చిలకలూరిపేట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు సురేంద్ర శ్రీవాస్తవ డిమాండ్ చేశారు. హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. బుధవారం గుంటూరు పర్యటనలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పలు అంశాలు లేవనెత్తారు.
- ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి నేడు ప్రత్యేక ప్యాకేజీలు అంటున్న సిఎం పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు
- ప్యాకేజీ సరిపోతుందని రాష్ట్రానికి న్యాయం జరగుతుందని చెప్పటం పూర్తిగా మోసపూరితం. ప్యాకేజి పేరిట ఇచ్చేడబ్బు పాలకుల ఆర్బాటాలకే తప్ప ప్రజలకు ఉపయోగపడదు
- ప్రత్యేక హోదాతోనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయి తప్పించి ప్యాకేజీ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు
- రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నాటి అసెంబ్లీలో కోరింది మేమే
- హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి దీక్ష చేయటం అభినందనీయం
- వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా సాధించకుండా కేవలం రాజధాని నిర్మాణంపైనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టడం అవివేకం
- ప్రపంచస్థాయి రాజధాని అనే పదానికి అర్ధమే లేదని సుసంపన్న దేశం అమోరికాలోని అనేక రాష్ట్రాలకు గొప్ప గొప్ప రాజధానులు ఉన్నాయి భవిష్యత్తులో ఎన్నికల నిధుల కోసం, వ్యాపారాల కోసం వేలాదిఎకరాలు రైతుల నుంచి సమీకరించారు
- రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా రాజ్యం మేలుతున్నాయి.