
‘‘సినిమా అనేది ఎంటర్‌టైన్ చేయడంతో పాటు ఎడ్యుకేట్ చేయాలి. అలా ఎడ్యుకేట్ చేసే సినిమాలను ప్రొత్సహించాలి. యువత రాజకీయాల్లో తిరుగుతూ సరైన నాయకుడిని ఎంచుకోకుండా, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అలాటి అంశానికి వినోదం జోడించి తీసిన ‘రామన్న యూత్’ని ఆదరించాలి’’ అని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డా. జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.
అభయ్ నవీన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. సెప్టెంబర్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. రిలీజ్ డేట్ ΄ోస్టర్‌ని జయప్రకాశ్ నారాయణ్ ఆవిష్కరించారు. ‘‘గ్రామీణ ్రపాంతాల్లో రాజకీయ నాయకుల కోసం యువత ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు? రాజు అనే ఒక యువకుడు ΄÷లిటికల్ లీడర్‌గా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు అభయ్ నవీన్.
Comments
Please login to add a commentAdd a comment