సాక్షి, హైదరాబాద్: సర్కారు వైఫల్యాలు, ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ఉద్దేశించిన ధర్నాచౌక్‌లో ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడికి పోలీసులను వాడుకోవడం దారుణమని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ విమర్శించింది. సోమవారం జరిగిన ఘటనలో కాలనీవాసుల ముసుగులో టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, వాకర్ల ముసుగులో మఫ్టీ పోలీసులు ధర్నాచౌక్‌ను రణరంగంగా మార్చారని ధ్వజ మెత్తింది.
ఉద్యమ సమయంలో ఆంధ్ర, తెలంగాణ అంటూ ఏ విధంగానైతే పబ్బం గడిపారో, అదే తరహాలో ధర్నాచౌక్ దగ్గర లోకల్–నాన్‌లోకల్ అంటూ తెలంగాణ ప్రజల మధ్యే చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని ఆ పార్టీ నేత జన్నేపల్లి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
ధర్నాచౌక్‌ను రణరంగంగా మార్చారు: లోక్‌సత్తా
Published Wed, May 17 2017 3:37 AM | Last Updated on Sat, Mar 9 2019 3:05 PM
Advertisement
Advertisement