ధర్నాచౌక్ వద్ద నిరసనలకు ఆటంకాలొద్దు
►ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న నిర్వహించ నున్న ధర్నాచౌక్ ఆక్రమణకు ఆటంకాలు కల్పించవద్దని.. వివిధ వర్గాల ప్రజలు ఈ నిరసనకు హాజరయ్యే విధంగా రాష్ట్రప్రభు త్వం అనుమతించాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. అన్నివర్గాల ప్రజలు, రాజకీయపార్టీలు, సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేం దుకు ధర్నాచౌక్‌కు వచ్చేవారని, ఇప్పుడు దానిని పరిరక్షించుకునేందుకు ధర్నాలు, నిరసనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించింది.
ధర్నాచౌక్‌ను కాపాడుకునేం దుకు ప్రజలంతా ఈ నెల 15న ఉదయం 11 గంటలకు ఇందిరాపార్కుకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇందిరా పార్కు ఆక్రమణను నిర్వహించి ప్రజల ప్రజా స్వామిక ఆకాంక్షలను కచ్చితంగా వెల్లడించి తీరుతామని ప్రకటించింది. బుధవారం మఖ్దూం భవన్‌లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ధర్నాచౌక్‌ను మూసేయడం ద్వారా ప్రజా స్వామ్య గొంతుకను నొక్కేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా అడ్డుకోవాలన్నారు.
సీఎస్‌కు, డీజీపీకి వినతి పత్రాలు
తమ కమిటీ ఈ నెల 15న చేపట్టే ధర్నాచౌక్ ఆక్రమణకు ఆటంకాలు కల్పించవద్దని 11న డీజీపీకి, 12న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాలను సమర్పిస్తామన్నారు. 12న వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద మౌనదీక్ష చేస్తారన్నారు. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీల నాయకులు, ప్రజాస్వామ్య వాదులు సేవ్ ధర్నాచౌక్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం కోరారు. తెలంగాణ ఏర్పడ టమంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం కాదని వరవరరావు అన్నారు.
మలిదశ పోరా టంలో 1,400 మంది విద్యార్థులు, యువ కులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎన్ని కలు జరిగి ప్రభుత్వం ఏర్పడగానే ప్రజా స్వామ్య ప్రక్రియ ముగిసినట్లు కాదని, అది ఒక జీవనవిధానమన్నారు. అందుకు నిరం తర సంఘర్షణ, చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ధర్నాచౌక్ సాధించుకునే వరకు ఉద్యమం సాగుతుందని సీపీఎం నేత డీజీ నర్సింహారావు చెప్పారు. ఈ సమావేశంలో ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు (ఆప్), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ–చంద్రన్న), రమాదేవి (న్యూడెమోక్రసీ), విమలక్క (అరుణో దయ), రవిచంద్ (టీడీఎఫ్), కె.సజయ (సామాజిక కార్యకర్త) పాల్గొన్నారు.