'ధర్నాచౌక్ తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'
Published Sun, Mar 26 2017 5:44 PM | Last Updated on Sat, Mar 9 2019 3:05 PM
హైదరాబాద్: ధర్నాచౌక్ తరలింపును వ్యతిరేకిస్తూ నిసరనలు చేస్తున్న వారిని అరెస్టుచేయడంపై లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిన్నేపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పట్ల నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కని, వాటిని వ్యక్తపర్చే ప్రాంతాన్ని తరలించడం సరైన నిర్ణయం కాదన్నారు. టీజేఏసీ చైర్మన్ కోదండరామ్‌తో సహా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేసి ధర్నాచౌక్ తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన నిరంకుశంగా మారిందని, ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం ధర్నాచౌక్ తరలింపునకు ఉపక్రమించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
Advertisement
Advertisement