ప్రజా ఉద్యమాల గొంతు నులిమినట్లే
ధర్నాచౌక్ రద్దుపై ప్రొ. హరగోపాల్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌ను రద్దు చేయడమంటే ప్రజా ఉద్యమాల గొంతు నులిమినట్లేన ని ప్రొఫెసర్ హరగోపాల్ అభివర్ణించారు. ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహి రంగ లేఖ రాశారు. రాష్ట్ర సాధనలో ధర్నా చౌక్ పాత్ర కీలకమైందని, టీఆర్‌ఎస్ ఆవి ర్భావం నుంచి అధికారంలోకి వచ్చేవరకూ నిచ్చెనలా నిలబడ్డ విషయాన్ని లేఖలో గుర్తు చేశారు.
ఎన్నోపార్టీలు అధికారంలోకి రావచ్చు పోవచ్చని, ఏపార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదనేది చరిత్రాత్మక సత్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన ఉద్యమాలకు ఊపిరి పోసిన ధర్నాచౌక్ తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య సంస్కృతి, జీవితంలో అంతర్భాగ మన్నారు. ధర్నా చౌక్ రద్దు నిర్ణయం వెనుక పోలీసు యంత్రాంగం పాత్ర ఉంటుందన్నారు.