'సీఎం రాజమండ్రిని వదిలి రావాలి'
రాజమండ్రి: ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పోతుందని ఇప్పటికే పలుసార్లు ఆరోపించిన జన చైతన్య వేదిక మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తప్పుబట్టింది. గోదావరి పుష్కరాల్లో మంగళవారం చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చంద్రబాబునాయుడు రాజమండ్రిని వదిలి రావాలని జనచైతన్య వేదిక డిమాండ్ చేసింది. చంద్రబాబు నాయుడు తన ప్రచార కాంక్షని మానుకోవాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు , రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్ రెడ్డి సూచించారు. చంద్రబాబు అక్కడ్నుంచి వచ్చేస్తేనే పుష్కరాలు ప్రశాంతంగా జరుగుతాయన్నారు.
మంగళవారం ఉదయం రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 29 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.