జేపీ అలా చెప్పడం హాస్యాస్పదం | JP Is So Ridiculous | Sakshi
Sakshi News home page

జేపీ అలా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది

Published Fri, Apr 13 2018 11:51 AM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

JP Is So Ridiculous - Sakshi

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ రెడ్డి

అనంతపురం జిల్లా :  కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులపై లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ చెప్పటం హాస్యాస్పదంగా ఉందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బలపర్చాలని కోరటం సరికాదన్నారు.  సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం కిందకే వస్తుందన్నారు.  ఈనెల16న ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ, వామపక్షాలు చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని కోరారు.

బంద్ అవసరం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని,  హోదా ఉద్యమన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. శివరామకృష్ణయ్య నివేదిక బుట్టదాఖలు చేశారని, ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబు రాజధాని, పోలవరం పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement