
ధర్నాచౌక్ ప్రజా గొంతుక: చాడ
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను నిషేధించి అప్రకటిత అత్యవసర పరిస్థితిని సృష్టించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించకుండా నిషేధం విధించడంతో పాటు అక్కడ నిరసనలు తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజా గొంతుకగా నిలిచిన ధర్నాచౌక్ పరిరక్షణలో భాగంగా శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.