మలిదశ ఉద్యమానికి ‘లోక్‌సత్తా’ శ్రీకారం | Lok Satta Party movement internship | Sakshi
Sakshi News home page

మలిదశ ఉద్యమానికి ‘లోక్‌సత్తా’ శ్రీకారం

Published Thu, Sep 14 2017 2:54 AM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

మలిదశ ఉద్యమానికి ‘లోక్‌సత్తా’ శ్రీకారం - Sakshi

మలిదశ ఉద్యమానికి ‘లోక్‌సత్తా’ శ్రీకారం

హైదరాబాద్‌: వ్యవస్థను మార్చేందుకు, పాలనలో ప్రజల్ని భాగస్వామ్యం చేసేందుకు లోక్‌సత్తా పార్టీ మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 13, తెలంగాణలోని 31 జిల్లాల్లో పర్యటించి ‘యూత్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా’, ‘సిటిజన్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా’ నినాదంతో ముందుకు సాగనున్నట్లు లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ తెలిపారు. ‘జనం కోసం జేపీ సురాజ్య యాత్ర’ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు, రెండు వెబ్‌సైట్లను బుధవారం ఇక్కడ ఆవిష్కరించారు.

 సురాజ్యయాత్రలో ముఖ్యంగా ఆరు అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ యాత్రలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనా యాత్ర లక్ష్యం జాతీయస్థాయిదని పేర్కొన్నారు. యువతను భాగస్వామ్యం చేసేందుకు  www.youthforbetterindia.com ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించినట్లు చెప్పారు. యాత్ర ఖర్చుతో కూడుకున్నది కావున ప్రోత్సహించేందుకు దాతలు తమవంతు విరాళాలు అందించాలని, వారు అందించే ప్రతీ పైసాకు పదిపైసల పని చేసి చూపిస్తామని తెలిపారు. దాతలు  www.fdrindia.orgలో సంప్రదించాలని సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement