
రేపటి నుంచి జేపీ నిరాహార దీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయాలంటూ లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ మంగళవారం నుంచి రాష్ట్రంలోని వివిధ నగరాల్లో నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోందని ప్రకటనలో జేపీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి తగిన న్యాయం జరిగేంత వర కూ లోక్‌సత్తా పోరాటం చేస్తుందన్నారు.
మార్చి 3న అనంతపురంలో, 5న విశాఖపట్నంలో, 8న విజయవాడలో నిరాహార దీక్షలు చేస్తున్నట్లు జేపీ ప్రకటించారు.