అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను జనచైతన్య వేదిక అధ్యక్షులు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి కలిసి సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు పలు స్వచ్ఛంద సంఘాలు కలిసి సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘాన్ని అప్రతిష్టపాలు చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెంటనే గవర్నర్ పాలన తెచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఓటింగ్ శాతాన్ని 80కి పెంచిన ఎన్నికల సంఘాన్ని అభినందిసున్నామని చెప్పారు. పోలింగ్ రోజు 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఓటమి భయంతో ఈవీఎంలను, ఎన్నికల సంఘాన్ని సాకుగా చూపటం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు వైఖరిని ఖండించాలని కోరారు. టీడీపీ సంరక్షణలో ఉన్న ఐటీ గ్రిడ్ డేటా దొంగ అశోక్‌ని పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం కంటే బ్యాలెట్ విధానం మంచిందంటూ చంద్రబాబు చెప్పడం అశాస్త్రీయమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment