jana chaithanya vedika
-
‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు’
ఒంగోలు/నెల్లూరు (సెంట్రల్): వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి పేదల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతగా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మద్య నియంత్రణ కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువగా పట్టణ ఓటర్లు కృతజ్ఞత చూపేందుకు ముందుకు రావాలని కోరారు. శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రెస్‌క్లబ్, నెల్లూరులోని మాగుంట లే అవుట్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కరోనా కష్ట కాలంలోనూ ఆకలి మరణాలు లేకుండా ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం రూపంలో నగదు అందించడం ద్వారా ఆ కుటుంబాలు ఆర్థిక సంక్షోభానికి గురికాకుండా తట్టుకోగలిగాయని లక్ష్మణరెడ్డి స్పష్టం చేశారు. ఓటు ఎవరికి వేశారనే దానితో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ఏపీ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగు విజేంద్ర బహుజన్, జనచైతన్య వేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘సీఎం జగన్ మనసున్న మారాజు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చిక్కుకుపోయిన వేలాది మంది వలస కూలీలను తరలించేందుకు ఏర్పాట్లు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసున్న మారాజులా వ్యవహరిస్తున్నారని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో అభినందించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఏపీ మీదుగా కాలినడకన వెళుతున్న వలస కూలీల కష్టాలను చూసిన ఏపీ ప్రభుత్వం వారిని సురక్షితంగా సొంత ప్రాంతాలకు పంపడంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం గొప్పవిషయమన్నారు. దీని పై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోందని పేర్కొన్నారు. వలస కూలీలకు భోజన, వసతి సౌకర్యాలను కల్పించి శ్రామిక్ రైళ్లల్లో వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. వలస కూలీల దారి ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.500 లను ఇవ్వడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు. ఉపాధి కోసం వేలాది కిలోమీటర్లు వెళ్లిన వలస కూలీలు ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందేన్నారు. లాక్‌డౌన్‌తో చేతిలో చిల్లిగవ్వ లేక పరాయి రాష్ట్రాల్లో అష్టకష్టాలు పడుతున్న వలస కూలీలు ప్రాణాలకు తెగించి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు తమ కాళ్లనే నమ్ముకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోని చిత్తూరు మీదుగా తరలివస్తున్న కూలీలను మానవతా దృక్పధంతో ఆదుకోని ఇక్కడ వారి కోసం ప్రభుత్వం ఆశ్రయం కల్పించడం అభినందిచాల్సిన విషయమని కొనియాడారు. వారికి వసతి, ఆహారం అందించడంతో పాటు వైద్యపరీక్షలు చేసి ఆరోగ్యధృవీకరణలు అన్ని చేసిన తరువాత రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చి సొంత ప్రాంతాలకు పంపుతున్నట్లు లక్ష్మణరెడ్డి వివరించారు. ఏపీ నుంచి ఇప్పటి వరకు 1,10,000 మంది వలస కూలీలను వారి సొంత జిల్లాలకు పంపారని తెలిపారు. ఇప్పటి వరకు పరాయి రాష్ట్రంలో సొంతవారికి దూరంగా వేదనాభరిత జీవనాన్ని కొనసాగించిన వలస కూలీలు సొంత ఊళ్లకు చేరుకోవడంతో వారి కళ్లల్లో వెలకట్టలేని ఆనందం కనిపిస్తోందని లక్ష్మణరెడ్డి తెలిపారు. -
అభివృద్ధి అంటే.. భూముల విక్రయం కాదు
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, కడప, అనంతపురం ఉన్నాయని మద్యపాన నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ పి.లక్ష్మణరెడ్డి అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. జిల్లాలోని పబ్లిక్ లైబ్రరీలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓకే ప్రాంతం అభివృద్ధిగా అడుగులు వేస్తే భవిష్యత్తులో వేర్పాటువాద ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాజధాని కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అవసరం అవుతుంది. అంత పెద్ద మొత్తం ఒకే చోట వెచ్చించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ చదవండి: వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తే కేవలం ఐదు నుంచి పది వేల కోట్లతో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని లక్ష్మారెడ్డి వివరించారు. విశాఖకు ఉన్న నైసర్గిక స్వరూపాన్ని బట్టి రాజధానిగా ఏర్పాటు చేస్తే.. ప్రపంచంలోనే ఉన్నత స్థాయి నగరంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో అమరావతి గ్రాఫిక్ చూపించి కోట్లాది రూపాయల విలువ చేసే భూములను కొందరు స్వాధీనం చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి అంటే భూముల విక్రయం, విలువ ద్వారా సాధ్యం కాదని లక్ష్మణరెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ సదసస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ కేసీ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి ఎప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా చేయాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రింగ్ రోడ్డు నిర్మించినప్పుడు కొందరు నవ్వారని.. ఇప్పుడు అది హైదరాబాద్ ప్రజలకు జీవనాధారం అయిందని గుర్తు చేశారు. పేరుకు అమరావతి రాజధాని అయినా రాజధాని ఎక్కడో దూరంగా ఉందన్నారు. శివరామకృష్ణన్ కమిటీలో ఎక్కడా అమరావతి ప్రస్తావన లేదని ప్రొఫెసర్ కేసీ రెడ్డి తెలిపారు. చాలా కమిటీ నివేదికల్లో అమరావతి రాజధాని నిర్మాణం వలన ఇబ్బందులు ఉన్నాయని ప్రస్తావించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. విశాఖను అభివృద్ధి చేయలన్నది సీఎం జగన్ ఆలోచన అని.. విశాఖ ప్రజలు అభివృద్ధి ఎవరు చేసినా ఆహ్వానిస్తారని ప్రొఫెసర్ కేసీ రెడ్డి తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ కేఎస్ చలం మాట్లాడుతూ.. 1953లోనే విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన జరిగిందని ఆయన గుర్తు చేశారు. నర్మదా, గోదావరి నదుల జలాలు విశాఖ తూర్పు కనుమల్లోని నీరని అన్నారు. గోదావరి జిల్లాలో రెండో పంటకు సీలేరు నీరే ఆధారమని ఆయన చెప్పారు. గోదావరి పుష్కరాలలో నీరు లేనప్పుడు.. చంద్రబాబు నాయుడు స్నానం చేసిన నీరు సీలేరు నుంచి విడిచిపెట్టినవని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రుల రాజధానిగా అమరావతి, కర్నూలు, విశాఖను అభివృద్ధి చేస్తే అభ్యంతరాలు ఏమిటని ప్రొఫెసర్ కేఎస్ చలం ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్రలో ఉన్నాయని.. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు నిర్ణయాన్నిఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని కేఎస్ చలం తెలిపారు. -
వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి సాధ్యమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మద్యపాన నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ పి.లక్ష్మణరెడ్డి అభిప్రాయపడ్డారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణతో ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న చర్యలు అమోఘమని కొనియాడారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు చరిత్రలో లిఖించదగ్గదని కొనియాడారు. నెల రోజుల వ్యవధిలో దాదాపు 4 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టారన్నారు. రాజధానిగా అమరావతి అంత శ్రేయస్కరం కాదని మేధావులు, విద్యావేత్తలు, కమిటీలు చెప్పినప్పటికీ గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆక్షేపించారు. మూడు పంటలు పండే ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్‌గా చంద్రబాబు ప్రభుత్వం మార్చిందని విమర్శించారు. రాష్ట్రానికి మధ్యలో ఉందని అమరావతిని రాజధాని చేయడం సరికాదన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని ఆరోపించారు. అదీ కూడా ఒక సామాజిక వర్గం కోసమే చంద్రబాబు అక్కడ రాజధాని ప్రకటించారని దుయ్యబట్టారు. అభివృద్ధి కాని ప్రాంతంలో లక్షల కోట్లు వెచ్చించి రాజధాని నిర్మించే కన్నా.. వనరులన్నీ సమృద్ధిగా ఉన్న విశాఖపట్నంలో ఐదారు వేల కోట్లతో హైదరాబాద్, ముంబయి తలదన్నిన రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని భావించి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌గా మారాలంటే సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు వెచ్చించాలన్నారు. రాష్ట్ర సమతుల్యాభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడకుండా వికేంద్రీకరణను స్వాగతించాలని ఆయన హితవు పలికారు. అంబేడ్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ లజపతిరాయ్ మాట్లాడుతూ వికేంద్రీకరణపై ప్రజల్లో చైతన్యం బాగా వచ్చిందన్నారు. వికేంద్రీకరణ అనేది ఇప్పటిది కాదని 1953లోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. గత అనుభవాల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పారు. 70 ఏళ్లుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా మిగిలిపోయాయన్నారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు, కృష్ణా జలాలు రాయలసీమకు ఇవ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి చైర్మన్ పేర్ల సాంబమూర్తి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా పరిపాలన వికేంద్రీకరణకు అందరూ మద్దతు పలకాలని కోరారు. ఈ సమావేశంలో జనచైతన్య వేదిక విశాఖ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పౌర గ్రంథాలయంలో నేడు సదస్సు వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి అనే అంశంపై సోమవారం ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో సదస్సు నిర్వహించనున్నట్టు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పి.లక్ష్మణరెడ్డి తెలిపారు. ఉదయం 10.30 నుంచి నిర్వహించనున్న సదస్సుకు ప్రొఫెసర్ కేసీ రెడ్డి, ప్రొఫెసర్ కేఎస్ చలం, ప్రొఫెసర్ బాల మోహన్‌దాస్, పలువురు మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. -
‘డ్రోన్ తిరిగింది బాబు కోసం కాదు..’
సాక్షి, అమరావతి: డ్రోన్ వ్యవహారాన్ని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ ఆదేశాలతోనే వరద ప్రాంతాల్లో డ్రోన్ వినియోగించారని పేర్కొన్నారు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో టీడీపీ నేతల తీరును జనచైతన్య వేదిక అధ్యక్షుడు తప్పుపట్టారు. వరద ప్రవాహం ఉన్న అన్ని ప్రాంతాల్లో డ్రోన్ వినియోగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం మీదనే డ్రోన్ వినియోగించారనడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు తాను ఉంటున్న అక్రమ భవనాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. వరద వేగాన్ని నిరంతరం గమనిస్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వరద ప్రవాహాన్ని ప్రభుత్వం నియంత్రించడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో తక్కువ నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం సమీక్షలు జరుపుతూ తగు ఆదేశాలను ఇస్తూ వరద బాధితులను ఆదుకోవడం హర్షనీయమని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. చదవండి: టీడీపీ ‘డ్రోన్’ రాద్ధాంతం ‘ఎలాంటి కుట్ర లేదు..రాజకీయం చేయొద్దు’ -
‘ఉన్నత విద్యామండలి అక్రమాలపై దర్యాప్తు జరపాలి’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం జ్ఞానభేరి పేరుతో కోట్లలో దుర్వినియోగం జరిగిందని జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఉన్నత విద్యామండలి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నాటి ప్రభుత్వం జ్ఞానభేరి కార్యక్రమాలకు పది కోట్లు, విదేశీయాత్రలకు 5కోట్లు, ఎల్ఈడీ బల్బుల కోసం యాభై కోట్లు, అధికారుల వ్యక్తిగత ఖర్చు కోసం రెండు కోట్లు, బ్రిటీష్ కౌన్సిల్‌తో శిక్షణ ఇప్పించడానికి 13కోట్లు ఇలా ప్రజాధనాన్ని ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేసిందని జనచైతన్య వేదిక ఓ ప్రకటనలో తెలిపింది. -
చంద్రబాబుని తక్షణం అరెస్ట్ చేయాలి
-
‘ఆయన్ను కోవర్టు అనడం సీఎంకు తగదు’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను జనచైతన్య వేదిక అధ్యక్షులు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి కలిసి సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు పలు స్వచ్ఛంద సంఘాలు కలిసి సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘాన్ని అప్రతిష్టపాలు చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెంటనే గవర్నర్ పాలన తెచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఓటింగ్ శాతాన్ని 80కి పెంచిన ఎన్నికల సంఘాన్ని అభినందిసున్నామని చెప్పారు. పోలింగ్ రోజు 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఓటమి భయంతో ఈవీఎంలను, ఎన్నికల సంఘాన్ని సాకుగా చూపటం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు వైఖరిని ఖండించాలని కోరారు. టీడీపీ సంరక్షణలో ఉన్న ఐటీ గ్రిడ్ డేటా దొంగ అశోక్‌ని పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం కంటే బ్యాలెట్ విధానం మంచిందంటూ చంద్రబాబు చెప్పడం అశాస్త్రీయమని వ్యాఖ్యానించారు. -
‘అమరావతి’లో రూ.లక్ష కోట్ల అవినీతి
అమరావతి నిర్మాణం పేరిట రూ.లక్ష కోట్ల స్కాం జరిగిందని నాతో కొంతమంది ఎన్నారైలు అన్నారు. అప్పట్లో వారు అతిగా చెబుతున్నారనుకున్నా.. కానీ ఇప్పుడు చూస్తే లక్ష కోట్లు కాదు.. ఇంకా ఎక్కువే స్కాం జరిగిందనిపిస్తోంది. ఆర్బీఐకి స్థలం ఎకరానికి రూ.4 కోట్లకి ఇచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆస్పత్రులకు రూ.50 లక్షలకే ఇస్తున్నారు. మిగతా మూడున్నర కోట్లు ఎక్కడకు పోతోందో? – జస్టిస్ లక్ష్మణరెడ్డి కొన్నాళ్ల క్రితం వరకు ఎమ్మెల్యేలు చెప్పినట్టే చేయాలనే వారు.. ఇప్పుడు ఏకంగా కార్యకర్తలకూ ప్రాధాన్యం ఇవ్వాలం టున్నారు. నియోజకవర్గ నిధులను అధికార పార్టీ ఎమ్మెల్యేలకే కాకుండా ఆ పార్టీ నేతలకూ ఇస్తున్నారు. ప్రజాస్వామ్యం ఇలా ఉంటే ఏమనుకోవాలి?.. ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని దుయ్యబట్టారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను అనర్హులను చేయకపోవడం అన్యాయమన్నారు. ఇలాంటి వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు నిలదీయాలని కోరారు. ఆదివారం విశాఖలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే... ‘‘పాలక పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. వాస్తవ పరిస్థితులు చెప్పేవారు లేరు. ఎన్నికలయ్యాక రాజకీయాలు మరచిపోయి అందరికీ సమ న్యాయం చేయాల్సిన బాధ్యత పాలక పార్టీలపై ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆ విషయం మరచిపోయి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచింది. పరిపాలన గురించి మాట్లాడాల్సిన కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో టీడీపీ కార్యకర్తలకు సహకరించాలని సీఎం మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించింది. కొన్నాళ్ల క్రితం వరకు ఎమ్మెల్యేలు చెప్పినట్టే చేయాలనే వారు.. ఇప్పుడు ఏకంగా కార్యకర్తలకూ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. నియోజకవర్గ నిధులను అధికార పార్టీ ఎమ్మెల్యేలకే కాకుండా ఆ పార్టీ నేతలకూ ఇస్తున్నారు. ప్రజాస్వామ్యం ఇలా ఉంటే ఏమనుకోవాలి?.. ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమవుతోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి స్కాం రూ.లక్ష కోట్లకు పైనే.. ‘‘అమరావతి నిర్మాణం పేరిట రూ.లక్ష కోట్ల స్కాం జరిగిందని గతంలో నాతో కొంతమంది ఎన్నారైలు అన్నారు. అప్పట్లో వారు అతిగా చెబుతున్నారనుకున్నా.. కానీ ఇప్పుడు చూస్తే లక్ష కోట్లు కాదు.. ఇంకా ఎక్కువే స్కాం జరిగిందనిపిస్తోంది. ఆర్బీఐకి స్థలం కావలసి వస్తే ఎకరానికి రూ. 4 కోట్లు వసూలు చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు, ఆస్పత్రులకు రూ.50 లక్షలకే ఇస్తున్నారు. మిగతా మూడున్నర కోట్లు ఎక్కడకు పోతుందో అర్థం చేసుకోవచ్చు’’. ఇదంతా లెక్కలేస్తే లక్ష కోట్లు దాటిపోతోంది. అమరావతిలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ప్రభుత్వానికి ఈ దళారీ పని ఎందుకు? అన్నారు. వాళ్లు నిజాలు చెబుతుంటే కళ్లు తిరిగాయి..: ఉండవల్లి మాజీ చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజేయకల్లంలు చెబుతున్న నిజాలు వింటుంటే కళ్లు తిరిగాయని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘నా రాజకీయ జీవితంలో ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు. 1996లో వచ్చిన తుపాను సహాయక చర్యల్లో ముందుగా పాల్గొన్నందుకు అప్పటి సీఎం చంద్రబాబు కలెక్టర్ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని సస్పెండ్ చేశారు. పనిచేస్తే విపత్తు వస్తుందన్న పరిస్థితి అధికారుల్లో ఉంది. ఏం చేస్తే అధికార పార్టీ నేతల్లో మార్పు వస్తుందో ప్రజలు కూడా ఆలోచించాలి. మీ ప్రాంతంలో జరిగే అవినీతిపైనా స్పందించాలి.’ అని పేర్కొన్నారు. ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు పంచాయితీరాజ్ వ్యవస్థను ఖూనీ చేశాయని ఆరోపించారు. చంద్రన్న పేరిట వివిధ కార్డులపై సీఎం ఫోటోలు ముద్రిస్తున్నారని, ఈ ప్రభుత్వం మారిపోతే మళ్లీ కొత్తకార్డులు ముద్రిస్తారని, ఆ ఖర్చు ప్రజలపైనే పడుతుందని చెప్పారు. ప్రచారం సీఎంకి, భారం ప్రజలకా? అని ప్రశ్నించారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ అమరావతి పేరిట అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకరిస్తూ ఇతర ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. యూపీఎస్సీ మాజీ ఇన్చార్జి చైర్మన్ కేఎస్ చలం మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పాలకులు వివక్ష చూపుతున్నారని, విశాఖను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. సదస్సులో ఏయూ మాజీ వీసీ కెవీ రమణ, ఏయూ ప్రొఫెసర్లు పీవీ ప్రసాదరెడ్డి, పద్దయ్య, డాక్టర్ పి.వి.రమణమూర్తి, ఏపీ నిరుద్యోగ సమితి జేఏసీ చైర్మన్ సమయం హేమంత్‌కుమార్, విశ్లేషకులు సురేష్, రవికుమార్ తదితరులు మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులను చేయరు? ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి మారితే ఆటోమేటిక్‌గా అనర్హులవుతాన్నారు. ఏదైనా వివాదం వచ్చినప్పుడు మాత్రమే స్పీకర్‌కు రిఫర్ చేయాలని చట్టం చెబుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వివాదం ఏమీ లేదు. పబ్లిగ్గా పార్టీలు మారుతున్నట్టు చెప్పారు. స్వయంగా సీఎం వారికి కండువాలు కప్పారు. ఇందులో వివాదానికే తావులేదు. అయినా స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులను చేయరు? ఇలాంటి ఫిరాయింపులపై ప్రజల్లో చైతన్యం వచ్చి నిలదీయాలని తెలియజేశారు. -
వ్యవస్థలను నాశనం చేస్తున్నారు
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాశనం చేస్తున్నారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పంచాయతీ వ్యవస్థలను జన్మభూమి కమిటీలతో, దాడులలో చిక్కిన అధికారుల నుంచి కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేయడం ద్వారా ఏసీబీని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా స్పీకర్ వ్యవస్థను, స్థానిక సంస్థల సాధికారతకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. రాజకీయ అవినీతిని తారస్థాయికి చేర్చడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను, తన తాబేదార్లను న్యాయవ్యవస్థలో చొప్పించటం ద్వారా ఆ వ్యవస్థను కూడా కళంకితం చేశారన్నారు. తాజాగా సీబీఐ వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2014లో మోదీ ఆకర్షణతో అధికారం పొందిన చంద్రబాబు ప్రస్తుతం మోదీకి వ్యతిరేకంగా కేంద్రంపై యుద్ధం చేస్తున్నట్లు నటిస్తున్నారన్నారు. నిప్పులాంటి వాడినని చెప్పుకొనే బాబుకు నిఘా సంస్థలంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. ఢిల్లీ స్పెషల్ ఎస్టాబ్లిస్‌మెంట్ చట్టం ప్రకారం హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ ఏరాష్ట్రంలోనైనా దర్యాప్తు చేయవచ్చన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా తాను చేసిన పాపాలపై సీబీఐ విచారణ జరుపుతుందేమోనని సీఎం దానిని అడ్డుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. -
గాలి తప్ప అన్ని సహజ వనరులూ లూటీ!
గుంటూరు ఈస్ట్: ప్రస్తుతం ప్రజాప్రతినిధులు గాలి తప్ప అన్ని సహజ వనరులనూ దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం ఆందోళన వ్యక్తం చేశారు. మట్టి, ఇసుక సైతం అమ్ముకుని కోట్ల రూపాయిలు సంపాదించడం ఈ మధ్యే మొదలైందని వెల్లడించారు. గుంటూరులో ఆదివారం జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ధనస్వామ్యం– వారసత్వ రాజకీయాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో అజేయ కల్లం రచించిన ‘మేలుకొలుపు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో చెరువు తవ్వడానికి కోటి రూపాయలు అంచనా వేసి విడుదల చేయగా, తవ్విన మట్టి అమ్ముకుని ఎకరాకు రూ. 60 లక్షలు ఆర్జించారని తెలిపారు. ఎమ్మెల్యేలు కేవలం తమ పార్టీకి, కార్యకర్తలకు మాత్రమే ప్రజాప్రతినిధులుగా వ్యవహరించడం అప్రజాస్వామికమన్నారు. పౌరసమాజం నిర్వీర్యం అవడం వల్లే ఇవన్నీ చెల్లుబాటు అవుతున్నాయని ఆయన చెప్పారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవారిని ఆదర్శంగా తీసుకోవద్దు సమాజం కోసం త్యాగాలు చేసిన వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అజేయ కల్లం పిలుపునిచ్చారు. సినిమా రంగానికి చెందిన వారిని, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవారిని, రౌడీలు, సమాజాన్ని దోచుకున్న వారిని ఆదర్శంగా తీసుకుంటే అనర్థాలను మనమే చవిచూడాల్సి ఉంటుందన్నారు. గ్రామ స్థాయిలో ప్రాథమిక వసతులన్నింటినీ సమకూర్చే సెక్రటేరియట్లను అభివృద్ధి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు ఉండే సెక్రటేరియట్‌ను అభివృద్ధి చేస్తే ప్రజలకు ఒనగూరేది మిటని ప్రశ్నించారు. ఆగమ శాస్త్ర నిపుణులే చెప్పాలి తిరుమలలో భక్తుల సాధారణ దర్శనాన్ని నిలిపివేయడంపై అడిగిన ప్రశ్నకు అజేయ కల్లం స్పందిస్తూ సంప్రోక్షణ సమయంలో గర్భగుడిలోకి అనుమతించకపోయినా.. సాధారణ దర్శనాన్ని గతంలోలా కొనసాగించవచ్చన్నారు. ఏదో ఇబ్బందులు ఉన్న కారణంగానే వెంకన్న దర్శనం నిలిపివేసే సాహసం చేశారని వ్యాఖ్యానించారు. ఏ కారణాలతో దర్శనం నిలిపివేసిందీ ఆగమశాస్త్ర నిపుణులే చెప్పాలన్నారు. ఎంపీల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నేరస్తులు సదస్సుకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. లోక్‌సభకు ఎన్నికైన ప్రతి ముగ్గురు ఎంపీల్లో ఒకరు నేరస్తులు ఉంటున్నారని, 66 శాతం మంది వారసులు ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని, మేధావులకు సామాజికవేత్తలకు స్థానం కల్పిస్తేనే ఈ వ్యవస్థ మారుతుందని అభిప్రాయపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలను రాజ్యాంగంలో భాగస్వాములను చేయడం, ఐరోపా దేశాల తరహాలో దామాషా పద్ధతి ప్రవేశపెట్టడం తదితర విప్లవాత్మక చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్‌ది వారసత్వ రాజకీయం కాదు నవ్యాంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ డీఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఎంపీగా అనుభవం పొంది, సొంత పార్టీ పెట్టి.. ప్రజలను చైతన్యపరచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాభిమానం పొందారన్నారు. ఆయనది వారసత్వ రాజకీయం కిందకు రాదని స్పష్టం చేశారు. ఈ సదస్సులో ఏఎన్‌యూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.రంగయ్య, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, కన్నా విద్యా సంస్థల డైరెక్టర్ కన్నా మాస్టారు, వావిలాల సంస్థ కార్యదర్శి మన్నవ షోడేకర్, సోషలిస్టు ఉద్యమ నేత మోదుగుల బాపిరెడ్డి, ఎస్హెచ్ఓ వ్యవస్థాపకుడు సేవాకుమార్, ఆగ్జిలరీ సొసైటీ అధ్యక్షుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. -
దీక్ష సరే...అవినీతిపై నోరు విప్పరేం?
సాక్షి, అమరావతి: నవ నిర్మాణ దీక్ష పేరిట ఆర్భాటం చేస్తున్న సీఎం చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై నోరెందుకు విప్పడం లేదని జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఈ మేరకు శనివారం ఆయన 20 ప్రశ్నలతో ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీటిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోని 50 వేల నగరాల్లో ఒకటిగా లేని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ఐదో స్థానంలోకి తెస్తానని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. కేంద్రీకృత అభివృద్ధి ధోరణి మంచిది కాదని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. ఏపీని అవినీతిలో అగ్రస్థానంలో నిలబెట్టారని మండిపడ్డారు. -
చంద్రబాబు క్షమాపణ చెప్పాకే దీక్ష చేపట్టాలి
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాపై పలుమార్లు మాట మార్చి ప్రజలను మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధిస్తూ బుధవారం లక్ష్మణరెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పి, ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు నిరాహార దీక్షకు పూనుకోవాలని డిమాండ్ చేశారు. జన చైతన్య వేదిక అడిగిన ప్రశ్నలు.. ప్రత్యేక హోదా కోసం ఏపీ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తర్వాత కూడా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు? ప్రత్యేక హోదా సాధించిన 11 రాష్ట్రాలలో అసలేమాత్రం అభివృధ్ధి జరగలేదని ఆనాడు ఎందుకన్నారు? ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ లభించిందని ప్రజలను ఎందుకు మోసం చేశారు? ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై పి.డి యాక్ట్ ఉపయెగిస్తామని బెదిరించటం న్యాయమా? స్వచ్ఛందంగా ప్రజలు హోదా కోసం పోరాడుతున్న తరుణంలో రాజకీయ లబ్ధికోసమే నిరాహార దీక్షకు పూనుకోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటూ చంద్రబాబు నాయడుకు పలు ప్రశ్నలతో కూడిన ప్రెస్‌నోట్‌ను జన చైతన్య వేదిక విడుదల చేసింది. -
జేపీ అలా చెప్పడం హాస్యాస్పదం
అనంతపురం జిల్లా : కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులపై లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ చెప్పటం హాస్యాస్పదంగా ఉందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బలపర్చాలని కోరటం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం కిందకే వస్తుందన్నారు. ఈనెల16న ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ, వామపక్షాలు చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని కోరారు. బంద్ అవసరం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, హోదా ఉద్యమన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. శివరామకృష్ణయ్య నివేదిక బుట్టదాఖలు చేశారని, ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు రాజధాని, పోలవరం పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
'చంద్రబాబు మీ వైఖరి తెలపండి'
సాక్షి, హైదరాబాద్ : హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వైఖరి తెలపాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాతోపాటు, రాయలసీమలో హైకోర్టు సాధన, విశాఖపట్నం రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు నిర్మాణం, కడప స్టీల్ ఫ్యాక్టరీల కోసం పోరాడాలని ఆయన సూచించారు. ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాణం పెడతామన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని జన చైతన్య వేదిక స్వాగతిస్తోందని అన్నారు. అన్ని పార్టీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించాలని కోరారు. ఏప్రిల్ 6లోపు కేంద్రం ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోకపోతే ఏపీకి చెందిన 25 మంది లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసి, ప్రజాభిప్రాయాన్ని కేంద్రానికి తెలియచేయాలంటూ విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఇతర పార్టీ నేతలు, ప్రజా సంఘాలతో కలిసిపోరాడాలని లక్ష్మణ్ రెడ్డి సూచించారు. -
'సీఎం రాజమండ్రిని వదిలి రావాలి'
రాజమండ్రి: ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పోతుందని ఇప్పటికే పలుసార్లు ఆరోపించిన జన చైతన్య వేదిక మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తప్పుబట్టింది. గోదావరి పుష్కరాల్లో మంగళవారం చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చంద్రబాబునాయుడు రాజమండ్రిని వదిలి రావాలని జనచైతన్య వేదిక డిమాండ్ చేసింది. చంద్రబాబు నాయుడు తన ప్రచార కాంక్షని మానుకోవాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు , రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్ రెడ్డి సూచించారు. చంద్రబాబు అక్కడ్నుంచి వచ్చేస్తేనే పుష్కరాలు ప్రశాంతంగా జరుగుతాయన్నారు. మంగళవారం ఉదయం రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 29 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.