విజయనగరం క్రైం : లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పాండ్రంకి వెంకటరమణ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు.లోక్‌సత్తా పార్టీలో 2006 నుంచి సాధారణ సభ్యుడిగా చేరిన పాండ్రంకి అంచెలంచెలుగా క్రియాశీలక సభ్యుడిగా, పట్టణ ఉపాధ్యక్షుడిగా, యువసత్తా జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన శాసనసభ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే పార్టీలో ఇటీవల జరి గిన కొన్ని పరిమాణాలతో మస్తాపానికి గురై, పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు.