
ల్యాండ్ పూలింగ్‌లో రూ.కోట్ల అక్రమాలు
సీతంపేట (విశాఖ): విశాఖ జిల్లాలో అనందపురం, భీమిలి మండలాల్లో ఉడా సేకరించిన ల్యాండ్‌పూలింగ్ వ్యవహారంలో రూ.600 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పత్రికల్లో అనేక కథనాలొచ్చాయని, దీనిపై లోక్‌సత్తా పార్టీ కీలక అంశాలను పరిశీలించి అక్రమాలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చిందన్నారు.
సీఎం బాబు తక్షణమే ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. పూలింగ్ అక్రమాల వల్ల పెద్ద ఎత్తున పేద రైతులు నష్టపోతారన్నారు. పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం, ఆనందపురం మండలం దబ్బంద, గండిగుండం, కొమ్మాది, భీమిలి మండలంలో నేరెâýæ్ళవలస గ్రామాల్లో కొన్ని నెలలుగా రాజకీయ దళారీలు పక్కా ప్రణాళికలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దీని వెనుక ప్రభుత్వ అధికారుల హస్తం ఉన్నట్టు స్పష్టమైందని తెలిపారు. తొలిదశలో ఉడా సేకరించిన 359 ఎకరాలు, రెండో దశలో 183 ఎకరాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
ల్యాండ్‌పూలింగ్ కోసం మూడు జీవోలు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. భూమి సేకరించనున్న రైతుల పేర్లు, సర్వే నంబర్లతో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎం.ఎస్.ఎ¯ŒS.మూర్తి, వడ్డిహరి గణేష్, చంద్రమౌళి, చిరంజీవి, హర్ష, పక్కి శంకర్ పాల్గొన్నారు.