‘ఉన్నత విద్యామండలి అక్రమాలపై దర్యాప్తు జరపాలి’ | Jana Chaitanya Vedika Demand For Investigation On Higher Education Board | Sakshi
Sakshi News home page

‘ఉన్నత విద్యామండలి అక్రమాలపై దర్యాప్తు జరపాలి’

Published Mon, Jun 3 2019 3:38 PM | Last Updated on Mon, Jun 3 2019 3:38 PM

Jana Chaitanya Vedika Demand For Investigation On Higher Education Board - Sakshi

సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం జ్ఞానభేరి పేరుతో కోట్లలో దుర్వినియోగం జరిగిందని జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఉన్నత విద్యామండలి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

నాటి ప్రభుత్వం జ్ఞానభేరి కార్యక్రమాలకు పది కోట్లు, విదేశీయాత్రలకు 5కోట్లు, ఎల్‌ఈడీ బల్బుల కోసం యాభై కోట్లు, అధికారుల వ్యక్తిగత ఖర్చు కోసం రెండు కోట్లు, బ్రిటీష్‌ కౌన్సిల్‌తో శిక్షణ ఇప్పించడానికి 13కోట్లు ఇలా ప్రజాధనాన్ని ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేసిందని జనచైతన్య వేదిక ఓ ప్రకటనలో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement