి రూ. 1000 వరకు వివిధ ధరల్లో పలు రకాల మెనూతో కూడిన విందును సిద్ధం చేశారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లకుపైగా ఖర్చు పెట్టింది. మహిళా మంత్రులు గత మూడు రోజులుగా వంటశాల వద్ద ఉండి పర్యవేక్షించారు. అయినప్పటికీ సభకు హాజరైన వారిలో సగం మందికి మాత్రమే ఆహారం అందించగలిగారు. మిగిలిన వారంతా ఆకలితో వెనుదిరగాల్సి వచ్చింది. -
హోదా సాధించలేని సీఎం రాజీనామా చేయాలి
చిలకలూరిపేట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు సురేంద్ర శ్రీవాస్తవ డిమాండ్ చేశారు. హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. బుధవారం గుంటూరు పర్యటనలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పలు అంశాలు లేవనెత్తారు. ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి నేడు ప్రత్యేక ప్యాకేజీలు అంటున్న సిఎం పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు ప్యాకేజీ సరిపోతుందని రాష్ట్రానికి న్యాయం జరగుతుందని చెప్పటం పూర్తిగా మోసపూరితం. ప్యాకేజి పేరిట ఇచ్చేడబ్బు పాలకుల ఆర్బాటాలకే తప్ప ప్రజలకు ఉపయోగపడదు ప్రత్యేక హోదాతోనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయి తప్పించి ప్యాకేజీ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నాటి అసెంబ్లీలో కోరింది మేమే హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి దీక్ష చేయటం అభినందనీయం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా సాధించకుండా కేవలం రాజధాని నిర్మాణంపైనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టడం అవివేకం ప్రపంచస్థాయి రాజధాని అనే పదానికి అర్ధమే లేదని సుసంపన్న దేశం అమోరికాలోని అనేక రాష్ట్రాలకు గొప్ప గొప్ప రాజధానులు ఉన్నాయి భవిష్యత్తులో ఎన్నికల నిధుల కోసం, వ్యాపారాల కోసం వేలాదిఎకరాలు రైతుల నుంచి సమీకరించారు రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా రాజ్యం మేలుతున్నాయి. -
వాళ్లే 'సుప్రీం'లా... అదెలా?
హైదరాబాద్ : న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును... లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటు, ప్రజల భాగస్వామ్యం లేకుండా న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దశాబ్దకాలంగా జాతీయ న్యాయ నియామక వ్యవస్థను సమర్ధించిన వారిలో తానూ ఒకడినని జేపీ శుక్రవారమిక్కడ అన్నారు. కాగా జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టిపారేసింది. పాత పద్ధతిలోని కొలీజియం ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కొలీజియం వ్యవస్థను పక్కకు పెట్టి నేషనల్ జ్యూడిషియల్ కమిషన్ తీసుకొచ్చింది. అయితే, ఇందులో రాజకీయ జోక్యం ఎక్కువవుతోందని కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కీలక తీర్పును వెల్లడించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వ్యవస్థను కొట్టి పారేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. -
వాళ్లే 'సుప్రీం'లా... అదెలా?
-
ఎజెండాలతో ‘హోదా’కు గండి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఏడాదికి పైగా కేంద్ర ప్రభుత్వం దోబూ చులాట సాగించింది. అధ్యయనం చేస్తు న్నట్టు, సానుకూల ప్రకటన వస్తుంద న్నట్టు ఆశలు రేకెత్తించారు. కేంద్రం తమ చేతులలోనే ఉన్నట్టు రాష్ర్ట ప్రభుత్వం బీరాలు పలికింది. విభజన బిల్లు మీద జరిగిన చర్చలో గట్టిగా వాదించిన ఆనా టి ప్రతిపక్ష నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు ఇప్చడు కీలక పదవు లలో ఉండడంతో నమ్మకాన్ని పెంచింది. ఆ తర్వాత ఈ నేతలే మాటమార్చడంతో, ముఖ్యమంత్రి మౌనముద్ర దాల్చడంతో శంక లు మొదలయ్యాయి. జూైలై 31న కేంద్ర ప్రణాళికా శాఖమంత్రి, ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ ైైజైట్లీల ప్రకటనలతో ప్రత్యేక హోదాకు ఎసరు పెట్టారని అర్థమైంది. ప్రత్యేక హోదాను నిరాకరించడానికి బీజేపీ ప్రభుత్వం చూపు తున్న కారణాలలో నిజాయితీ కనిపించదు. రాష్ర్ట ప్రగతి గురించి నిరంతరం ప్రగ ల్భించే టీడీపీ ప్రభుత్వం హోదా గురించి గట్టిగా నిలదీయకపోవడం వెనుక చిత్తశుద్ధి కూడా కానరాదు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చక పోవడా న్ని బీజేపీ సాకు గా చూపుతున్నది. ఎన్నికలకు ముందే విభజన జర గాలనుకు న్నారు. దానికోసం రాజ్యసభలో బిల్లును యథాతథంగా ఆమోదిం చకపోతే, మళ్లీ లోక్‌సభ ఆమోదం పొందవలసి ఉంటుంది. కాబట్టే కాంగ్రె?స ప్రభుత్వం, నాటి ప్రతిపక్ష బీజేపీ చేసుకున్న ఒప్పందం ఫలితంగానే ప్రధాని ప్రకటన వచ్చిందనేది బహిరంగ రహస్యం. దానిని అమలు చేయవలసిన నైతిక బాధ్యత బీజేపీ మీద ఉంది. చట్టంలో ఈ అంశం ఉండి తీరాలని కేంద్రం భావిస్తే, చట్ట సవర ణతో ముంపు గ్రామాలను చేర్చినట్టూ, శాసనమండలి స్థానాలను పెంచినట్టూ ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించాలి. అంతేగాని హోదా ఎగవేతకు దానినే కారణం చేయరాదు. అరుణ్ జైట్లీ తాజాగా 14వ ఆర్థిక సంఘం సిఫారసును కూడా ఓ సాకుగా చూపుతున్నారు. గతంలో ఉన్న ప్రత్యేక కేటగిరీ విధానం ఇప్చడు సరికాదని ఆర్థిక సంఘం చెప్పిందనీ, అందు వల్ల ఈ వివాదానికి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశఖకు ప్రత్యేక సాయమందజేస్తామనీ ప్రకటించారు. అంటే ప్రత్యేక హోదా లేదని జైట్లీ చెప్పకనే చెప్పారు. ఆయన న్యాయవాది. రాజ్యాంగాన్ని ఔపో సన పట్టినవారు. ప్రత్యేక హోదా అనేది ఆర్థిక సంఘం పరిధిలో లేని అంశం. రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ప్రకటించే లేదా తొల గించే అధికారం ఆర్థిక సంఘానికి ఎక్కడ నుంచి వచ్చినదీ జైట్లీయే చెప్పాలి. ప్రత్యేక హోదాకు మార్గదర్శకాలను ప్లానింగ్ కమిషనఖ రూపొందించినా, మంజూరు గురించి అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం జాతీయ అభివృద్ధి మండలికి ఉండేది. ఇప్చడు ఈ రెండు సంస్థలు రద్దయ్యాయి. అధికారం గల సంస్థ అస్తిత్వంలో లేదు. అస్తిత్వంలో ఉన్న ఆర్థిక సంఘానికి లేని అధికారాలు కట్ట బెట్టి ప్రత్యేక హోదాను పక్కన పెట్టడం కంటే మించిన వంచన ఉం డదు. ప్రత్యేక హోదాను మంజూరు చేసే సంస్థలు లేకపోవడంతో నిర్ణయం తీసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వం, ప్రతిపక్షం కూడా ఆమోదించిన హామీని నెరవేర్చక పోతే పార్లమెంటఖ విశ్వసనీయత దెబ్బ తింటుంది. ఇది ఒక అసా ధారణ పరిస్థితిలో, రాష్ర్ట విభజన సందర్భంగా ఇచ్చిన హామీ. మన రాజ్యాంగం ఆర్టికలఖ 4 ప్రకారం రాష్ట్రాల పునర్విభజన సం దర్భంగా ఉత్పన్నమయ్యే తాత్కాలిక ఇబ్బందుల పైనా, పర్యవ సానాలపైనా తగిన చర్యలు తీసుకునే అధికారం పార్లమెంటఖకు ఉంది. బీజేపీకి హామీని నిలబెట్టుకోవడం కంటే, టీడీపీకి ఆ హోదా ను సాధించడం కంటే తమ తమ సొంత ఎజెండాలే ముఖ్యమైన ట్టు కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశఖకు ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టడానికి బలమైన రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదాను కోరుతున్న బిహార్‌కు త్వరలో ఎన్నికలు జరగబో తున్నాయి. ఇక్కడ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే అక్కడ బిహార్ ఎన్నికలలో హోదా ప్రధాన ఎజెండా అవుతుంది. పార్లమెంటఖ ఎన్నికలలో ఢిల్లీలో ఘనవిజయం సాధించిన బీజేపీ తర్వాత జరి గిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైంది. ఇదే బిహార్‌లోనూ పునరావృతమైతే, అది దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైనట్టు చెప్పే బలమైన సంకేతమవుతుంది. అందుకే హోదాలకు బదులు ప్యాకేజీ నినాదాన్ని తలకెత్తుకుంది. మరోపక్క తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత ఆంధ్రప్రదేశఖకు ప్రత్యేక హోదాను తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు. ఆమెతో దోస్తీకి బీజేపీ బాటలు వేసుకుంది. రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అనుమతి పొంద కుండా కేంద్ర మంత్రులు హోదాపై ప్రకటనలు చేసే వీలులేదు. ప్రత్యేక హోదా రాదని బాబుకు ముందే తెలుసునని టీడీపీ పార్ల మెంటఖ సభ్యుడు జేసీ దివాకరరెడ్డి ఒక ప్రకటనే చేశారు. అడపా దడపా హోదా అని అంటున్నా, బాబు మనసు మాత్రం ప్యాకేజీ మీదేనని ఆయన స్పందిస్తున్న తీరే తేటతెల్లం చేస్తున్నది. చేసిన వాగ్దానాలు, ఇస్తున్న రాయితీలు, దుబారా అన్నీ కలిపి నెలనెల గండంగా ఉంది. ఇవే తనను గెలిపించిన మంత్రదండాలుగా ఆయన భావిస్తున్నారు. దీనిని సాగించడానికి డబ్బు కావాలి. ప్యా కేజీ ఐతే ఖజానాకు డబ్బుల్ఠస్తాయి. ప్రత్యేక హోదా రాష్ట్రానికీ, ప్రజలకూ ప్రయోజనం. ప్యాకేజీ ప్రభుత్వానికి ప్రయోజనం. అందుకే ప్రత్యేకహోదా కోసం చెప్పే మాటలలో చిత్తశుద్ధి కొరవ డింది. బీజేపీ, టీడీపీలు స్వప్రయోజన రాజకీయాలకు ప్రత్యేక హోదాను బలితీసుకున్నట్టు కనిపిస్తున్నది. వ్యాసకర్త అధ్యక్షులు, డీవీవీఎస్ శర్మ, ఆంధ్రప్రదేశ్ లోక్‌సత్తా పార్టీ, మొబైల్ 9866074023 -
'హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తాం'
విజయవాడ: హైదరాబాద్‌లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేస్తామని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలో శనివారం జరిగిన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. త్వరలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కార్యవర్గాల్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో, తెలంగాణలోని హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీ రాజ్యాంగం మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల ద్వారా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
సీఎం బ్లాక్ వద్ద విపక్షాల మెరుపు ధర్నా
లెఫ్ట్, టీడీపీ, వైఎస్సార్సీపీ, లోక్‌సత్తా నేతల అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, టీడీపీ, వైఎస్సార్సీపీ, లోక్‌సత్తా నేతలు సచివాలయంలోని సీఎం అధికారిక కార్యాలయం సమతా బ్లాక్ ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె సహా ఇతర ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు సీఎం అపాయింట్మెంట్ కోరినా ఇవ్వనందుకు నిరసనగా సచివాలయంలో బైఠాయించారు. మున్సిపల్ కార్మికులసమ్మెను పరిష్కరించాలి, సీఎం కేసీఆర్ వెంటనే చర్చలకు పిలవాలి, రైతు ఆత్మహత్యలు, ప్రజాసమస్యలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినే ని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, నేతలు పల్లా వెంకటరెడ్డి, రవీంద్రకుమార్, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైఎస్సార్సీపీ నేతలు కె. శివకుమార్, కొండా రాఘవరెడ్డి, బీష్వ రవీందర్‌లతోపాటు వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), జానకిరాములు, గోవింద్ (ఆర్ఎస్పీ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), దయానంద్, నరేందర్ (ఫార్వర్డ్ బ్లాక్), భూతం వీరయ్య (సీపీఐ-ఎంఎల్), రామ్మోహనరావు (లోక్‌సత్తా) తదితరులను అరెస్ట్ చేసి గాంధీభవన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి, న్యూడెమోక్రసీ నేత వి.వెంకటరామయ్య తదితరుల మధ్య తోపులాట జరిగింది. దీంతో వారు సీఎం డౌన్ డౌన్, కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు మఖ్దూం భవన్ నుంచి అఖిలపక్ష నేతలు బయలుదేరి సచివాలయం గేటు వద్దకు చేరుకున్నారు. సీఎం అపాయింట్మెంట్ లేదు కాబట్టి అనుమతించబోమని అక్కడున్న పోలీసులు వారిని నిలిపివేశారు. పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం జరిగాక, ఈ నేతలు వారిని తోసుకుని సచివాలయం ‘సీ’ (సీఎం బ్లాక్) బ్లాక్ ఎదుటకు చేరుకోగా అక్కడ వారిని ఆపేశారు. సీఎం ఎప్పుడు సమయం ఇచ్చినా అప్పటివరకు తాము వేచి ఉంటామని వారు పోలీసులకు చెప్పారు. దీనిపై చర్చ జరుగుతుండగానే వారంతా రోడ్డుపై బైఠాయించారు. ఇదేం ప్రజాస్వామ్యం..: విపక్షాల నేతలు సమస్యలపై మాట్లాడేందుకు సీఎంను కలుద్దామని వస్తే రోడ్డుపైనే ఆపేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం, ఇదేమి పాలన అంటూ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. తెలంగాణ పరిపాలన ఇలానే సాగించదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. నెలరోజులకు పైగా సమ్మె చేస్తూ పేద మున్సిపల్ కార్మికులు కష్టాల్లో ఉంటే సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. మున్సిపల్ కార్మికులు, ఇతర కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సమయమివ్వాలని అన్ని పార్టీలు లేఖ రాస్తే సీఎం కేసీఆర్ నుంచి ఏ స్పందన లేదని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి చెప్పారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమ్మెలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసి దానిని నిలబెట్టుకోలేదన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజలెవరినీ సీఎం కలవకపోవడం ఏమిటని వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు. తాము కూడా ఉద్యమాలు చేశామని, ఇటువంటి పద్ధతిని ఎక్కడా చూడలేదన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతూ 14 నెలల పాలనలో సీఎం కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని వైఎస్సార్సీపీ నేత కె.శివకుమార్ ధ్వజమెత్తారు. ఒకవైపు ఉద్యోగాలిస్తామంటూ, సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ సీఎంగా ఉండగా ప్రజలను కలుసుకునేందుకు రోజూ పొద్దున సమయమిచ్చినట్లుగా సీఎం కేసీఆర్ కూడా సమయమివ్వాలని డిమాండ్ చేశారు. -
ప్రజా విశ్వాసం కోల్పోతున్న టీడీపీ ప్రభుత్వం
లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు కఠారి భవానీపురం : తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానాల ఊబిలో చిక్కుకుని నానాటికీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని పార్టీ జాతీయ అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు విమర్శిం చారు. బెంజిసర్కిల్ వద్ద గల వేదిక హాల్లో ఆదివారం జరిగిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆ యన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. లోక్‌సత్తా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటానికి తగిన ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ, జాతీయ నాయకులు రవిమారుతి, జె.వెంకటేశ్వర్లు తమ సందేశాలను అందించారు. రాజకీయ అంశాలపై రాష్ర్ట ఉపాధ్యక్షుడు నర్రా శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి ఐ.రామమూర్తి, ప్రజా సమస్యలపై ప్రత్యక్ష కార్యాచరణ కార్యక్రమంపై రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెన్నుపాటి వజీర్, పార్టీ సంస్థాగత అంశాలను ప్రధాన కార్యదర్శి రమేష్‌రెడ్డి ప్రతిపాదించారు. ప్రభుత్వ మద్యం పాలసీపై రాష్ర్ట నాయకులు మనోరమ, పద్మారాణి ప్రవేశపెట్టగా, విభజన హామీలపై తీర్మానాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓంకార్, వెంకటేశ్వరరావు ప్రతిపాదించగా, అవినీతి వ్యతిరేక తీర్మానాన్ని ఎస్.నరేంద్ర, ఎం.వెంకటేశ్వరరావులు ప్రతిపాదించారు. -
ఆ అంశాలు ఏపీ మంత్రులకెందుకు?: జేపీ
సాక్షి, హైదరాబాద్: సెక్షన్ 8ను హైదరాబాద్‌లో అమలు చేయాలని అడగాల్సింది ఇక్కడి ప్రజలు గానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్మమో, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలో కాదని, తమ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడుకోకుండా పొరుగు రాష్ట్రంలోని సమస్యలు ఏపీ మంత్రులకు ఎందుకని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రజలు తమది ఆంధ్రానా.. తెలంగాణనా అన్న భేదాభిప్రాయాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో పాలకులు సెక్షన్ 8 అంశాన్ని వివాదాస్పదం చేసి ఇక్కడి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెక్షన్ 8 అన్నది కేవలం హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల ప్రజల శాంతిభద్రతలకు సంబంధించినది మాత్రమేనన్నారు. ప్రజలెనుకున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్ అన్ని వ్యవహారాలలో తలదూర్చితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. గవర్నర్ వ్యవస్థ క్రమంగా లేకుండా పోవాలన్నది తన కోరికగా జయప్రకాష్ నారాయణ చెప్పారు. -
ఇడియట్స్ రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జేపీ హైదరాబాద్ : ఇడియట్స్, జోకర్స్, పనిలేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థను భ్రష్టుపటి ్టస్తున్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. హైదరాబాద్‌లో శనివారం లైఫ్‌స్కిల్స్ ఇండియా ఆధ్వర్యంలో ‘భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయ నేతలు కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రావాలన్న ధ్యాస తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఓటుకు కోట్లు వ్యవహారంపై రెండు రాష్ట్రాల సీఎంలు రెచ్చగొట్టే ధోరణులే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యా విధానం పరమచెత్తగా ఉందని, పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే యువతకు ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. -
'తాలిబన్ల కంటే ప్రమాదకారి చంద్రబాబు'
హైదరాబాద్ : తాలిబాన్ ఉగ్రవాదుల కంటే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రమాదకారి అని తెలంగాణ లోక్‌సత్తా అధినేత కంచర్ల ధర్మారెడ్డి దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటుకు కోట్లు కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులకు ఏపీలో ఆశ్రయం కల్పించడం సిగ్గుచేటన్నారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసమే సెక్షన్-8 అంటూ చంద్రబాబు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు కుట్రలు మానుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. -
'బాబు, కేసీఆర్ కాదు... ప్రజలు నష్టపోతారు'
-
'బాబు, కేసీఆర్ కాదు... ప్రజలే నష్టపోతారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోక్‌సత్తా పార్టీ నాయకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) ఆరోపించారు. ఇలా చేయడం వల్ల నష్టపోయేది చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని... ప్రజలే నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో జేపీ మాట్లాడుతూ... ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు ప్రాంతాల మధ్య సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదాలను కేంద్రప్రభుత్వం పరిష్కరించకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని జేపీ విమర్శించారు. ఎన్ని కుట్రలు పన్నినా అన్ని ప్రాంతాల్లో ప్రజలు పూర్తిసామరస్యంతో ఉన్నారని తెలిపారు. ఓ పౌరయుద్ధం, హింస రావాలని కొంతమంది కోరుకుంటున్నారని ఆరోపించారు. అయితే ప్రజల్లో విజ్ఞత ఉందని... దాన్ని పోగొట్టాలని చూస్తున్నారని జేపీ ఆందోళనవ్యక్తం చేశారు. -
చంద్రబాబుకు జేపీ సూటిప్రశ్నలు
-
చంద్రబాబుకు జేపీ సూటిప్రశ్నలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సూటి ప్రశ్నలు సంధించారు. ఓటుకు కోట్లు కుంభకోణం నేపథ్యంలో ఆయన తన ట్విట్టర్ వేదికగా ఈ ప్రశ్నలు వేశారు. మీ ఎమ్మెల్యే 5 కోట్ల లంచం ఎరవేసి ఒక ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేయడానికి సిద్ధమైన విషయం నిజమేనా? ఒకవేళ అలా చేస్తే.. మీ సూచనలతోనే ఓటుకు నోటు వ్యవహారం జరిగిందా? ఒకవేళ రేవంత్ రెడ్డి సొంతంగా ఈ వ్యవహారం చేస్తే మీరు ఇంతవరకు ఎందుకు ఎలాంటి చర్య తీసుకోలేదు? ఆడియో రికార్డుల్లో ఎలాంటి ఎడిటింగ్ లేదని తేలితేమీరు రాజీనామా చేస్తారా? We demand answers from @ncbn #CashFOrVote #TDPBribegate pic.twitter.com/dwfUYB1MzH — Jayaprakash Narayan (@JP_LOKSATTA) June 13, 2015 -
బాబూ..పదవిని వదలండి
లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచాది రాంబాబు శ్రీకాకుళం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచాది రాంబాబు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాన్ని వ్యాపారంలా నడుపుతున్నారనడానికి తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉదంతమే సాక్ష్యమన్నారు. ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు పాత్రదారులతోపాటు తెరవెనుక పథక రచన చేసిన సూత్రధారులనూ ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రపై ఆరోపణలు వస్తున్నందున చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు సీబీఐ దర్యాప్తును కోరాలన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు పి.ప్రవీణ్‌కుమార్, వి.వైకుంఠరావు, ఎ.మల్లేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆ పార్టీ బాస్ ను అరెస్ట్ చేయాలి
హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు రూ. 5 కోట్లు ఇవ్వచూపి అరెస్ట్ అయిన టీడీపీ కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీ బాస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కూడా అరెస్ట్ చేయాలని లోక్‌సత్తా పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం లోక్‌సత్తా పార్టీ నాయకులు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. -
పంతం వద్దు
సాక్షి, హైదరాబాద్: పంతానికి పోకుండా ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్కును పరిరక్షించాలని, కళాభారతిని మరోచోట నిర్మించాలని సీఎం కేసీఆర్‌కు లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్‌లో కళాభారతి నిర్మిస్తామంటే ప్రతిపక్షాలు లోతుగా ఆలోచించకుండా, భేషజాలకు పోయి అడ్డుకుంటున్నాయని కేసీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలో యువత, పిల్లలు ఆడుకునేందుకు ఎన్టీఆర్ స్టేడియాన్ని అలాగే ఉంచాలని కోరారు. ఇందిరా పార్కు పచ్చదనాన్ని కాపాడాలని సూచించారు. -
సేవ్ ఎన్టీఆర్ స్టేడియం..సేవ్ ఇందిరాపార్క్
మారేడ్‌పల్లి (హైదరాబాద్) : సేవ్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్ అనే నినాదాలతో లోక్‌సత్తా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఈస్ట్‌మారేడుపల్లిలోని తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు మిస్డ్‌కాల్, పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్కుల స్థానంలో తెలంగాణ భవన్, వినాయక్సాగర్ను నిర్మించాలని తలపెట్టటం సరికాదని అన్నారు. వాటిని వేరేచోట ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు తమతో కలసి పాల్గొనదలచిన వారు 8688047100 నంబర్‌కు మిస్ట్ కాల్ చేయాలని, లేదంటే పోస్టు కార్డు ద్వారా కేసీఆర్‌కు నిరసన లేఖలు రాయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆయన మిస్డ్ కాల్ బ్యానర్ ఆవిష్కరించి, పోస్టు కార్డు రాస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారు. -
లోక్‌సత్తా పార్టీకి వెంకటరమణ రాజీనామా
విజయనగరం క్రైం : లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పాండ్రంకి వెంకటరమణ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు.లోక్‌సత్తా పార్టీలో 2006 నుంచి సాధారణ సభ్యుడిగా చేరిన పాండ్రంకి అంచెలంచెలుగా క్రియాశీలక సభ్యుడిగా, పట్టణ ఉపాధ్యక్షుడిగా, యువసత్తా జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన శాసనసభ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే పార్టీలో ఇటీవల జరి గిన కొన్ని పరిమాణాలతో మస్తాపానికి గురై, పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. -
'పట్టిసీమ ఓ పిచ్చి ప్రాజెక్ట్'
విశాఖపట్నం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టనున్న పట్టిసీమ ఓ పిచ్చి ప్రాజెక్ట్ అని లోక్‌సత్తా అధ్యక్షుడు ఎన్.జయప్రకాశ్ నారాయణ ఎద్దేవా చేశారు. బుధవారం ఓ ప్రవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్ట్ రాజకీయపరంగా కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా పోలవరం ప్రాజెక్టు కోసం కనీసం రూ.1 అయినా ఖర్చు చేశారా ? అని జయప్రకాశ్ నారాయణ... చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విభజన తర్వాత పరిశ్రమలకు పన్ను రాయితీ ఇచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వికృత క్రీడల్లా కనిపిస్తున్నాయని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. -
చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి: జెపి
-
'ఎన్నికలు అయిపోయాయి కాబట్టి డ్రామాలు ఆడుతున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం చంద్రబాబును లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ... చంద్రబాబు సొంతింటి వ్యవహారం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి ఇచ్చిన లెక్కలు సరైనవా ? కాదా ? అన్నది తేలుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చు నెలకు వడ్డీ కింద లెక్కేసినా రూ. 1900 కోట్లు అవుతుంది. అలాంటిది రూ. 100 కోట్లు ఇచ్చారు. ఈ డబ్బు కూడా ఖర్చు చేయలేదని జేపీ పేర్కొన్నారు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి డ్రామాలు ఆడుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జయప్రకాశ్ నారాయణ నిప్పులు చెరిగారు. ఈ నాలుగేళ్లలో సంవత్సారల్లో పోలవరం పూర్తికావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. -
ప్రత్యేక హోదా కోసం పోరాడుదాం
తాడేపల్లిగూడెం :రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం చేద్దామని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ ఇతర పార్టీలకు పిలుపునిచ్చారు. స్థానిక సుబ్బారావుపేటలోని హ్యాంగ్ అవుట్లో శనివారం జరిగిన లోక్‌సత్తా జిల్లా సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన విలేకర్లతో మాట్లాడారు. అప్పటి ప్రధాని మన్మోహ న్సింగ్ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానంటే దాన్ని 15 ఏళ్లుగా ప్రకటించాలని రాజ్యసభలో వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే, పదేళ్లపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారని వర్మ అన్నారు. తీరా కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నింటిని తుంగలో తొక్కిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం మాని ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న పది రాష్ట్రాల సరసన మరో రాష్ట్రంగా మాత్రమే ఆంధ్రాను చేర్చి అన్యాయం చేశారన్నారు. ఖర్చు లేని రైల్వే జోన్ ప్రకటన, రైల్వే డబ్లింగ్‌లు వంటివి కూడా ఏమీ లేవన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.18000 కోట్లు ఖర్చు అవుతుందని, బడ్జెట్లో కేవలం వంద కోట్లు కేటాయిం చడంలో ఆంతర్యం ఏమిటన్నారు. లోక్‌సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన సంకల్పదీక్ష అంతా బూటకమన్నారు. దీనికి సంబంధించి పత్రంలో ఉదాహరించిన నాలుగు డిమాండ్లు చూస్తే ఆ విషయం పూర్తిగా అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఆ హామీని దగా చేసిన కేంద్రానికి జేపీ కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు సాగిరాజు జానకిరామరాజు, కార్యదర్శి కె.కె.విశ్వేశ్వరరావు, జాతీయ ఉపాధ్యక్షుడు చెన్నుపాటి వజీర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌రెడ్డి, మహిళా సత్తా నాయకురాలు ఎస్.మనోరమ, జిల్లా నాయకులు ఎం.వెంకటేశ్వరరావు, వివిధ మండలాల నుంచి వచ్చిన పార్టీ నేతలు పాల్గొన్నారు. లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్) : ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అనే అంశంపై లోక్‌సత్తా పార్టీ ఉద్యమిస్తుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటాన్ని సాగిస్తుందని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ జానకి రామరాజు, కేకే విశ్వేశ్వరరావులు తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయం నుంచి తాలూకా ఆఫీస్ మీదుగా పోలీస్ ఐలాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జాతీయ అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ, ప్రధాన కార్యదర్శి రమేష్‌రెడ్డి, మహిళా రాష్ట్ర నాయకురాలు మనోరమ, ఉపాధ్యక్షులు చెన్నుపాటి వజీర్, ఐ.రామమూర్తి, జిల్లా నాయకులు ఎస్.వెంకటేశ్వరరావు, పి.కృష్ణ, ఎ.అప్పారావు, శివరామకృష్ణ, న్యాయవాది రాజగోపాల్, స్థానిక నాయకులు ఎస్‌ఏకే జిలాని, టి.రామకృష్ణ, కె.లక్ష్మీనారాయణ, కాశీ విశ్వనాధం, కమల, ఆర్ రాజా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వాళ్లకు గల్లాపెట్టె, ఓటు బ్యాంకే ముఖ్యం: జేపీ
విశాఖపట్నం: గల్లా పెట్టె, ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప రాష్ర్ట ప్రయోజనాల్ని కొన్ని పార్టీలు పట్టించుకోవడం లేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. తెలుగు ప్రజల భవిత కోసం 4 డిమాండ్లతో కూడిన 'సంకల్ప దీక్ష' ను గురువారం ఉదయం 10.30 నిమిషాలకు చేపట్టిన జేపీ సాయంత్రం నాలుగు గంటలకు విరమించారు. దీక్షకు ముందు, తర్వాత జేపీ ప్రసంగించారు. రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించడం సంతోషదాయకమన్నారు. ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లి డబ్బులు లేవంటే నవ్వుతారని, క్యాంపు కార్యాలయం కోసం రూ.కోట్లు వెచ్చించడమేమిటని ప్రశ్నించారు. ఈ నెల 15న హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. -
రేపటి నుంచి జేపీ నిరాహార దీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయాలంటూ లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ మంగళవారం నుంచి రాష్ట్రంలోని వివిధ నగరాల్లో నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోందని ప్రకటనలో జేపీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి తగిన న్యాయం జరిగేంత వర కూ లోక్‌సత్తా పోరాటం చేస్తుందన్నారు. మార్చి 3న అనంతపురంలో, 5న విశాఖపట్నంలో, 8న విజయవాడలో నిరాహార దీక్షలు చేస్తున్నట్లు జేపీ ప్రకటించారు. -
లోక్‌సత్తాలో కుమ్ములాటలు
దెబ్బతిన్న ఆ పార్టీ వ్యవస్థాపకుడి లక్ష్యం సాక్షి, హైదరాబాద్: వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలైన లోక్‌సత్తా పార్టీ జాతీయ పార్టీగా మారబోయి బొక్కబోర్లా పడింది. ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ విజయం నేపథ్యంలో ఇక్కడ ఓటమి పాలైనా ఇతర రాష్ట్రాల్లో అవకాశాలు చూసుకోవాలన్న ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ లక్ష్యం ఆదిలోనే బెడిసికొట్టింది. ఉత్తరాదికి చెందినవారిని పార్టీ జాతీయ అధ్యక్ష పదవిలో ఉంచితే ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరించవచ్చనేది జేపీ ఆలోచన. ఆయన ఆలోచనలకు భిన్నంగా పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల నేతలు లేకుండా ఇతర రాష్ట్రాల నేతల నాయకత్వంలో తాము పనిచేయడం ఏమిటంటూ ఏపీ నేతలు ఎదురుతిరిగారు. ఈ వివా దం ముదిరిపోయి రోడ్డున పడేదాకా వచ్చింది. జేపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతూ జాతీ య కౌన్సిల్ సభ్యులే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. 30 మందిలో ముగ్గురే ఉన్న తెలుగు రాష్ట్రాల నేతల ఆలోచనలకు భిన్నంగా జాతీయ కౌన్సిల్ అధ్యక్షుడిగా మహా రాష్ట్రకు చెందిన సురేంద్ర శ్రీవాత్సవ ఎన్నికయ్యారు. ఆయన్ని నాయకుడిగా అంగీకరించబోమంటూ ఏపీ శాఖ బహిరంగంగా విమర్శలు చేయగా, తెలంగాణ శాఖ అంతర్గత సమావేశాల్లో అసంతృప్తిని వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలో నోటీసులు ఇవ్వకుండానే ఏపీ నేతలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు సురేంద్ర ప్రకటించడంతో వివాదం ముదిరింది. ఈ మొత్తం వ్యవహారంలో జేపీ పూర్తిగా సురేంద్ర శ్రీవాత్సవకు మద్దతు పలుకుతూ వచ్చారు. లోక్‌సత్తాలో కీలకంగా పనిచేసిన కటారి శ్రీనివాసరావు, డీవీవీఎస్ వర్మ వంటి నేతలు పార్టీ నుంచి సస్పెండైన తర్వాత తమదే అసలైన లోక్‌సత్తా పార్టీగా ప్రకటించుకున్నారు. దీంతో త్వరలో జేపీ జిల్లా పర్యటనలు మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. త్వరలో తామూ జిల్లాల్లో పర్యటిస్తామని పోటీ వర్గానికి చెందిన జాతీయ కమిటీ అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు చెప్పారు. -
లోక్ సత్తా పార్టీలో వర్గ పోరు?
-
లోక్ సత్తా పార్టీలో వర్గ పోరు?
హైదరాబాద్:లోక్ సత్తా పార్టీలో మరోసారి విభేదాలు చోటు చేసుకున్నాయి. గతంలో చోటు చేసుకున్న వర్గ పోరు ఈసారి తారాస్థాయికి చేరింది. లోక్ సత్తా పార్టీ.. తమదంటే తమదని శ్రీవాత్సవ వర్గం వాదిస్తుండగా.. పార్టీకి విధివిధినాలను రూపొందించింది తామని కఠారి శ్రీనివాస్, వర్మ వర్గం అంటోంది. అసలు శ్రీవాత్సవ వర్గం పార్టీ నియమాలను ఉల్లంఘించదని ఆ పార్టీ అధ్యక్షుడు కఠారి శ్రీనివాస్ తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ను ఆ వర్గం మబ్బుల్లో ఉంచుతున్నారని ఆయన విమర్శించారు. ఈనేపథ్యంలో జేపీ ఎటువైపు ఉన్నారో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని కఠారి తెలిపారు. -
ఫలితాలు మార్పును సూచిస్తున్నాయి: జెపి
-
20, 22 తేదీల్లో జాబ్‌మేళా
హైదరాబాద్: లోక్‌సత్తా, ఇంజినీర్స్ కాడ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20, 22 తేదీల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు లోక్‌సత్తా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అధ్యక్షులు బి.సాంబిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10 నుంచి మ.2 గంటల వరకు ఈ జాబ్‌మేళా ఉంటుందని పేర్కొన్నారు. అమీర్‌పేటలోని యూరేకాకోర్ట్ 2వ అంతస్తులో ఉన్న సీసీఈ సంస్థలో ఈ మేళా ఉంటుందని తెలిపారు. డిగ్రీ, డిప్లొమా, మెకానికల్, ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నెలకు జీతం రూ.7 వేలు ఆపై ఉంటుందని, పూర్తి వివరాలకు 89770 31068 నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. -
నేడు విశాఖలో లోక్‌సత్తా రౌండ్‌టేబుల్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: పౌర సేవల హక్కు చట్టం కోసం లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ప్రజా ఉద్యమంలో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. లోక్‌సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. -
‘పౌరసేవల చట్టం’పై నేడు రౌండ్‌టేబుల్: లోక్‌సత్తా
సాక్షి, హైదరాబాద్: ‘హక్కుగా పౌరసేవల చట్టం’ అంశంపై మంగళవారం హైదరాబాద్‌లోని ‘సెస్’ సెమినార్ హాల్లో నిర్వహించే రౌండ్‌టేబుల్ సమావేశంతో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు లోక్‌సత్తా పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. సామాన్య ప్రజలకు రోజువారీ జీవితంలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందాల్సిన రేషన్ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు, మంచినీటి కనెక్షన్లు వంటి సేవలను అవినీతి, ఆలస్యం లేకుండా కచ్చితంగా అందించేందుకు వీలుగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు లోక్‌సత్తా తెలంగాణ కన్వీనర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 14న విశాఖపట్టణంలోనూ రౌండ్‌టేబుల్ సమావేశం ఉంటుందన్నారు. సెస్‌లో జరిగే రౌండ్‌టేబుల్ సమావేశంలో సీహెచ్ రాజేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్ కేఆర్ వేణుగోపాల్, జస్టిస్ రెడ్డప్ప రెడ్డి, కళానిధి సత్యనారాయణ, ప్రొ.హనుమంతరావు, ప్రొ. సి.లక్ష్మణ్ణ, అన్వర్ ఖాన్, డా.చక్రపాణి, ఎం.ధర్మారావు, డా. టి.హనుమాన్‌చౌదరి, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొంటారు. -
జేపీకి ప్రధాని మోదీ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నందుకుగాను లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మోదీ ట్విట్టర్ ద్వారా జేపీకి అభినందనలు తెలిపినట్టు లోక్‌సత్తా పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
మోసపూరిత హామీలిచ్చిన బాబు: జేపీ
గుంటూరు: ఎన్నికల వేళ మోసపూరితమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలులో పూర్తి నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం లోక్‌సత్తా 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు బాండ్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు ఆ బాండ్లను నగదుగా మార్చుకునేవరకు ఆయన పదవిలో ఉంటారో.. లేదోనని ఎద్దేవా చేశారు. రైతుల కళ్ల నీళ్లు తుడిచేందుకే ఈ బాండ్ల పంపకమని వ్యాఖ్యానించారు. అవినీతి నిర్మూలనలో అన్నాహజారేకు అన్నగా చెప్పుకున్న బాబు ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చుచేసి అధికారంలోకి వచ్చారనీ, ఇప్పుడెందుకు అవినీతి గురించి ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. దేశంలో రాజకీయ మార్పు కోసం లోక్‌సత్తా పోరాడుతోందన్నారు. కులం, ధనం, ప్రాంతీయతలను ముడిపెట్టుకుంటూ రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, వాటికి స్వస్తి పలకడానికి ప్రాణం ఉన్నంత వరకు ఉద్యమిస్తానని చెప్పారు. రాజధాని నిర్మాణం విషయంలో మంగళగిరి, తుళ్ళూరు ప్రజలను ప్రభుత్వం అయోమయానికి గురి చేస్తోందని మండిపడ్డారు. రాజధానికి 2 వేల ఎకరాలు ఉంటే సరిపోతుందని, దానిని ఆసరా చేసుకుని రైతుల వద్ద ఎక్కువ భూములు తీసుకుని అనుయాయులు, బంధువులకు అప్పగించేలా మంత్రులు కుయుక్తులు చేస్తున్నారని విమర్శించారు. లోక్‌సత్తా పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. -
రాజధానికి రెండువేల ఎకరాలు చాలు: జేపీ
గుంటూరు : రాజధాని పేరుతో అడ్డగోలుగా భూములు సేకరిస్తే సహించేది లేదని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హెచ్చరించారు. రాజధాని కోసం రెండు, మూడువేల ఎకరాలు సరిపోతాయని, ముప్పై వేల ఎకరాలంటూ భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వాళ్లను పెంచి పోషించాలనుకుంటున్నారా అని ఆయన శనివారమిక్కడ ప్రశ్నించారు. లోక్‌సత్తా పార్టీ 8వ వార్షికోత్సవ సభలో జయప్రకాష్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ రైతుల దగ్గర తీసుకున్న భూమిలో అభివృద్ధి చేసిన సగం తిరిగి వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన పనికిమాలిన హామీలతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని జయప్రకాష్ నారాయణ విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో రైతులను నిలువునా ముంచారని ఆయన వ్యాఖ్యానించారు. -
చంద్రులిద్దరూ చుక్కలు చూపిస్తున్నారు
ఇరు సీఎంలపై జేపీ ఫైర్ హైదరాబాద్: ఓటేసిన పాపానికి ఇద్దరు చంద్రులు ఇరు రాష్ట్రాల్లో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రథమ మహాసభ, లోక్‌సత్తా ఎనిమిదో వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇరు రాష్ట్రాలు శ్రీశైలం విద్యుత్‌పై రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని జేపీ మండిపడ్డారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు రామ్మోహన్రావు మాట్లాడుతూ తెలంగాణలో లోక్‌సత్తా ప్రజలకు మరింత దగ్గరై గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతుందన్నారు. ఈ సభలో లోక్‌సత్తా నాయకులు శ్రీనివాసరెడ్డి, రవిమారుతి, గజాన న్, సరోజాదేవి తదితరులు పాల్గొన్నారు. -
శివరామకృష్ణన్ కమిటీ సూచనలు విలువైనవి
అరసవల్లి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణలపై శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలు చాలా విలువైనవని, వాటిని పక్కనపెట్టి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లున్నట్టు కన్పిస్తోందని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు కె. పోలినాయుడు అన్నారు. ఇది సహేతుకం కాదని వ్యాఖ్యానించారు. లోక్‌సత్తా పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని సమస్య అతి సున్నితమైందన్నారు. మూడు ప్రాంతాల వారిని సంతృప్తి పరిచేలా అన్ని ప్రాంతాల అభివృద్ధికి భరోసానిస్తూ తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను తలదన్నే సూపర్‌సిటీ అంటూ ప్రజల్లో భ్రమలు కలిగించేలా ప్రకటనలివ్వడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. అన్నీ మేము నిర్ణయిస్తామని ఏకపక్ష ధోరణికి ప్రభుత్వం స్వస్తి చెప్పి రాజధానిపై ప్రజాప్రతినిధులు, ప్రజలతో చర్చలు జరిపి అంతిమంగా శాసనసభ ఆమోదం ద్వారా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జిల్లా కోశాధికారి అల్లు మల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎ.నాగేశ్వరరావు, బి.గౌరీశంకర్, వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు టి.మాధవరావు, పి. ప్రవీణ్, వి.అప్పలరాజు, బి.నర్సున్నాయుడు, ఎం.సత్యనారాయణ, బి.జానకీరామ్, ఆర్.గాంధీ పాల్గొన్నారు. -
లోక్‌సత్తా అధికార ప్రతినిధిగా పాండురంగారావు
తెలంగాణ లోక్‌సత్తా పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా ఎం. పాండురంగారావు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణలో పార్టీ అధికార ప్రతినిధుల పేర్లను బుధవారం నాడు ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండారు రామ్మోహనరావు ప్రకటించారు. కె. గీతామూర్తి, వి. లక్ష్మణ్ బాలాజీ, పి. భాస్కరరావు అనే ముగ్గురిని ఇతర అధికార ప్రతినిధులుగా ప్రకటించారు. లోక్‌సత్తా తరఫున మల్కాజిగిరి లోక్‌సభా స్థానానికి ఆ పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ పోటీ చేసిన విషయం తెలిసిందే. -
లోక్‌సత్తా.. వైఫల్యానికి నాదే బాధ్యత: జేపీ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణల్లో లోక్‌సత్తా పార్టీ వైఫల్యానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తనదే పూర్తి బాధ్యతని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆది వారం పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఏర్పాటైన తర్వాత అనేక మైలురాళ్లు సాధించామని, వచ్చేనెల 14, 15 తేదీల్లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో మరిన్ని కీలక అంశాలపై చర్చిస్తామని చెప్పారు. మోడీ, చంద్రబాబు, కేసీఆర్‌ల విజయాన్ని అభినందించారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు. -
ఈల మోగలేదు...గోల చేయలేదు
నూతన రాజకీయాలు, నీతివంతమైన ఆదర్శ రాజకీయాలు.. భారత రాజ్యాంగం .... ఇది లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ నిత్యం చెప్పే మాటలు. ప్రస్తుతమున్న రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ప్రజల చేతికి అధికారం రావాలి. రాజకీయాలంటే ఐదేళ్లకోసారి అధికార మార్పిడి కాదంటూ ఐదేళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చదువుతున్న యువతతో పాటు, పట్టణ, నగర ఓటర్లలో ఆలోచనలు రేకెత్తించారు. నూతన విధానాల పేరిట వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఐదేళ్లు తిరిగిచూసేసరికి ఇప్పుడు లోక్ సత్తా అధినేత ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన విషయం స్పష్టమైంది. జేపీ మాటల్లో చెప్పిన ఆదర్శాలను ఆచరణలో నిరూపించుకోలేక రాజకీయాల్లో నామమాత్ర పాత్రకు పరిమితమయ్యారు. ఐదేళ్ల కిందట కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ నియోజకవర్గ ప్రజలకు సైతం తాను చేయదల్చుకున్న నూతన రాజకీయాలేమిటో, అభివృద్ది ఏమిటో చూపించలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర విభజన మొదలుకొని.. అనేక అంశాల్లో జేపీ అనుసరించిన విధానం కూడా ఫక్తు రాజకీయ నాయకుడిలా పూటకో మాట తరహాలో ఉండటం.. ఆయనను అభిమానించినవారిలో సైతం వ్యతిరేకత వచ్చేందుకు కారణమైంది. ఇక సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే.. జేపీ నేతృత్వంలోని లోక్ సత్తా పార్టీ మిగతా రాజకీయ పార్టీల్లాగే వ్యవహరించిందన్న విషయం స్పష్టమైంది. లోక్ సత్తాలో జేపీ తర్వాత పేరున్న నేత కటారి శ్రీనివాస్. ఆ తర్వాత చెప్పుకోదగిన నేతలెవరూ లేరు. ఆపార్టీలో మిగతా నేతల పేర్లు కూడా జనాలకు చేరనేలేదు. గత ఎన్నికల్లో లోక్ సత్తా గట్టి పోటీ ఇవ్వలేకపోయినప్పటికీ చాలాచోట్ల ఓట్లను చీల్చింది. హైదరాబాద్‌లో పలుచోట్ల బీజేపీ కన్నా మెరుగ్గా ఉండి నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ....ఈల వేసి గోల చేసిన లోక్‌సత్తా ఈసారి మాత్రం ఎలాంటి సత్తా చూపలేకపోయింది. గత ఎన్నికల్లో వచ్చిన ఒక్క సీటును కూడా ఈసారి నిలుపుకోలేకపోయింది. ఆయన ఈ సారి లోక్ సభ సీటకు పోటీ చేసి 1,47,458 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మల్కాజిగిరి ఎంపీ స్థానానికి మారిన జేపీ.. అక్కడ గెలుపు కోసం సినీ ప్రముఖుల్ని వాడుకున్నారు. అంతే కాకుండా మోడీ బొమ్మను ప్రచారంలో ఉపయోగించుకోవటంతో పాటు పవన్ కల్యాణ్ మద్దతు కోసం పాకులాడినా ఫలితం లేకపోయింది. ఇంత చేసి.. బీజేపీతో అంటకాగినా జేపీ సత్తా చూపలేక మల్కాజ్‌గిరిలో సోదిలో లేకుండా పోయారు. ఇవన్నీ ఇలా ఉండగా జేపీ నీతిమంతమైన రాజకీయాల గుట్టు విప్పారు ఆయన పార్టీ ఢిల్లీ కన్వీనర్ ఒకాయన. అంతర్గతంగా రాజకీయ నాయకులతో కుమ్మక్కు కావడం.. పారిశ్రామికవేత్తల కోసం సెటిల్మెంట్లు చేయడం, తన మేధావితనాన్ని అంత ఉపయోగించుకొని ఢిల్లీ స్థాయిలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలతో లాబీయింగ్ జరుపడం ద్వారా లోలోపల చీకటి వ్యవహారాలు చక్కదిద్దడంలో దిట్ట జేపీ అని ఆయన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో కుండబద్దలు కొట్టడం సంచలనం సృష్టించింది. -
సీమాంధ్రలో జేఎస్పీ, లోక్‌సత్తాకు ఘోర పరాభవం
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ), లోక్‌సత్తా పార్టీలకు సీమాంధ్రలో ఘోర పరాభవం ఎదురైంది. సీమాంధ్రలో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఆయా పార్టీల అభ్యర్థులు ఓటమి చవిచూశారు. కనీసం ఒక్కచోటన్నా గెలుస్తామని ఆశలు పెట్టుకున్న ఈ రెండు పార్టీల నేతలు ఫలితాలు చూసి కంగుతిన్నారు. సీమాంధ్రలో మొత్తం 152 అసెంబ్లీ స్థానాల్లో జేఎస్పీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల పొత్తులో భాగంగా మరో 18 అసెంబ్లీ స్థానాల్లో సీపీఎంకు మద్దతు తెలిపారు. అయితే సీమాంధ్రలో జేఎస్పీ తరపున బరిలో నిలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ గెలవకపోవడంతో జేఎస్పీ అధినేత, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నీరుగారిపోయారు. గెలుస్తారని భావించిన అమలాపురం లోక్‌సభ అభ్యర్థి జీవీ హర్షకుమార్‌తోపాటు విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాల పరిధిలోని పలువురు అసెంబ్లీ అభ్యర్థులు సైతం ఓటమి పాలవడంతో ఆయన పూర్తిగా డీలాపడ్డారు. కనీసం తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలోని పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి తన సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి గెలుపు ఖాయమని భావించిన ఆయనకు తీవ్ర నిరాశే ఎదురైంది. మరోవైపు లోక్‌సత్తా పార్టీ శ్రేణుల్లోనూ నిరుత్సాహం అలుముకుంది. సీమాంధ్రలోని 75 అసెంబ్లీ స్థానాల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడగా.. కనీసం ఒక్కచోటన్నా గెలవలేదు. అంతేగాక ఎక్కడా 5 వేలకు మించి ఓట్లు కూడా రాలేదు. ప్రజల తీర్పు శిరోధార్యమంటూ ఆ పార్టీ నేతలు అభ్యర్థులకు సర్దిచెప్పారు. -
ప్రచారం సమాప్తం
సాక్షి, ఒంగోలు: సార్వత్రిక సంగ్రామంలో కీలక ఘట్టం ముగిసింది. ప్రచారహోరుకు తెరపడింది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకల్లా అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. పోలింగ్ బుధవారం జరగనుంది. మూడు లోక్‌సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు జైసమైక్యాంధ్ర, లోక్‌సత్తా తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. అందరూ ఎన్నికల ఆఖరి ఘట్టమైన పోలింగ్‌పైనే దృష్టి సారించి.. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ధనం, మద్యంతో ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే పోల్ మేనేజ్మెంట్లో నిష్ణాతులైన నేతలు, క్రియాశీలక కార్యకర్తలు రంగంలోకి దిగారు. ధనం, మద్యంను భారీ స్థాయిలో బయటకు తీస్తున్నారు. 20 శాతం ఓట్ల డిపాజిట్‌కు.. ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు కీలకంగా ప్రభావితం చూపే 20 శాతం ఓట్లపై నేతలు కన్నేశారు. ఎవరికి వారు తమ సామాజికవర్గ ఓటుబ్యాంకుతో పాటు ఇతరులను ఏ మేరకు తమ వైపునకు తిప్పుకోవాలనే మార్గాలను అన్వేషిస్తున్నారు. రహస్య సమావేశాలు పెట్టుకుని సామాజికవర్గాల పెద్దలతో మాట్లాడుతున్నారు. పేదల కాలనీలకు వెళ్లి ఓటుకింత చొప్పున డబ్బు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులందుతున్నాయి. ఓటుకు రూ.500 నుంచి రూ.2వేలకు పైగా ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సామాజికవర్గాల ఓట్లను గంపగుత్తగా కొనుగోలు చేయడంలో టీడీపీ ముందంజలో ఉంది. దర్శి, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు, గిద్దలూరు, మార్కాపురం, చీరాల నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు డబ్బులు పంచుతుండగా గత మూడ్రోజుల్లో లక్షలాది రూపాయల ఎన్నికల పంపిణీ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాణాలు చేయించుకుంటున్న టీడీపీ... జిల్లావ్యాప్తంగా గెలుపుపై ధీమా సన్నగిల్లిన టీడీపీ నేతలు ఓట్ల కొనుగోలుకు తెగబడుతున్నారు. గ్రామాలవారీగా డబ్బుసంచులిచ్చి వారితో ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అద్దంకి, పర్చూరు, ఒంగోలు, కందుకూరులో టీడీపీ అభ్యర్థులు ఓటుకు రూ.1000 నుంచి రూ.1500లు పంచుతూ తినే అన్నంపై.. చంటిబిడ్డలపై ప్రమాణాలు చేయిస్తున్నారని.. ఒకట్రెండు చోట్ల ఓటర్లు ఎదురు తిరుగుతున్న సందర్భాలున్నాయని స్వయాన పార్టీ వర్గాలే బయటపెడుతున్నాయి. అద్దంకి పట్టణంలోని బీసీ ఓటర్లను స్థానిక టీడీపీ నేత కరణం బలరాం అనుచరులు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు, చీరాలలో నవోదయ పార్టీ తరఫున పోటీచేస్తున్న ఆమంచి కృష్ణమోహన్ వర్గం కూడా ఎస్సీ, ఎస్టీలను బెదిరిస్తున్నట్లు ఎన్నికల కమిషన్, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. కనిగిరిలో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి అనుచరులు స్థానికంగా ఉన్న యాదవ సామాజికవర్గ ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సోమవారం రాత్రి పలువురు జిల్లాపోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విజయంపై ధీమాతో వైఎస్సార్ సీపీ.. ఈసారి ఎన్నికల్లో అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపడం రాజకీయ దిగ్గజాల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులపై వివిధ సామాజికవర్గాల ప్రజలు అపూర్వ ఆదరణ చూపుతున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సుభిక్షపాలనను అందించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడాన్ని... ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కడం.. రాష్ట్రాన్ని విభజనను ప్రతీఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. రైతుల కోసం పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల బరిలో నిల్చి గెలవడం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నేడు పేదలపక్షాన పోరాడుతోన్న వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌పై విశ్వాసంతో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు ప్రజల వద్దకు రావడాన్ని జనం స్వాగతిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతామని ప్రజలు చెబుతున్నారు. ఈ జన లక్ష్యమే రాజకీయాల్లో సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నేటినుంచి సీమాంధ్రలో జేపీ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఇక సీమాంధ్ర జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. గురువారం నుంచి ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారం ప్రారంభిస్తారని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, కాకినాడలో, 2న విజయవాడలో, 3న గుంటూరు, ఒంగోలులో, 4న నెల్లూరు, తిరుపతిలో, 5న నంద్యాల, కర్నూలులో ప్రచారం చేస్తారని తెలిపింది. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ డీవీవీఎస్ వర్మలు కూడా వివిధ జిల్లాల్లో రోడ్‌షోల ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని ఆ ప్రకటనలో తెలియజేశారు. -
జేపీ.. మోడీ ఫొటో వాడొద్దు: బీజేపీ
సాక్షి,హైదరాబాద్: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తన ఎన్నికల ప్రచారం, పత్రికాప్రకటనల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఫొటోను వాడుకోవటం ఏ మాత్రం సరికాదని బీజేపీ పేర్కొంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ... తన స్వార్థం కోసం బీజేపీ, మోడీ పేర్లను జేపీ వాడుకోవటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే ఆయన తన ప్రచారంలో మోడీ ఫొటోలను తీసేసి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని లేకుంటే బీజేపీ కార్యకర్తలు ఆయన్ను నిలదీయాలని మల్లారెడ్డి పిలుపునిచ్చారు. -
సిద్ధాతమంటూ ఒకటి లేని స్టార్ నేత !
-
మోడీకి లోక్‌సత్తా మద్దతిస్తుంది: జేపీ
హైదరాబాద్: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి లోక్‌సత్తా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ చెప్పారు. మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో మోడీని కలసి కాసేపు మంతనాలు జరిపారు. అనంతరం జేపీ మీడియాతో మాట్లాడుతూ... దేశాన్ని నరేంద్రమోడీ మంచి మార్గంలో నడిపిస్తారని భావించి ఆయనకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. లోక్‌సత్తా పార్టీ కోరుకున్న నాలుగు అంశాలు.. ఆర్థికాభివృద్ధి, ఏడాదికి కోటి ఉద్యోగాలు, సుపరిపాలన, ఇండియా నంబర్-1 వంటివి మోడీలో ఉన్నాయన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం విషయుంలో పవన్ కల్యాణ్ తనకు బహిరంగ మద్దతు తెలపడమే కాకుండా తర్వలో ప్రచారం చేయనున్నారని తెలిపారు. ఆందోళనలో టీడీపీ అభ్యర్థి వుల్లారెడ్డి.. వుల్కాజిగిరి నుంచి పోటీచేస్తున్న లోక్‌సత్తా అభ్యర్థి జయుప్రకాష్ నారాయుణ్ బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని కలిసి వుద్దతు కోరడంతో ఇక్కడి టీడీపీ అభ్యర్థి వుల్లారెడ్డి పరిస్థితి అగవ్యుగోచరంగా వూరింది. మిత్రపక్షమైన బీజేపీ తనకు కాకుండా జేపీకి వుద్దతిస్తుందేమోనని ఆయన వుథనపడుతున్నారు. చంద్రబాబు కూడా ఒకవైపు తన సావూజికవర్గానికి చెందిన జేపీ కోసం, వురోవైపు మోడీ, పవన్‌లను ప్రసన్నం చేసుకునేందుకు తనను బలిచేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. -
సరైన నాయకున్ని ఎన్నుకోండి: జయప్రకాష్‌నారాయణ
లోక్‌సత్తా అధినేత, మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి జయప్రకాష్‌నారాయణ శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: సమాజం బాగుపడాలంటే సరైన నాయకున్ని ఎన్నుకోవాలని లోక్‌సత్తా అధినేత, మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి జయప్రకాష్‌నారాయణ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్యం, డబ్బుకు అమ్ముడు పోయి ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. 50 కోట్లతో లోక్‌సభ టికెట్ కొని, 100 కోట్లు ఖర్చుపెట్టి గెలుపొందితే ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఎక్కడ చూచినా అవినీతి, కుంభకోణాలే కనిపిస్తున్నాయన్నారు. రైతులకు మద్దతు ధర కలిపించడానికి, ఆహార ధాన్యాలు విదేశాలకు ఎగుమతి కావటానికి ఎంతగానో కృషి చేశానన్నారు. ప్రతి యేడాదికి కోటిన్నర మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా కేవలం 10, 15 లక్షల మందికే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విదేశీ ఉత్పత్తుల పై మన దేశం ఆధారపడుతుందన్నారు. పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఇంతకు ముందు కూకట్పల్లి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ఒక్కసారి అవకాశం కలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాన్నారు. మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థి లింగమూర్తి మాట్లాడుతూ... నిస్వార్థంగా ఓటు వేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాల్లో నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో లోక్‌సత్తానాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆంధ్రా పెత్తనాన్ని సహించం
అల్వాల్, న్యూస్‌లైన్: మల్కాజిగిరి నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు ఉన్నాయనే ఉద్దేశంతో పలు పార్టీలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని పోటీకి దించాయని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు తెలంగాణ ఆత్మగౌరవానికి మరింత బలాన్నిస్తుందన్నారు. ఇకపై ఆంధ్ర పెత్తనాన్ని సహించేదిలేదన్నారు. అల్వాల్ లోతుకుంటలో శనివారం రాత్రి జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సత్తా సత్తా లేకుండా పోయి ఏక్‌సత్తాగా మారిందన్నారు. చంద్రబాబు నాయుడిని తెలంగాణ వారు వద్దంటున్నా తానిక్కడే ఉంటానని అంటున్నారని, ఆయనిక్కడ ఉండటానికి ఇబ్బంది లేదని, కానీ చక్రం తిప్పుతానంటేనే అభ్యంతరమన్నారు. సెక్రటేరియట్లో 90 శాతం మంది ఆంధ్ర ఉద్యోగుల ఉన్నారని వారిని ఆంధ్రప్రభుత్వంలోనే ఉంచాలని అంటుంటే కాంగ్రెస్ వాళ్లు మాత్రం అభ్యంతరం చెబుతున్నారన్నారు. కేవీపీ రాంచందర్‌రావు సహకారంతో టీపీసీసీ పదవి దక్కించుకున్న పొన్నాల లక్ష్యయ్య తెలంగాణ ప్రాంతానికి ఎలా న్యాయం చేయగలుగుతాడని ప్రశ్నించారు. చంద్రబాబు- వెంకయ్య నాయుడు చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. పొత్తు వద్దని కిషన్‌రెడ్డి వారించినా పట్టించుకోకుండా బలవంతంగా కుదుర్చుకున్నారన్నారు. టీడీపీ, బీజేపీకి ఓటు వేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దన్నారు. టీఆర్ఎస్కు 90 స్థానాలు ఖాయం జీహెచ్ఎంసీ పరిధిలో సెటిలర్ల ఓట్లు అధికంగా ఉన్నాయని టీఆర్ఎస్ బలహీనంగా ఉందని పలువురు దుష్ర్పచారం చేస్తున్నారని, అయితే మూడు రోజులుగా టీఆర్ఎస్ బలపడినట్లు సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్ అన్నారు. 90 సీట్లు గెలుచుకుని తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేయనుందన్నారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటి వేసి పారదర్శక పాలన అందిస్తామన్నారు. వక్ఫ్, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, అసెంబ్లీ అభ్యర్థులు కనకారెడ్డి, సుధీర్‌రెడ్డి, గజ్జెల నగేష్, రామ్మోహన్‌గౌడ్, కొలను హనంతరెడ్డి, గొట్టిముక్కల పద్మారావు, సుభాష్‌రెడ్డితో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ మంత్రి ఎన్ఏ కృష్ణ, నక్క ప్రభాకర్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. బాబు వాడుకుని వదిలేశాడు: మైనంపల్లి కేసీఆర్ చొరవతోనే తాను టీడీపీలో చేరానని, అనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ బయటకు వెళ్లినా పార్టీపై అభిమానంతో తాను టీడీపీలో కొనసాగానని, కానీ చంద్రబాబునాయుడు తనను వాడుకుని వదిలేశాడని మల్కాజిగిరి లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు ధ్వజమెత్తారు. చంద్రబాబు లాగా తనకు వెన్నుపోట్లు పొడవడం రాదన్నారు. పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ, 24 గంటలు పని చేసేలా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తానన్నారు. -
పవన్‌ది ఇంకా ఆ 'రంగుల' ప్రపంచమే !
-
బాబు, మోడీ దొందూదొందే.. ప్రపంచ బ్యాంకు చిలుకలు
* అమెరికా సామ్రాజ్య శక్తుల తొత్తులు * రక్త చరితులిద్దరూ చేతులు కలిపారు * నిరుపేద నోటికాడి ముద్దనూ లాక్కుంటారు జీవితంలో మళ్లీ జట్టు కట్టబోనన్న బీజేపీతోనే చంద్రబాబు మరోసారి ఎన్నికల పొత్తు పెట్టుకోవడం వెనుక దాగున్న లోతైన కారణాలను, వారికి లోక్‌సత్తా జేపీ దన్ను తాలూకు లోగుట్టును, వీరందరినీ తెర వెనక నుంచి ఇష్టానుసారం ఆడిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద శక్తుల తీరుతెన్నులను కళ్లకు కడుతూ సామాజికవేత్త ప్రొఫెసర్ జి.హరగోపాల్ వెలిబుచ్చిన అభిప్రాయాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... - ప్రొఫెసర్ హరగోపాల్: రక్తం రుచి మరిగిన నరేంద్ర మోడీ ఒక్కసారిగా తెరమీదికి ఎందుకొచ్చారు? నెత్తుటి చారికలే తన పాలనకు ఆనవాళ్లుగా మిగిలిన చంద్రబాబు ఆయనతో ఎందుకు జోడీ కట్టారు? పేదవాడి సంక్షేమం భారమంటున్న లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ ఈ జట్టుతో చేతులు కలపడం వెనుక అర్థమేమిటి? ఆర్థిక సంస్కరణలే ఆయువుపట్టుగా చెప్పుకున్న యూపీఏపై జనం ఎందుకు కన్నెర్ర చేస్తున్నారు? నిశితంగా పరిశీలిస్తే, నిగూఢార్థం ఒక్కటే. ఈ కూటమిని అమెరికా సామ్రాజ్యవాద శక్తులు ఏరికోరి ఎంచుకున్నాయి. దేశాన్ని తమ విషపు కౌగిట్లో మరింతగా బిగించేందుకు 2014 ఎన్నికలను వేదికగా చేసుకున్నాయి. ఈ వ్యూహమే అమలైతే, ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తే పేదవాడి జీవితం అల్లకల్లోమవుతుంది. నోటి ముందు ముద్దను కూడా అమెరికా శక్తులు లాక్కెళ్లడం ఖాయం. భయం, హింసే పాలకుల అస్త్రమయ్యే ప్రమాదముంది. ముస్లింలకు, మైనారిటీలకు నిలువ నీడలేని దుస్థితి ఎదురవుతుంది. వ్యవసాయం దండగని అప్పట్లో చంద్రబాబు పలికిన ప్రపంచ బ్యాంకు పలుకులే అనునిత్యం సుప్రభాతాలవుతాయి. సన్న, చిన్న కారు రైతు తన పొలంలో ఏం పండించాలో కూడా అమెరికానే ఆదేశించే ఆస్కారముంది. కూటి కోసం అగచాట్లు, గూడు కోసం వెదుకులాట, గుడ్డ కోసం దేబిరింపు... ఇవీ ప్రపంచబాంకు ఆధిపత్యంలో కన్పించే దుష్ఫలితాలు. ఇదో కుట్ర మన దేశంలో 1983 వరకూ సంక్షేమ రంగానికి ఎంతోకొంత ప్రాధాన్యముండేది. ఆ తర్వాత అమెరికా శక్తుల ప్రమేయం పెరిగింది. అప్పు పేరుతో ప్రపంచబ్యాంకు ఆధిపత్యం మొదలైంది. అరకొరగా దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. ఫలితంగా ప్రజా వ్యతిరేక పెరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ సంస్కరణల వేగం పెంచింది. వాజ్‌పేయి నేతృత్వంలో అమెరికా భజన నిరాటంకంగా కొనసాగింది. భారత్ వెలిగిపోతోందన్న నినాదం తో ఓట్ల కోసం వెళ్తే దగాపడ్డ వర్గాలు ఈడ్చి తన్నాయి. 90 దశకం నుంచీ అమెరికా చేతిలో కాంగ్రెస్ పావుగా మారింది. పెట్టుబడిదారీ వర్గాలన్నీ పీవీ నరసింహారావును కీర్తించడం, ఆ తర్వాత ఆర్థికవేత్తగా మన్మోహన్‌ను ఆకాశానికెత్తడం పరిపాటైంది. పదేళ్లుగా అమెరికా పెట్టుబడిదారులు భారత్‌లో గల్లీగల్లీకీ విస్తరించారు. ఆఖరుకు రిటైల్ రంగంలోనూ చొరబడేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. మోడీని ఎందుకు ఎంచుకున్నారు? నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ఓ కుట్ర దాగుంది. సామ్రాజ్యవాద శక్తులు పదేళ్లుగా యూపీఏ ప్రభుత్వంతో అలవోకగా తమ విధానాలను అమలు చేయించుకున్నాయి. ఫలితంగా యూపీఏపై ప్రజాగ్రహం పెరిగింది. ఉపాధి లేని యువత తిరగబడుతోంది. గిట్టుబాటు లేని రైతన్న ఆగ్రహిస్తున్నాడు. కార్మిక, కర్షకులు సంస్కరణలపై కన్నెర్ర చేస్తున్నారు. ఈ ఎన్నికలనే తీసుకోండి. ప్రధాని మన్మోహన్సింగ్ ఎక్కడ సభ పెట్టినా జనం రావడం లేదు. దేశ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఏ మారుమూల గ్రామానికీ వెళ్లలేని పరిస్థితి. యూపీఏ మంత్రులను, ఎంపీలనూ జనం చీదరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ముఖం కావాలి. దాని వెనుక భయపెట్టో, బెదిరించో పాలన సాగించే శక్తులుండాలి. అంతిమంగా అవన్నీ తమ చెప్పుచేతుల్లో ఉండాలి. ఇదీ అమెరికా ఆలోచన. బీజేపీని సమర్థిస్తున్న శక్తులన్నీ ఇలాంటివే. సంఘ్‌పరివార్, ఆర్ఎస్ఎస్... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వీటికో అజెండా ఉంది. ఈ దేశంలో హిందూత్వ రాజ్యాన్ని స్థాపించాలి. మైనారిటీ వర్గాలను తరిమేయాలి. ముస్లిం దేశాలకు అమెరికా వ్యతిరేకం. కాబట్టి ఆ దేశం తోకపట్టుకుని వెళ్లాలని అవి భావించాయి. అమెరికాకేమో తమ పెట్టుబడులను విస్తరించుకునే వ్యూహముంది. హిందూత్వ శక్తులకు తమ రాజ్యాన్ని స్థాపించాలన్న అజెండా ఉంది. అందుకే అవన్నీ ఒకటయ్యాయి. మోడీ అంటే రక్తం; బాబు అంటే బషీర్‌బాగ్ మోడీ పేరు వింటే గుజరాత్ అల్లర్లే గుర్తుకొస్తాయి. అనేక నేరాలు కళ్లముందే కదులుతాయి. రక్తపాతం భయం పుట్టిస్తుంది. చంద్రబాబు కూడా అంతే. బషీర్‌బాగ్ కాల్పులు. కాల్దారీ సంఘటన వణికిస్తాయి. ఇలాంటి శక్తులన్నీ కలిస్తే ప్రజల్లో భయం పుట్టుకొస్తుంది. ప్రజా వ్యతిరేకత ఉన్నా, ధైర్యం చేసి ఉద్యమించలేరు. ఒకవేళ ఉద్యమించినా అణిచివేస్తారు. ఇదీ అమెరికా సామ్రాజ్య శక్తుల బలమైన నమ్మకం. వీటన్నింటికన్నా మించి, నరేంద్రమోడీ సంస్కరణలకు కేంద్ర బిందువు. గుజరాత్ తరహా అభివృద్ధిని చూపిస్తానని ఆయనే చెబుతున్నారు. నిజానికి అక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటి? పెట్టుబడిదారీ వర్గ ఆలోచనల విస్తృతి కాదా? దీన్నే ప్రజలకు అందిస్తానంటే సగటు మనిషి దుస్థితి ఏమిటి? పేదరికం పెరిగిపోదా? దుర్భిక్షం తాండవించదా? వ్యవసాయం పరిస్థితేమిటి? వ్యవసాయ రాయితీలకు అమెరికా పూర్తిగా వ్యతిరేకం. ఆ దేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ వాటా కేవలం 2.5 శాతమే. కానీ మన దేశంలో 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. అమెరికా ఆదేశాలనే పాటిస్తే, విదేశీ పెట్టుబడి రాయితీలే ప్రధానమైతే, రైతన్నకు చిల్లిగవ్వ కూడా మిగలదు. పురుగుమందే పరమాన్నమయ్యే దుర్గతి పడుతుంది. చంద్రబాబు ఈ విధానాన్నే భుజానికెత్తుకున్నారు కదా! వ్యవసాయం దండుగని ఆయన నోటి నుంచే చెప్పారు కదా! అప్పుడు ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో తెలియదా? ఇప్పటికీ చంద్రబాబు అధికారంలోకి రాకపోవడానికి ఆయన అనుసరించిన రైతు వ్యతిరేక విధానాలే కారణం. అణచివేతే విధానమా? దేశంలో ఇప్పుడు ఓ భయం ఉంది. అమెరికా తన అజెండాను మోడీకిచ్చి ఎన్నికలకు పంపింది. బహుళజాతి సంస్థల పెట్టుబడిదారులే బీజేపీకి ప్రధానంగా నిధులిస్తారు. కాబట్టి అధికారంలోకి వస్తే వాళ్లు చెప్పినట్టు వినాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేయాలి. అన్ని రంగాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలి. ఇది ఎంత ప్రమాదం! దీన్ని ఇప్పటికే భారత్‌లోని ప్రతి పల్లే వ్యతిరేకిస్తోంది కదా! మోడీ ఈ విషయంలో కేవలం నెల రోజుల్లోనే మూడు మాటలు చెప్పారు. ఎఫ్‌డీఐలను అనుమతించబోమని ఒకసారి, పాక్షికంగానేనని మరోసారి, అనుమతించకపోతే అభివృద్ధెలాగని మరోసారి అన్నారు. అమెరికా మాటలు జవదాటకుండా మోడీ పాలన సాగించే పరిస్థితి లేదనడానికి, ఈ విషయంలో ప్రపంచ స్థాయి ఒత్తిడి పెరుగుతోందని చెప్పడానికి ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి? వాస్తవానికి ప్రజలు కనీసావసరాలు కోరుకుంటున్నారు. నీరు, విద్య, ఉద్యోగం, వైద్యం, రవాణా... ఇవీ వారు ఆశించేవి. కానీ వాటికోసం అడిగితే, ఆందోళన చేస్తే అణచేయడానికి మోడీ ఏమాత్రం వెనుకాడరనేది ఆయన పాలన చాటిచెబుతున్న సత్యం. ఆర్థికేతర సమస్యలుగా చూపే ఎత్తుగడ బీజేపీకి అనుబంధంగా ఉన్న శక్తుల వల్ల ప్రయోజనముంటుందని అమెరికా భావిస్తోంది. ఎందుకంటే ఆర్థికపరమైన సమస్యలను ఇతర అంశాల వైపు మళ్లించే చాకచక్యం ఆ పార్టీకే సొంతం. గతంలో రామజన్మభూమి అంశాన్ని చూసినా, రామసేతు వివాదం తీసుకున్నా... ఇలా రాముడో, దేముడో అని చెప్పి, మతం మత్తులో జనాగ్రహాన్ని అణచేయగల శక్తి బీజేపీకి ఉందనేది వాస్తవం. పైగా ఆ పార్టీ వెనుక ఆర్ఎస్ఎస్, సంఘ్‌పరివార్ వంటి శక్తులు ఉండనే ఉన్నాయి. రామ్‌దేవ్ బాబా రాజకీయాలు మాట్లాడుతున్నారు. సన్యాసులు అభ్యర్థులను సూచిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాలిస్తోంది. భారత ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తే, ఇలాంటి సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఎన్నికల్లో అవి ఇంతగా ప్రభావం చూపిస్తున్నాయంటే బలమైన అజెండా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా అమెరికా సామ్రాజ్య శక్తుల దుష్ట పన్నాగాల నుంచి బయటకు వచ్చేందుకు తృతీయ ప్రత్యామ్నాయ శక్తి అవసరం. ఈ దిశగా ఆస్తిత్వాన్ని కాపాడుకునేందుకు సామాజిక శక్తులు ఏ మేరకు సఫలమవుతాయో వేచి చూడాల్సిందే. బాబు... ప్రపంచ బ్యాంకు పోస్టర్ బోయ్! అది 2004. మరో గంటలో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని పార్టీ గెలుస్తుంది. కానీ గాంధీభవన్‌లో ఓ యువజన నేత ‘ఆ, ఏం గెలుస్తాం... చంద్రబాబును తట్టుకోవడం సాధ్యమా?’ అని అన్నారు! అంటే బాబు కోసం ప్రపంచ బ్యాంకు అంతగా ప్రచారం చేసింది. ఆయన అంత గొప్ప నేత అంటూ బాకా ఊదింది. ఎంతగా అంటే... చివరకు గెలిచే వ్యక్తి కూడా తాము గెలుస్తామని చివరి నిమిషం దాకా నమ్మలేనంతగా! ఇంకా చెప్పాలంటే, బాబు ఓడిపోయాడనే రిజల్టు వెలువడేదాకా కూడా ‘చంద్రబాబే మళ్లీ సీఎం’ అని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆఖరుకు బాబు ఓడిపోయిన తర్వాత కూడా, ఎందుకు ఓడాడా అని ప్రపంచ బ్యాంకు సర్వే చేయింది. బహుశా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వల్లేమోనని 2009లో కూడా ప్రపంచ బ్యాంకు భావించిందట! అంటే బాబుపై దానికి అంత నమ్మకం! తమ ఆదేశాలను పొల్లుపోకుండా అమలు చేయడానికి ప్రజలను కాల్చివేయడానికి కూడా సిద్ధమైన ఆయనను ప్రధాని చేయాలని కూడా ప్రపంచ బ్యాంకు అనుకున్నదట. కానీ ప్రజలకు వ్యతిరేకంగా పని చేయడం వల్ల ఆ ఆగ్రహం ఇప్పటికీ ఆయన మీద పోలేదు! వామపక్షాల వైఫల్యమే కారణం మత శక్తులు, అమెరికా అనుకూల పార్టీలు ఇంతగా ఎదగడానికి ఒకరకంగా వామపక్షాలే కారణమని విశ్లేషించాలి. అమెరికా సామ్రాజ్య శక్తులకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టడంలో ఆ పార్టీలు విఫలమయ్యాయి. లాటిన్ అమెరికా లాంటి చోట్ల వామపక్ష శక్తులు ఎదుగుతున్నా మన దగ్గర రోజు రోజుకు దిగజారుతున్నాయి. జన సమీకరణలో అవి విఫలం కావడమే ఈ పరిస్థితికి కారణం. జగన్‌ది సాహసమే! ఒకపక్క చంద్రబాబు అమెరికా మంత్రం జపిస్తుంటే, నరేంద్రమోడీ చుట్టూ తిరుగుతుంటే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేమో సంక్షేమ పథకాలనే ఎజెండాగా చేసుకున్నారు. ఇది సాహసోపేత నిర్ణయమే. ప్రపంచ బ్యాంకు కన్నా ప్రజల సంక్షేమమే ప్రధానమని గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. దాంతో ఆయనపై వచ్చిన ఒత్తిడి అంతా ఇంతా కాదు. నిజానికి అంత ధైర్యం చేయబట్టే వైఎస్ ఇప్పటికీ జనంలో ఉన్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే దారిని ఎంచుకున్నారు. అనుకున్నట్టు సంక్షేమ పథకాలను అమలు చేస్తే ప్రజలకు ప్రభుత్వం నిజంగా అండగా ఉన్నట్టే. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికీ న్యాయం జరుగుతుందని చెప్పవచ్చు. -
జేపీ.. టీడీపీ భజనపరుడు
గట్టు రామచంద్రరావు ధ్వజం హైదరాబాద్ : ఏసీ రూముల్లో పడుకునే లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు పేదల కష్టాలు ఏం తెలుస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. కడుపు నిండిన జేపీకి కడుపు ఎండినవారి గురించి ఆలోచించే సమయం ఉండదని, అందుకే వైఎస్సార్సీపీ ప్రకటించిన ‘అమ్మ ఒడి’ అర్థం కాలేనట్లుందని విమర్శించారు. ఆయన మంగళవారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ తల్లికి అయినా తన బిడ్డను చదివించుకోవాలనే తపన కచ్చితంగా ఉంటుంది. కానీ బిడ్డ తనతోపాటు పనిచేస్తే ఒక పూట గడుస్తుందనే ఆశతో పిల్లల్ని పనిలో పెడుతున్నారే తప్ప బడికి పంపకూడదని కాదు. అందుకే అలాంటి తల్లులకు భరోసానిస్తూ పిల్లల్ని పెద్ద చదువులు చదించేందుకు అమ్మ ఒడి పథకానికి జగన్ రూపకల్పన చేశారు’’ అని వివరించారు. పేదవారి గుండె చప్పుడు నుంచి రూపొందించిన మేనిఫెస్టో కూడా జేపీకి అర్థం కాలేదంటే పేదవాళ్లకు ఆయన ఎంత దూరంగా ఉంటున్నారో అర్థమవుతోందని పేర్కొన్నారు. తనకు తాను గొప్ప మేధావినంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ తెలుగుదేశం పార్టీకి భజనపరుడిగా మారారని ధ్వజమెత్తారు. -
జేపీ ఉగ్రవాది కంటే ప్రమాదకారి: టీ.లోక్‌సత్తా
హైదరాబాద్: లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఉగ్రవాది కంటే చాలా ప్రమాదకారుడని తెలంగాణ లోక్‌సత్తా అధినేత కంచర్ల ధర్మారెడ్డి దుయ్యబట్టారు. ఆర్థిక నేరాలలో ఆరితేరిన జేపీ యువతను మాయ మాటలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక ఛానల్ స్టింగ్ ఆపరేషన్‌లో ఢిల్లీ లోక్‌సత్తా అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ సంభాషణల ఆధారంగా ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ధర్మారెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జేపీ మంచివ్యక్తి అనే ముసుగులో దాగి ఉన్న ఒక గజదొంగ అని ఆయన ఆరోపించారు. లోక్‌సత్తా అనే గజదొంగల పార్టీకి తెర ముందు జేపీ కనిపించినా...తెరవెనుక నడిపించేది మొత్తం ‘ఈనాడు’ అధినేత రామోజీరావు అని ఆయన పేర్కొన్నారు. తమ సామాజికి వర్గానికి చెందిన చంద్రబాబు ఫెయిల్ అయితే జేపీని తెరపైకి తెచ్చి ఫోకస్ చేయడానికే ఇదంతా రామోజీరావు చేస్తున్న డ్రామా అని ఆయన వివరించారు. విద్యార్థులు, యువత జేపీ మాయ మాటలకు మోసపోవద్దని కంచర్ల విజ్ఞప్తి చేశారు. -
లోక్‌సత్తా నీతులు చెబితే సరిపోదు: నాగేశ్వర్
సిటీబ్యూరో: పరిపాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలన, వారసత్వ రాజకీయాలపై నిత్యం నీతులు చెప్పే లోక్‌సత్తా పార్టీ కూడా ఇతర పార్టీల జాబితాలో చేరిపోయిందని మల్కాజిగిరి లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఎద్దేవా చేశారు. ప్రజలకు నీతులు చెప్పడం కాదని, తాము కూడా వాటిని పాటించాలన్నారు. ఆదివారం ఆయన ఆల్వాల్, బాలానగర్, మలేషియా టౌన్షిప్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీతి, న్యాయం అని చెప్పే లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఇప్పుడు తనపై, తన పార్టీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఏం సమాధానం చెబుతారని నాగేశ్వర్ ప్రశ్నించారు. స్ట్రింగ్ ఆపరేషన్‌లో చిక్కిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో సరిపోదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీ మేనిఫెస్టోలు అద్భుతంగా ఉన్నాయని జేపీ చెబుతున్నారని, ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆ పార్టీలతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారనేందుకు ఇదో నిదర్శనమన్నారు. ఆదర్శవంతమైన కేజ్రీవాల్‌ను వదిలేసి మతోన్మాదిగా ముద్రపడిన నరేంద్రమోడీని భుజానికి ఎత్తుకోవడంలో ఉన్న ఆంతర్యమేమిటో వివరించాలన్నారు. సుమారు ఆరువేల మంది నివసిస్తున్న మలేషియా టౌన్షిప్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని, గత పాలకులు దీని అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని నాగేశ్వర్ ఆరోపించారు. బాలాన గర్ శ్రీనగర్ కాలనీలోని ప్రజలు గుక్కెడు నీళ్లకూ నోచుకోవడం లేదని, ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజల కనీస అవసరాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. -
ఆరోపణలపై విచారణకు సిద్ధం: జేపీ
అనురాగ్ కేజ్రీవాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్టు వెల్లడి హైదరాబాద్: అనురాగ్ కేజ్రీవాల్‌పై స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో.. లోక్‌సత్తా పార్టీ మీద వచ్చిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ పార్టీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్‌ది క్షమార్హం కాని ప్రవర్తన అని పేర్కొంటూ.. అందుకుగాను ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించామని వెల్లడించారు. లోక్‌సత్తాపార్టీ ఇంత బాధ్యతాయుతంగా స్పందించినా మీడియాలో ఒక వర్గం, చానళ్లు లోక్‌సత్తా ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో వ్యవహరించాయంటూ జేపీ తప్పుపట్టారు. ఇదిలా ఉండగా లోక్‌సత్తా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురేంద్ర శ్రీవాస్తవ ఆదివారం ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించిన అనురాగ్ కేజ్రీవాల్‌ను తక్షణం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్టు తెలిపారు. పార్టీ ఢిల్లీ శాఖ కమిటీని రద్దు చేసి.. కొత్తగా ఐదుగురు సభ్యులతో తాత్కాలిక ప్యానల్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. -
"జేపీకి తెలియకుండానే 'ఇదంతా' జరిగుంటుందా ?"
-
క్రేజివాల్ను బహిష్కరిస్తున్నాం: జెపి
-
''లోక్‌సత్తా ఎవరితో ఒప్పందాలున్నాయో చెప్పాలి''
-
ఏం కావాలన్నా చేసి పెడతా..ఇదీ మా 'సత్తా'
-
పార్టీల్లో రెబల్స్ మరియు లోక్‌సత్తా గుట్టురట్టుపై చర్చ
-
ఏం కావాలన్నా చేసి పెడతా..ఇదీ మా సత్తా..
రూ. 35 కోట్ల మొత్తానికి అనురాగ్ కేజ్రీవాల్ ఒప్పందం కార్పొరేట్ సంస్థ ప్రతినిధులుగా ఓ చానల్ పాత్రికేయుల బేరాలు మోడీ ప్రభుత్వంలో జేపీ మంత్రి కావటం ఖాయమన్న అనురాగ్ ఆయన శాఖలో ఏ పని కావాలన్నా చేస్తామంటూ ‘గ్యారంటీ’ జేపీ ‘నో కరప్షన్’ నీతి పాఠాలు యువత కోసమేనని వ్యాఖ్యలు ఆంధ్రాలో 5 ఎంపీ, 20 అసెంబ్లీ సీట్లు, ఢిల్లీలో 70 అసెంబ్లీ సీట్లకు మొత్తం రూ. 35 కోట్లు పార్టీకి ఇవ్వాలని ఒప్పందం ‘ఆపరేషన్ లోక్‌సభ’ స్టింగ్ ఆపరేషన్‌ను బయటపెట్టిన న్యూస్ ఎక్స్‌ప్రెస్.. వీడియో దృశ్యాల ప్రసారంతో లోక్‌సత్తాలో కలకలం హుటాహుటిన హైదరాబాద్ వచ్చిన అనురాగ్.. జేపీతో భేటీ అనురాగ్ కేజ్రీవాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని జేపీ వెల్లడి ‘‘మోడీ గెలవడం గ్యారంటీ.. 99 శాతం జేపీ మంత్రి కావడం ఖాయం. ఆయన పేరు లిస్ట్‌లో ఉంది. జేపీ మంత్రి అయ్యారనుకోండి.. ఆయన శాఖకు సంబంధించి మీకు ఏ రకమైన ప్రయోజనం కావాలన్నా చేస్తాం. మీ కంపెనీ షార్ట్ లిస్ట్ అయితే ఎలాంటి లెసైన్స్ ఇచ్చేందుకు ప్రమోట్ చేస్తాం. ప్రతి పనికీ ఓ బడ్జెట్ ఉంటుంది. మీరు 2జీ లాంటి స్కాం చేయాలంటే ఆయన చేయడు. మీరు నా చేతుల్లో ఒక లాజికల్ పేపర్ ఉంచారనుకోండి.. జేపీ హామీ ఇస్తారు.. నేను జేపీతో చెప్తాను.. మన వాళ్లకు సాయం చేయాలి అని’’ ‘‘జేపీ గురించి అందరికీ తెలుసు.. టీవీలో మీరు వినే ఉంటారు.. ‘నో కరప్షన్ - నో కరప్షన్’ అనే ఆయన నినాదాన్ని. ‘మీరిలా నీతి పాట పాడితే ఎలా కుదురుతుంది సార్..?’ అని నేను ప్రశ్నిస్తే.. ‘అనురాగ్! నేను యువతకు చెప్తున్నా.. మూర్ఖులు కాకండి అని. అయినా నేను డబ్బు ఇవ్వకుండా ఒక లెసైన్స్ కోసం వారం రోజులు లైన్లో నిలబడతానా?’ అని ఆయన బదులిచ్చారు...’’ ‘‘కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఏదైనా పాలసీ వస్తే.. మీరు లాజికల్ పాయింట్ ఇస్తే మేము వ్యతిరేకిస్తాం.. పార్లమెంటులో గొడవ చేయించాలి.. లేదా పాలసీకి వ్యతిరేకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఏదైనా సాధ్యం.. మీకు ఏ అవసరం వచ్చినా లెటర్ ఇప్పించగలను. దోపిడీలు చేయించలేము.. కానీ జేబులు కత్తిరిస్తాం...’’ ‘‘ఢిల్లీలో 70 అసెంబ్లీ సీట్ల కోసం రూ. 20 లక్షల చొప్పున కావాలి. అంటే రూ. 14 కోట్లు అవుతుంది. మొత్తం రూ. 25 కోట్లు మా పార్టీ కోసం ఇవ్వాలి. ఆంధ్రాలో 5 పార్లమెంటు సీట్లకు రూ. 70 లక్షల చొప్పున రూ. 3.5 కోట్లు, కనీసం 20 ఎమ్మెల్యే సీట్ల కోసం రూ. 20 లక్షలు చొప్పున రూ. 4 కోట్లు ఇవ్వండి. మొత్తం 32.5 కోట్లు అవుతుంది. రౌండ్ ఫిగర్ రూ. 35 కోట్లు ఇవ్వండి...’’ లోక్‌సత్తా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ ‘కార్పొరేట్ సంస్థల’ ప్రతినిధులతో నెరపిన ‘బేరసారా’ల్లో సంభాషణలివి! ప్రముఖ హిందీ వార్తా చానల్ ‘న్యూస్ ఎక్స్‌ప్రెస్’ తాజా స్టింగ్ ఆపరేషన్‌లో లోక్‌సత్తా నేత ఇలా ఒప్పందం చేసుకుని దొరికిపోయారు. ఆయనను పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్ సస్పెండ్ చేశారు. తాను సరదాగా మాట్లాడిన మాటలను రహస్యంగా చిత్రీకరించారని, పూర్తి సంభాషణలను ప్రసారం చేయకుండా, తమకు అనుకూలంగా కత్తిరించి ప్రసారం చేశారని అనురాగ్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్ కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో మంత్రి అవటం ఖాయమని.. ఆయన మంత్రిత్వశాఖలో కార్పొరేట్ సంస్థలకు ఏ పని కావాలన్నా చేసిపెడతామని.. అందుకోసం ఎన్నికల్లో తమ పార్టీకి రూ. 35 కోట్లు ఇవ్వాలని ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ మాట్లాడిన దృశ్యాలు స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడటం కలకలం రేపుతోంది. రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్.. ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణకు, అవినీతి నిర్మూలనకు ఒక ఉద్యమ సంస్థగా ప్రారంభించిన లోక్‌సత్తాను గత ఎన్నికలకు ముందు లోక్‌సత్తా పార్టీగా మార్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి జేపీ పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా గెలవటమూ విదితమే. తాజా ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో లోక్‌సత్తా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతుండటం.. మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి జేపీ పోటీ చేస్తుండటం తెలిసిందే. అయితే..ఎన్నికల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’కు సంబంధించి చిన్న పార్టీలు, డమ్మీ అభ్యర్థుల పా త్ర, కార్పొరేట్ సంస్థలతో చీకటి ఒప్పందాలు తదితర అం శాలపై ‘న్యూస్ ఎక్స్‌ప్రెస్’ తాజాగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ‘ఆపరేషన్ లోక్‌సభ’ పేరుతో వివిధ రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులపై నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వీడియో దృశ్యాలను ఆ చానల్ శనివారం ప్రసారం చేసింది. ఇందులో లోక్‌సత్తా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ చేసుకున్న ‘ఒప్పందాన్ని’ కూడా బయటపెట్టింది. ఓ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులుగా చెప్పుకుని పరిచయం చేసుకున్న తమ చానల్ పాత్రికేయులు.. కార్పొరేట్ వర్గాలకు సహాయం చేస్తామంటే ఎన్నికల నిధులు సమకూరుస్తామని లోక్‌సత్తా పార్టీ నేతను సంప్రదించగా ఆయన బుట్టలోపడ్డారని పేర్కొంది. జేపీతో చెప్పి ఏ పని కావాలన్నా చేయిస్తానని ‘గ్యారంటీ’ ఇచ్చారని.. ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేయిస్తానని చెప్తున్న దృశ్యాలను చూపింది. అలాగే.. ‘‘ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే నేను సీఎం అవుతా.. ఇక్కడ కూడా మీరు ఏం చెప్తే అది చేయగలను... ఎన్నికల్లో ఓట్లను చీల్చేందుకు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధం.. దక్షిణ ఢిల్లీ, ఆర్కే పురం, కొత్త ఢిల్లీ.. సీట్లూ నా చేతిలోనే ఉన్నాయి’’ అని కూడా అనురాగ్ కేజ్రీవాల్ చెప్తున్న దృశ్యాలనూ ప్రసారం చేసింది. ఇందుకు ప్రతిఫలంగా.. ఢిల్లీలోని 70 అసెంబ్లీ సీట్లకు, ఆంధ్రప్రదేశ్‌లోని 5 పార్లమెంటు, 20 అసెంబ్లీ స్థానాలకు మొత్తం రూ. 35 కోట్లు తమ పార్టీకి ఇవ్వాలని ఖర్చు అవుతుందని అనురాగ్ కేజ్రీవాల్ డీల్ చేసుకున్న వీడియో దృశ్యాలను ఆ చానల్ చూపింది. ఆయనను సస్పెండ్ చేశాం: జేపీ న్యూస్ ఎక్స్‌ప్రెస్ స్టింగ్ ఆపరేషన్ లోక్‌సత్తా పార్టీలో కలకలం సృష్టించింది. అనురాగ్ కేజ్రీవాల్ శనివారం ఉదయం హడావుడిగా హైదరాబాద్ చేరుకుని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణతో సమావేశమయ్యారు. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు. జయప్రకాష్ నారాయణ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీమాంధ్రలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరులు ‘స్టింగ్ ఆపరేషన్’ గురించి ప్రస్తావించగా.. మొదట దీని గురించి ఏమీ తెలియదని అంటూనే, ఆ కొద్దిసేపటికే అనురాగ్ కేజ్రీవాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అనురాగ్ క్రేజీవాల్ డబ్బులు వసూలు చేశారంటున్నారని అడిగిన ప్రశ్నకు.. ‘ఆయన డబ్బులు వసూలు చేశారా?’ అంటూ సదరు విలేకరిని జేపీ రెట్టించారు. ‘‘జేపీ ఎన్నికలలో గెలవడానికి కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేస్తే మీకు తెలియదా? అంతా విచిత్రంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. పార్టీకి నిధుల సేకరణ చెక్కుల రూపంలో జరుగుతుందని.. పార్టీ విరాళాలకు సంబంధించిన వివరాలను ఎవరైనా పరిశీలించుకోవచ్చని బదులిచ్చారు. సంభాషణలు కత్తిరించారు: అనురాగ్ కేజ్రీవాల్ కార్పొరేట్ సంస్థ ప్రతినిధులుగా వచ్చిన వారు తమ పార్టీకి ఫైనాన్స్ చేస్తామన్నారని, అయితే లోక్‌సత్తా పెద్ద పార్టీ కాదని, అయినా తమ పార్టీకి ఎందుకు ఫైనాన్స్ చేయాలనుకుంటున్నారని, మద్దతు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని తాను వారిని అడిగానని అనురాగ్ కేజ్రీవాల్ ‘సాక్షి’తో ఫోన్లో పేర్కొన్నారు. స్టింగ్ ఆపరేషన్‌పై వివరణ కోసం ‘సాక్షి’ సంప్రదించినపుడు.. మీడియా ప్రతినిధులు తమ మధ్య జరిగిన పూర్తి సంభాషణలు లేకుండా, వారికి అవసరమయ్యే విధంగా కత్తిరించి, మార్పుచేర్పులు చేసి ప్రసారం చేశారని ఆయన ఆరోపించారు. సరదాగా మాట్లాడిన వాటిని కూడా రహస్యంగా చిత్రీకరించి ప్రసారం చేశారని వాపోయారు. పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానన్నారు. స్టింగ్ ఆపరేషన్‌లో అనురాగ్ క్రేజీవాల్ మాట్లాడిన మాటలను ఎడిట్ చేశారని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు ఆరోపించారు. అనురాగ్ క్రేజీవాల్ తమ పార్టీ బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి అని, ఆయనపై ఇప్పుడు ఆరోపణలు రావడం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. డమ్మీ అభ్యర్థుల దందాపై ‘స్టింగ్’ న్యూస్ ఎక్స్‌ప్రెస్ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్ పార్టీలకు దడపుట్టిస్తోంది. ఎన్నికల తేదీలు వెలువడిన వెంటనే ఈ చానల్‌కు చెందిన బృందం అనేక అవతారాలు ఎత్తి ‘ఆపరేషన్ లోక్‌సభ’ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయని పేర్కొంది. ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులు కొందరు గెలవడానికి పోటీచేస్తే.. కొందరు ఓడిపోవడానికి పోటీచేస్తారని, మరికొందరు ప్రత్యర్థి ఓట్లను చీల్చేందుకు పోటీచేస్తారని, ఇంకొందరు ప్రధాన అభ్యర్థికి డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని.. వీరిని పోటీచేయించే వారు తెర వెనక ఉంటారని.. ఈ మొత్తం ‘మ్యాచ్ ఫిక్సింగ్’లలో కోట్లాది రూపాయలు చేతులు మారతాయని ఈ స్టింగ్ ఆపరేషన్ కథనాల సారాంశం. ఇందులో పలు పార్టీల నేతలు ప్రత్యర్థుల ఓట్లను ఎలా చీల్చారో వారితోనే టీవీ చానల్ చెప్పించింది. బలమైన ప్రత్యర్థి ఉన్న చోట ఆ ప్రత్యర్థి పేరును పోలిన వారిని డమ్మీలుగా నిలబెట్టిన వైనాన్ని టీవీ కథనం వివరించింది. ఉదాహరణకు ఢిల్లీలో ఆప్ నేత అశుతోష్ నిలిచిన చోట అదే పేరుతో మరో అభ్యర్థిని నిలబెట్టడం, హేమామాలిని నిలుచున్న చోట అదే పేరు ఉన్న మరికొందరు అభ్యర్థులను నిలబెట్టడం వంటి చర్యలు వెల్లడయ్యాయి. అలాగే బీఎస్పీ కూడా రాజస్థాన్‌లో ప్రత్యర్థులకు సంబంధించి డ మ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని ఈ కథనాలు ఆరోపించాయి. తాజా స్టింగ్ ఆపరేషన్‌లో లోక్‌సత్తా పార్టీతో పాటు, రాష్ట్రీయ లోక్‌దళ్ వంటి వాటితో పాటు.. వంచిత్ సమాజ్ ఇన్సాఫ్ పార్టీ, నయాదౌర్ పార్టీ వంటి చిన్నాచితకా పార్టీల పాత్రను, కొందరు పెద్ద పార్టీల అభ్యర్థుల ధన లోలతను స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టింది. -
బాబు జేబులో జేపీ
బాబు, జేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం టీడీపీ, బీజేపీ ఓడిపోవద్దంటూ.. జేపీ మమ్మల్ని పోటీ నుంచి తప్పించారు జేపీ కోసమే బాబు రేవంత్‌రెడ్డిని మల్కాజ్గిరి బరిలో నిలపలేదు గెలిస్తే.. బీజేపీకి మద్దతిచ్చి కేంద్రమంత్రి అవ్వాలని జేపీ ఆశ సిద్ధాంతాలు వదిలి పొత్తుల కోసం వెంపర్లాడారు లోక్‌సత్తా రాష్ట్ర కార్యదర్శి ఏనుగు రామారావు ఆరోపణ ఎలక్షన్ సెల్ తెలంగాణలో లోక్‌సత్తా పార్టీ నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్గిరి నుంచి ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ, చేవెళ్ల నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏనుగు రామారావు, సికింద్రాబాద్ నుంచి పి.రోహిత్‌కుమార్, మహబూబాబాద్ నుంచి రెడ్యానాయక్‌లను పార్టీ అభ్యర్థులుగా ఈ నెల ఆరో తేదీన ప్రకటించింది. జయప్రకాశ్ నారాయణ మాత్రం మల్కాజ్గిరి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. మిగతా ముగ్గురు నామినేషన్లు వేసేందుకు సిద్ధం కాగా చివరి క్షణంలో జేపీ వారికి బీ ఫారాలు ఇవ్వలేదు. ‘మనం ఆ మూడు చోట్ల పోటీ చేస్తే ఓట్లు చీలి టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఓడిపోతారు. అందువల్ల మీరు పోటీ చేయొద్ద’ని అభ్యర్థులకు నచ్చజెప్పి తానుమాత్రం లోక్‌సభ బరిలో నిలిచారు. ఈ మొత్తం తతంగం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జయప్రకాశ్ నారాయణల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ఉందని లోక్‌సత్తా పార్టీ నుంచి చేవెళ్ల టిక్కెట్టు లభించి బీఫారం పొందని ఏనుగు రామారావు ఆరోపిస్తున్నారు. ఆయన ‘సాక్షి’కిచ్చిన ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లోనే..! ఫోనోచ్చింది.. ఒప్పందం కుదిరింది నన్ను చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా ఈ నెల ఆరున అధికారికంగా ప్రకటించారు. 9వ తేదీ నామినేషన్లకు చివరి గడువు కావడంతో 8వ తేదీ రాత్రి బీ-ఫారం కోసం పార్టీ ఆఫీసుకు వెళ్లాను. ఎంత రాత్రయినా బీ-ఫారం ఇవ్వలేదు.చివరకు మనం ఆ మూడుచోట్లా (మల్కాజిగిరి మినహా) పోటీ చేయడంలేదంటూ జేపీ చావు కబురు చల్లగా చెప్పారు. లోక్‌సత్తా పోటీలో ఉంటే ఓట్లు చీలి టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఓడిపోతారనే కుంటి సాకు చెప్పారు. ‘మల్కాజిగిరిలో కూడా టీడీపీ అభ్యర్ధి రంగంలో ఉన్నాడు కదా. టీడీపీ కోసం మీరు కూడా తప్పుకోవాలి కదా’ అంటే సమాధానం లేదు. వాస్తవానికి ఆ రోజు జరిగిందేంటంటే.. జేపీకి ఆ రోజు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో ఏదో మాట్లాడారు. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘చేవెళ్లలో దేవేందర్‌గౌడ్ కొడుకు వీరేంద్రగౌడ్ టీడీపీ తరపున పోటీ చేస్తున్నాడు. ఏనుగు రామారావు పోటీ చేస్తే వీరేంద్రగౌడ్ గెలవడు.. అందువల్ల ఏనుగు రామారావును బరిలోకి దింపొద్ద’ని చంద్రబాబు చెప్పడం వల్లే నాకు బీ ఫామ్ ఇవ్వలేదు. దేవేందర్‌గౌడ్ కొడుకు కోసం చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకొని నన్ను తప్పించారు. చేవెళ్లలో నేను పోటీ చేస్తే కనీసం లక్ష ఓట్లు వస్తాయి. ఇప్పుడు నేను పోటీ నుంచి తప్పుకుంటే.. ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని అమ్ముడుపోయానని ప్రజలు పొరబడే అవకాశం ఉంది. కాబట్టి జేపీ బహిరంగంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. జేపీ మల్కాజిగిరీలో పోటీలో ఉంటే వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను. లోక్‌సత్తా స్థాయిని దిగజార్చారు మద్యం, డబ్బులు పంచొద్దు.. నేరచరితులకు టిక్కెట్లు ఇవ్వొద్దనేది లోక్‌సత్తా విధానం. అలా చేసే పార్టీలకు మద్దతు ఇవ్వొద్దనేది నిబంధన. టీడీపీ, బీజేపీలతో పొత్తుకోసం వెంపర్లాడి.. లోక్‌సత్తా స్థాయిని జేపీ దిగజార్చారు. వామపక్షాలతో పొత్తు అన్నాడు. కానీ వాళ్ల వల్ల తనకు ప్రయోజనం లేదనుకొని టీడీపీ, బీజేపీ పంచన చేరాడు. ఆమ్ఆద్మీతో పొత్తు అన్నాడు. కానీ వాళ్లు విలీనం అన్నారు. దీంతో అహం దెబ్బతిని దానికి దూరంగా ఉన్నాడు. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి పార్టీని ఎదగనీయడం లేదు. తనకు తాను మేధావినని అనకుంటూ.. పార్టీలోని ఇతర నాయకులకు విలువ ఇవ్వడు. ప్రైవేటు ఎస్టేట్‌లా పార్టీని తయారుచేశాడు. అవినీతిపరులతో చేతులు చంద్రబాబు-జయప్రకాశ్ నారాయణ ఇద్దరూ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ఇష్టపడ్డా మల్కాజిగిరి నుంచి ఆయనను చంద్రబాబు నిలబెట్టలేదు. జేపీతో ఒప్పందం చేసుకవడం వల్లనే బలమైన రేవంత్‌రెడ్డిని తప్పించి ఈ మధ్యే టీడీపీలో చేరిన మల్లారెడ్డికి టిక్కెట్టు ఇచ్చారు. బలహీన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా జేపీకి మార్గం సుగమం చేశారు. అందుకు కృతజ్ఞతగా జేపీ మమ్మల్ని బలి చేశాడు. ఒకవేళ గెలిస్తే బీజేపీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి పొందొచ్చన్నది జేపీ దురాలోచన. వయస్సు మీద పడుతుండటంతో ఆయనకు పదవీ వ్యామోహం పెరిగింది. అంతేకాదు తన స్వప్రయోజనాల కోసం కటారి శ్రీనివాసరావును ఈసారి కూకట్పల్లి నుంచి పోటీ చేయిస్తున్నారు. ఎందుకంటే ఆ అసెంబ్లీ స్థానం మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఓట్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆయన్ను ఇక్కడి నుంచి నిలబెట్టారు. జేపీలాంటి దేశద్రోహులకు బుద్ధి చెప్పాలి. జేపీ మాయమాటలకు ఎందరో బలయ్యారు. అవినీతిపరులు, నేరచరిత్రులకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి ఇప్పుడు వాళ్లతోనే చేతులు కలుపుతున్నార -
ఆ ఒక్క సీటు కోసమేనా..!
-
ఎవరికీ పట్టని లోక్‌సత్తా !
* నిర్వేదంలో జేపీ సాక్షి, హైదరాబాద్: జెండా, ఎజెండా పక్కనబెట్టినా లోక్‌సత్తా పార్టీకి ఫలితం దక్కలేదు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో కలిసి ఎన్నికల బరిలో దిగాలని కలలుగన్న లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు భంగపాటు ఎదురైంది. ఈసారి ఎలాగైనా టీడీపీ, బీజేపీలతో కలిసి మహాకూటమిగా జట్టుకట్టి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన భావించారు. అందుకనుగుణంగా కొంతకాలంగా ముమ్మర ప్రయత్నాలు చేశారు. బీజేపీని మచ్చిక చేసుకోవాలని అవకాశం వచ్చినప్పుడల్లా ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఆకాశానికెత్తారు. అయినా కమలదళం నుంచి పిలుపు రాలేదు సరికదా, లోక్‌సత్తా నేతలే ఆ పార్టీ తలుపు తట్టినా పట్టించుకోలేదట. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబును సంప్రతించడం కోసం వారి సామాజిక వర్గానికి చెందిన బడాబాబులతో విశ్వప్రయత్నాలు చేయించారు. చివరికి ఒక పత్రికాధినేత స్వయంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం నెరిపారు. అయితే, చంద్రబాబు చెప్పిన అభిప్రాయం విని మధ్యవర్తులు సహా జేపీ కూడా కంగుతిన్నట్టు తెలిసింది. ‘ఇప్పటికే బీజేపీతో పొత్తుతో తలబొప్పి కడుతోంది. మధ్యలో మీరు దూరితే ఇంకేమైనా ఉందా’ అని చంద్రబాబు అనడంతో జేపీ నివ్వెరపోయినట్టు సమాచారం.