
చంద్రులిద్దరూ చుక్కలు చూపిస్తున్నారు
ఇరు సీఎంలపై జేపీ ఫైర్
హైదరాబాద్: ఓటేసిన పాపానికి ఇద్దరు చంద్రులు ఇరు రాష్ట్రాల్లో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రథమ మహాసభ, లోక్‌సత్తా ఎనిమిదో వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇరు రాష్ట్రాలు శ్రీశైలం విద్యుత్‌పై రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని జేపీ మండిపడ్డారు.
ఈ సభలో తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు రామ్మోహన్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో లోక్‌సత్తా ప్రజలకు మరింత దగ్గరై గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతుందన్నారు. ఈ సభలో లోక్‌సత్తా నాయకులు శ్రీనివాసరెడ్డి, రవిమారుతి, గజాన న్, సరోజాదేవి తదితరులు పాల్గొన్నారు.