సాక్షి, అమరావతి: డ్రోన్ వ్యవహారాన్ని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ ఆదేశాలతోనే వరద ప్రాంతాల్లో డ్రోన్ వినియోగించారని పేర్కొన్నారు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో టీడీపీ నేతల తీరును జనచైతన్య వేదిక అధ్యక్షుడు తప్పుపట్టారు. వరద ప్రవాహం ఉన్న అన్ని ప్రాంతాల్లో డ్రోన్ వినియోగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం మీదనే డ్రోన్ వినియోగించారనడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు తాను ఉంటున్న అక్రమ భవనాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. వరద వేగాన్ని నిరంతరం గమనిస్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వరద ప్రవాహాన్ని ప్రభుత్వం నియంత్రించడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో తక్కువ నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిరంతరం సమీక్షలు జరుపుతూ తగు ఆదేశాలను ఇస్తూ వరద బాధితులను ఆదుకోవడం హర్షనీయమని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.
చదవండి:
టీడీపీ ‘డ్రోన్’ రాద్ధాంతం
‘ఎలాంటి కుట్ర లేదు..రాజకీయం చేయొద్దు’
Comments
Please login to add a commentAdd a comment