ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి | should respect peoples opinion | Sakshi
Sakshi News home page

ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి

Published Thu, Sep 15 2016 10:07 PM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

పోస్టుకార్డులు బాక్స్‌లో వేస్తున్న గ్రామస్తులు - Sakshi

పోస్టుకార్డులు బాక్స్‌లో వేస్తున్న గ్రామస్తులు

జిల్లాల పునర్విభజనపై..
లోక్‌సత్తా ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం

కౌడిపల్లి: జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని లోక్‌సత్తా నర్సాపూర్‌ నియోజకవర్గం కన్వీనర్‌ నాగేందర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కౌడిపల్లి బస్టాండ్‌ ఆవరణలో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించారు. నర్సాపూర్‌ నియోజక వర్గాన్ని రెవెన్యూ డివిజన్‌ చేయడంతోపాటు ఏ జిల్లాలో కలపాలన్న  ప్రజలు ఆభిప్రాయాన్ని పోస్టుకార్డుపై రాసిన సీసీఎల్‌ఏ అడ్రస్‌ బాక్స్‌లో వేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులన్నారు. జిల్లా, రెవెన్యూ మండలాల పునర్విభజనలో ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వారి సౌలభ్యం కోసం ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు, పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్నందున అనుకూలంగా ఉండేట్లు చూడాలన్నారు. గ్రామస్తులు కుమార్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement