సాక్షి, హైదరాబాద్ : హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వైఖరి తెలపాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాతోపాటు, రాయలసీమలో హైకోర్టు సాధన, విశాఖపట్నం రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు నిర్మాణం, కడప స్టీల్ ఫ్యాక్టరీల కోసం పోరాడాలని ఆయన సూచించారు.
ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మాణం పెడతామన్న వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయాన్ని జన చైతన్య వేదిక స్వాగతిస్తోందని అన్నారు. అన్ని పార్టీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించాలని కోరారు. ఏప్రిల్ 6లోపు కేంద్రం ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోకపోతే ఏపీకి చెందిన 25 మంది లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసి, ప్రజాభిప్రాయాన్ని కేంద్రానికి తెలియచేయాలంటూ విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఇతర పార్టీ నేతలు, ప్రజా సంఘాలతో కలిసిపోరాడాలని లక్ష్మణ్ రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment